Pages

08/06/2008

లార్డ్స్ - క్రికెట్ మైదానం

మొన్న లార్డ్స్ మైదానానికి వెళ్లాను. నాకు క్రికెట్ పరిజ్ఞానం అంతగా లేదు. అందుకే ఎం.సి.సి అంటే, మన స్వామి, రాజన్ ల 'మాల్గుడీ క్రికెట్ క్లబ్' గుర్తొచ్చింది. :D


మేము వెళ్ళిన రోజు స్థానిక టీం ల మధ్య మేచ్ జరుగుతోంది. మేచ్ చూడటానికి స్త్రీలకు ఆ రోజు ఎందుకో ఉచిత ప్రవేశం ఇచ్చారు. మేచ్ చూడటానికి టికెట్ వెల - £ 14. ఈ స్టేడియం లో పిల్లర్లు ఎక్కువ లేకుండా కట్టడం వల్ల అన్ని సీట్ల లోంచీ చక్కగా మేచ్ కనపడుతుంది.

ఇవి మీడియా సెంటర్ లో కామెంటరీ డెస్కులు. మొదట్లో ఇవి పెవిలియన్ లకు మధ్యలో ఉండేవి. వీటికి గాజు తొడుగు ఉండినా, కామెంటరీ చెప్పే వాళ్ళకు బయట జనం హోరు, విమానాలూ, బస్సుల హోరూ, వినిపించి, హుషారైన కామెంటరీ వినిపించేవారు. ఇప్పుడు వీళ్ళకు కట్టించిన అత్యాధునిక మీడియా సెంటర్ గాజు పెట్టె (క్రింది ఫోటో ) లా ఉందని, గొడవ చేసి, మేచ్ జరిగే టప్పుడు చిన్న కిటికీలు తెరుచుకుంటున్నారు. లార్డ్స్ లో క్రికెట్ చూడటం అంటే ఆట లో మమైకం కావటమే.

మైదానం బయట .. గోడ మీద ఒక శిల్పాల కేన్వాస్.


పెవిలియన్ - ఎడమ వైపు హోమ్ టీం, కుడి వైపు 'వెయిటింగ్ టీం' ఉంటారు - ఆ కుడి వైపు బాల్కనీ లోనే, సౌరవ్ గంగూలీ - షర్ట్ విప్పి గాల్లో గిర గిరా తిప్పాడు.


లార్డ్స్ లో మీడియా సెంటర్. ఇక్కడ రేడియో, టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి. మైదానం లోకి కామెంటరీ కూడా ఈ మీడియా సెంటర్ లోంచే వినిపిస్తారు.

ఇంకా..

~ లార్డ్స్ లో 'ఆనర్లు' రికార్డ్ చేసి, వైటింగ్ రూం లలో ప్రదర్శిస్తారు. ఈ ఆనర్లు చూసి, క్రీడా కారులు స్పూర్తి చెంది, బాగా ఆడాలని ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టారు. అయితె, ఈ 'ఆనర్ల బోర్డు' లోకి తమ పేరు ఎక్కడం ఎంతొ గొప్ప విషయం గా క్రికెటర్లు భావిస్తారు. అయితె, ఈ బోర్డుల్లో ప్రపంచ ప్రసిద్ది చెందిన క్రీడా కారులు చాలా తక్కువ మంది ఎక్కారు. ఉదా.. సచిన్ లార్డ్స్ లో ఎప్పుడూ సెంచరీ చెయ్యలేదు. లార్డ్స్ లో ఈ బోర్డ్ ఎక్కిన భారతీయ క్రికెటర్ - అగార్కర్. (Most unlikely candidate)


~ లార్డ్స్ లో క్రికెట్ కు సంబంధించిన అన్నీ - ఉన్నాయి. హాస్యం, ఉద్వేగం - ఇలా. ఇక్కడి మ్యుసియం (ఫోటోలు తీయనివ్వరు) లో 'ఏషేస్' ట్రోఫీ.. ఉంది. దీనికి సంబంధించిన కధలు - ఉద్వేగాలు అన్నిటినీ హాస్యం గా తీసుకుంటారు.

~ ఈ మైదానాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులు రెండు వర్గాలు. ఒకటి - భారతీయులు (మేము వెళ్ళిన టీం లో తెలుగు వాళ్లు బోల్డంత మంది కనిపించారు). రెండు - ఆస్త్రేలియన్లు. టూర్ గైడ్ ఈ రెండు వర్గాల వారితో క్రికెట్ మీద బోల్డన్ని జోకులు వేసాడు. ఆస్త్రేలియన్లు బోల్డంత ఆనందించారు.

~ లార్డ్స్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మిలియన్ల కొద్దీ విలువ చేస్తుంది. బ్రిటన్ లో అత్యధిక ధర పలికే ఇళ్లు ఇవి. లార్డ్స్ దగ్గర ఇళ్లు అంటే ఎంతో గొప్ప అంట.

~ ఇక్కడ క్రికెట్ చూడటం - చాలా అత్భుతమైన అనుభవం. ఎంత దూరం లో కూర్చున్నా గ్రౌండ్ లో జరిగేది స్పష్టం గా కనిపిస్తుంది. ప్రేక్షకులకూ, క్రికేటర్లకూ మధ్య కంచెలు లేవు.

~ మ్యూసియం లో బ్రియాన్ లారా కోసం ప్రత్యేక విభాగం ఉంది. బ్రియాన్ లారా అభిమానులకు కనువిందు చేస్తుంది. బ్రియాన్ లారా ఒక లెజెండ్ అయి చాలా గౌరవం పొందుతున్నాడు ఇక్కడ.


క్రికెట్ అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకు ఇక్కడ మేచ్ చూడటం ఒక జీవిత కాలపు అనుభవం అవుతుందేమో!

No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.