Pages

08/06/2022

The Art of Bitfulness - Nandan Nilekani, Tanuj Bhojwani

 The Art of Bitfulness - Keeping Calm in the Digital World 

- Nandan Nelekani, Tanuj Bhojwani



ఒక టెక్ పెద్దాయన 2017 లో అండమాన్ వెళ్తాడు.  అండమాన్,  భారత ద్వీపకల్పానికి 1400 కిలో మీటర్ల దూరంలో ఉన్న ద్వీపం.   ఆగస్ట్ 2020 లో ప్రధాన భారత ద్వీపకల్పానికీ ఈ దీవులకీ కలుపుతూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ని వేసీదాకా, అక్కడ సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. అలా ఆ పెద్దాయన 2017 లో నెట్ లేని ఆ ద్వీపాల్లో  వెకేషన్ గడపడానికి వెళ్ళి, ఇరుకున పడ్డాడు. హోటల్ రిసర్వేషన్ చిటికలో చెయ్యడానికి, ఎక్కడికన్నా ఎలా వెళ్ళాలో తెలీడానికీ, టేక్సీ బుక్ చెయ్యడానికి కూడా అష్టకష్టాలు పడాల్సొచ్చింది. ఇక్కడ ఇంటర్నెట్ ఉండదని తెలుసుంటే ఈప్రయాణమే పెట్టుకుని ఉండేవాడిని కాదు భగవంతుడా అనుకున్నాడాయన. కానీ ఆ తరవాత ఏడు రోజులూ అతని జీవితంలో అత్యంత ఆహ్లాదకరమైన సెలవు, ప్రకృతి ఒడిలో, పని ఝంఝాటాలు లేకుండా, ఆనందించడం, ఆస్వాదించడం పైన దృష్టి పెట్టి చాలా చక్కగా గడిపానని తెలుసుకుంటాడు.   ఇలా అరచేతిలో వైకుంఠం చూపించే మన పెర్సరల్ సెక్రటరీ,  డైరీ, మన జీవితాల్లో ముఖ్య భాగం వంటి మన మొబైల్, దానిలో ఉన్న ఇంటర్నెట్ లు లేకపోతే డీటాక్సిఫికేషన్ ఇలా జరుగుతుందా అనే భావన అప్పుడే కలిగింది. 

ఫోను అస్తమానం చేతిలో లేకపోవడం / కనెక్షన్ లేకపోవడం, మొదట్లో చాలా భయపెడతాయి. కానీ ఫోన్ తో ఎంత తక్కువ సమయం గడుపుతామో అంత క్వాలిటీ జీవితం జీవిస్తామని అర్ధం అవుతుంది. పొద్దున్నే లేవడం, ఉదయించే సూర్యుడిని చూడడం, రాత్రి పెందరాళే పడుకోవడం, కేవలం ఫోన్ ని పక్కన పెడితేనే సాధ్యం అవుతుంది. కానీ ఆ బ్రహ్మపదార్ధం మనల్ని వదలదు. మన జీవితాలు ఫోన్ తో, దానిలో ఉండే అసంఖ్యాకమైన అప్లికేషన్ ల లో ముడిపడిపోయింది.  ఈ సాధనాలు మన జీవితాన్ని సౌకర్యవంతం చేస్తూ మెల్లగా ఆక్రమణ మొదలు పెట్టాయి. మెల్లగా మనకి తెలీకుండానే వాటి మాయలో పడి, జీవితాన్ని ఫోన్ కీ, ఇంటర్నెట్ కీ ధారాదత్తం చేసేస్తున్నాం.

