కలకత్తా లో మొట్ట మొదట కళ్ళకు గుచ్చుకునేది దాని కొలోనియల్ పాస్ట్ ! ముందుగా వంటగదితో స్వాగతం పలికే పాత ఇళ్ళూ, ఆ వీధులూ, వెనీషియన్ బ్లైండ్స్ ఉన్న కిటికీ లూ, ఇంటి కిటికీ పక్కనే ఫుట్ పాత్, ఇరుకు వీధులు, వీధుల్లో పారలల్ పార్కింగ్, ఘనమైన మ్యూసియం లు, పాత వాసన కొట్టే గాలి, ఆగిపోయిన కాలాన్ని ప్రతిబింబించే డొక్కు ట్రాం లు, నల్లని బస్సులు, అతి భయానకమైన బీదరికం, ఇంకోపక్క విపరీతమైన ధనం, ఆకాశహర్మ్యాలు, వ్యవస్థ లో విపరీతంగా పాతుకుపోయిన వ్యవస్థాత్మకమైన అవినీతి !
కొన్ని ప్రామాణికంగా తీసుకునే పాయింట్ల ప్రకారం, వెనకబడిన కలకత్తా మహానగరం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద వాణిజ్య నగరం. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అతి పెద్ద వ్యాపారం ఈ నగరం నుంచే జరిగింది. మన దేశం, ముఖ్యంగా తూర్పు భారతంలో 200 యేళ్ళ పరాయి పాలన ముగిసి దాదాపు ఎనభై ఏళ్ళవస్తున్నా ఇంకా బీదరికంలో మగ్గిపోవడానికి, "బిహారీ"లు కపటులు / దుర్మార్గులు, గూండాలు అనీ మిగతా అందరికీ మనసుల్లో పాతుకుపోవడానికీ, మన పరాయి ప్రభువులకూ ఒక సంబంధం ఉంది. చైనా కి ఇక్కడి నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతి చేసిన నల్లమందు / ఓపియం ఇప్పటికీ మన దేశాల మధ్య ఇరుకుని ప్రభావితం చేస్తూండడం, ఎన్నో సంవత్సరాల పాటు పబ్లిగ్గా + అతి రహస్యంగా జరిగిన ఓపియం వేలాలు, వ్యాపారం, ఒక దేశం (Britain) ఇప్పుడు విపరీతమైన డబ్బుతో శక్తివంతంగా విర్ర వీగడానికి రెండు దేశాలు (India, China) ఒకప్పుడు భ్రష్టుపడిపోవడానికి మూలాలు ఈ నగరం లోనే పడ్డాయి. అదీ ఈ పుస్తకం చెప్పే చరిత్ర.
దాదాపూ 150 యేళ్ళు తూర్పు భారతం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళాక ఎలా, ఎంతలా దోపిడీకి గురయిందీ, వాణిజ్య పంటల ముసుగులో, మొదట వరి పండించడాన్ని ఆపించి, రైతుల చేత ఎకరాల కొద్దీ మొదట నీలిమందు (ఇండిగో), నల్లమందు, పత్తి, తరవాత ఓపియం పండించి, ఆ ఓపియం ను ఫాక్టరీలలో యంత్రాలతో కాకుండా, కూలీల చేతులతో, కాళ్ళతో ప్రాసెస్ చేయించి, దాన్ని పెట్టెల కొద్దీ వేర్ హౌస్ ల లో భద్రపరచి, కలకత్తా రేవు నుండీ, ప్రస్తుత Guangzhou, హాంగ్ కాంగ్ (చైనా) కు పంపించి, చెప్పలేనంత సొమ్ము ని కొన్ని సంవత్సరాల పాటూ గడించి, భారతీయ రాజులతో చేసే యుద్ధాలకు డబ్బు ఎలా సంపాయించుకుంది, చాలా జాగ్రత్తగా పరిచయం చేసిన పుస్తకం ఇది. డచ్, ఫ్రెంచ్, అమెరికన్ వ్యాపారులు కూడా ఈ వ్యాపారంలో కోట్లు, పేరు గడించారు. ఘనత వహించిన F.D.R ముత్తాత కూడా వారిలో ఒకడు. మన దేశానికి చెందిన రబీంద్రనాథ్ పూర్వీకులు కూడా ఒకప్పుడు నల్లమందు వ్యాపారంలో డబ్బు ఆర్జించిన వారే. అందుకేనేమో ఆ ఇబ్బందిని మీరేందుకు రబీందృడు మాత్రం చైనా ను సమర్ధిస్తూ, నల్లమందు కు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడారు.
