Pages

29/06/2008

భమిడి పాటి కామేశ్వర రావు గారి జోకు

ఓ ఊళ్ళో ఇద్దరు కవల అన్న దమ్ములు ఉండే వార్ట. కవల అన్న దమ్ముల్లో ఒక విచిత్రమైన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. అదే - వాళ్ళిద్దరూ పుట్టడం వరకూ ఒకే రోజుని - ఆ మాటకొస్తే, వొకే గంటకీ పుట్టొచ్చు - కానీ ఒకే సారి చావటం మాత్రం కుదిరే పని కాదు.

అలాగున - ఆ ఇద్దరన్నదమ్ముల్లొ ఒకాయన పోయాట్ట. ఆ పోయిన కొద్దిరోజులకి బతికున్న ఆయన రోడ్డు మీద నడుస్తుంటే, వొకాయన ఎదురు పడి -
'' ఈ మధ్య పోయింది నువ్వా, నీ బ్రదరా ?'' అని అడిగేసాట్ట.


- భమిడి పాటి రామ గోపాల్ (భ రా గో) గారి ''సరదా కధలు - నూట పదహారు'' నుంచి.

1 comment:

  1. నాకు భమిడిపాటి జోకు తెలీదు కానీ,చింతామణి నాటకం రికార్డులో మాత్రం అచ్చం ఇదే ఉంది

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.