ఈ పెద్దాయన కూడా ఇంటికి తిరిగొచ్చి కొన్న్నాళ్ళు డిసిప్లిన్ తో బ్రతికినా, మెల్లగా మళ్ళీ వెనక్కి, అనగా కనెక్టివిటీ మాయలోకి, బిజీ జీవితపు చట్రాల్లోకీ లాగివేయబడ్డాడు. జీవితంలో ఒత్తిడి పెరిగింది. క్రమశిక్షణ మాయమైంది. ఆరోగ్యమూ దెబ్బతింది.  ఒకప్పుడు టెక్నాలజీ మనల్ని తక్కువ ఆకర్షించేది. ఇప్పుడు మనని ఆకట్టుకోవడం, అంటుకుపోవడమే దాని ఉద్దేశ్యం. అది గెలిచేది మనల్ని ఎంతగా ఎడిక్ట్ చేయగలిగిందా అనే సూత్రం మీదే.  మార్కెట్ లో రకరకాల టెక్నాలజీ లు వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయో చూడండి.ఎన్ని సౌలభ్యాలు.. ఎంత సమాచారం. ఎన్ని ఉచితాలు ? ఎని అనౌచితాలు ?  వేటి గ్రిప్ లో ఎవరం ఉన్నాం? సౌలభ్యాలు మన మంచి కోసమా ? అపకారం కోసమా ? 

సెల్ ఫోన్లూ, సోషల్ మీడియా, ఇలా మన జీవితానికి సౌకర్యాన్నిచ్చే ఉపకరణాలు, మెల్లగా మనల్ని శాశించడం మొదలుపెడుతున్నాయి. ఎందుకంటే ఇవి మన మెదడు కీ, వివేచన కీ సాయం చేస్తున్నాయి. మనకోసం ఆలోచించి పెడుతున్నాయి. మనకి కావలసిన సమాచారాన్ని వడగట్టి ఇస్తున్నాయి. మనం ఏది వినాలనుకుంటున్నామో అవే వినిపిస్తున్నాయి. ఇది మన మనసుకి ఇంకో గదిలాంటివి. స్మార్ట్ ఫోన్లూ, స్మార్ట్ ఉపకరణాఅలు, టీవీలు, ఫ్రిజ్ లూ, రిమోట్ కంట్రోల్ బ్రతుకులు, మన ఆలోచనల్ని కూడా చదివేసే రిమోట్ కంట్రోల్ జీవితాల్ని ఇస్తున్నాయి. 

QUOTE

In theory, having access to all this information should help us live better. In practice, it quickly becomes a trap.  When we have access to all the information in the world, we don't have to spend time or energy memorizing.  Instead, we have a new problem.  Every moment, we need to decide what to focus on. 

UNQUOTE

మొట్టమొదటి సారి మొబైల్ ఏప్లికేషన్ ద్వారా టాక్సీ బుక్ చెయ్యడం గుర్తుందా ఎవరికైనా ?  మేరు, ఊబర్, ఓలా లాంటి అప్ప్లికేషన్ లు రోడ్ ఎక్కితే టేక్సీ దొరుకుతుందో లేదో అనే సందిగ్ధాన్ని   పూర్తిగా వినియోగదారుడి మనసులోంచీ తుడిచిపెట్టేసాయి.  కీడు చేస్తుంది అని చెప్పి ఉన్నపళాన ఇంటర్నెట్ ని త్యజించేసి, ఇలాంటి సుఖాల్ని వొదులుకోవడానికి ఎవరు సిద్ధపడతారు ?  అసలు మోటారు వాహనాలు వచ్చినపుడు కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని భయపడ్డారంతా. ప్రమాదాలు ఎలా జరగొచ్చో అవగాహన కలిగాక, నష్టాన్ని నివారించడం కూడా సాధ్యమే అని ఇలాంటి సందర్భాలు బాగా బోధపరుస్తాయి.   అలా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా, కొన్ని ప్రమాదాల్ని ఎలా నివారించాలో చెప్పడమే ఈ పుస్తకం ఉద్దేశ్యం. 

