Pages

09/06/2008

ఈ పాటలు కావాలి

ఈ క్రింది పాటలను చాన్నాళ్ళు గా వెతుకుతూ ఉన్నాను. కానీ ఎక్కడా దొరకలేదు. అయితె, వీటి 'ఆచూకీ' తెలిపిన వాళ్ళకు బోల్డంత పుణ్యం దొరుకుతుంది. అందుకే, ఎవరయినా ప్లీజ్ సహాయం చెయ్యండి.. థాంక్స్.

౧) ''అమ్మ దొంగా - నిన్ను చూడకుంటే నాకు బెంగ'' దీనిని దూరదర్శన్ లో ప్రసారం అయ్యే 'లలిత గీతాల' కార్యక్రమం లో వేదవతీ ప్రభాకర్ గాత్రం లో విన్నాను.

౨) ''ఏవి తల్లీ - నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లీ?'' - శ్రీ శ్రీ 'మహా ప్రస్థానం' లోని కవిత. బాలూ నిర్వహించిన 'పాడుతా తీయగా' (ఈ టీవీ) లో ఒకమ్మాయి పాడగా విన్నాను.

౩) ''కమలా వల్లభ, గోవింద మాం పాహి - కళ్యాణ కృష్ణా గోవిందా.. యశోద తనయా, గోవింద మాంపాహి - కళ్యాణ కృష్ణా గోవిందా..'' - బాల మురళీ కృష్ణ, వేదవతీ ప్రభాకర్, చాయా దేవీ కలిసి పాడిన కృష్ణ భజన. (తిల్లానా కేసెట్ లో విన్నట్టు గుర్తు)

* * *

8 comments:

  1. 1. Its available on commercial tapes and in different versions. Here is one version: http://www.surasa.net/music/lalita-gitalu/
    Scroll down the page for R. Vedavati Prabhakara Rao's songs.

    2. To my knowledge no commercial version of the recording exists.
    I am aware of an AIR recording. SriSri himself recorded all his poems in "మహాప్రస్థానం" in 1980. Since you live in Bedford (I am also UK-based!) you may like to contact Dr. Gutala Krishnamurthy in London. He was the man behind that project.

    Regards,
    Sreenivas

    ReplyDelete
  2. Srinivas garu

    Thank you very much.

    ReplyDelete
  3. సుజాత గారు,
    చాల్రోజుల తర్వాత హాయ్! మీరు చెప్పిన అమ్మదొంగా పాట ని ముందు ఆలిండియా రేడియో విజయవాడ ఆర్టిస్టు స్రీమతి బి.వరహాలు గారు పాడారు. ఆ తర్వాత, వేదవతి గారు దూరదర్శన్ లో పాడటంతో , కొత్తగా టివి వచ్చిన రోజుల ప్రభావంతో ఆ పాట క్రెడిట్ అంతా వేదవతి గారికి దక్కింది. ఆవిడ బాగానే పాడారు గానీ, వరహాలు గారు అద్భుతంగా పాడారు. అంత weight ఉంటుంది ఆవిడ స్వరంలో. సంగీత దర్శకులు దమ్ము అంటారు చూడండి, అదన్నమాట! సరే, ఆ పాట సాహిత్యం అనగాlyrics కావాలంటే, నేను పంపుతాను .రికార్డు మీకు బహుశా వేదవతి గారి ప్రైవేట్ ఆల్బంలో దొరకొచ్చు.

    ఏవి తల్లీ కూడా విజయవాడ రేడియో లోనే మల్లిక్ పాడారు. అది బహుసా ముద్దుకృష్ణ గారి వైతాళికులు లో ఉంటుంది. కావాలంటే చూసి lyrics పంపగలను.

    చివరి పాట కోసం www.musicindiaonline.com లో వెదకండి, తెలుగు devotinal విభాగంలో!

    ReplyDelete
  4. సుజాత గారు - హాయ్. చాల థాంక్స్.