ఈ ఓపియం చైనా ని కొన్ని వందల సంవత్సరాల పాటూ చాలా బాధ పెట్టింది. ప్రజలు మత్తు కు బానిసలయ్యారు. చాప కింద నీరులా అది కంఫ్యూషియస్ బోధలని తుడిచిపెట్టింది. కుటుంబాలను, రాజ్యాలను, మర్యాదలను, ఆరోగ్యాలను మంట కలపడమే కాకుండా, దేశాల మధ్య చిచ్చు పెట్టింది. చైనా వరకూ ఇదో రాజకీయ, వాణిజ్య సమస్య. వేలాది మంది ఎడిక్ట్స్, లక్షలాది మంది వినియోగదారులూ, దేశ రెవెన్యూ ను ఇంగ్లీషు వాడి చేతుల్లో పెట్టారు. చైనా నుండి అత్యంత విలువైన మేలురకం సిల్క్, తేయాకు సంగ్రహించి, వాటికి బదులుగా ఓపియం ను అమ్మి ఆ దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది ఈస్ట్ ఇండియా కంపెనీ / బ్రిటన్.
ఈ వ్యాపారం లో భారతీయులు ఎంత గా ఇన్వాల్వ్ అయ్యారో, భారతీయ పార్సీలు హాంగ్ కాంగ్ లో / ప్రస్తుత చైనా లో, తైవాన్ లో రాజకీయ, వ్యాపార రంగాలలో ఎంతకా పాతుకుపోయారో చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి అమెరికా లో, బ్రిటన్ లో అతి ఎక్కువ సంపద ఉన్న సంపన్నులు, భారతీయ సంపన్నులున్నూ ఒక తరంలో ఈ ఓపియం మత్తు మందు వ్యాపారంలో గడించిన వాళ్ళే. Guangzhou City, Macao, Hong Kong లు ప్రధాన వాణిజ్య (మత్తు మందు వ్యాపారానికి ప్రసిద్ధి) నగరాలు. వీటిల్లో భారతీయ వ్యాపారులు అనేకంగా వ్యాపారాలు చేసారు. హిందువులకు సముద్రయానం నిషిద్ధం గాబట్టి, మన దేశం నుండీ ఆ రోజుల్లో బయటి దేశాలకు సముద్రాలు దాటి వెళ్ళింది పార్శీలే. వాళ్ళు అక్కడ సామాజికంగా, సాంస్కృతికంగా పాతుకుపోయి, గుళ్ళూ, స్మశానాలనూ నిర్మించుకున్నారు. కొందరు చైనీయ మహిళని వివాహమాడి "సైనో ఇండియన్" కమ్మ్యూనిటీ ని సృష్టించారు. వాళ్ళ సంతతి లో ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటులూ, వ్యాపార వేత్తలూ ఉన్నారు.
ఇండియా చైనాల వాణిజ్య సంబంధాలలో చారిత్రాత్మకమైన గురుతులు చైనా కళాకారుల కళ. కలకత్తాలో ఇప్పటికీ నిలిచిపోయిన చైనీయుల పేటలు, చైనీస్ రెస్టారెంట్లు, స్పాలు. ఈ కళ పాశ్చాత్యులను విపరీతంగా ఆకట్టుకుంది. అమెరికాలో చైనా చిత్ర కళ కు, మృణ్మయ కళ కూ ప్రత్యేకంగా మ్యూజియం లు కూడా ఏర్పాటు చేసారు. ముంబయి లో జె జె ఇన్స్టిట్యూట్ లో జెమ్షెడ్ జీ చైనా నుండీ తీసుకొచ్చిన అనేక చీనీ పెయింటింగ్లు ఉన్నాయి. చైనా అమ్మిన టీ, సిల్కూ, ఈ అత్భుత చిత్ర కళ, వేదాంతమూ ప్రపంచం ఎంత ఎంజాయ్ చేసిందో, బదులుగా చేసిన ఈ నల్ల మందు వ్యాపారంతో దానికి చెప్పరానంత చేటు చేసింది.
