Pages

30/06/2008

సరదా కధలు - భరాగో

భరాగో గారి ఈ పుస్తకం, ఎన్నాళ్ళు గానో పరిచయం చేద్దామనుకుంటూనే, ఏదో ఒక పేజీ వెంట పడిపోయి, అలా... ఆ వెల్లువ లో కొట్టుకు పోతూనే ఉన్నాను. భరాగో అనగా.. భమిడిపాటి రామ గోపాలం గారు.. మా విశాఖ వాస్తవ్యులు. విశాఖ పోర్టు ట్రస్టు లో పని చేసి, రిటైర్ అయ్యి, మా ఇంటి దగ్గర ''ఇసుక తోట'' (విశాఖ లో ఒక కాలనీ పేరు) లో నే స్థిరపడ్డారు. ఆయన మా నాన్నగారికి 'ఆశీస్సులతో..' అంటూ ఆటోగ్రాఫ్ చేసిచ్చిన ఈ పుస్తకం 23-02-2002 తేదిన మా ఇంటికి వచ్చింది. ఈ పుస్తకం లో అచ్చంగా 'నూట పదహారు' సరదా కధలు - కధ కి ఒక రూపాయి చొప్పున, పుస్తకం వెల కూడా సరదాగా నూట పదహారే. అప్పటినించీ, ఇప్పటి దాకా.. ఎన్ని సార్లు ఈ కధలు చదివానో లెక్క లేదు. మర మరాలో, కాఫీనో - వర్షం పడిన మద్యాహ్నం సమయం లో అయినా.. మన బద్దకానికో తోడుగా ఈ పుస్తకం చదువుతూ ఉంటే, ఆ మజాయే వేరు.

ఈ పుస్తకం 1995 జూన్ లో తాన (తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) పడవ మహా సభల్లో సంమానితులయిన ''బాపు-రమణ'' లకు వారి స్నేహ బంధ స్వర్ణోత్సవ సందర్భంగా అంకితం ఇవ్వదానికోసం జ్యేష్ట లిటరరీ ట్రస్టు ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తక పరిచయం లో 'మధురాంతకం రాజారాం'' గారి పరిచయ వాక్యాలు కూడా ఉన్నాయి. నిత్య జీవితం మీద, ఫీచర్ గా రాసిన ఈ కధలు, ఆఫీసు జీవితం, టూర్ ల లో విశేషాలూకాలేజీ స్నేహాలూ, బాంధవ్యాలూ, చుట్టాలూ.. ఇలా అందరి మీదా... ఆప్యాయంగా వేసిన చెణుకులు.


సెక్సు కధలూ.. సరసాలూ గుప్పించి వ్యాపారం చేసుకునే వార పత్రికలూ, వీధి చివర గుళ్ళ లో మైకు సెట్టులూ, సరైన రూలు తెలియకుండా.. మన పనులకు మెలిక పెట్టె క్లార్కులూ, తెలుగు టీవీ వాళ్ల 'వ్యాఖ్యానం', ఈ మధ్య వస్తున్నా పాటలూ, శ్రమా ఖర్చులూ, వివాద భోజనంబు.. నమ్మక హరాం ... ఇలాంటి ప్రతీ విషయం.. (ఐస్ లోంచీ వాటర్ పద ప్రయోగం ఈ పుస్తకం లోనిదే..) ఆయా కధ ల లో చెక్కగా.. చెప్పేసి, బోల్డంత నవ్వు తెప్పించేస్తారు. అన్నీ సింపుల్ కధలే. కానీ.. ఆ కధలు చదివితే, ఒక పదేళ్ళ క్రితం జీవితానికీ.. ఇప్పటి నిత్య జీవితానికీ సామ్యాన్ని, తేడానూ - తెలుసుకోవచ్చు. అయితే, ఈ కధలు చెప్తే కన్నా.. చదివితే ఇంకా బాగుండడం ఒక విశేషం. ఆఫీసు రాజకీయాలూ... లోసుగులూ, కాపీ రాయల్లూ, రాజకీయ ఔత్సాహికులూ.. ఇలా కావేవీ కధ అల్లడానికి అనర్హం అన్నట్టు, కనబడ్డ అన్ని సమస్యల మీదా, సహేతుకమైన విమర్శ తో చెక్కగా ఇన్ని కధలు చెప్పేరు. ఇంక చదివి, సరదాగా నవ్వుకోవడం మనం చెయ్యగలిగే పని.

ఈ పుస్తకం చదివాకా.. మనసు లొ కలిగే ఫీలింగ్.. ఒక చమత్కారం తరవాత కలిగేది. బరువైన ఇతివృత్తం.. కధనాలూ ఉండవు. జీవితం మీద నిక్కచ్చి అభిప్రాయాలు, నిజాలూ పెద్ద ఆర్భాటం లేకుండా మనసు ని ఆకట్టుకుంటాయి. ఈ పుస్తకం నిజానికి ''కధన కుతూహలం'' పేరిట రచయిట వారానికి ఒకతి చొప్పున ఆంధ్ర జ్యొతి డెయిలీ కి రాసిన ఫీచర్ కధల లొ ఒక నూట పదహారు చిన్న కధలు - గుది గుచ్చి చేసిన మాలిక.

రచయితే, తన పుస్తకం గురించి స్వయంగా చెప్పుకుంటూ.. -- ''సరదా కధలు '' చాలా వాట్లొ ''నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకపరి తలచే'' వినొదాత్మకత వుందని నా స్ఫురణ. సమాజం లొ తటస్థపడే క్రౌర్యాలూ, నైచ్యాలూ, చీకటి కొణాలూ, నా కధల్లో దృగ్గొచరం కావని ప్రసంసా, అభిసంసా కలిపిన కితాపు నాకిదివరకే దఖలు పడింది. అది మైనస్ పాయింట్ ఎలాగొ, ప్లస్ పాయింటూ అలాగే అని నన్ను నేను ఓదార్చుకుని, నా ఈ స్వ-పుస్తక-ప్రచురణా-వ్యసనాన్ని సమర్ధించుకుని, ఈ ''భారీ బడ్జెట్ వెంచర్ '' లొ దిగేసాను (పుస్తకం స్వయంగా ప్రచురించారు..) సరదాకి (ఏదో) ఆడితె, చాకలిది చీర పట్టుకుపొయిందని సామెత. ఈ సరదా కధల ప్రచురణ నాకొక వస్త్రాపహరణం కాకుండా వుండాలని, ఈ పుస్తకం, నేనూ బతికి బట్టకట్టాలనీ, నేనే తుమ్ముకుని, నేనే చిరంజీవ అనుకుంటున్నాను.'' అంటారు.

ఈ పుస్తకం తప్పకుండా చదవొచ్చు. నిరాశ చెందకుండా, కాసేపు నవ్వుకొవచ్చు.

పుస్తకం వెల : నూట పదహారు రూపాయలు - ప్రతులు విశాలాంధ్ర , నవోదయా బుక్ హౌస్ లలో దొరుకుతాయి.

29/06/2008

Sri Sri

A day will come
When I pervade the world
when my song of the dark night
thrills the earth !

I will open like the white petal of the World Lotus ;
I will sing like the string of the world Iyre ;
I will fly like the flag on the top of the world.

- Sri Sri

డిక్షనరీ జోకు

అమెరికాకు చెందిన ఒక డిక్షనరీ రచయిత గురించి ఒక జోకు చెప్పారు. అది నిజంగా (జరిగిందనే అంటారు - కానీ) జరిగి ఉండక పోవచ్చు. అయితే సరైన మాట వాడడం దానికి సరైన అర్ధం తెలుసుకోవటం అనే ఈ రెండు విషయాలూ మాటలు (భాష) ఉపయోగించే వారికి ఎంత ముఖ్యమో ఆ జోక్ లో స్పష్టంగా చెప్పడమైంది. ఆ జోకు ఇది :

డిక్ష్ నరీ రాసే ఆ రచయిత కి తన ఇంట్లో మెడ మీద గది లోనే రోజులో ఎక్కువ కాలం గడపడం కొన్నేళ్లుగా అలవాటు. పెన్ లో సిరా అయిపోవడం నుంచి, గొంతు తడి ఆరిపోవడం వరకూ.. ఏది జరిగినా, అక్కడ కూర్చునే, కిందికి సంకేతం పంపిస్తాడు - ఒక ఎలక్ట్రిక్ బెల్ ద్వారా. రాత్రేమిటి, పగలేమిటి, అతనికి భార్య తోనూ, ఇతర కుటుంబ సభ్యుల తోను గడిపే అవకాశం కుదరటం లేదు - ఈ కొన్నేళ్ళ నుంచీనూ.

