The Little Book of Encouragement - His Holiness The Dalai Lama
Edited by Renuka Singh
కరోనా రెండు మూడు దశల్లో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించడం మన స్మృతి పథాల్లోంచీ చెరిగిపోలేదు. చాలా మంది ఆత్మీయుల్ని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, కోల్పోయాము. ప్రార్ధనాలయాలకు తాళాలు పడ్డాయి. ఇంట్లో పెద్ద వాళ్ళ నుంచీ టీనేజ్ పిల్లలు కూడా వ్యాధి బారిన పడ్డారు. కొందరు మరణించారు.
దీనిని, ప్రకృతి మనిషి అస్తవ్యస్త ప్రవర్తనల మీద కన్నెర్ర జేయడం అన్నారు. ప్రభుత్వాలు / కొన్ని కార్యాలయాలు, పోలీసులు, వైద్య వృత్తి లోని వారు, కిరాణా సామాన్ల వ్యాపారులు, కూరగాయల వాళ్ళు, ఆగిపోకుండా పని చేసారు. ఇప్పుడు కరోనా ఎప్పుడో జరిగిపోయిన విషయమే గానీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మీద అది కొట్టిన దెబ్బ చాలా గట్టిది.
అయితే, ఇప్పటికీ, వ్యక్తిగతంగా, కరోనా దుష్ప్రభావాలు అనుభవిస్తున్నవారున్నారు. మానసికంగా కరోనా కలిగించిన వ్యధ ఇంతా అంతా కాదు. అది సమిష్టి వ్యధ కూడా. మనిషి సంఘజీవి కాబట్టి, ఎన్నో అనుమానాలు, ఒంటరితనం, తీవ్ర వ్యాధిని కూడా ఒంటరిగా ఎదుర్కోవాల్సి రావడం, ఎదటి వ్యక్తికి, హాని కలిగిస్తున్నానేమో అనే గిల్ట్ తో హాస్పత్రి కి వెళ్ళాల్సి రావడం, అహోరాత్రాలు ఎన్నో వాలంటీరు గ్రూపులు పని చేస్తూ, నిస్సహాయ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావడం, సకాలంలో వైద్యం అందక, లేదా అందినా సరే, తెలీని ఈ వ్యాధిని అదుపు చేయలేక, ప్రాణాలు పోవడాన్ని ఎందరో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడడం, జరిగాయి.
ఇది వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ మనుషులకు వచ్చిన తీవ్రమైన కష్టకాలం. దీనికి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి, తనను అనుసరించే వారికి మేలు చేసేందుకు దలైలామా కొంత ప్రయత్నం చేసారు. ఆయన సోషల్ మీడియా బైట్ ల సంకలనమే ఈ పుస్తకం. ఇదో పెద్ద పుస్తకమని చెప్పలేం. దీని పేరు సరిగ్గ సూచించినట్టు post pandemic world కు, ఇది చిన్న ఊరటకూ, కాస్త అభినందనకూ, సాంత్వనకూ ఉపయోగపడేందుకే తీసుకొచ్చారు. అందుకే దీని పేరు The Little Book of Encouragement.
దేశాలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ కనిపించని, తెలీని జబ్బుతో పోరాటం చేస్తున్నపుడు, రోజువారీ మృతుల సంఖ్యల పట్టికలు తయారు చేస్తున్నప్పుడు, దలై లామా లాంటి మత గురువులు, సాంఘిక మాధ్యమాల ద్వారా - తమ అనుచరులకు ఎప్పటికప్పుడు ధైర్య వచనాలు పలికారు. దలైలామా కు ఇప్పుడు ఎనభై ఏడేళ్ళు.
