
In the picture : King Jigme Khesar Namgyel Wangchuk, Bhootan's new King.
జిగ్మే సింగే వాంగ్ చుక్ - భూటాన్ రాజు - ప్రపంచం లో మొట్ట మొదటి సారి గా స్వచ్చందంగా తన రాజ్యాన్ని ప్రజా స్వామ్యం వైపు నడిపించారు. భారత దేశం నుండీ పారిపోయి, తమ భూభాగం లో తలదాచుకున్న ఉగ్రవాదుల పైకి సైన్యాన్ని నడిపించిన మన మొట్ట మొదటి పొరుగు వీరుడు. ఈయన మరీ ఎంత మంచి మనసున్న మారాజంటే - ఈయన తెచ్చిన సంస్కరణల లో స్వచ్చందంగా ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించడం, (March 08 ఎన్నికల లో గెలిచిన పార్టీ భూటాన్ పీస్ అండ్ ప్రాస్పరిటీ - గెలిచింది జిగ్మే థిన్లే), పార్లమెంట్ కు సార్వభౌమత్వం, రాజుని తొలగించే అధికారాన్నివ్వడం, కొత్త రాజు గారికే రిటైర్మెంట్ వయసు - అరవైగా నిర్ణయించడం లాంటివి ముఖ్యమైనవి. ఇక్కడ ప్రజల ఆనందమే - రాజు కి ఆనందం ! ఆనందమే జీవిత మకరందం అని గట్టి గా నమ్మిన రాజు వాంగ్ చుక్ !
భూటాన్ రాజు గారు ఈ విధంగా రిటైర్ అయ్యాక, వారి అబ్బాయి రాజా జిగ్మే ఖేసార్ నమ్గఎల్ వాంగ్చుక్ - కి వచ్చే నెల పట్టాభిషేకం జరగనుంది. ఈయన వయసు ఇరవై తొమ్మిది ! ఈయన ప్రపంచం లో కెల్లా చిన్న వయసున్న రాజు గారు కానున్నారు.
భూటాన్ లో ఈ 'మొదటి' సారి రికార్డులు ఇంకా ఉన్నాయి. ప్రపంచం లో, కేవలం ఈ దేశం లోనే, అభివృద్ధిని, ప్రజల ఆనందం తో కొలుస్తారు. (Bhutan is the only country that measures its Prosperity by the gross national happiness) చందమామ కద లా ఉన్నా, ఇది నిజం. ప్రజల శాంతి, ఆనందం, భద్రత లే పరిపాలన లో వారు విధించుకున్న ప్రమాణాలు !
మొదటి సారి (బహుసా చివరి సారి) స్వచ్చందంగా రాజు పదవీ విరమణ చెయ్యడం, తన అధికారాలన్నిటినీ గుత్తంగా ప్రజలకు కట్టబెట్టడం, ఇక్కడే జరిగింది.
కొత్త రాజు గారు సినిమాలు ఎక్కువ గా చూస్తారుట! అందుకే ఆయన పట్టాభిషేకానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సోనియా, రాహుల్, తో పాటూ, షారుఖ్ ఖాన్ కూడా వెళ్తున్నారు. అక్కడ థింపూ సాకర్ స్టేడియం లో షారుఖ్, కత్రినా ల స్టేజ్ షో ఉంది. ఈ షో - రాజు గారి రాయల్ రిక్వెస్ట్ మీద ఏర్పాటు చేసారట. ఈ న్యూస్ చదవగానే నాకు వావ్ అనిపించింది. అందుకే పోస్ట్ చేస్తున్నా!
భూటాన్ కి మరియు కొత్త రాజు గారికి శుభాకాంక్షలు !
13 comments:
ముచ్చటగా ముప్పై కూడా రాకుండానే రాజైపోతున్నాడా! Cool! మీరు భలే ఇంట్రెస్టింగ్ న్యూస్ పోస్ట్ చేస్తారు సుజాత గారు!!
ఈ యువ"రాజు"కు భారతదేశం పట్ల ఉన్న నిబద్ధత గురించి సంవత్సరం క్రితం CNN-IBN లో ఒక కథనం ప్రసారం అయ్యింది. అప్పుడూ కనీసం ఈ పరాయి దేశంవాడికున్న నిబద్దత మన రాజకీయనాయకులకు లేదే అనిపించింది.