అటువంటి కాలం లో ఒక సారి ఆయన హఠాత్తుగా మెడ మెట్లు దిగి వచ్చేసరికి మెట్ల దగ్గర ఉన్న చిన్న గది లో తన భార్య, వంటవాడు, ఒకర్నొకరు కౌగిలిన్చుకుని ముద్దులాడుతూ కనిపించేరు. భార్యని అలా చూసిన వెంటనే అతనికి నోటంట మాట రాలేదు. ఆవిడే ఊడి, ఇవతల పడి, ..''మిస్టర్ ... అయాం సర్ ప్రయిజ్డ్'' అందిట. దానికి ఆ మిష్టరు ''తప్పు ! ఆశ్చర్య పడింది నేను, నువ్వు నిర్దాంత పోయానని అనాలి'' అన్నాడట.



- భరాగో సరదా కధల నుంచి.

భమిడి పాటి కామేశ్వర రావు గారి జోకు

ఓ ఊళ్ళో ఇద్దరు కవల అన్న దమ్ములు ఉండే వార్ట. కవల అన్న దమ్ముల్లో ఒక విచిత్రమైన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. అదే - వాళ్ళిద్దరూ పుట్టడం వరకూ ఒకే రోజుని - ఆ మాటకొస్తే, వొకే గంటకీ పుట్టొచ్చు - కానీ ఒకే సారి చావటం మాత్రం కుదిరే పని కాదు.

అలాగున - ఆ ఇద్దరన్నదమ్ముల్లొ ఒకాయన పోయాట్ట. ఆ పోయిన కొద్దిరోజులకి బతికున్న ఆయన రోడ్డు మీద నడుస్తుంటే, వొకాయన ఎదురు పడి -
'' ఈ మధ్య పోయింది నువ్వా, నీ బ్రదరా ?'' అని అడిగేసాట్ట.


- భమిడి పాటి రామ గోపాల్ (భ రా గో) గారి ''సరదా కధలు - నూట పదహారు'' నుంచి.

ఆటోవాలాల తో బెడదా ?

మొన్న హిందూ లో ఒక చిన్న వార్త వచ్చింది. ఆటో రిక్షా ల వాళ్లు ప్రయాణీకులకు వీజీ గా ఇచ్చేస్తూండే సర్ ప్రైస్ లు తట్టుకోవడం మీ వల్ల కాక పొతే, మిమ్మల్ని ఆదుకోవడానికి రాష్ట్ర రవాణా శాఖ, పోలీసు శాఖ తో కలిసి పది మొబైల్ టీం లను ఏర్పరిచింది అంట! వీళ్ళు - ప్రధానంగా నాంపల్లి, సికంద్రా బాద్, అమీర్పేట్, జూబిలీ బస్ స్టాండ్, దిల్ షుక్ నగర్ బస్ స్టేషన్, మెహదిపట్నం, మలక్ పెట్, తార్నాక, మహాత్మా గాందీ బస్ స్టేషన్ మరియు ఫలక్ నుమా ఏరియా ల లో ప్రస్తుతానికి పని చేస్తున్నారు.

ఈ వార్త చదివాక, మా మావయ్య గారు, ఆ నెంబర్లూ అవీ ఉన్నపేపర్ కట్టింగ్ తీస్కెళ్ళి, జిరాక్స్ కాపీలు తీయించి, నాకు 'ఈ నెంబర్లు నీ హ్యాండ్ బాగ్ లో ఉంచుకో అమ్మా.. ఎపుడన్నా, ఎవరైనా, ఆటో వాడు, నేను రాను, డిజిటల్ మీటరు వెయ్యను అన్నా.. మిస్ బెహేవ్ చేసినా.. మొబైల్ ఫోన్ లోంచీ ఫోన్ చెయ్యడానికి సులువు గా ఉంటుంది అని ఇచ్చారు. ఈ పధ్ధతి ఎంత సమర్ధ వంతంగా పని చేస్తుందో తెలియదు గానీ.. ఆటో వాలాలు ప్రయాణీకులను చాలా ఇబ్బంది పెడతారని ప్రభుత్వం గుర్తించి, మన లాంటి సామాన్య ప్రజల మీద జాలి పడిఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నదంటే ఆనందం తో నాకు ఐస్ (కళ్లు) లోంచీ వాటర్ (కన్నీరు - ఆనంద భాష్పాలు ..) వచ్చేసింది.

సికందరాబాద్ రైల్వే స్టేషన్ లో పొద్దున్న మా ఊరి నుంచీ, గోదావరి లో అయిదున్నర కల్లా దిగితే, ఇల్లు చేరడానికి ఏ పోలీసు ఆయనో (నాకు ఆ క్షణం లో స్టేషన్ బయట ప్రయాణీకుల ను దగ్గరుండి, ఆటో లు ఎక్కించే పోలీసు వాళ్ళంటే... ఎన లేని గౌరవం కలుగుతూ ఉంటుంది.) సాయం చెయ్యక పొతే, మా వైపు (కంటోన్మెంట్ వైపు) ఏ ఆటో వాడు, కరుణించి తీసికుని వెళ్ళడు. అటు వెళ్తే, ఎవరు వాళ్ళని కరిచేస్తారో నాకు అర్ధం కాదు.

సరే, ప్రస్తుతం, ఈ నెంబర్లు చూద్దాం. ఎవరైనా ఆటో వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, ఈ నెంబర్లలో మాట్లాడి, వాళ్ల మీద కంప్లైంట్ లాడ్జ్ చెయ్యొచ్చు!

నాంపల్లి స్టేషన్ - అశోక్ యాదవ్ (రవాణా) - 98485 28656
- సలీం (పోలీసు) - 94906 16069
Secunderabad - P. RAMESH బాబు (రవాణా) - 99085 25635 &
Police - Koteswara Rao - 99129 14547
Amberpet - GV Srinivasa Goud (Transport) - 98483 06352
- SI Paramkusam - (Police) - 98906 16097
Jubilee Bus Station - KVS Murti (Transport) - 98485 28668
Dilshuk Nagar - A Srinivas Reddy (Transport) - 98485 28449
- SI Mohan Rao, Malakpet Tr.PS (Police) - 94906 16842
Mehdi Patnam - C.P. Venkateswara Rao (Transport) - 98485 28614
- Naseeruddin, Goshamahal (Police) - - 94906 16738
Malakpet - T Goverdhan Rao (Transport) - 98485 28614
Tarnaka - H Ganesh (Transport) 98485 28459
- Siva Ram Prasad (Inspr of Police) - 94906 16084
MGBS - K Kiran Kumar (Transport) - 98483 08440
- Bhadriah SI (Police) - 94906 08457
Faluknuma - K Abhimanyudu (Transport) - 98483 08457
- SI Isaih (Falaknuma - Police) - 94906 16750

ఈ సమాచారం ఎవరికన్నా పనికొచ్చేది అనిపిస్తే, నా టైపింగు వృధా పోనట్టే.. ఇంకా దీని గురించి సమాచారం కావాలంటే, Page No.2, The Hindu dated 26 - 06 - 2008 ని చూడండి.

25/06/2008

భజ గోవిందం





Sassangatve Nissangatvam
Nissangatve Nirmohatvam
Nirmohatve Nischalatvam
Nischalatve Jeevan Mukti
Bhaja Govindam Bhaja Govindam
Bhaja Govindam Moodhamate


Through the company of good, there arises non-attachment
Through non-attachment, there arises freedom from delusion
When there is freedom from delusion, there is reliability
On experiencing the Immutable reliablity, there comes the state of liberated life.

Seek Govind, Seek Govind,
Seek Govind, O: Fool.