కారు చవగ్గా నిముషాల్లో Portrait లను వేసే చైనీయుల కళా ప్రతిభను ఇప్పటికీ అబ్బురంగా చెప్పుకుంటారు. యూరప్ లో portrait చేయించుకోవాలంటే అది డబ్బున్నవారికే చెల్లేది. వ్యవస్థీకృతమైన చైనా నల్లమందు వ్యాపారం ఎందరో సైనికులనీ, నావికులనీ, వ్యాపారులనీ, రక రకాల దేశాక వాళ్ళని ఒక చోట చేర్చింది. ప్రారంభం లో బ్రిటిషర్లు చైనీయుల ప్రభుత్వ విధానాల్ని ఎంత మెచ్చుకున్నారంటే, ఇప్పటికీ మన దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రతిష్టాత్మక "సివిల్ సర్వీస్" పరీక్షల ని చైనీయుల ని చూసే (అప్పట్లో) వీళ్ళూ ప్రవేశపెట్టారు.
జరిగినన్నాళ్ళూ కలకత్తాలో రహస్యంగా జరిగిన ఓపియం వేలం పాటలు, (బిహారీ పొలాలలో పండిన పంట, యూ.పీ లో ఫాక్టరీలలో ప్రాసెస్ అయి, చైనాలో అమ్మకానికి సిద్ధపరచి, కలకత్తాలో వేలం వేసేది కంపెనీ. అది కొని, చైనా లో అమ్మినది మొదట పార్సీలు, తరవాత ఫోర్బ్స్ వంటి అమెరికన్లు, కొందరు బ్రిటీషు వ్యాపారులు) బొంబాయిలో బహిరంగంగా జరిగేవి. అయినా బ్రిటిష్ వలసరాజ్యం 'మరాఠవాడా' లో విస్తరించడానికి సమయం పట్టింది. అక్కడి రైతుల్ని / గ్రామాలనూ లొంగ దీసుకుని, ఓపియం పండించడం కూడా కష్టమైన పనే. అయితే డబ్బు ప్రవాహపు ఆశ బొంబాయి ని కూడా ఓపియం వ్యాపారం లోకి దించింది. ఇక్కడా కొందరు సంపన్నులు తయారయ్యారు. HSBC Bank కి మూల ధనం వచ్చిందీ ఓపియం లాభాలనుంచే. హాంగ్ కాంగ్ మొదట చైనా చేతుల్లోంచి జారి బ్రిటన్ చేత పడటం, ఇప్పుడు లీజు ముగిసి, చైనా కి చేరడమూ ఒపియం వ్యాపారం మూలానే (మొదటి ఓపియం యుద్ధం లో China ఓడిపోవడం వల్ల జరిగిన ఒప్పందం ప్రకారం).
ఇప్పుడు అమెరికా లో ప్రబలంగా ఉన్న ఓపాయిడ్ డ్రగ్ సమస్య ఒకప్పుడు చైనా లో విపరీతంగా ఉండేది. చక్రవర్తులు, రాజులు శతవిధాల ప్రయత్నించినా, పాశ్చాత్యుల కుతతంత్రాల ముందు నెగ్గలేకపోయారు. 50 ల లో కమ్మ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్ర కఠిన చర్యలకు పాల్పడే దాకా కూడా ఈ ఓపియం విష సంస్కృతి ని తమ దేశం నుండీ తరమలేకపోయారు. ఇండియా కూడా స్వతంత్రం వచ్చాక ఓపియం ను ఓ రెవెన్యూ గడించే ఉపాయం కింద తీసుకోకపోవడం ఉపశమనం తీసుకొచ్చింది.