సోషల్ మీడియా, "ఆలోచనల  వ్యాపారాన్ని" పూర్తిగా మలుపుతిప్పేసింది.  ఇన్స్టాగ్రాం లోనో, ఫేస్ బుక్ లోనో ఏదో సమాచారం కోసం తొంగి చూసిన వినియోగదారుడు, అలా దానిలో కొట్టికెళిపోయి, గంటా రెండు గంటలు పూర్తిగా సమయం వృధా చేసుకుని, తను చూడాలనుకోని వీడియోలు కూడా గంటల కొద్దీ చూసేసి, తీరా తనకు కావల్సిన సమాచారం ఏదో పూర్తిగా మర్చిపోవడం చాలా తరచుగా జరుగుతుంటుంది. ఇదో మాయ. దీనిలోకి మనం పదే పదే పడిపోతున్నాం.  మనం ఎంత పిచ్చివాళ్ళం  ? 

కాదు. మనల్ని అలా ఆ మాయలోకి తీసుకెళ్ళేలా టెక్నాలజీ సంస్థలు తమ సేవల్ని ప్రోగ్రాం చేస్తున్నాయి. దాన్నించీ తప్పించుకోగలగడం దాదాపు అసాధ్యం. మనదగ్గర ఉన్నదంతా అపరిమిత సమాచారం, అపరిమిత స్వేచ్చ. ఫోన్ చేతిలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి చిన్న విషయానికీ రెస్పాండ్ కావడం, ప్రతి దాని మీదా వ్యాఖ్యనో, ఉచిత సలహానో పోస్ట్ చేసేలా ప్రోత్సహించడం లోనే వివిధ టెక్నాలజీ కంపెనీల విజయం దాగుంది. మీకు ప్రతీదీ సులభం చెయ్యడం, ప్రతీదానిమీదా ఒక అభిప్రాయం వెళ్ళగక్కే హక్కు ఉన్నట్టు, తరచూ మీ మనసులో ఏముందో పోస్ట్ చెయ్యమని ప్రోత్సహిస్తున్నాయి ఈ కంపెనీలు. మీ అడుగడుగూ, మీరు ఎక్కడికి వెళ్ళేది, ఎవరిని కలుస్తున్నదీ, ఏమి తింటున్నదీ, ఏది కొనాలనుకుంటున్నదీ ఇలా మీగురించి ప్రతీ సమాచారాన్ని, సేకరించడం, దానిని తమ లాభాల కోసం వాడుకోవడం, వాటి పని. 

QUOTE 

The early web entrepreneurs couldn't have known that taking a bite of the juicy advertising apple would eventually lead to the loss of the internet's innocence.  This moment is now considered by many to be the one when the internet went from a collective project to being a commercial project.  

In an article in The Atlantic in 2014, Ethan Zuckerman, the creator of pop-up ad, called this moment, the internet's original sin. 

UNQUOTE

మనిషికి ఆలోచించడం, ఎంచుకోవడం, ఒక పని కోసం శ్రమించడం.. ఇలాంటి కష్టమైన పనుల్నుండీ టెక్నాలజీ విరామాన్నిస్తుంది. టాక్సీ లు, ఉండడానికి హోటళ్ళు, ప్రయాణాలకి వివిధ సాధనాలు, విమానాలు, బస్సులు, రైళ్ళు -, తినేందుకు  భోజన పదార్ధాలు, వండుకోవడానికి కూరలు, కిరాణా వస్తువులూ ఇలా అన్నిటికీ రకరకాల ఏగ్రిగేటర్లు కనీస కేపిటల్ / టాక్స్ ఖర్చులు లేకుండా, వినియోగదారులకి విస్తారమైన సదుపాయాల్నిస్తున్నాయి.  

