చాలా రోజులనుండీ కూడలి లో నేను తప్పిపోయాను. ఎవరికి వారే సాయం చేసుకోవాలి. ఎవర్ని వారే వెతుక్కోవాలి. అందుకే ఇదింకో టెస్టింగ్ పోస్ట్.
చాలా రోజులుగా నేను చెయ్యని పని ఒకటి మిగిలిపోయింది. అది నా బ్లాగు ప్రయాణం విశేషాలని పంచుకోవడం. ఈ పోస్టు ఇక చాలా మందికి అందుబాటులో ఉండదు కనుక, ధైర్యం చేసి రాస్తున్నాను. చదివిన వారే - దురదృష్టవంతులు.
నా మట్టుకూ నేనొక ప్రత్యేకమైన వ్యక్తిని. (ఇది నా వ్యక్తిగత అభిప్రాయం!!) కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో (...mm...tell you later) ఎప్పుడూ చిక్కుకుపోతూ ఉంటాను. ఉద్యోగం ఒక చాలెంజ్, పెళ్ళి ఇంకో చాలెంజ్, పెళ్ళయ్యాకా నన్ను నేను కోల్పోకపోవడం ఒక సెపెరేట్ చాలెంజ్, (పెళ్ళయ్యాకా హీరోయిన్ లా ఫీలయిపోకుండా - నేల మీదే నిలబడి, పూర్తిగా మారిపోకుండా, నా ఫ్రెండ్స్, నా హాబీలూ, నా అభిరుచులూ.. నా సొంత వ్యక్తిత్వము నిలుపుకోవడం.. ఇవన్నీ మళ్ళా మా అయన్ను నొప్పించకుండా, అనుమానం రాకుండా, నా స్పేస్ లోకి రానీయకుండా టైట్ రోప్ వాక్ చెయ్యడం ఒక పెద్ద చాలెంజ్. పెళ్ళయిన అమ్మాయిలకు {esp if it is arranged marriage} తెలుస్తుంది.)
ఈ ప్రత్యేకతల్లో నా ఉద్యోగానికి సెలవు పెట్టి, చెత్త ఆఫీసునుంచీ, (It was such a phase) (లిటరల్ గా) ముగుడితో కలిసి, ఇంగ్లండ్ పారిపోవడం ఇంకో ప్రత్యేకత. ఈ ముగుడు గారికి ఆఫీసు రోజుకి 13 గంటలు. నాకేమో ఇంట్లో కూర్చోడం కొత్త ! ఎంత చారిటీ (see very raw blog post) షాపులో గానుగెద్దు చాకిరీ చేసినా డబ్బులు ఎలానూ ముట్టేవి కాదు. కానీ కొంచెమే టైం పాస్ అయేది. చలి కాలంలో గ్లూమీ నెస్. సరే కనీసం వంటలు నేర్చుకుందామని యూట్యూబ్ వెంట పడ్డాను.
నా మట్టుకూ ఇదొక మంచి అనుభవం. సంజయ్ తుమ్మా దగ్గరే (వహ్ షెఫ్) బోల్డన్ని నేర్చుకున్నా. ఆ ప్రయోగాలన్నీ ఆఫీసునుంచీ వచ్చిన హీరో మీద ప్రయోగించేదాన్ని.
అయితే వ్యాపకం లేకపోవడం వల్ల జీవితంలో బోల్డంత వెలితి కనబడేది. నాకు మా షాపు మేనెజర్ ఇచ్చిన బిరుదు 'బోర్డ్ హౌస్ వైఫ్ ' అస్సలు నచ్చలేదు. బ్లాగులంటే అప్పటికి పెద్ద ఇష్టం లేదు. వీడియో దునియా, వీడియో మస్తీ ల్లో ఏవో సినిమాలు చూడటం ! అపుడపుడూ టైం మేగజైన్ మాత్రం మూడు పౌండ్ లకు కొనుక్కుని, ముఖ చిత్రం నుంచీ చివరి పేజీ దాకా చదవడం, ఆదివారం వచ్చే ఫ్రీ న్యూస్ పేపర్ లో ఆర్బిట్యూరీ లు కూడా వింత గా చదవడం - లేదా నడవడానికి పోవడం ! ఇలానే బ్రతికేను.