    ౧) అవునా.. శ్రీనివాస్ గారిచ్చిన లింక్ లో 'అమ్మ దొంగా!' విన్నాను. థాంక్స్. 'వరహాలు' గారి పాట నెట్ లో దొరుకుతుందా ?

    ౨) నా దగ్గర 'మహా ప్రస్థానం' ఉంది.. :D కేవలం ట్యూన్ తెలుసుకుంటే చాలు! :D :D

    ౩) మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ లో దొరక లేదు. ...ప్చ్!

    ReplyDelete
  5. ఉదయం కాస్త హడావిడిగా రాయటంలో అనవసరంగా శ్రీశ్రీ "లండన్ మహాప్రస్థానం" గురించి ప్రస్తావించాను. మీకు కావలిసిన కవిత దానిలో లేదు కాబట్టి. మిమ్మల్ని కొంత mislead చేసానేమో!

    పోతే, ఆ కవిత "ఖడ్గసృష్టి" లోనిది.

    మరో సుజాత గారు "వైతాళికులు" లో ఆ కవిత పూర్తి పాఠం చూసి చెప్తామన్నారు. ఆ పుస్తకం 1930ల్లో లో వచ్చింది. అప్పటికి ఈ కవిత ప్రచురితం కాలేదు. దానిలో వున్న 8 శ్రీశ్రీ కవితలు తర్వాత మహాప్రస్థానంలో వచ్చినవి.

    మల్లిక్ "ఏవి తల్లీ" పాడారా? మీరు విన్నారా? నేనో పెద్ద మల్లిక్ fan ని. ఆయన విజయవాడ రేడియోలో పాడిన చాలా లలిత/భక్తి గీతాలు నా దగ్గరున్నాయి. నాకు తెలిసినంతలో (/నాదగ్గరున్నవాటిలో) ఆయన పాడిన శ్రీశ్రీ కవిత "నీడలు" (చూడు చూడు నీడలు ...) ఒక్కటే. "జగన్నాథ రథచక్రాలు" బృందగానంగా వచ్చింది.

    మరికొన్ని వివరాలు/సవరణలు మరోసారి.

    -- శ్రీనివాస్

    ReplyDelete
  6. శ్రీనివాస్ గారు,
    కరక్టే! వైతాళికులు 1935లో మొదట వేసారు.ఆ పుస్తకం రిఫర్ చేసి చాలా రోజులైంది. అదీగాక ఏవి తల్లీ శ్రీ శ్రీ ఎప్పుడు రాశారో అంతగా ఐడియా లేదు నాకు. అందుకే చూసి చెప్తానన్నాను. చూసాను. లేదు.!

    మల్లిక్ పాడిన 'ఏవి తల్లీ ' విజయవాడ రేడియోలో చాలా పేరు పొందిన పాటల్లో ఒకటి. ఆ పాటలో ఆయన lead. ఆయన వెనక బృందం ఉంటుంది. మీరు ఇండియా వచ్చినపుడు ఆలిండియా రేడియోలో దొరుకుతుందేమో ప్రయత్నించండి.

    ReplyDelete
  7. Yes. 'Khadgasrushti' lonidi. ..oops. Thanks Srinivas garu.

    ReplyDelete
  8. చాలా రోజుల తరువాత అమ్మ దొంగా పాటని గుర్తు చేసారు. మా ఫ్రెండు అనూరాధ ఆ పాట చాలా అద్భుతంగా పాడేది. హాస్టల్ లో ఉండగా వెన్నెల రోజులలో రాత్రి పూట భోజనాలు అయ్యాక ఆరుబయట కూర్చుని ఎన్ని సార్లు పాడించుకున్నామో ఆ పాట. ఈ పాట తో పాటు "యే నీలే గగన్ కీ ఘలే" పాట కూడా.

    Thank you for bringing back those memories.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.