కానీ ఈ ఏగ్రిగేటర్లు , చట్ట బద్ధంగా, పన్నులు చెల్లిస్తూ, అద్దెలు కడుతూ మిగతా ఆబ్లిగేషన్లతో లీగల్ గా వ్యాపారం చేసుకునేవాళ్ళలా కాకుండా,  ఉద్యోగులకు భీమా సౌకర్యమూ, జీత భత్యాలూ, పీ.ఎఫ్ లాంటి కనీస చెల్లింపులు కూడా చెయ్యక్కర్లేకుండా, కేవలం సమాచారాన్ని అటూ ఇటూ అమ్ముతూ లాభాలు సులువుగా సంపాదిస్తున్నాయి. పోనీ ఇది వినియోగదారుడికి మంచిదే అయినా, సరుకులు సంప్రదాయ పద్ధతిలో అమ్మే వ్యాపారులకు, డ్రైవర్లకు, సేవలు అందించే వారికీ నష్టదాయకంగా మారింది.  ఏగ్రిగేటర్ ల ద్వారా పెరిగిన టాక్సీ సర్వీసులు రోడ్లలో ట్రాఫిక్ పెరిగేందుకు, ఎయిర్ బీ ఎన్ బీల లాంటి సదుపాయాలు, ఆయా ప్రాంతాలలొ కృత్రిమంగా అద్దెలు పెరిగిపోవడానికి దారితీయడం చూసాము.    

కానీ అతి ఎప్పటికైనా ప్రమాదకరం. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్చ కూడా అమ్ముకోబడ్డ వస్తువు.   ఇది తెలుసుకున్నాక, కాస్త మొబైల్  ఎడిక్షన్ తగ్గించుకోవాలని, లేదా, మొబైల్ ల ను పనికొచ్చే విధంగా, పరిమితంగా మాత్రమే వాడాలనీ కొన్ని చిట్కాలు చెప్తూ,  టెక్ కంపెనీల వలలో మనిషి ఎలా చిక్కుకోకూడదో / తన దగ్గరున్న సమాచారాన్ని ఎలా సమర్ధవంతంగా వినియోగదారులు వాడుకోవచ్చో చెప్పే మంచి పుస్తకం ఇది.  

పుస్తకం ఎంత సులువుగా అర్ధమయేలా ఉందో చెప్పేందుకు కొన్ని  tit-bits : 

(i)   Nobel Prize-winning economist Herbert Simon saw things differently. 'What information consumes is rather obvious; it consumes the attention of its recipients. Hence, a wealth of information creates the internet, it is worth mentioning that Simon said this in 1971. 

The advtertising  model made attention the real currency of the internet. Selling targeted ads was how companies encashed your attention.  Targeting is why AdTech companies like collecting user data.  Data helps match users to advertisers. 

In effect, the lack of payments infrastructure on the early web has led us to the current attention and data-hungry internet. 

(ii)  Google has a large, unique collection of user search data because it has more than 92 per cent market share of online search.  In exchange for search results, we tell the search bar things we probably do not tell our closest friends.  Facebook has unique social data.  we tell Facebook who we are friends with and whom we follow.  Our interactions further betray which of these bonds are stronger and which are not. 

Companies like Facebook and TikTok have control over the social infrastructure. This enables them to get our data and prevent the competition from having that unique subset of user data  Also why wouldnt they?  It makes definite business sense to do so.  Anyone else in their position would have done the same. 

The original sin of the internet was that we decided to sell our attention to pay for the missing infrastructure of the internet.  Today, this logic has given rise to a few players who essentially own the crititcal infrastructure of the internet.  The owners of this infrastructure are using our data to further their control. 

(iii)   The enduring narrative around technology, especially touted by those who build it, is that it is a tool, neither good nor bad in itself.  They claim that the toxic patterns in our relationship with technology are problems arising from how people use these  tools. 

ఎంతయినా మన లాంటి సరైన గట్టి వ్యవస్థలు, విద్యా, సంపదా లేని దేశంలో ఇంటర్నెట్, మొబైళ్ళూ తెచ్చిన సమాచార విప్లవం, అది సాధించిన విజయాలూ కూడా చెప్పుకోదగ్గవే. 

ఉదాహరణకి - జనాభా కన్నా అధిక సంఖ్య లో ఉన్న మొబైళ్ళు, ఆధార్ లాంటి ఉచిత బయోమీట్రిక్ వ్యక్తిగత గుర్తింపు, దాని ద్వారా అనుసంధానించబడ్డ వివిధ సంక్షేమ పథకాలు, పెద్దగా చదువు లేని వ్యక్తి కూడా సులువుగా వీడియోలు చూడగలగడం, వివిధ పనులకోసం తమ సమాచారాన్ని వ్యవస్థలో పొందుపరచగలగడం, కొత్త విషయాలు       నేర్చుకోవడం, వగైరా (నందన్ నీలేకని కూడా పుస్తక  రచయిత)  ఒక పూర్తి చాప్టర్ లో ప్రస్తావించారు. 