మంచి టపా. అభినందనలు.
మనకు ఇలాంటి రాజులు అదే నాయకులు ఎప్పుడొస్తారో ఏమో .ఆయువరాజేమో ముప్పై రాకుండానే రాజవుతున్నాడు.మనయువరాజుకేమో 40 వస్తున్నాయి.పీఠం ఎక్కనివ్వడంలేదే
స్థూల జాతీయానందం! ఇంతకంటే మానవీయ ప్రభుత్వం మరొకటుండదు. రాబోయే నాయకులు కూడా రాజు లాగే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుందాం. ఉంటే భూటానీయులు అదృష్టవంతులే!.
ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పినందుకు నెనరులు.
భూటాన్లో ఆనందమే అభివృద్ధయితే
అందమే ఆనందం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
రాజు గారి కబుర్లు బావున్నాయి.
థాంక్స్ నిషిగంధ - కదా చాలా కూల్ ! :D
thatchedhuttales - మీ కామెంట్ కి ధన్యవాదాలు.
చిలకమూరి విజయ మోహన్ గారు
మన రాజు గారి సంగతి పక్కనుంచండి. మన రాజు ని గద్దె ఎక్కనిచ్చేదీ, దించేదీ మనమే ! మరి చార్ల్స్ సంగతి చూడండి. ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గానే చచ్చిపోతాడేమో ! ఇప్పటికే వయసు మళ్ళిపోయింది.
Thanks for the comment.
చదువరి గారు.
చాలా బావుంది కదూ - ఈ స్తూల జాతీయానందం అనే పదం ! ఇంత మంచి రాజు గారు పెద్ద వాంగ్చుక్ గారు. నాకు చిన్నప్పుడు ఆయన వేసుకునే గౌన్ లాంటి థ్రోబ్ చూసి భలే వింత గా ఉండేది. కూర్చుంటే ఆడవాళ్ళ లాగా కాళ్ళు కనిపిస్తాయని నవ్వుకునే దాన్ని. ఎంత మంచొరో ఈ రాజు గారు అని పెద్దయ్యాక తెలిసింది.
సీ.బీ.రావు గారు
అసలు మీ కామెంటే ఎంతో ఆనందంగా రాసినట్టుంది. చదివితే బోల్డంత సంతోషం కలిగింది. థాంక్స్.
వేణూ శ్రీకాంత్ గారు
చాలా థాంక్స్ అండీ. మీకు ఈ కబుర్లు నచ్చినందుకు.
వీళ్ళ నాన్నగారు ఒకసారి విజయవాడ వచ్చారు, నాగార్జునా విశ్వవిద్యాలయం ఆరంభానికో లేక అంకితానికో .. వీళ్ళు ఆచార్య నాగార్జునుడు బోద్ఝించిన బౌద్ధ మతావలంబికులు లాంటిదేదో .. ఆ టైములో అసలే రాజులూ రాజకుమారులూ అంటే పిచ్చ ఇంట్రస్టు ఉండేది, అందుకని పేపర్లో ఆయన్ ఫొటోల్ని చాలా వింతగా చూసిన గుర్తు.
థాయిలాండ్ రాజు భూమిబొల్ గారికి కూడా మనసున్న మారాజుగా చాలా పేరుంది. 1946 నుండీ ఈయన థాయి రాజుగా ఉన్నారు. ఆ రకంగా ప్రపంచంలో అత్యధిక కాలం రాజ్యాన్నేలింది ఈయనే. ఎన్నోసార్లు తమ దేశం ప్రజాస్వామ్యం నుండి నియంతృత్వంలోకి జారుకోకుండా కాపాడారు ఈయన (ఆ వంకతో రాజ్యాన్ని హస్తగతం చేసుకోటానికి ప్రయత్నించే ఇంద్రుల ఉదాహరణలు నేపాల్లో చూసున్నాం. ఈయన అలాంటోడు కాదు). థాయి ప్రజలకి ఈయన సాక్షాత్తు దేవుడే. అమెరికాలో అన్ని థాయి రెస్టారెంట్లలోనూ ఈయన ఫొటో ఉండటం గమనించి ఆరా తీస్తే తెలిసిన విషయాలివి.
Post a Comment