- Adi Shankara

24/06/2008

అగ్ని

అగ్ని ఊర్ధ్వ ముఖంగా ఎక్కు పెట్టిన వస్తువు కాదు
అశుభాన్ని పరిహరించడానికొ
లేదా నీ బలాన్ని చూపించడానికో కాదది
అది భారతీయుడి హృదయాగ్ని
దానికి ఆయుధ రూపం ఇవ్వకు
జ్వలిస్తున్న జాతి ఆత్మా గౌరవ కాంతి తో
దాన్ని మరింత వెలగనివ్వు

- ఎ.పీ.జే. అబ్దుల్ కలాం
(ఒక విజేత ఆత్మకధనుంచి)
అగ్ని క్షిపణి వ్యవస్థ పై రాసిన వాక్యాలు

స్వామి అండ్ ఫ్రెండ్స్

స్వామీ అండ్ ఫ్రెండ్స్ - ఆర్.కే. నారాయణ్ గారి అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం కొన్నేళ్ళ క్రిందట విశాఖపట్నం లో 'జ్యోతి బుక్ డిపో' లో చాలా అదృష్టం మీద దొరికింది. ఈ పుస్తకం నిండా ఆర్.కే. లక్ష్మణ్ గారి ఇలస్త్రేషన్ లు ఉన్నాయి. ఈ పుస్తకం ఎవరు అనువదించారో గుర్తు లేదు.. బహుసా శ్రీమతి.వాసిరెడ్డి సీతాదేవి అనుకుంటాను. అయితే, ఈ పుస్తకం ఒక ఫ్రెండ్ కి బహుమతి గా ఇవ్వటం జరిగింది. ఆ తరవాత ఈ పుస్తకం ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు (తెలుగులో..) ! బ్లాగరులు చాలా మంది చదువరులు కాబట్టి, యధాప్రకారం. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో, ఎవరు అనువదించేరో.. లేదా.. ఎటువంటి సమాచారాన్నయినా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకాన్ని నా సేకరణలలో (కొనుక్కుని ఉంచుకోవలసిన పుస్తకాలలో) చేర్చుకోవాలని ఆశిస్తున్నాను. తెలుగు లో కూడా స్వామీ... రాజన్, మని .. వీళ్ళంతా.. చాలా అలరిస్తారు మరి. అనువాదమే అయినా.. చాలా బావుంటుంది. ఎవరికయినా ఈ పుస్తకం గురించి తెలిస్తే ఒక సారి వ్యాఖ్య ద్వారా తెలియచేయ గలరు. ఆర్కుట్ సమూహం లో సభ్యులు.. ఇంగ్లీష్ లో చదువుకోవచ్చు గా.. అని, ఇంగ్లీష్ లోనే బావుంటుంది లెమ్మని....ఒక ఉచిత సలహా పడేసారు. తెలుగు అనువాదం కూడా బావున్నపుడు, (అసలు అనువాదం సంగతి చాలా మందికి తెలియదు) చదివితే మంచిదేగా..

మా అమ్మ



సాగర తరంగాలు, సువర్ణ సైకతాలు, యాత్రీకుల విశ్వాసాలు
రామేశ్వరం మసీదు వీధి, అన్నీ కలిసి ఒక్కటైతే
మా అమ్మ !

అమ్మా ! నన్ను స్వర్గ వాత్సల్యంతో చేరవచ్చావు
జీవితం ఒక సవాలుగా ఒక శ్రమగా గడచిన ఆ యుద్ధ కాలం
మైళ్ళకొద్దీ నడక, సూర్యోదయానికి ముందే లేవడం,
గుడి దగ్గర అయ్యవారు చెప్పిన పాఠాలు
అరబ్బు పాఠశాలకు మైళ్ళ నడక
రైల్వే స్టెషన్ రోడ్డుకి ఇసుకదారుల్లో ఎదురీత
ఆ దేవాలయ వీధులూఅ వార్తాపత్రికలు సేకరించడం, పంచడం
మళ్ళా పాఠశాలకిసాయంకాలం, రాత్రి చదువుకి ముందు దుకాణంలొ పనిపాట్లు,
ఇది ఒక బాలుని వేదన

అమ్మా ! రొజుకి ఐదు సార్లు నీ వందన నమస్కారాలు
సర్వేశ్వరుని క్రుపావీక్షణాలతొ జీవితాన్ని పవిత్రంగా బలపర్చావు.
ఆ పవిత్రతే నీ పిల్లలకు శ్రీరామ రక్ష.
నువ్వెప్పుడూ నీకున్నదాంట్లొ మంచిదేదో ఎవరికి ఏది అవసరమో చూసి ఇచ్చావు.
నీకు ఇవ్వడమే తెలుసు, ఇస్తూనే ఉంటావు.

నా పదేళ్ళప్పటి ఆ రోజు నాకింకా గుర్తే
నన్ను నీ వళ్ళొ పడుకోబెట్టుకున్నావు.
నా అన్నలూ, చెల్లెళ్ళూ ఉడుక్కుంటున్నారు
నిండు పున్నమి రాత్రి, అప్పుడు, నాకు తెలిసిందల్లా నువ్వే,
అమ్మా, నా అమ్మా !
నేను కన్నీళ్ళతొ ఉలిక్కిపడి లేచాను
నీకు నీ బిడ్డ బాధ తెలుసు నీ లాలించే చేతుల ద్వారా మ్రుదువుగా తొలుగుతున్న బాధ
నీ ప్రేమ, నీ లాలన, నీ నమ్మకం, నాకు బలాన్నిచ్చేయి.
ప్రపంచాన్ని నిర్భయంగా ఎదుర్కోవడం నేర్పాయి.
సర్వేశ్వరుని శక్తిని నిలిపాయి.


అమ్మా, అంతిమ తీర్పు రోజున కలుస్తాం కదా మళ్ళా !

- ఎ.పి.జె. అబ్దుల్ కలాం
[చిన వీరభద్రుడు]
(వింగ్స్ ఆఫ్ ఫైర్ - నుంచి)
తెలుగు అనువాదం - ఒక విజేత ఆత్మ కధ

11/06/2008

గోవిందా ఆలారే!


నిన్న మా ఊరికి 'గోవిందా'' సినిమా ఏదో షూటింగ్ కి వచ్చింది. జనం, గోల గోల చేసారు. సినిమా పేరు తెలియదు గానీ... 'గోవిందా', 'శక్తి కపూర్', 'హరీష్', లాఫ్టర్ ఛాలెంజ్ తాలూకూ 'కుకీ' ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇంగ్లీష్ వాళ్ళంతా.. ఈ హడావిడి కి కొంచెం కంగారు పడ్డారు. షూటింగ్ వేళ కి నేను 'టౌన్ సెంటర్' లోనే ఉన్నాను. అనుకోకుండా.. గోవిందా ప్రత్యక్షం అవడం తో.. జనం తమ తమ స్నేహితులకూ, ఇంట్లో వాళ్ళకూ ఫోన్లు చేసి పిల్చుకున్నారు. కాసేపట్లోనే పెద్ద మూక తయారైంది. ఫోటోలు తీసుకోవడం, 'చీ చీ' - 'చీ చీ' అని ,కేకలూ మొదలు పెట్టారు. 'గోవిందా' ముఖం మీదే.. 'ఎహ్ తో మోటా హోగాయా!', 'ఎహ్ తో బుడ్డా హోగాయా.. !' అని రిమార్కులూ చేసారు. గోవిందా మాత్రం పాపం విన్నంత సేపూ, మొహం ''ఈ టీవీ సీరియల్ లో నటుడి'' లా.. భావ రహితంగా పెట్టుకుని, ఈ మాటలు విన్నాడు.




నేనూ మొదటి సారి సినిమా షూటింగ్ చూసాను. ఒక చిన్న సీన్ కోసం బోల్డంత తిప్పలు పడుతున్నారు. ఒక డాన్స్ సీన్ కూడా తీసారు.. 'ఫారిన్ అమ్మాయి లతో'! జనం పెరిగేకా.. గోవిందా త్వర త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ చెదిరి పోయాక, మళ్ళీ వచ్చేడు. మాకు తెలిసిన వాళ్ళంతా.. దాదాపు పరిగెత్తుకుంటూ, కెమేరాలు పట్టుకుని, అక్కడకు వాలిపోయారు. చిన్న ఊరు కాబట్టి, ఈ ఊరికి బాలివుడ్ రావటం తో అందరూ బోల్డంత ఆనంద పడిపోయారు. స్థానిక ఇంగ్లిష్ వాళ్ళకు వచ్చింది 'బాలీవుడ్' స్టార్ అని చెప్తే, అర్ధం చేసేసుకున్నారు. మరి 'బాలీవుడ్' అన్న పదం డిక్షనరీ లో చేరింది గా! శక్తి కపూర్ మాత్రం... జనం ఆటోగ్రాఫులు అడుగుతారేమో అని ఆశ పడుతూ తిరిగాడు. అయితె, కొంచెం సేపటికి అమ్మాయిలు ఈ 'పక్కా విలన్ గాడి' తో ఫోటోలు తీసుకోవటం మొదలు పెట్టారు. శక్తి కపూర్ కూడా.. బోల్డంత సహకరించి, దాదాపూ అందరితో ఫోటోలు దిగాడు. వాతావరణం పెద్ద పండగ లాగా అయింది.