దిషా (DISHA) లాంటి ప్రభుత్వమే అందించే విద్యకు సంబంధించిన ఉచిత అప్ప్లికేషన్ల సమర్ధత,  ఇప్పుడు కోవిడ్ కష్ట కాలంలో వేక్సీన్ ల సమాచారాన్ని, వ్యక్తిగతంగా వాక్సీన్ తీసుకున్నట్టు (కో వాక్సినా / కోవీ షీల్డా - ఎవరు ఇచ్చారు లాంటి సమాచారం తో పాటు) ధృవీకరణ పత్రాలు అందజేసే డివాక్ (DIVOC - Digital Infrastructure for Vaccination Open Credentialing) గురించీ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్  (ABDM)  గురించీ, బీదా బిక్కీ కి కూడా ఉచితంగా అందుబాటులోకొచ్చిన వివిధ  కొత్త సాంకేతిక సాయాల  విషయాల గురించీ చదివి ఆశ్చర్యం కలుగుతుంది. 

COWIN  ద్వారా భారత్ లో ప్రజలకు ఇచ్చిన ఒక బిలియన్ డోసుల కన్నా ఎక్కువ వాక్సీన్ల సమాచారాన్ని DIVOC (డివాక్) లో పొందుపరిచారు. దానికి తోడు, మన దేశంలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్న యూ.పీ.ఐ. విధానం దాని ద్వారా డిజిటల్ పేమెంట్ లలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కూడ చెప్పుకోదగ్గవే. 

మరి ఇంటర్నెట్ ఇంత మంచిదయితే, మనం ఎందుకు కమోడిటీ అయ్యాం ? మన సమాచారం భద్రం గా లేదేమో, మన ఐడెంటిటీ లు చోరీలకు గురవుతాయేమో, మనం ఏది కొనాలో, ఎలా జీవించాలో  టెక్ కంపెనీలే నిర్ణయిస్తాయేమో అన్నది కాదు ఇక్కడ సమస్య. 

సమర్ధవంతంగా మన సమాచారాన్ని పొందుపరచుకోవడం, అవసరం  అయినంత వరకే వాడుకోడం, మంచి చెడులను అవగాహన చేసుకోవడం, ఒక వినియోగదారుడిగా ప్రతి పౌరుడికీ అవసరమే.  మనం చూసే వార్తలు, వాడే సోషల్ మీడియా, మన జీవితాల్లోకి విపరీతంగా చొచ్చుకొచ్చే పద్ధతి ఎంత మేరకు మంచిదో చూసుకోవాలి కద. సినిమా కి ఆన్లైన్ లో టికెట్ కొనుక్కుంటే, మనం ఎప్పుడు బయలుదేరాలో మన ఫోనే మనకి గుర్తు చేస్తుంది. తొందరపెడుతుంది. ఈ సదుపాయం మీకు చాలా బాగా అనిపించొచ్చు. ఇదే ప్రెసిషన్ తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణానికో / ఏ పాస్పోర్ట్ ఆఫీస్ లోనో మన అపాయింట్ మెంట్ కో, మన ఫోన్ మనకి ఎందుకు సాయం చెయ్యదు ?  

ఆ గాప్ నే నింపాలంటుంది ఈ పుస్తకం.  ప్రభుత్వమూ, ప్రైవైట్ టెక్ కంపెనీలు కలిసి ఈవైపు కృషి చెయాలి.   ఒక ఏప్ ద్వారా 'స్టార్ట్ అప్ కంపెనీ'లు కేలం ఒక్క వారంలో తమ కంపెనీలు రిజిస్టర్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు, ప్రజలు వివిధ సేవల్ని సులువుగా పొందేలా చేసేందుకు టెక్నాలజీ నిర్మించాలి.  ఆయా ప్రయత్నాలు ఎటు నుండి ఎలా మలుపు తీసుకోవచ్చో ఎవరం చెప్పలేం. కోవిడ్ లాంటి పాండమిక్,  మనుషులకు టెక్నాలజీ కీ ఉన్న గాప్ ని, ఒకదానిమీద ఒకటి ఆధారపడిన విధానాన్నీ  బయటపెట్టింది. 