ఓపియం నిజానికి ఓ అత్భుత ఔషధం. ఎలాంటి వారికి అంటే, విపరీతమైన నొప్పి ఉన్న వాళ్ళకి, మృత్యు ముఖంలో ఉన్నవారికి, కేన్సర్ పీడితులకు, హాస్పైస్ లో ఉన్నవారికి, నొప్పి తెలీనివ్వకుండా వాడే ఔషధ ప్రమాణాలలో వాడితే అదొక వరం. కానీ అది ఇష్టం వచ్చినట్టు, వ్యాపార ధోరణిలోనే, ఒక కాలనీ లో బీద రైతులను భయపెట్టి, బీద కార్మికుల చేత భౌతికంగా ప్రాసెస్ చేయించి, యుద్ధాలు జరిపి, లక్షలాది పౌండ్ లను సంపాయించేందుకు ఒక జాతికి నల్ల మందు ని విపరీతంగా అలవాటు చేయించి, వాళ్ళ బలహీనతలను సొమ్ము చేసుకుని ఒక మహా సామ్రాజ్యమే నడిచిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
By the 1880s, opium was one of the most valuable commodities moving in international trade. In an average year, export opium leaving Calcutta and Bombay averaged over 90,000 chests, containing more than 5,400 metric tons. This staggering amount would meet the annual needs of between 13 and 14 million opium consumers in China and Southeast Asia who smoked opium on a daily basis.
అదే సమయంలొ తమ తమ స్వదేశాలో మాత్రం, ఓపియం వాడుక మీద నియంత్రణలు విధించారు పాశ్చాత్యులు. మత్తు మందుల వాడకం (ఆల్కహాల్ కాదు) ఒక నీతి మాలిన చర్య అని, చైనీయులు, తూర్పు ఆశియన్లూ దొంగలు, దుర్మార్గులు, నమ్మ దగని వాళ్ళూ కాబట్టి, వాళ్ళకు ఓపియం అమ్మవచ్చనీ ఒక భావజాలాన్ని సృష్టించారు. స్వదేశాలలో ఎందుకూ కొరగానివాళ్ళు కలకత్తా వచ్చి ఓపియం వ్యాపారంలో పాల్గొని, కోట్లు గడించారు. స్వదేశాలలో వితరణ శీలులుగా పేరు గడించారు. నోబుల్స్ గా హై సొసైటీలలో తిరిగారు. రాజ్యాల పోరాటాలను ఫైనాన్స్ చేసారు. దీనిలో అంత డబ్బా - అని ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది కదా.
Charles Dickens writes in an essay - If you were to check or prohibit this drug, a craving would arise for some other stimulus, like as in England, where an intermperate advocacy of temperance often leads to a secret indulgence in something fully as bad as ardent spirits.
ఇప్పుడు క్రిమినల్ కార్టల్స్ దొంగతనంగా నడిపే డ్రగ్ రాకెట్స్ ని, ఒకప్పుడు ప్రభుత్వాలు నడిపేవి. ఇండియా కూడా స్వాతంత్ర్యం వచ్చాక కొన్నాళ్ళు నడిపింది. ప్రజల్లో చైతన్యం వచ్చి, పోరాటాలు జరిగి, రబీంద్రనాథ్ టాగోర్ వంటి వారు వ్యతిరేకించడం బట్టి, స్త్రీలు తిరగబడడం వల్లనూ, మెల్లగా మన దేశంలొ నల్లమందు సాగు ఆగింది. తరాల పాటూ ప్రభుత్వ కనుసన్నల్లో ఇష్టం వున్నా లేకపోయినా, తాము తినడానికి కాసిని తిండి గింజలనైనా సంపాదించుకోలేని / (పండించుకోవడానికి అనుమతి లేదు) బీద రైతులు ఓపియం కీ, దాని వాసనకీ, మత్తు కీ, దళారుల దోపిడి కీ, వెట్టి చాకిరీ కీ కరిగిపోయి, కట్టు బట్టలతో మిగిలి, కుటుంబాలతో విదేశాలకు 'ఇండెంచర్ కూలీ' గా వలస పోయారు. బెంగాల్, బీహార్ లు వట్టిపోయాయి. అక్కడ, రెండు వందల సంవత్సరాల క్రితం నుండే సామాజిక అన్యాయం జరగడం అలవాటయిపోయింది. పిల్లలకు బళ్ళు లేవు. గ్రామాలకు రోడ్లు లేవు. ఇప్పటికీ పల్లెల్లో జీవనాధారం లేదు. ఆస్పత్రులు లేవు. ఉద్యోగాలు లేవు. "బిహారీ", తన 'దేశం' (State) వదిలి బయటికొస్తేనే అన్నం తినగలడు. ఇప్పటికీ ! (బిహార్, యూపీలు ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్ లో ఉండేవి - వనవాసి గుర్తుంది కద)
"ఐబిస్ ట్రైలొజీ" రాసినప్పుడు రచయిత చేసిన విస్తారమైన రీసెర్చ్ ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు మనకు అవసరమా అని అనుమానం వస్తే, దానికి ఒక సమాధానం ఉంది.