అయితె, ఒకటి.. ఇంత కష్టపడి.. నానా పాట్లు పది, ఒక చిన్న సీన్ కొన్ని పదుల సంఖ్యలో తీసి, ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని మనం ఇంటర్నెట్ లో ఫ్రీ గా చూసేస్తాం కదా.. అని జాలి కలిగింది.

09/06/2008

చెప్పట్లు ! నా యాభయ్యవ పోస్టు కి

అందరూ బ్లాగుతున్నారని, రాయక పోతే, ఏదో వెనక బడిపోతానేమో అన్న కుతి తో, బోల్డు కుళ్ళు కు చచ్చి పోయి, - నేనూ రంగం లోకి దూకాను। కానీ, అప్పుడు ఇది ఎంత దూరం పోతుందో తెలియదు। చివరికి ఈ చెత్తా, చెదారం, గడ్డీ, గాదం - తెగ రాసేసి ఇప్పుడు నా 50 వ పోస్ట్ రాసేస్తున్నాను. ఇది నా బ్లాగు గురించే !! (సెల్ఫ్ డబ్బా అని గమనించాలి).


బ్లాగ్ రాయటం వల్ల, నా భాష మెరుగు పడింది। రాయటం లో - ఒక స్పష్టత రావడానికి ఇంకా బోల్డంత సమయం ఉంది. ఇంకా - మంచి మంచి వాళ్ల బ్లాగులూ చదివాను. మంచి విషయాలూ తెలుసుకున్నాను. ఏవో నా - గోల - అంతా, నా ఇష్టం ఉన్నట్టు చెప్పుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడింది. 'జీవ హింస' మహా పాపం. అయినా దాన్ని క్షమించి, ఉదాత్త హృదయం తో నా బ్లాగ్ చదివే వారందరికీ బోల్డు ధన్యవాదాలు. మీరెంత మంచి వాళ్ళో !?!!

అందుకే, నా 50 వ పోస్ట్ కి నాకు నేనే ఆనందంగా చెప్పట్లు కొట్టుకుంటున్నా !

లండన్ అండర్ గ్రౌండ్ కవితలు

లండన్ ట్యూబ్ లో ప్రయాణంలో అప్పుడప్పుడూ ఈ 'అండర్ గ్రౌండ్ కవితలు' తారసపడతాయి. ఇది చదివాక, నచ్చి, చేతనైన విధంగా.. ఈ ఫోటో తీశాను.

కుర్చీ బైక్

ఈ బైక్ చూసారా.. పెద్దవాళ్ళూ, కీళ్ళ నొప్పులతో బాధ పడేవాళ్ళూ ఇలా ఈ బైక్ ల మీదే షాపింగ్లూ, ఊర్లో ఏమైనా పనులు చెక్కబెట్టుకోవటానికి వస్తూంటారు. ఈ బళ్ళు అన్ని రాంపు ల మీద నడుస్తాయి కాబట్టి వికలాంగుల రాంపు ల మీద - Disabled Access ఉన్న అన్ని ప్రాంతాలూ.. ఈ బైక్ ల మీద హాయిగా తిరగడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ నడక ఎక్కువ కాబట్టి, కాస్త స్తోమత గల ముసిలీ, ముతకా - ఇలాంటి బైక్ మీద తిరుగుతారు. దీని వేల £ 650.00 నుండీ మొదలు. కొన్ని బైక్ లలో వర్షం వస్తే ఇంకా.. శీతాకాలంలో చల్ల గాలి తగలకుండా, చుట్టూ (చిన్న కేబిన్ లా) ప్లాస్టిక్ తొడుగు కూడా పెట్టుకోవచ్చు. UK లో నాకు బాగా నచ్చిన ఐడియా ఇది.

బెడ్ఫోర్డ్ జ్ఞాపకాలు

ఔస్ నది లో రాజ హంసలు

నది పక్కన షికారు

అంతర్జాతీయ పతంగుల పండగ (International Kite Festival) అయినప్పుడు బాలీ (ఇండోనేషియా) నుంచీ వచ్చిన హనుమంతుడి డిజైన్ లో ఒక గాలిపటం
పొరుగింట్లో విరగబూసిన గులాబీలు (English Roses)

ఔస్ నది పక్కన ఒక మడుగు. చేపలూ, నాచూ పెరగడానికి దాన్నలా వొదిలేసారు.

గ్రేట్ ఔస్ నది లోని ఒక బోటు
* * *
ఇంకో వారం లో Bedford కూ, నాకూ రుణం తీరిపోతుంది. సర్కారీ ఉద్యోగం లో, అందునా రక్షణ శాఖ లో దురదృష్టకరంగా చిక్కుకుపోయినందుకు, దీర్ఘకాలిక సెలవు దొరకడం ఇంక అసాధ్యం. అందుకే, హైదరాబాదు కి తిరుగు ప్రయాణం. జీవితం లో ఇంకో సారి ఇక్కడికి రానేమో అని బెంగ కలిగి, ఈ ఫోటోల తో జ్ఞాపకాలు మూట కట్టుకుందామని ఈ ప్రయత్నం.

ఈ పాటలు కావాలి

ఈ క్రింది పాటలను చాన్నాళ్ళు గా వెతుకుతూ ఉన్నాను. కానీ ఎక్కడా దొరకలేదు. అయితె, వీటి 'ఆచూకీ' తెలిపిన వాళ్ళకు బోల్డంత పుణ్యం దొరుకుతుంది. అందుకే, ఎవరయినా ప్లీజ్ సహాయం చెయ్యండి.. థాంక్స్.

౧) ''అమ్మ దొంగా - నిన్ను చూడకుంటే నాకు బెంగ'' దీనిని దూరదర్శన్ లో ప్రసారం అయ్యే 'లలిత గీతాల' కార్యక్రమం లో వేదవతీ ప్రభాకర్ గాత్రం లో విన్నాను.

౨) ''ఏవి తల్లీ - నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లీ?'' - శ్రీ శ్రీ 'మహా ప్రస్థానం' లోని కవిత. బాలూ నిర్వహించిన 'పాడుతా తీయగా' (ఈ టీవీ) లో ఒకమ్మాయి పాడగా విన్నాను.

౩) ''కమలా వల్లభ, గోవింద మాం పాహి - కళ్యాణ కృష్ణా గోవిందా.. యశోద తనయా, గోవింద మాంపాహి - కళ్యాణ కృష్ణా గోవిందా..'' - బాల మురళీ కృష్ణ, వేదవతీ ప్రభాకర్, చాయా దేవీ కలిసి పాడిన కృష్ణ భజన. (తిల్లానా కేసెట్ లో విన్నట్టు గుర్తు)

* * *

సానియా మీర్జా

లార్డ్స్ నుంచీ వింబుల్డన్ కు కూడా వెళ్ళాను. ఆయితే సమయాభావం వల్ల 'టేన్నిసు కోర్టులు' చూడలేదు. పైగా అదే సమయానికి 'సెంటర్ కోర్టు' ఏవో మెయింటైన్ చేస్తున్నారట. అందుకే, కేవలం 'టెన్నిస్' మ్యూసియం చూసి వచ్చేసాము. ఇక్కడ మంచి 'ఐ-మాక్స్' తరహా సినిమా చూపించారు. చాలా బావుంది. ఈ సినిమా, టెన్నిస్ క్రీడ గురించి. ఈ ఆట ఆడాలంటే, మెదడుకీ, శరీరానికి ఎంత చురుకుదనం, కో-ఆర్డినేషన్ కావాలో, ఈ వింబుల్డన్ ప్రత్యక్ష ప్రసారాలు ఎలా జరుగుతాయో, బంతి వేగాన్ని ఎలా కొలుస్తారో అన్నీ.. గ్రాఫిక్స్ తో చూపించారు. చాలా బావుంది.



అయితె, ఈ టపా సానియా మీర్జా గురించి. మన అమ్మాయి - భారత టెన్నిస్ ముఖ చిత్రం లో పెద్ద పేరు తెచ్చుకుంది. మహేష్ భూపతి తో మిక్సిడ్ డబుల్స్ ఆడిన ఫోటో తో సహా ఆమె వాడిన టీ-షర్ట్ ఈ మ్యూసియం లో చూసి, చాల సంతోషం కలిగింది. సానియా మీర్జా ను సినిమాల్లో తీసుకోవాలని అనుకుంటున్నారట. అదేదీ జరగకుండా.. సానియా ఇంకా బాగా ఆడి, టెన్నిస్ స్టార్ గానే మిగిలిపోవాలని ఆశిస్తున్నాను.