కొన్నాళ్ళకి నాకు నెట్ లో 'మనిషి ' కనిపించాడు. అదీ తెలుగు మనిషి. నేను చదివిన మిట్టూరోడి లాంటి మనిషి. అంతే ! నేను గెంతి, ఈ బ్లాగు గంప లో పడ్డాను. రాద్దామని అనుకోలేదు. కనీసం 3 నెల్లు చదివుతూనే ఉన్నాను. కొన్ని చాలా మంచి బ్లాగులూ, కొన్ని చెత్త కబుర్లు రాసే బ్లాగులూ, తెలుగులో ! కౌముది, పొద్దు, భూమిక కూడా చదివేదాన్ని.
నాకు తెలుగు బాగా వచ్చు ! పైగా నేను ఏమి రాసినా హీరో కి అర్ధం కాదు. (హీరో తెలుగు మాట్లాడగలరు. అంతే !) కాబట్టి ఇదో మహాద్భుత అవకాశం. నేనూ రాశేస్తాను. ఏదో ఒకటి! పైగా రాయగా రాయగా ఆలోచనలు దార్లోకి వస్తాయి - అనుకుని నేనూ బ్లాగర్ లో చేరాను.
నిజానికి ఎప్పుడో చేరినా, కొన్నాళ్ళకు గానీ కుదురు రాలేదు. కుదిరాకా, రాత కుదర్లేదు. రాత కుదిరాకా, కోతలు కుదర్లేదు. ఇదీ కుదిరాకా నా ప్రత్యేకత సర్ఫేస్ మీదికొచ్చింది. పైగా 2008 జనవరి లో హీరో కసిన్ ఒకబ్బాయి - నా న్యూ ఇయర్ రిసల్యూషన్ ఏమిటో చెప్పమన్నాడు. అపాటికి హీరో కీ నాకూ తీవ్ర స్థాయిలో తగువులు తంటాలూ నడుస్తున్నాయి. అందుకే ఆ కక్ష తో నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికీ, నన్ను నేను కోల్పోకుండా - నేగింగ్ వైఫ్ గా అయిపోకుండా, బ్లాగింగ్ ని సీరియస్ గా తీసుకుంటానని నిర్ణయానికొచ్చాను.
నా ఈ బ్లాగు నన్ను ఒక విధంగా కాపాడింది. ఏదన్నా చదివినా, చూసినా దాన్ని గురించి రాయాలనిపించేది. మొదట మా hero మాతృభూమి ఒరిస్సా ప్రత్యేకతల్ని - సంబల్ పురీ కళల్ని, పట చిత్రాలనూ, మగ పిల్లల ఒడిస్సీ శైలి నృత్య విన్యాశాల గురించీ నాకు తెలిసినంత మటుకూ రాశాను. మాతృభూమి సినిమా గురించి రాశాకా, నాకు కాస్త గుర్తింపు వచ్చింది. సినిమాలు అంటే పిచ్చి లేదు గానీ మంచి సినిమాలంటే కుంచెం ప్రేమ. నేను సినిమాల గురించి రాసింది కొంచెమే గానీ - నా బ్లాగు ఆధారంతో నవతరంగం లో చేరిపోయా ! మొదట నాకు ఆ మాత్రం గుర్తింపునిచ్చింది ఈ తప్పుల తడకల మాతృభూమి రివ్యూ.
నేను వ్యక్తిగతంగా ప్రత్యేకంగానే ఉండిపోవాలని ఆశిస్తాను. (So I started blogging!) ఈ ప్రత్యేకత - నా హాబీల (చదవడం, బొమ్మలూ, పర్యటనా, సంగీతం) ద్వారా నిలుపుకోవాలని - నా ఆశ ! But I am a private person. (ఈ టపా పూర్ణిమ కోసమే రాశాను ! పూర్ణిమ తో ఎపుడన్నా మాటాడినపుడు ఒక ఆరేళ్ళ క్రితం నా జీవితం, ఆ రోజుల్లో ఆవేశం, ఉత్సాహం గుర్తొస్తాయి - నా మెమోయిర్స్ తరవాత రాస్తాను గానీ - పూర్ణిమా థాంక్స్) కాబట్టి నా బ్లాగ్ నాకో వెంటిలేటర్. మంచి వర్చువల్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది నాకు మరి !!! ఇంత కన్నా ఏమి కావాలి నా లాంటి ఇంట్రావర్ట్ కి ?
