Pages

09/06/2008

లండన్ అండర్ గ్రౌండ్ కవితలు

లండన్ ట్యూబ్ లో ప్రయాణంలో అప్పుడప్పుడూ ఈ 'అండర్ గ్రౌండ్ కవితలు' తారసపడతాయి. ఇది చదివాక, నచ్చి, చేతనైన విధంగా.. ఈ ఫోటో తీశాను.

5 comments:

  1. సాధారణంగా మన బస్సుల్లో,సినిమా బాత్రూము గదుల్లో ప్రేమ గుర్తులూ,వెకిలి రాతలూ గీసి కనపడతాయి. ఆ దరిద్రం కంటే ఈ అండర్ గ్రౌండ్ కవితలు చాలాచాలా మంచి పరిణామం.


    మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలిసే ఉంటుంది. అక్కడ ఏ డిపార్ట్ మెంట్,హాస్టల్ లో ఏ విషయం జరిగినా మరుసటి రోజు కవితల రూపంలో దాని గురింఛి రాసి, పోస్టర్ రూపంలో యూనివర్సిటీ మొత్తం కనిపించేవి. చాలా గొప్ప సాంప్రదాయం ఇది.నాకు చాలా విషయాలు వీటిద్వారానే తెలిసాయి, అప్పట్లో.

    ReplyDelete
  2. అర్ధం అవుతున్నట్టే అయి జారిపోతుంది. కొంచెం తెనిగించి పెట్టకూడదూ మేడం.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  3. బాగుందండీ కవిత. మరి అండర్ గ్రౌండులో ఇలా ప్రింట్ లో పెడతారా. తెలీక అడుగుతున్నా.
    twisted braids of lillies అంటే మన పిల్లలు నాగమల్లెలతో జడలల్లడం గుర్తొచ్చింది.
    Thanks for the nice poem.

    ReplyDelete
  4. మహేష్ గారు - థాంక్స్.

    మాలతి గారు -

    ఈ కవితలు అచ్చు వేసి, మంచి గా రైళ్ళలో స్టిక్ చేస్తారు. ఈ అండర్ గ్రౌండ్ పోఎట్రీ - 1985 లో మొదలయిందంట. ఒక అమెరికన్ రచయిత అండర్ గ్రౌండ్ ట్రైన్ లలో ప్రకటనలకు పోగా - మిగిలిన ఖాళీ స్థలాలో రాయొచ్చు కదా అని ఒక ఐడియా ని అండర్ గ్రౌండ్ అధికారుల ముందు ఉంచాడట. అప్పటి నుంచీ.. ఇది పాత కవులవీ, ఇప్పటి కాలపు కవులవీ మంచి కవితలు ఎంచి, ఆరు నెలలకు ఒక సారి మారుస్తూ.. ట్రైన్ లలో ప్రదర్శించటం మొదలయింది.

    ప్రయాణాల్లో.. ఎంత రద్దీ గా ఉన్నా.. పుస్తకాలు చదువుతూ, క్రాస్ వర్డ్ పజిల్లు నింపుతూ, పత్రికల్లో, ఇంకోవో.. చదువుతూ ఉండే ఇంగ్లీష్ ప్రజలు.. ఈ ఐడియాని ఎంతొ మెచ్చుకుని ప్రోత్సహించడం జరిగింది. ఇవన్నీ.. బాగా ప్రాచుర్యం పొంది, ఇలా కవితలు రైళ్ల లో, బస్సుల్లో రాయటం మిగతా దేశాల్లో కూడా మొదలయిందిట.

    బాబా గారి కోసం ఈ కవితను కాస్త మంచి తెలుగు లో తెనిగిస్తారా నా కోసం ? ప్లీజ్!

    ReplyDelete
  5. చాలా బాగుంది. మీవివరణకి థాంక్స్. మన జర్నలిజం చరిత్రలో తొలి వార్తాపత్రిక గోడలమీదే రాసేవారని చదివేను. నిజానికి ఇంటర్నెట్ లో సుమారుగా అలాగే అనిపిస్తోంది.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.