08/06/2008

లార్డ్స్ - క్రికెట్ మైదానం

మొన్న లార్డ్స్ మైదానానికి వెళ్లాను. నాకు క్రికెట్ పరిజ్ఞానం అంతగా లేదు. అందుకే ఎం.సి.సి అంటే, మన స్వామి, రాజన్ ల 'మాల్గుడీ క్రికెట్ క్లబ్' గుర్తొచ్చింది. :D


మేము వెళ్ళిన రోజు స్థానిక టీం ల మధ్య మేచ్ జరుగుతోంది. మేచ్ చూడటానికి స్త్రీలకు ఆ రోజు ఎందుకో ఉచిత ప్రవేశం ఇచ్చారు. మేచ్ చూడటానికి టికెట్ వెల - £ 14. ఈ స్టేడియం లో పిల్లర్లు ఎక్కువ లేకుండా కట్టడం వల్ల అన్ని సీట్ల లోంచీ చక్కగా మేచ్ కనపడుతుంది.

ఇవి మీడియా సెంటర్ లో కామెంటరీ డెస్కులు. మొదట్లో ఇవి పెవిలియన్ లకు మధ్యలో ఉండేవి. వీటికి గాజు తొడుగు ఉండినా, కామెంటరీ చెప్పే వాళ్ళకు బయట జనం హోరు, విమానాలూ, బస్సుల హోరూ, వినిపించి, హుషారైన కామెంటరీ వినిపించేవారు. ఇప్పుడు వీళ్ళకు కట్టించిన అత్యాధునిక మీడియా సెంటర్ గాజు పెట్టె (క్రింది ఫోటో ) లా ఉందని, గొడవ చేసి, మేచ్ జరిగే టప్పుడు చిన్న కిటికీలు తెరుచుకుంటున్నారు. లార్డ్స్ లో క్రికెట్ చూడటం అంటే ఆట లో మమైకం కావటమే.

మైదానం బయట .. గోడ మీద ఒక శిల్పాల కేన్వాస్.


పెవిలియన్ - ఎడమ వైపు హోమ్ టీం, కుడి వైపు 'వెయిటింగ్ టీం' ఉంటారు - ఆ కుడి వైపు బాల్కనీ లోనే, సౌరవ్ గంగూలీ - షర్ట్ విప్పి గాల్లో గిర గిరా తిప్పాడు.


లార్డ్స్ లో మీడియా సెంటర్. ఇక్కడ రేడియో, టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి. మైదానం లోకి కామెంటరీ కూడా ఈ మీడియా సెంటర్ లోంచే వినిపిస్తారు.

ఇంకా..

~ లార్డ్స్ లో 'ఆనర్లు' రికార్డ్ చేసి, వైటింగ్ రూం లలో ప్రదర్శిస్తారు. ఈ ఆనర్లు చూసి, క్రీడా కారులు స్పూర్తి చెంది, బాగా ఆడాలని ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టారు. అయితె, ఈ 'ఆనర్ల బోర్డు' లోకి తమ పేరు ఎక్కడం ఎంతొ గొప్ప విషయం గా క్రికెటర్లు భావిస్తారు. అయితె, ఈ బోర్డుల్లో ప్రపంచ ప్రసిద్ది చెందిన క్రీడా కారులు చాలా తక్కువ మంది ఎక్కారు. ఉదా.. సచిన్ లార్డ్స్ లో ఎప్పుడూ సెంచరీ చెయ్యలేదు. లార్డ్స్ లో ఈ బోర్డ్ ఎక్కిన భారతీయ క్రికెటర్ - అగార్కర్. (Most unlikely candidate)


~ లార్డ్స్ లో క్రికెట్ కు సంబంధించిన అన్నీ - ఉన్నాయి. హాస్యం, ఉద్వేగం - ఇలా. ఇక్కడి మ్యుసియం (ఫోటోలు తీయనివ్వరు) లో 'ఏషేస్' ట్రోఫీ.. ఉంది. దీనికి సంబంధించిన కధలు - ఉద్వేగాలు అన్నిటినీ హాస్యం గా తీసుకుంటారు.

~ ఈ మైదానాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులు రెండు వర్గాలు. ఒకటి - భారతీయులు (మేము వెళ్ళిన టీం లో తెలుగు వాళ్లు బోల్డంత మంది కనిపించారు). రెండు - ఆస్త్రేలియన్లు. టూర్ గైడ్ ఈ రెండు వర్గాల వారితో క్రికెట్ మీద బోల్డన్ని జోకులు వేసాడు. ఆస్త్రేలియన్లు బోల్డంత ఆనందించారు.

~ లార్డ్స్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మిలియన్ల కొద్దీ విలువ చేస్తుంది. బ్రిటన్ లో అత్యధిక ధర పలికే ఇళ్లు ఇవి. లార్డ్స్ దగ్గర ఇళ్లు అంటే ఎంతో గొప్ప అంట.

~ ఇక్కడ క్రికెట్ చూడటం - చాలా అత్భుతమైన అనుభవం. ఎంత దూరం లో కూర్చున్నా గ్రౌండ్ లో జరిగేది స్పష్టం గా కనిపిస్తుంది. ప్రేక్షకులకూ, క్రికేటర్లకూ మధ్య కంచెలు లేవు.

~ మ్యూసియం లో బ్రియాన్ లారా కోసం ప్రత్యేక విభాగం ఉంది. బ్రియాన్ లారా అభిమానులకు కనువిందు చేస్తుంది. బ్రియాన్ లారా ఒక లెజెండ్ అయి చాలా గౌరవం పొందుతున్నాడు ఇక్కడ.


క్రికెట్ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకు ఇక్కడ మేచ్ చూడటం ఒక జీవిత కాలపు అనుభవం అవుతుందేమో!

06/06/2008

జ్ఞాపకాలు

ఈ పాట నాకు కుంచెం ఇష్టం..

ఎందుకంటే, లండన్ లో నాకు పిచ్చ పిచ్చ గా నచ్చే ట్రఫాల్గర్ స్క్వేర్, దాని పక్కనే 'నేషనల్ మ్యుసియం' ముందు తీసిన పాట. పైగా, ప్రముఖమైన టవర్ హిల్ నూ, స్వింగ్ బ్రిడ్జ్ మీదా కూడా తీసారు. హైదరాబాద్ వెళ్ళాకా ''హైయా'' అనుకుంటూ ఈ పాట చూస్తాను.

మహిళలు - ''మహా''రాణులే

మహిళలు - వీళ్ళు ఒక పెద్ద శక్తి. మిగతా రాష్ట్రాల లో తెలియదు గానీ, మన రాష్ట్రం లో మాత్రం... ఒకప్పుడు సినిమాలు విడుదల అయినపుడు 'గొప్ప మహిళా చిత్రం' అని ప్రకటించుకునే వారు. ఇపుడు 'సకుటుంబ సపరివార .. చిత్రం' అని ప్రత్యేక సూచనలూ చేస్తుంటారు లెండి. ఈ మహిళా ప్రేక్షకుల కోసమే, 'భక్తి' సినిమాలూ (''అమ్మోరు'', 'దేవి' .. లాంటివి), సౌందర్య సినిమాలూ ('పవిత్ర బంధం', 'రాజా' లాంటివి), ఇంకా ఈ మధ్య 'ఆడ వాళ్ళకు మాత్రమే!', 'ఆదివారం ఆడవాళ్ళకు సెలవు' లాంటి పేర్లు పెట్టి మరీ తీసారు.

మహిళా ఓటర్ల నిర్ణయాత్మక ఓట్లు పోతాయని సాక్షాత్తూ మన ముఖ్య మంత్రి గారు వంట గాస్ సిలిండర్ల పై కేంద్రం విధించిన యాభై రూపాయల అదనపు భారం తానే భరించేస్తానన్నారు. వెంటనే.. ఈ సినిమా వాళ్ల 'గొప్ప మహిళా చిత్రం' కాప్షన్ గుర్తొచ్చింది. అయ్య బాబోయ్! వై ఎస్ గారు ఈ ఒక్క మాటతో అఖిలాంధ్ర మహిళామణుల వోట్లను గెలిచేసుకుందామని ఆశ పడుతున్నారు. అసలు మంత్రం ఈ మహిళా వోట్లే! అదేదో ఈ పది నెలలలో మహిళా రిజేర్వేషన్ బిల్లు కూడా పాస్ చేయించేస్తే.. సోనియా గారికి ఇంకోసారి దేశాన్ని ఏలే సువర్ణావకాసం వస్తుందో - పురుషులకు వ్యతిరేక అయిపోయి (సంఖ్యా పరంగా పురుషుల సంఖ్య ఎక్కువ కదా!) వోట్లు రాలవో.. అని ఆ బిల్లుని ఆట్టే పెడుతున్నారు.