ప్రభుత్వ స్థాయి లో చూసుకుంటే - సమాచారాన్ని సమర్ధవంతంగా ప్రజల మంచి కోసం - నష్టాలు లేకుండా వాడుకునేందుకు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఎక్కువమంది ప్రజలని బాంకు వ్యవస్థ లో కి (వ్యవస్థీకృత విధానం లో)  తీసుకోవడం ప్రోత్సహించేందుకు Account Aggregator Network అందుబాటులోకి వచ్చింది.  DEEPA (Data Empowerment and Protection Architecture) లో ఈ బేంక్ ల అకౌంట్ ఏగ్రిగేటర్  ఒక భాగం. అలాగే గవర్నమెంట్ ఈ - మార్కెట్ ప్లేస్ (GEM ) సహాయ్ (SAHAY), Digital Public Goods లాంటి కొత్త ఆలోచనలు అమల్లోకి వచ్చాయి, వస్తున్నాయి.    

సరైన ఫైలింగ్ వ్యవస్థ, (కావల్సినప్పుడు మనం దాచుకున్న ఫైల్ లోంచీ మనకి కావల్సిన సమాచారాన్ని తీసి వాడుకోగలగడం) గురించి అవగాహన మనకి చాలా అవసరం. అదే విధంగా కొన్ని చిట్కాలు పాటించి, మనమే ఒక అమ్మదగ్గ ఉత్పత్తిగా మారిపోకుండా, మన సమాచారం, దుష్టుల చేతిలోకో, మనల్నే మభ్యపెట్టేందుకో పనికిరాకుండా, కాపాడుకోవడమూ సాధ్యమే. 

If you believe that the reason for our current set of problems is because some corporations are evil, you'd be wrong. The concept of good and evil is not sufficient to describe the complex set of incentives and interactions that drive the behavior of the platforms and people. 

పుస్తకం చాలా బావుంది. ఆసక్తికరంగా, ఉపయోగపడేలా, చదివించగలిగేలా ఉంది. "ఈ పుస్తకం టెక్నాలజీ కి వ్యతిరేకం కాదు. మీ మేలు కోసమే" {"Ultimately this book is not anti-tech, it is pro-you"} అంటూ ముగుస్తుంది. ఒక APPENDIX లో మన సమాచారం దాచుకునేందుకు, అతి సమాచారం నుంచీ, ఎడిక్షన్ లనుండీ మనల్ని రక్షించుకునేందుకు, మనకి ఉపయోగపడే టూల్స్, లింక్ లు, చిట్కాలు, ప్రింట్ లో, ఇంకా  ఒక QR కోడ్ ద్వారా ఉచితంగా కూడా నెట్ లో అందుబాటులో ఉంచారు. 

ఈ పుస్తకం రాసింది నందన్ నీలెకని, తనుజ్ భోజ్వానీలే అయినా, "ఒక పాపాయిని గ్రామం అంతా పెంచుతుందన్నట్టు" , ఈ మంచి పనిలో ఆయా రంగాలకు చెందిన  హేమా హేమీలు రచనలో సహకరించినట్టు ఉంది. చాలా రోజులకు మంచి నాన్ ఫిక్షన్ చదివాను. ఎప్పట్లాగే, నా ఇంట్రెస్ట్ చూసి, ఆటోగ్రాఫ్డ్ కాపీ అయినా నేను పెర్సనల్ గా చదువుకునేందుకు ఈపుస్తకం  ఇచ్చిన అన్న గారికి కృతజ్ఞతలు. 






***





No comments: