Pages

31/03/2024

పియా మోరా బాలక్ హం తరుణీగే - Mythili Poem by Mahakavi Vidyapati

 పియా మోరా బాలక్ హం తరుణీగే 

పియా మోరా బాలక్ హం తరుణీగే - 

కౌనె తప్ చుక్లో బెల్గౌన్ జననిగె


పహిరెలెల్ సఖి దక్షినక్ చీర్

పియా కె దెఖయిత్ మొరా దఘద్ శరీర్

పియా కె దెఖాయిత్ మోరా దఘద్ శరీర్

పీయా లెలె గోద్ కె చలాయి బజార్

హతియా కె లోగ్ పూచె కె లగె తొహర్

హతియ కె లోగ్ పూచె కె లగె తొహర్


నహీ మొరా దేవర్ కి నహి చోట్ భాయి

పూరబ్ లిఖాల్ చల్ బలము హమార్

పూరబ్ లిఖాల్ చల్ బలం హమార్

బత్ రె బతొహియ కె తహున్ మొర భై

హమరో సమద్ నైహార్ లెనై జాయ్

హమరో సమద్ నైహార్ లెనై జై


కహీ హున బబ కె క్నీయి ధెను గే

దూదవ పియ కె పొసత్ జమయి

దొదవ పియ కె పొసత్ జమయి

భనహి విద్యపతి సునహున్ బ్రిజ్ నారి

ధీరజ్ ధైరహున్ మిలత్ మురారి

ధీరజ్ దూఇరహున్ మిలత్ మురారి


పియా మోర బాలక్ హుం తరుణీగె

కౌనె తప్ చూకలొన్ భెలావూన్ జననీ గె

- Maithili Poem by Mahakavi Vidyapati 


నా భర్త బాలుడు (చిన్న పిల్లవాడు), నేనేమో యవ్వనం లో ఉన్న తరుణిని

నేను చేసిన పాపమేమో గానీ, నా భర్త బాలకుడు. 


సఖీ, ఏ దక్షిణ దేశపు చీరనో కట్టుకుని  అతన్ని చూసే సరికీ నా దేహం దగ్ధమౌతుంది. అతన్ని పట్టుకుని బజారు కు వెళ్దామన్నా, ప్రజలు అతను నీకేమౌతాడని అడుగుతున్నారే!


ఇతను నా మరిదీ కాదు, నా చిన్న తమ్ముడూ కాదు. విధి వశాన ఇతను నాకు భర్త అవుతాడు. పాంధుడా,  మాటవరసకైనా నువ్వు  నువ్వు నాకు సోదరుడివవుతావా ? నా కన్నవారి దగ్గరికి తీసుకుపోతావా ? 


నా తండ్రి తో చెప్పు ! నాకు ఓ   (బాగా పాలిచ్చే కామ) ధేనువు జాతి ఆవును కొనివ్వమని !  నీ అల్లుడిని సాకేందుకు నా దగ్గర ఏదీ లేదు కనీసం అతను ఆ పాలు తాగి పెద్దవాడవుతాడు. అని చెప్పు !!    స్త్రీ జనమంతా విద్యాపతి మాటలు వినండి . ఓర్పు తో వేచినవారికి మురారి (Lord Krishna)  తప్పకుండా దొరుకుతాడు. నేనేమి పాపం చేసానో గానీ నా భర్త ఒక బాలకుడు. 

***

ఇది ఒక 15 వ శతాబ్దపు స్త్రీ ల పరిస్థితి గురించి కవి చెప్పిన పదం. ఆ నాటి స్త్రీ లకు కనీస స్వతంత్రం, స్వేచ్చా లేకపోవడం, ఆర్ధిక సామాజిక వెనకబాటుతనం, ఎవరో వచ్చి ఉద్ధరిస్తే తప్ప బాగుపడని జీవితాలవడం,  నిస్సహాయత తో జీవితాన్ని గడపాల్సి రావడం గురించి మైథిలీ లో రాసిన పదం. ఈ పాట లో స్త్రీ బాలుడ్ని ఎందుకు పెళ్ళాడవలసి వస్తుందో గానీ, అది ఆవిడ తీసుకున్న నిర్ణయం కాదని, శిశువుని కట్టబెట్టి, ఆమె తల్లితండ్రులు ఆమె బరువును వదిలించుకున్నారనీ తెలుస్తుంది.   

ఆడపిల్లల్ని ఏదో ఒక లా పెళ్ళి చేసి వదిలించుకోవడం ఆనాటి సామాజిక పరిస్థితి. కట్నాలు, ఆస్తులు, లాంచనాలు వగైరా కారణాల వల్ల, ఆడపిల్లలని పుడుతూనే చంపేసే విధానాలు మామూలయిపోయిన దేశం లోది ఈ పాట. సాంఘిక దురాచారాలని కవులు, కధకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొచ్చి, వాటి వల్ల జరిగే అనర్ధాలను బయటపెట్టి, చైతన్యం తీసుకురాబట్టి, ప్రజలలో కాస్తయినా మార్పు వచ్చింది.  చట్టాల వల్ల వచ్చే సామాజిక మార్పు కన్నా, సాహిత్యం తీసుకుని వచ్చే మార్పు గట్టిది. కలకాలం నిలిచేదీనూ. 

***


Thanks to my young brother Atul for translating this poem in English and Hinglish, 

Reference : https://deoshankarnavin.blogspot.com/2015/01/1.html?m=1

Mahakavi Vidyapati 

Thanks to Swathi Pantula Garu, for introducing this song.

No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.