మహిళలు - వీళ్ళకు బస్సుల్లో ప్రత్యేక సీట్లు ఎందుకు ఇవ్వాలి ? అని తగువులాడే పురుష పుంగవులు.. తమ ఆడవాళ్ళను రైల్వే రిజేర్వేషన్ ఆఫీసు లోనో, సినిమా హాలు ముందో, 'స్త్రీ' ల క్యూ లలో నిలబెట్టేందుకు వెనుకాడరు. రక రకాల టీవీ సంస్థలు ఏవో ఆ సీరియల్లూ గట్రా తీసి ఆ మాత్రం లాభాలన్నా గడిస్తున్నాయంటే మహిళలే కారణం. మామూలు బట్టల షాపులు చూస్తుండగానే, పెద్ద పెద్ద మాల్ లు అయిపోయి, అక్కడే బంగారం, వజ్రాలూ అమ్మేస్తున్నారంటే.. పాపం ఈ మహిళలే కారణం. కాబట్టి - ఈ ఆడవాళ్ళు పెద్ద ''మార్కెట్ మంత్ర'' అయిపోయారన్న మాట. వీళ్ళని ఆకర్షిస్తే చాలు. ఏ వ్యాపారం అయినా పర్లేదు - పంట పండినట్టే.

ఆ మధ్య 'మధ్య నిషేధం' అని చెప్పి కేవలం ఆ మాట మీద ఆడ వాళ్ల ఓట్లను కొల్లగొట్టుకున్నారు. అసలు ఆడ వాళ్ళకు రాజకీయ చైతన్యం కన్నా, సామాజిక, ఆర్ధిక చైతన్యం ఎక్కువ. ఎప్పుడన్నా చూడండి.. నోబుల్ గ్రహీత యూనిస్ ఖాన్ దగ్గర నుంచీ.. ఈ మన రాష్ట్ర డ్వాక్రా వాళ్ల దాకా అడగండి - మహిళలు పాపం ఎలానో తంటాలు పడి తీసుకున్న అప్పులు తీర్చేస్తారు. పెళ్లి అయి - ఇద్దరు పిల్లలు పుట్టాకా.. దురదృష్టాన భర్త చనిపోతే, పెద్ద చదువూ, తెలివితేటలూ లేకపోయినా... పిల్లల కోసం ఏటికి ఎదురీగి గెలిచిన సాధారణ మహిళలు ఉన్నారు. కానీ.. వీళ్ళకు రాజకీయాలు పెద్దగా తెలియదు. వీళ్ళలో చాలామంది - ఎవరు ఉల్లిపాయలు తక్కువ ధరకిస్తే.. వాళ్ళకు ఒటేస్తారు.

మహిళల గురించి ఎవరు ఏమన్నా అనుకోనీ.. ఈవేళ మాత్రం వీళ్ళు మొత్తానికి ఇంటి యజమాని జేబు లోంచీ తమ ప్రబల (అబలా) శక్తి , తో వంట గ్యాస్ కోసం - నెలకో ''అదనపు'' యాభై రూపాయలు జారిపోకుండా కాపాడారన్న మాట.

వీర హనుమాన్

హనుమాన్ లాంటి సూపర్ హీరో తో సినిమా + ఇంత మంచి పాట. అందుకే సినిమా హిట్ అయింది. 'హనుమాన్' తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ పాట మాత్రం తెలుగు లో దొరకలేదు.

05/06/2008

పాపం మన్మోహన్!

పెట్రో - ఇంధనాల ధరలు పెరిగాయి - మనిషి వయసు, పెట్రోల్ ధర.. ఒకే లాంటివి. పెరుగుతాయి కానీ, వాటి చరిత్ర లో తగ్గటం అనేది ఉండదు. ప్రతి పక్షాలు ఎంత మొత్తుకున్నా, ఒక వేళ వచ్చే ఎన్నికల్లో వాళ్లు గెలిచినా, అధికారం లో కి వెళ్లి ఈ ధరలను ఎలానూ తగ్గించలేరు.

ఈ వార్త చదువుతుండగా ఒక విషయం దృష్టిని ఆకర్షించింది. అది మన్మోహన్ సింగ్ గురించి. '' ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ''ఈ పెంపు తప్పని సరి'' అని చెప్పి బాధపడ్డారు. జనాలందరినీ, ఇంధనాన్ని పొదుపు గా వాడమని ఎపీల్ చేసారు. అంతే కాకుండా, మనం ఇంక సంప్రదాయేతర ఇంధనాలూ, అణు ఇంధనాల మీద కూడా దృష్టి పెట్టాలని కూడా కోరారు''. ఇది చదివాక, మన్మోహన్ సింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఇండో-యూ.ఎస్ న్యుక్లియర్ డీల్ గుర్తొచ్చింది. అదేంటో, ఈ డీల్ ని తీవ్రంగా వ్యతిరేకించిన లెఫ్ట్ పార్టీల పెద్దలు, ఈ పెట్రో ధరల పెంపు కు ఒప్పుకున్నారు. ఒప్పుకోక చస్తారా?!

ప్రగతి ఆంటే ఏమిటో అర్ధం కావట్లేదు. దేశానికి ఏమీ చెయ్యలేక పోయి.. కేవలం 'అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని' (?!) గా మాత్రమే మిగిలిపోయారు మన్మోహన్. ఏమి చేద్దామన్నా, మొక్యాళ్ళు అడ్డేవాళ్ళే ఎక్కువ అయారు. ఇండియా లో, ఈ మధ్య కాలంలో అభివృద్ది చెందినది కేవలం ధరలే.

చంద్ర బాబు ముఖ్య మంత్రి గా ఉండేటప్పుడు.. హైటెక్ సిటీ వచ్చింది, హైదరాబాద్ కి బిజినెస్ వచ్చింది. రైతు బజారులోచ్చాయి. ఎం ఎం టీ సి రైలు వచ్చింది. ఎం.డీ.ఏ ఏవో కలలు చూపించి.. తనూ పాపం ఏవో కలలు చూసి, 'ఇండియా షయిన్' అవుతుందనుకుంది. ఆయితే గత ఎన్నికల లో ఒడి పొతే పోయారు కానీ.. దేశానికి ఏదో చెయ్యాలని, తాపత్రయం కనీసం కనపడేది వాళ్ళలో. ప్రస్తుత రాజకీయాల్లో.. నాయకులకు స్వంత ఎజెండాలే తప్ప, దేశానికి ఏదో చేద్దామన్న విజన్ అస్సలు లేదు.

ఈ రోజు మాత్రం మన్మోహన్ సింగ్ మాటల్లో.. 'న్యూక్లియర్ డీల్' బాధ స్పష్టంగా వినిపించింది. అయ్యో.. ఆయితే మీరు కూడా కనీసం 'ఏదో చేద్దామని' తాపత్రయ పడ్డారన్న మాట - అనుకుని, సంతృప్తి చెందాను.

04/06/2008

మోపాసా కధలు

ప్రముఖ ఫ్రెంచ్ రచయిత గై డి మొపసాంట్ (మోపాసా) కధలు - ఈ పుస్తకం విశాఖ లో 'గుప్తా బ్రదర్స్' లో కొన్నాను. మళ్ళా దీని ప్రతి దొరకలేదు. అసలు అన్ని సాహిత్య ప్రక్రియల లోనూ.. నాకు 'కధలు' నచ్చుతాయి. మోపాసా రాసిన ఈ కధలను ఎవరు అనువదించారో, ఎవరు ప్రచురించారో... ఇపుడు చెప్పలేను. ఎందుకంటే, ఆ పుస్తకం ఎక్కడో చేతులు మారి నా దగ్గర నుంచీ పోయింది.


అనువాద రచనలు చదివితే.. ఆయా దేశాల, రాష్ట్రాల సమాజం, జీవితం గురించి స్థూలంగా ఒక ఐడియా వస్తుంది. ఫ్రెంచ్ సమాజం - ఫ్రెంచ్ వారి 'వ్యక్తి-స్వాతంత్ర్యం', వారి జీవన విధానం.. వగైరా తెలుసుకొనే అవకాసం లభిస్తుందీ కధలు చదివితే.