బ్లాగింగ్ డైరీ లా కాదు గానీ నా ఆలోచనలకొక రికార్డు లా పనికొస్తుంది అనిపించింది. మా కికోసు రేప్పొద్దున్న చదివితే నాగురించి తెలుసుకుంటాడని రాస్తున్నాను. ఇది అత్యాశేమో గానీ - ఒక ఫ్రీక్ దురాశేమీ కాదు కదా ! పైగా - బ్లాగింగ్ నా ఆలోచనల్ని సరైన దారిలో పెట్టింది. బ్లాగు లకు ఎడిక్ట్ కావడం కూడా అపుడే మొదలైంది.
అయితే, వెనక్కి తిరిగొచ్చి,ఆఫీసులో చేరాకా, బ్లాగుల మీద ఉన్న ఎడిక్షన్ తగ్గింది. వ్యాపకాలు, ఉమ్మడి కుటుంబ బాధ్యతలూ దీనికి కారణం. ఒక దశ లో బ్లాగింగ్ కు ఇవతల జీవితం కూడా బానే ఉందే అనిపించేలా తయారయ్యాను. ఇపుడు నా రియాలిటీ లో బ్లాగింగ్ ఒకభాగం. ఇదే జీవితం కాదు. ఇపుడు రాయడం, చదవడం కూడా బాగా తగ్గింది. టైం దొరకట్లేదు. అయినా మనసు బాలేనపుడూ, సంఘర్షణ ఎదురైనపుడూ గడ్డిపూల వైపు చూస్తాను. మూడ్ బావున్నపుడు చాక్లెట్ల వైపు దృష్టి పెడతాను. నా హాబీ సంగీతం.. శాస్త్రీయ సంగీతం ఇష్టం ! పైగా మెట్టింట్లో తెలుగు కీర్తనలు పాడి వినిపించమని అడిగేవారూ లేరు, పాడితే అర్ధం చేసుకుని ఆనందించగలిగే వారూ లేరు. అందుకే నాలో ఈ వలపు నశించకుండా - నాకొచ్చినవీ, రానివీ, నేర్చుకోవాలనుకున్నవీ పాటలు - శ్రీనివాసంలో పెడతాను.
అదీ కధ !
నేను రాసిన టపాల్లో నాకు నచ్చిన కొన్ని :
ఈద్ గా - మున్షీ ప్రేం చంద్
కొలంబియా - ఇన్ గ్రిడ్ విడుదల
తీవ్ర వాదం - ఐ ఈ డీ ట్రెండ్స్ [ ఇవి అయిదు భాగాలు ]
నా పెన్ను పిచ్చి గురించి
స్త్రీ పక్షపాతం
లక్కీ మిట్టల్ పతకాలు
Switzerland
లార్డ్స్
న్యూ లవ్
{చదివినా చదవకపోయినా - బ్లాగమంటూ ప్రోత్సహించిన హీరోకి ప్రేమతో ఈ టపా అంకితం}
నేను కూడలి లో దొరికిపోయాను. హమ్మయ్య ! నా పని సరే !
ReplyDeleteకాకపోతే చదివే వాళ్ళే 'దొరికి పోయారు !!!' (నిలువునా..) దేవుడే కాపాడాలి వాళ్ళని.
బాగుంది మీ స్టోరీ ..
ReplyDeleteచాలా బాగా చెప్పారు
ReplyDeleteపెళ్ళి అయిన అడపిల్ల తన వ్యక్తిత్వాన్ని బ్రతికించుకోడానికి చాలా కష్టపడాలి. అదీ భర్త నొచ్చుకోకుండా.......
ఇక వుమ్మడి కుటుంబాలలో వుండాల్సివచ్చినపుడు, మనల్ని మనం కోల్పోకుండా వున్నామంటే అదో పెద్ద విజయమే .అత్తగారో ,అడపడుచో తోడులేకుండా పక్కింటికి కూడా వెళ్ళడానికి వీలులేని పెద్దింటి పద్దతులమద్య వూపిరాడని కొంతమందికి (నన్నుకూడా కలుపుకొని) ఏదో ఒక హాబీ వుంటే అది వాళ్ళకి ఆక్సిజన్ లా పనిచేస్తుంది .కుట్లు, అల్లికలూ వంటలూ , వాటిసరసనే ఇప్పుడు బ్లాగింగ్ చేరిందన్నమాట. కాకపోతే ఇది అన్నింటికంటే మంచి హాబీ అని నేను అనుకొంటున్నను. ఎందుకంటే ఇందులో మన అలోచనలని ఎప్పటికప్పుడు మనలాంటి మరికొంతమందితో పంచేసుకోవచ్చు. నవ్వుకోవచ్చు, బాధలు వెళ్ళబోసుకోవచ్చు, ఏమంటారు?