అతను 1959 లో భారత దేశానికి శరణార్ధిగా పారిపోయి వచ్చి అరవై మూడేళ్ళు గడిచాయి గడిచాయి. అతని బుద్ధ మార్గం, నలందా శైలిది. అతని బోధిచిత్తం, భారతీయ తత్వ మూలాల మీదే నిర్మించబడినది. అందుకనే, ఈ వృద్ధుడు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న టిబెటన్ బుద్ధులకు మాత్రమే నాయకుడిగా మిగిలిపోకుండా, వేదాంతాన్ననుసరించే ఎందరికో మార్గదర్శకుడయ్యాడు.
ఈ స్వార్ధమయ ప్రపంచంలో మఠాధిపతులు సర్వసంగ పరిత్యాగులయినప్పటికీ, పీఠాధిపత్యం కోసం హత్యలు చేసుకుంటారు, పోట్లాడుకుంటారు. ప్రసిద్ధి చెందిన మత గురువో / బాబా నో మరణిస్తే, అతని సామ్రాజ్యం నాశనం అవుతుంది. అతని మరణానికి ముందే ఆస్తి పంపకాలు జరిగిపోతాయి. ఎల్లకాలం ప్రముఖుడై ఉండిపోయేందుకు, రాజకీయ అండదండలు సంపాదించేదుకు పెద్ద ప్రభువులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తు ఉంటారు. అలాంటి వారి మధ్య "దలై లామా" చాలా విచిత్రమైన వ్యక్తి.
బుద్ధులు పునర్జన్మలని నమ్ముతారు. Eg. దలై లామా మరణానంతరం, అతను ఎవరి లా మళ్ళీ పునఃజన్మిస్తారో కనుక్కుంటారు. ఏ పల్లె లోనో పెరుగుతున్న చిన్ని బాలుడిని దలై లామా పునరావతారంగా గుర్తించి, తమ మఠానికి తెచ్చుకుని, అతన్ని ఆరాధనగా పెంచుకుని, విద్య నేర్పించి, గురువు గా స్వీకరిస్తారు. ఈ మధ్య టిబెటన్ తాంత్రిక బౌద్ధానికి చెందిన లామా Rinpoche అవతారాన్ని కనుగొన్నారు. ఈ వార్త ను చూడండి.
https://www.shambhala.com/snowlion_articles/dilgo-khyentse-rinpoche-reincarnation/
ఇలాంటి సంప్రదాయాలనుంచీ వచ్చిన బౌధిసత్వం ఈ 14 వ దలై లామా ను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ్యులకూ, పాశ్చాత్యులకూ ఇష్టుడిగా చేసాయి. దలై లామా కు ఆశ్రయం ఇచ్చినందుకు చైనా కూ, ఇండియాకూ మధ్య ఎడతెగని యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే కాలం తో పాటూ చాలా విషయాలూ మారుతాయి. దలై లామా కూడా కొత్త మార్పులను స్వీకరించారు. ఆయనకు గ్లోబల్ వార్మింగ్ సమస్య గురించి తెలుసు. ప్రపంచ శాంతి కోసం అమాయకమైన కోరికలూ ఉన్నాయి ఆయనకు. కొన్ని కోట్స్ - పేజీ కొకటి చొప్పున ఉన్న ఈ పుస్తకంలో కొన్ని పేజీలు చదవండి.
"I
have wished for it in this lifetime, and I know I'd wished for this in my
previous lifetimes. My death may well mark the end of the great tradition
of Dalai Lamas; the word means 'great leader' in Tibetan. It may end with
this great Lama. The Himalayan Buddhists of Tibet and Mangolia will
decide what happens next. They will determine whether the 14th Dalai Lama
has been reincarnated in another tulku. What my followers decide is not
an issue for me; I have no interest. My only hope is that when my last
days come, I will still have my good name and will feel that I have made some
contribution to humanity."
"Weakness being a part of greatness is quite a philosophical question. It is important to know your weakness; then you can improve. If some Tibetan and Hindu Lamas consider themselves great, it is important to test, criticize, and tease them. If they remain completely calm, it shows that they truly practice what they teach."
-----
ఇంకొన్ని కోట్స్ 👇
-----
-----
-----
No comments:
Post a Comment