ఈ సంపుటి లో మొదటి కధ 'రోజ్' ది. రోజ్ ఒక వంటలక్క. టీనేజ్ లో ఉంటుంది. ఒక గ్రామంలో జమీందారు ఇంట్లో వంట చేస్తూ.. ఇంటి పనులు చేస్తూ జీవనం గడుపుతూ ఉంటుంది. ఆమె కు ఉన్న ఒక్కగానొక్క బంధువు ఆమె తల్లి. ఈ తల్లి ఆరోగ్యం బాలేక, స్వగ్రామంలో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటుంది. ఆవిడకు రోజ్ పంపే డబ్బులే ఆధారం. ఇలాంటి పరిస్థితులలో, యజమాని గొర్రెలు కాచే జాన్ అనే కుర్రాడు, రోజ్ ను ఆకర్షిస్తాడు. ఈ జాన్, రోజ్ ను చాలా నాళ్ళుగా వెంటపడుతూ, ఒంటరి గా ఉన్నపుడు మాటలు, చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంక ప్రేమ మొదలవుతుంది. ఇద్దరూ, పచ్చిక బయళ్ళ లోనూ, గొడ్ల సావిట్లోనూ.. రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళకు రోజ్ గర్భవతి అవుతుంది. అప్పటికే, ఆమె జాన్ ను తనను పెళ్లాడ మని అడుగుతూ ఉండటం, అతనూ ఒప్పుకుంటూనే, వాయిదాలు వెయ్యటం, జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడే జాన్ ఆమె మీద మోజు తీరాక, తప్పించుకు తిరగడం కూడా మొదలవుతుంది.


తన గర్భాన్ని గురించి తెలుసుకున్న తరవాత, రోజ్ జాన్ ను కలుసుకుని.. తనను పెళ్లి చేసుకొమ్మని ఖచ్చితంగా అడుగుతుంది. మరుసటి రోజు ఉదయమే జాన్ కనపడకుండా పోతాడు. రోజ్ ఊరంతా, అతని గురించి వాకబు చేస్తుంది. అతను అప్పటికే వేరే యజమాని దగ్గర పనికి కుదిరి, వేరే ప్రాంతానికి వెళిపోయి ఉంటాడు. అంటే, రోజ్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అతనికి ఎంత మాత్రం లేదనీ, తనను కేవలం వాడుకుని, తన మానాన తను వెళిపోయాడని రోజ్ కు అర్ధం అవుతుంది.


అయితె రోజ్ కు ఇప్పుడు ఒక కొత్త సమస్య. తను ఇపుడు గర్భవతి. ఎన్నాళ్ళు తన పరిస్థితి ఇతరులకు తెలియకుండా దాస్తుంది ? ఎవరికన్నా తెలిస్తే, తను చులకన అయిపోదూ? ఇక ప్రతిమగాడూ తన కోసం ప్రయత్నిస్తే .. అని భయంతో, సిగ్గుతో, అవమానంతో, తనలోతానె కుంచుంచుకు పోతూ ఉంటుంది. అప్పటికే జాన్ సంగతీ, తన సంగతీ ఊరిలో అందరికీ చూచాయ గా తెలుసు. ఇక తను గర్భవతి నన్న విషయం తెలిస్తే ఎంత అవమానం?
అందుకే, తన గర్భం పెరిగే కొద్దీ.. శరీరం లో మార్పులు బయటకు తెలియకుండా.. పొట్టకు ఒక బట్ట తో గట్టిగా.. కట్టుకుంటూ ఏడు నెలలు కాలం ఎలానో నెట్టుకొస్తుంది. ఇలా ఉండగా.. ఒక రోజు ఆమెకు ఒక నల్ల సిరా తో రాసిన ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం చూడగానే, ఆమె కు అది జాన్ రాసాడేమో అని అనుమానం కలుగుతుంది. కానీ తనకు చదవటం రాదు. ఎవరి చేతనన్నా చదివించుకుంటే, తన రహస్యం బయటకు పొక్కుతుంది. అందుకే, వెంటనే ఆ ఉత్తరం జేబు లో పెట్టుకుంటుంది. రెండు రోజుల వరకూ, ఆ ఉత్తరం గురించిన తర్జన భర్జన ల తో మధన పడి చివరకు చర్చి లో మతాచార్యుడి చేత చదివించుకుంటుంది. ఇన్నాళ్ళూ ఆమె చర్చి మొహమే చూడటం లేదు. మతాచార్యుడికి ఏవో శక్తులు ఉంటాయని, తను ఆయనకు ఎదురు పడటం తోనే, తను చేసిన పాపం ఆయన గ్రహిస్తాదనీ ఆమె భయపడుతూ ఉండేది. కానీ.. ఈ రోజు తప్పలేదు.


చివరికి ఆ ఉత్తరం, తన తల్లి పొరిగింటి వారు రాసారని తెలుస్తుంది. తల్లికి చాలా అనారోగ్యం గా ఉంది. వెంటనే రమ్మని..ఆ సందేశం. వెంటనే, తీవ్ర ఆందోళనతో సెలవు అనుమతి కోసం, యజమానిని కలుస్తుంది. అప్పటికే ఆ జమీందారు, రోజ్ మీద కన్ను వేసి ఉంటాడు. ఎందుకంటే.. గర్భం లో పసి కందు పడిన దగ్గరినించీ ఆ పిల్ల కి, తన బిడ్డ కోసమే జీవించాలన్న ఆత్రం పెరుగుతుంది. తను బాగా పనిచేసి, యజమానిని మెప్పించి, జీతం లో పెరుగుదల తెచ్చుకుని, తల్లికీ, తన బిడ్డకు అండగా ఉండాలని రోజ్ ఆశ. అందుకే ఆమె ఇంటి పనులు చక్కబెట్టడం తో పాటూ.. అపుడపుడూ పొలానికి వెళుతూ, చక్కగా పని చేస్తూ ఉండేది. ఆమె అడుగు పెట్టాక, ఆ ఇంటికీ, పొలానికి లాభించింది. యజమాని డబ్బు తనదే అన్నట్టు గా జాగ్రత్త గా ఖర్చు పెట్టడం, ఆదా చెయ్యడం చేస్తూ ఉంటుంది. ఒక సారి రోజ్ చెప్పిన విధంగా గడువు కు ముందే కోతలు కోస్తారు. అలా చేసినందుకు అందరూ ఆమెనూ, యజమానినీ ఎగతాళి చేస్తారు. కానీ, ఆ రాత్రే, పెద్ద గాలి వాన వచ్చి, చుట్టూ పక్కల మోతుబరులు అంతా తీవ్రంగా నష్టపోతారు. జమీందారు వయసు నలభై ల లో ఉంటుంది. ఆ వయసుకి ఆయనకి పిల్ల దొరకడం కష్టం కూడా. ఆ రోజుల్లో, ఆడవాళ్లు - యజమాని భార్య అయినా.. పొలం లో కూలి పనికి వెళ్లి, ఇతర కూలీలతో సమానంగా పని చెయ్యటం సామాన్యం. అందుకే, ఇలాంటి పనిమంతురాలైన పిల్లను పెళ్లి చేసుకోవాలని యజమాని ఆశ పడతాడు.


సెలవు అడిగినపుడు.. రోజ్ తో 'సరే. నువ్వు ఊరు నుండీ వచ్చాకా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి' అంటాడు. రోజ్ కూడా తన జీతం పెంచమని అడుగుదామని అనుకుంటూ ఉంటుంది. అందుకే తను కూడా.. తన యజమాని తో.. 'నేను కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను' అంటుంది. అప్పటికి ఆ సమావేశం ముగుస్తుంది.


ఊరు చేరేటప్పటికి రోజ్ తల్లి మరణిస్తుంది. ఈ బాధ లో కొట్టుకు పోతున్న రోజ్ కు ఏడు నెలల గర్భానికే, ప్రసవం జరుగుతుంది. నెలలు నిండకుండా పుట్టిన ఆ పసికందు ని మొదటి సారి చేతుల్లోకి తీసుకున్న రోజ్, ఆ వికృతమైన ఎముకల గూడు లాంటి బిడ్డ ని వెంటనే అసహ్యించుకుంటుంది. ఒక నెల తరువాత, అమెకు తిరుగు ప్రయాణం అయ్యే రోజు దగ్గర పడుతుంది. ఈ బిడ్డను తీసుకుని పనికి వెళ్ళలేదు కనుక.. కొన్నాళ్ళు బిడ్డను సాకేందుకు పొరుగు వారు ఒప్పుకుంటారు. ఆ బిడ్డ కోసం డబ్బు పంపిస్తానని వాగ్దానం చేసి, తిరుగు ప్రయాణం అవుతుంది రోజ్.
ఈ తిరుగు ప్రయాణం లో.. తన బిడ్డ ను తలుచుకుని, తనని వొదిలి రాలేక, బిడ్డ మీది మమకారం తో వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా దీనంగా, రెండు రోజులు - నడుస్తూనే ఉంటుంది. ఈ నడకకు కాళ్ళు బొబ్బలేక్కి, ఆ వేడికి దగ్గర్లో ఒక చెరువు కనపడితే, అందులో కాళ్ళు పెడుతుంది. చల్లగా అనిపించడంతో.. గబ గబా ముందుకు నడుస్తుంది. కాళ్ళ కి పెద్ద ముళ్లు గుచ్చుకుంటాయి. అసలే బాధ లో ఉన్న రోజ్ ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ, స్ప్రుహ తప్పిపోతుంది. సమయానికి ఆ దారినే పోతున్న రైతు ఒకడు ఆమెను రక్షించి యజమాని ఇంటికి తీసుకు వస్తాడు.


యజమాని ఇంటికి తిరిగి వచ్చాకా.. కొన్నాళ్ళకు ఆమె కోరుకున్నాక, యజమాని ఆమె ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తాడు. రోజ్ ఒప్పుకోను గాక ఒప్పుకోను అంటుంది. ఆమె మనసంతా...తన వికృతమైన బిడ్డ నిండి పోయి ఉంటాడు. ఒక కేతలిక్ గా..పెళ్లి అన్నది ఇపుడు పాపం. యజమాని మాత్రం మంకు పట్టు వదలడు. చాలా రోజులు వాద-ప్రతి వాదాల తరువాత.. ''ఇంకా జాన్ వస్తాడనే ఎదురు చూస్తున్నావా ? నీ సంగతీ నాకు తెలుసు లే ! ' అంటాడు. రోజ్ భయం తో బిగుసుకు పోయి, ఆయనకు ఎదురు మాట చెప్పదు. అతనికి ఏమి తెలుసు? అని సందిగ్ధం లో పడిపోతుంది. అయితె, ఆమె వ్యతిరేకత తో సంబంధం లేకుండా, ఒక రాత్రి ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటాడు. అలా ఆమె తన యజమానిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.


పెళ్లైయిన తరవాత కూడా ఆమె మునుపటి లానే, పొలంలో కూలి లా పనులు చేస్తూనే ఉంటుంది. యజమానికి తన కొత్త భార్య వలన చాలా కలిసి వస్తుంది. అయన చాలా ధనవంతుడు అవుతాడు. అయితె, ఆ దంపతులకు ఇపుడు ఒకటే కష్టం. వాళ్ళకు పిల్లలు లేరు. అన్ని రకాల పద్ధతులూ పాటించారు.. దానాలు, ధర్మాలూ చేసారు. ఎవరేవరినో కలిశారు. పుణ్య క్షేత్రాలు దర్శించారు. తావీజులు కట్టించుకున్నారు. ఫలితం లేదు.


రోజ్ ఈ మధ్య కాలం లో అపుడపుడూ తన ఊరికి వెళ్తూ ఉంటుంది. ఆమె బిడ్డ, కొంచెం కండ పట్టి, చక్కగా కనిపిస్తున్నాడు. పిల్లాడి మీద వాత్సల్యం తో.. ఎంతొ ప్రేమ తో, ఎంతొ మమకారంతో ఊరు వెళ్ళటం, తిరిగి వస్తున్నపుడు తీవ్ర విచారం లో మునిగి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లాడి సంగతీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.


అయితె తన నిస్సంతు జీవితం భరించలేని జమీందారుకి విపరీతమైన కోపం వస్తూంది ఈ మధ్య. తన భార్య మీద చిందులు తొక్కుతున్నాడు. తనకు వారసుడిని ఈయలేక పోతున్నదని, తనని అవమానాలకు గురి చేస్తున్నదని.. ఆయనకు రోజ్ మీద వల్ల మాలిన కోపం వస్తుంటుంది. కొట్టడం, తన్నడం, గేలి చెయ్యడం లాంటివి ఎక్కువయ్యాయి. జమిందారుకి వయసు ఎక్కువ కావటం తో.. పిల్లలు లేకుండానే చనిపోతానేమో అని భయం ఎక్కువయింది. ఆమధ్య రోజ్ తో ఏదో వాదన ముదిరి, ఆమె ని రెక్క పుచ్చుకుని బయటకు లాగి, రాత్రంతా వర్షం లో వోదిలేస్తాడు. తెల్లారి, తలుపులు తెరిచాక, రోజ్ ఇంట్లోకి వస్తుంది.


ఆఖరికి ఒక రోజు ఆమెతో గొడవ పడి, రోజ్ తలని పట్టుకుని గోడ కేసి బాదుతాడు. అంతే ! అంతకాలం ఆయన దుర్మార్గాలన్నిటినీ సహించిన రోజ్ ఆ రోజు మాత్రం భరించలేక పోతుంది. 'నీకు పిల్లలు లేక పొతే లేరు.. నాకు మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. మా ఊరిలో అనాధ అయి పెరుగుతున్నాడు. నాకూ, జాన్ కు కలిగిన బిడ్డ..!' అని పిచ్చిదాన్లా అరిచి ఏడుస్తుంది.


నిశ్చేష్టుడై.. రాయిలా నిలబడిపోతాడు జమీందారు. కానీ.. అదుపు లేకుండా ఏడుస్తున్న రోజ్ ని చూసి, ఆమె చెప్పిన నిజాన్ని అర్ధం చేసుకున్న తరువాత, ఆయన రోజ్ ను తన చేతి లోకి తీసుకుని.. 'పద! మన పిల్లాడిని తీసుకోద్దాం మన ఇంటికి..!!' అంటాడు. ఆ కుటుంబం ఆరోజు తో పరిపూర్ణం అయి.. అంతా హాయిగా ఉంటారు.


ఇలాంటి కదిలించే ఒక ౧౦ కధలు ఉన్నాయి ఈ సంపుటి లో. అన్నీ మానవ సంబంధాల గురించే.. ఎవరి దగ్గరన్న, ఈ పుస్తకం ఉంటే వాళ్లు అదృష్ట వంతులు!

ఈ టీవీ - మీ టీవీ



సుమన్ - ఈ టీవీ ప్రభను ఒంటి చేతితో పడగొట్టి.. ఈ చానెల్ చూసేవాళ్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేసారు. నిజానికి ఈ-టీవీ లో కొన్ని మంచి ప్రోగ్రాములు కూడా వస్తాయి. పప్పేట్ ల తో చేసిన పంచతంత్రం వీటిలో ఒకటి.


ఈటీవీ - రెండు లో సఖి అనే ప్రోగ్రాం ఎపుడైనా చూసారా ? వ్యాఖ్యాత.. చక్కగా అచ్చ తెలుగు మాట్లాడతారు. 'సుఖీభవ' కూడా ఒక పనికొచ్చే ప్రోగ్రాం. ఈనాడు సంస్థ నుంచీ వెలువడే 'చతుర', 'విపుల' మాగజీన్లు కూడా ఎన్నాళ్ళుగానో మంచి సాహిత్యాన్నీ ప్రచురిస్తున్నాయి. ఆవకాయలు అమ్ముకుని.. అంబానీ లా ఎదిగిన రామోజీ రావు తీసిన సినిమాలు కూడా పర్లేదు.. మంచివే! ఈటీవీ మొదలు అయిన కొత్తలో 'వసుంధర' ఎంత బావుండేది ?


బాలు గారు మొదలు పెట్టిన 'పాడుతా తీయగా' ఎంతొ ఇష్టంగా చూసేవాళ్ళం. అన్నిటి కన్నా.. సాయత్రం వచ్చే 'సినీ రంజని' లో చాల సినిమాల క్లిప్పింగ్స్. ఇపుడు రక రకాల డైలీ సీరియల్లూ.. రియాలిటీ షో లూ.. స్టాండర్డ్ తుడిచి పెట్టేసాయి. ఇపుడు మబ్బులు తొలిగిపోయాయి కాబట్టి, ఈ చానెల్ నాణ్యత కొంచెం అయినా పెరగుతుందని ఆశిస్తున్నా!

03/06/2008

నేను తీసిన ఫోటోలు

Classes on a weekend at Rowing Club, Bedford



River Great Ouse, Bedford