అంటే అడుగు కదపకుండా ఆవలి ప్రపంచంలోకి ప్రయాణం అన్నమాట
ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పేసినట్టున్నాను .సర్లెండి .......మీ రికార్డుని మాత్రం కంటిన్యూ చెయ్యండి.
Yours is the blog I envy the most, because for me a blog should be just like yours. For reasons known/unknown I'm struggle to include random thoughts on in my blog.
ReplyDeleteమీ బ్లాగులో, నాకు ఇంటెరెస్ట్ ఉన్నా రాయలేని విషయాలను చదువుకుని ఆనందిస్తుంటాను. అవీ-ఇవీ అని తేడా లేకుండా అన్నీ ఉంటాయి ఇందులో! Well Presented!
అభినందనలు. మరిన్ని విశేషాలు/ విషయాలకై ఎదురుచూస్తూ..
పూర్ణిమ
BaagumdamDi ... Teluguneastamaa
ReplyDeleteసుజాత,,
ReplyDeleteచాలా బావుంది బ్లాగు ప్రయాణం. ఇది ఎక్కడా ఆగకుండా సాగిపోవాలని కోరుకుంటున్నాను. లలిత అన్నట్టు బ్లాగింగును కూడా మన హాబీలా చేసుకుంటే మనకు ఎంతో లాభం. వారానికోసారన్నా దీనికోసం టైం ఇవ్వండి. పెళ్లయ్యాక ఎన్నో బాధ్యతలుంటాయి. నిజమే. వాటితో పాటు ఇది కూడా. ఎందుకంటే ఇది మనకు తప్తి , ఆనందాన్ని ఇస్తుంది. మన ఆలొచనలను ప్రతిబింబిస్తుంది. మనలాంటి ఎంతో మంది స్నేహితులను ఇస్తుంది..
చాలా చాలా బాగుంది. కర్ణాటక సంగీతం తోనే కాక, సొంత డబ్బా ద్యారా కూడా కచేరి చేయవచ్చు అని నిరూపించారు.
ReplyDeleteమరమరాలు
బాగుందండీ. డబ్బాలా లేదు. సరదాగా వుంది చదవడానికి. చాలామంది రాసేకారణాలే మరోసారి తడువుకుంటున్నట్టుంది. :)
ReplyDeleteచాలా బావుందండీ మీ కథ.చదూతుంటే మనసంతా ఎంతో ఆర్ద్రమైనట్లనిపించింది.
ReplyDeleteచాలాబాగుందమ్మా నీ రచనా శైలి. కొనసాగించండి పదికాలాలపాటు తెలుగు వెలిగేలా
ReplyDeleteలేటుగా రాసినా లేటెస్ట్ గా రాశారు సుజాతా! బాగుంది మిమ్మల్ని మీరు నిలుపుకోవడం! నిజంగా!
ReplyDeleteమీరెప్పుడూ మీకే కాదు, నాక్కూడా ప్రత్యేకంగా నే కనపడతారు.
మరిన్ని మంచి టపాల కోసం చూస్తూ...
సుజాత
బాగుంది... ఇలాగే మీ ఐడెంటిటీతో బ్లాగుని రాయండి.
ReplyDeleteఇప్పుడున్న కొన్ని మంచి తెలుగు బ్లాగుల్లో మీ బ్లాగూ ఒకటి. Expecting more posts...
ReplyDeleteచక్కటి వైవిధ్యమున్న తెలుగు బ్లాగులలో గడ్డి పూలు ఒకటి. మీ బ్లాగు చదివి ఆనందించే వారిలో నేనూ ఉంటాను. బ్లాగు రాయటం చక్కటి emotional outlet కూడా. మనసు తేట పడుతుంది. You hum with joy and ecstasy.
ReplyDelete-cbrao
San Jose, CA.
This is for feed of comments.
ReplyDeleteమీ బ్లాగు చూసినప్పుడల్లా అనుకుంటా, ఏ విషయమ్మీదైన భలే రాసేస్తుంటారే అని... మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతుంటాను కానీ, కామెంటడం చాలా తక్కువ...
ReplyDeleteఅదిరింది. మీ బ్లాగుకి మీరే రాణి,మహరాణి, బ్లాగుమాత(జగన్మాతకు ప్యారడీ కట్టా!).
ReplyDeleteఇది సొంతడబ్బా ఏమాత్రం కాదు.సొంతమైన డబ్బా,స్వానుభవాల డబ్బా,స్వాభిప్రాయాల డబ్బా,స్వాంతనకలిగించే డబ్బా అంతకంటే ఏంకావాలి చెప్పండి!
నా అభినందనలు.
అభినందనలు. వైవిధ్యమైన విషయాల గురించి చాలా authentic గా రాసే మీది ఓ ప్రత్యేక బ్లాగు. ఇలానే కొనసాగించండి మీ ప్రయాణాన్ని.
ReplyDeleteసొంతమైన డబ్బా చాలా బాగుంది.
ReplyDeletepsmlakshmi
psmlakshmi.blogspot.com
చాలా బావుందండీ. నేగింగ్ వొద్దులే అని బ్లాగింగ్ లో పడ్డారన్న మాట. ఏ టాపిక్ ఎత్తుకున్నా, ఆలోచనలోనూ అభివ్యక్తిలోనూ ఒక స్వఛ్ఛతతో కనిపిస్తుంది మీ రచన. నలిగిన దారినే వెళ్ళడం మీ బ్లాగు లక్షణం కాదు. మీబ్లాగులో నాకు గొప్పగా నచ్చే లక్షణం ఇదే.
ReplyDeleteమీకు శాసిత్రీయ సంగీతం ఇష్టమా? నా విన్నవీకన్నవీలో శాస్త్రీయ సంగీటం టపాలు చూడండి వీలుంటే.
మీ హీరోకి కూడా మా అభినందనలు :)
గడ్డిపూలు బాగా గుబాళిస్తాయని తెలిసింది.
ReplyDeleteShiva garu
ReplyDeleteStory na .. ya ya !! kadha ippude modalaindi. :D
Lalita గారు
ReplyDeleteథాంక్స్ అండీ.. ఏదో చెప్పాలనుకోబోవడం నిజం కాదు .. కానీ మీరన్నాకా, చెబ్దామని అనిపించింది. నేను ఇంకో టపాలో నా గురించి కొంచెం చెప్పాలి. అదే - ప్రత్యేకమైన పరిస్థితులంటే ఏమిటో - విడమర్చాలి. ఇన్నాళ్ళూ చెప్పాలని, (బ్లాగులో) మనసు పుట్టలేదు. కానీ నాదీ కొంచెం ఇన్ స్పైరింగ్ కధనే ! థాంక్స్ చాలా చాలా.
Purnima..
ReplyDeleteThanks! You are like my younger sister - I told u !
Thanks for your good words here.
Double thanks తెలుగు నేస్తం !!!
ReplyDeleteజ్యోతి గారు
ReplyDeleteYou are absolutely correct. Most importantly, మీ లాంటి altruistic స్నెహితులు దొరికారు. అదీ ఈ బ్లాగుల్లో విశేషం. So.. this is a nice feeling to be here. Kudos to u.
మరమరాలు గారు ..
ReplyDeleteమీ కో జోక్ చెప్పనా.. మీ పేరు గురించి ?
మా అక్క నెల్లూరు పోస్టింగ్ లో మా అక్క కొడుకు, వాడి పొరిగింటి ఫ్రెండూ (ఇద్దరూ 3-4 ఏళ్ళ పిల్లలు) ఒక రోజు మరమరాల గురించి ఇలా మాట్లాడుకున్నారంట !
'నువ్వు బొరుగులు తింటావా ?' అని ఆ అబ్బాయి అడిగాట్ట. మా అ.కొ. బెదిరిపోయి 'పురుగులా ?' అన్నాట్ట. వాడేమో.. 'పురుగులు కాదు - బొరుగులు ' అని కరెక్ట్ చేసాడుట. ఇంతకీ బొరుగులంటే మరమరాలు ! నెల్లూర్లో వాటిని బొరుగులంటారు.
థాంక్స్. డబ్బా.. అదీ నేనూ, వాయించకుండా వుంటానా ? చూడండి, మీ పేరు మీద కూడా వాయించాను.
మాలతి గారు -
ReplyDeleteథాంక్స్. నిజమే. తడువుకున్నట్టుగానే ఉంది. అందరిదీ ఒకటే కధ. అయితే ఇదో (blogging in Telugu and the story of blogs) పోసిటివ్ కధ.
నరసింహ గారు
ReplyDeleteథాంక్స్. మీ వ్యాఖ్యే - చాలా బావుందండీ.
దుర్గేశ్వర గారు
ReplyDeleteచాలా థాంక్స్.
సుజాత గారు..
ReplyDeleteచాలా చాలా థాంక్స్. లేటు గా అంటే.. నాకప్పుడు తీరికుండేది కాదు.
ఇప్పుడు కాస్త టైం చిక్కింది.
నన్ను నేను నిలబెట్టుకోవడం.. అనేది చాలా శ్రమ తో కూడినది. ఇప్పటికీ ఈ ప్రయత్నంలో కాళ్ళు జారుతుంటాయి (మనకూ మనసుంటుంది గాబట్టి) & నడుము విరుగుతుంది. గుండెనే పగలకుండా కాపాడుకోవాలి. అదీ ఈ విశ్వ ప్రయత్నం. కానీ ఇలా మనసుకి లొంగకుండా, మెదడుతో నే బ్రతకాల్సి రావడం కొంచెం బాధాకరమైన విషయం. కాకపోతే, అనుభవాల్నుంచీ నేర్చుకున్న పాఠాలే ఇవి. మెదడు ని పనిలో పెట్టకపోతే, మనసు మనల్ని చాలా బాధపెడుతుంది. (మీరసలే మనసు సుజాత గారు.. మీకు బాగా అర్ధం అవుతుంది)
ప్రవీణ్ గార్లపాటి గారు
ReplyDeleteథాంక్స్. ఐడెంటిటీ.. అన్న పదం అంటే నాకు ఒకప్పుడు ఎంతో అబ్సెషన్ ఉండేది. మీ వ్యాఖ్య చదివాకా.. ఆ రోజులు గుర్తొచ్చాయి. I will do that.
రిషి గారు
ReplyDeleteSo very nice of you to say that. Thanks.
సీబీ రావు గారు
ReplyDeleteథాంక్స్. మీ మొదటి వ్యాఖ్య తో 100% ఏకీభవిస్తున్నా. ఇది ఒక ఎమోషనల్ ఔట్ లెట్ అన్నది నిజమే. నాకయితే ఇదో స్లాం బుక్ ! ఇది లేకపోయుంటే చాలా ఒంటరిని అయిపోయుండేదాన్ని. లేక పోతే, ఇంకేదో లా.. నన్ను నేను కోల్పోయి ఉండేదాన్ని. దీని ద్వారానే (మీరో సారి చెప్పారు - దీనికోసం కాకపోయినా, మరింత చదివి, మరింత తెలుసుకుని .. ) నన్ను నేను ఎన్ రిచ్ చేసుకోవాలని చాలా ఆశలు పెట్టుకుంటున్నాను. ఎన్నాళ్ళీ అవకాశం ఉంటుందో గానీ.. !! మీ రెండో వ్యాఖ్య 'ఇది ఫీడ్ కోసం.. ' అనేది అర్ధం కాలేదు.
మేధా...?
ReplyDeleteఅమ్మో! కొరియా అమ్మాయిలు కూడా గడ్డిపూలు చదువుతారా ?
థాంక్స్.
మహేష్ గారు..
ReplyDeleteఎంత బాగా రాశారండీ.. చాలా బావుంది మీ వ్యాఖ్య. థాంక్స్ అ లాట్ !
వరూధిని గారు,
ReplyDeleteచాలా చాలా థాంక్స్. అథెంటిక్ - ఏమీ లేదు లెండి. తప్పులు దొర్లుతుంటాయి. వడ్డనలూ జరుగుతుంటాయి. సరిదిద్దుకోవడాలూ ఉంటాయి. తప్పులు మానవ సహజం ! సుజాత కైతే (నాకు) తప్పులు చెయ్యడం జన్మ హక్కు !
This comment has been removed by the author.
ReplyDeleteలక్ష్మి గారు
ReplyDeleteథాంక్సు థాంక్సండోయ్ !
కొత్త పాళీ గారూ..
ReplyDeleteమీ వ్యాఖ్య చదివాకా... మబ్బుల్లో తేలిపోయినట్టూ, స్వర్గ లోకం అంచుల దాకా వెళిపోయినట్టూ అనిపించింది. నన్ను మెచ్చుకున్న మీ అందరి వ్యాఖ్యల్నీ మా హీరో కి చూపించి.. ' పర్లేదే ' అన్నట్టు తను నన్ను చూస్తే చూడాలనిపించింది.
థాంక్స్. మీ విన్నవీ కన్నవీ ఒక సారి చూశాను 'పలుకు తేనెల తల్లి ' కోసం మీరు లింక్ ఇచ్చారు. చాలా బావుంది. తీరిగ్గా చదవాలి. చాలా థాంక్స్.
హీరో తరఫునుంచి కూడా థాంక్స్.
సత్య సాయి గారు
ReplyDeleteథాంక్స్. గుబాళించాయా ? ఏవో పిచ్చి పూలు. థాంక్స్ అగైన్.
బ్లాగ్ లో రేగులేర్ గ రాసే మిత్రుల పోస్టింగ్స్ కనపడక పొతే ఏదో వెలితి గ వుంటుంది, అటువంటి మిత్రులలో సుజాత గారు ఒకరు.చదివాకా నిర్లిప్తం గ వుండి పొఇ నేను సైతం గడ్డిపూల గుబాలింపుకు నీటి చుక్కను జార విడుస్తా అనుకుంటూ వచ్చా,మేము కూడా మీ ఉమ్మడి కుటుంబం లో ఒకరి మే అని గుర్తు పెట్టుకుంటే మీరు బ్లాగర్లకు దూరం కారు. అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా.మీ కదా చదివాకా నాకు గుర్తు వొచ్చిన పాట మీలో కొంత ఉపసమనం కలగడం కోసం వినండి.ఈ నిశిరాత్రి నిశబ్దం గ నే రాస్తూ ఉంటే నిజమే అనట్టు గోడమీద బల్లి తలుపుతోన్డి, కిటికీ పక్కన గడ్డిపూలు గాలికి taluputu వంత పాడాయి.
ReplyDeletenenu cheptoone unna, you are blessed ani vinavu naa maata.
ReplyDeleteకాస్త లేటుగా కమెంటుతున్నా క్షమించండి సుజాత గారు..
ReplyDeleteఇది సొంత డబ్బా కాదు.. పోపుల డబ్బా, మూత తెరవగానే అన్ని రకాల spices సువాసనలు వెదజల్లినట్టు మీ మనసులోని భావాలను మాకు చూపించింది!!
మీ 'మాతృభూమి ' టపాతోనే నాకూ మీ బ్లాగ్ తో బాగా పరిచయం ఏర్పడింది.. తర్వాత రెండు, మూడు యూట్యూబ్ లింక్స్ ని పంచుకోవడం.. వావ్, మంచి మ్యూజిక్ టేస్టున్న అమ్మాయి అనుకోవడం కూడా జరిగింది! 'గడ్డిపూలు ' అని కనబడగానే ఈసారి దేని మీద రాశారో అనుకుని ఆత్రుతగా తెరుస్తాను.. బ్లాగ్ మీజీవితంలో ఒక భాగంగా మారిన విధానం చదువుతుంటే 'అందుకనేమో అంత passionate గా రాయగలరు! ' అనిపిస్తుంది!!
"నాకు తెలుగు బాగా వచ్చు ! పైగా నేను ఏమి రాసినా హీరో కి అర్ధం కాదు. (హీరో తెలుగు మాట్లాడగలరు. అంతే !) "
నాదీ almost ఇదే పరిస్థితంటే నమ్మండి :(
మీనించి ఇంకెన్నో మంచి టపాలకోసం చూస్తుంటాము..
సోదరీ.. చాలా థాంక్స్. నాకైతే భలే ఆనందం గా ఉంది - నీ కామెంటుకి. ఏదో తప్పుల తడకల వ్యవహారం. నడుస్తూంది. మన గాంగ్ లో రాజన్నా, నువ్వూ చదువుతున్నారు దీన్ని. చాలా ఆనందం!!
ReplyDeleteనిషి గంధా..
ReplyDeleteమీ హీరో కూడానా? మరి మీరంత మంచి ప్రేమ లేఖలు రాస్తారే ?!?! మిస్సయిపోతున్నారన్న మాట హీరో ! చాలా చాలా థాంక్స్.
రవి గారు
ReplyDeleteనాదేమన్నా విషాద గాధ లా అనిపించిందా ఏమిటి ? అలా అయితే నా కధ మీకు చెప్పాల్సిందే. చెప్తాను !!! చాల థాంక్స్ అండీ. ఇంత మంచి కామెంటు రాశారు. మీ లాంటి మిత్రుల వలనే మనసు చాలా హాపీ గా ఫీల్ అవుతుంది.
నాకు తెలుగు బాగా వచ్చు ! .... నేనూ "రాశేస్తాను"
ReplyDeleteidEnA telugu bAgA rAvaDaM aMTE? ;-)
యనానిమహిషా .. కొంచెం లైట్ తీస్కోమ్మా. టైపాటన్న మాట వినలేదా?
ReplyDeleteAnonymous గారు,
ReplyDeleteమీకో వీర తాడు - నా తప్పుని చూపించినందుకు కాదు. నా బ్లాగ్ లొ మీరే మొట్ట మొదటి సారి నన్ను వేళాకోళం చేస్తూ కామెంట్ రాశారు.
నేను చాలా మిస్టేక్స్ చేస్తాను. ఇంత వరకూ నన్ను సరిదిద్దే వారెవరూ నన్ను వేళాకోళం చెయ్యలేదు. ఇపుడు మీరే ఫస్ట్ కాబట్టి మీకు అభినందనలతో ఒక వీరతాడు ! మీ మీద అభిమానంతో నా తప్పుని సరిదిద్దుకోవడం లేదు. నాకు తెలుగు సరిగ్గా రాదులే అని తెలుసుకున్నాను. Many Thanks.
కొత్త పాళీ గారు -
ReplyDeleteథాంక్స్.
అన్నట్టు చెప్పడం మరిచాను. బ్లాగు టెంప్లేటులో ప్లాస్టిక్ వాడకం తగ్గించమని పెట్టిన విషయాలన్నీ బాగున్నై. ఒక సూచన. మాటలుగా రాసింది, మేటర్ మరీ పొడుగై పలుచబడింది. దానికి బదులు దుడ్డు అక్షరాలతో ఒకటి రెండు స్లోగన్ల లాగా రాస్తే జనాల దృష్టి నాకర్షిస్తుందేమో .. ఒక సూచన మాత్రమే
ReplyDeletekotta paalee garu
ReplyDeleteChange chesanu. I hope this is ok. I couldnt get a bigger font for the message.
సుజాత గారూ, హుందాగా స్పందించారు. భేష్!
ReplyDeleteచదువరి గారు
ReplyDeleteథాంక్స్. 'హుందా గా' నా ? ఒకె ! థాంక్స్. :D
అవును సుజాత గారు బొరుగులంటే మరమరాలే, కాని ఇప్పుడు అందరూ బొరుగులు అనే అంటున్నారు.
ReplyDeleteతినటానికి రుచిగా లేక పోయినా healthకి మంచిది అని నా బ్లాగ్ (మరమరాలు) గురించి నా అబిప్రాయం. మీ బ్లాగ్ పేరు దాని టెంప్లేటు బాగా సరిపోయినది.
మరమరాలు
థాంక్యూ మేడమ్.
ReplyDelete"థాంక్యూ మేడమ్." అన్న రానారె వ్యాఖ్య నా జీ మైల్ ఇంబాక్స్ లో పడటంతో మీ టపా దగ్గరకు మరలా వచ్చాను. మీ బ్లాగు వ్యాఖ్యలలో "మీ రెండో వ్యాఖ్య 'ఇది ఫీడ్ కోసం.. ' అనేది అర్ధం కాలేదు." అన్నారు కదా. "This is for feed of comments." -దీని అర్థం మీ బ్లాగులో నా వ్యాఖ్య తరువాత ప్రచురించబడే వ్యాఖ్యలు నాకు మైల్ కావటానికి. సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom) ". Email follow-up comments" అనే పెట్టెలో మొదట వ్యాఖ్య రాసినప్పుడు టిక్ పెట్టడం మరిచాను. గుర్తొచ్చి టిక్ పెట్టి "This is for feed of comments." అని రాశాను. ఇదీ దానికర్థం. బోధపడిందని తలుస్తాను.
ReplyDeletesujatha gaaru ,
ReplyDeletechaala baavunnai mee post lu, mee rachana saili kooda baavundi. boasting anukoka pothe oka vishayam, "na blog sontha dabba" lo konni lines acchanga naa alochanala laage unnai, mana vyakthithvanni nilupukovadam, sangeetham sshithyam na pranam, andulo modatidi(sangeetham) na oopiri, nenu shastreeya sangeetham nerchukuntunnanu. manchi kathalu,navalalu chadavadam chinnapatninchi alavaatu. blog lu chadavadam ee madhyane alavataindi. naaku blog lokaaniki raavalanundi, kaanee inka anniti paina avagahana penchukovaali, mukhyamga time undaali,
anyways, baavundi mee blog chaduvuthunte
reply isthaarani ashisthoo
aparna