డబ్బు సంపాదించేందుకు సంపన్నులకు ఎటువంటి సందేహాలు, ధర్మ సంకటాలు ఉండవు. వాళ్ళకు మానవాళి కొంప కొల్లేరయిపోతున్నా అస్సలు పట్టదు. వాళ్ళకు అస్సలు ఏమీ అవసరం లేదు. ధర్మం అన్న మాట పని చెయ్యదు. స్వార్ధం, కపటత్వం, దుర్మార్గం, అన్యాయం - అంతే వాళ్ళకు తెలిసినవి.
In 1907, Britain signed an agreement with China, undertaking to phase out all opium exports from India, over a ten-year period, provided that China's suppression of its domestic drug industry meet similar annual targets. It was assumed that china would fail to meet its targets. However China's crusade to free her people from the opium curse, may be justly reckoned one of the greatest moral achievements in history - a challenge to Western world.
ఇప్పుడు చైనా మీద ఓపియం ఎడిక్షన్ ప్రభావం అంతగా లేదు. కఠోరమైన రాజకీయ నిర్ణయాలు + వాటిని అమలు పరచడం లో నిజాయీతీ, చైనాను ఆ సమస్య నుండీ బయట పెట్టాయి. అయినా ఈ వ్యాపారంలో లాభాల కోసం, తమ బంగారు గుడ్డు పెట్టే బాతుని కాపాడేందుకు శతవిధాలా ఈ పాశ్చాత్యులు చైనా ని తీవ్రంగా విమర్శించి, ఇరుకున పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. కేవలం ఇందువలన ఇప్పటికీ చైనా విదేశాంగ విధానం "అపనమ్మకం" మీదే ఆధారపడింది! ఇతరులను నమ్మి చాలా సార్లు చైనా మోసపోయింది ఓపియం వాణిజ్యంలోనే.
ఈ 1907 నాటి ఒప్పందం మెల్ల మెల్లగా ఇండియా లోనూ ఓపియం వ్యాపార జ్వరం తగ్గుముఖం పట్టేందుకు దోహదపడింది. 1911 లో పట్నా ఓపియం ఫాక్టరీ మూతపడింది. 1930 లో నల్ల మందు నిషేదానికి చట్టాలు వచ్చాయి. అయినా డబ్బాశ తో 1935 లో దొరల ప్రభుత్వం నీమచ్ ఓపియం ఫాక్టరీ ని తెరిచింది. స్వతంత్రం వచ్చాకా వెక్కిళ్ళు పడుతూ భారత ప్రభుత్వం కూడా నల్లమందు తయారీని పూర్తిగా నిషేధించింది. నల్లమందు వ్యాపారాల లైసెన్సులు రద్దయ్యాయి. అయితే బ్రిటిషర్లు వాదించినట్టు ఆ పరిస్థితుల్లో గ్రామీణ భారత వ్యవస్థ కుప్పకూలిపోలేదు. పొలాలలో తిండిగింజల ఉత్పత్తి జరిగింది. నల్లమందు కు బలయిన తరం, పక్కకు తప్పుకుని, సరైన వ్యవసాయాధార బ్రతుకుకు అవకాశం ఇచ్చింది.
--------------------------------------------------------------------------
Chinese Statesman Ku Hung-ming wrote to Somerset Maugham in 1921 :
Do you that that we tried an experiment that is unique in the history of the world? We sought to rule this great country not by force, but by wisdom. And for centuries we succeeded. Then why does white man despise the yellow? Shall I tell you? Because he has invented the machine gun. That is your superiority. We are a defenseless horde and you can blow us into eternity. You have shattered the dream of our philosophers that the world could be governed by the power of law and order. And now you are teaching our young men your secret. You have thrust your hideous inventions upon us. Do you know that we have a genius for mechanics ? Do you not know that there are in this country four hundred millions of the most practical and industrious people in the world ? Do you not know that there are in this country four hundred millions of the most practical and industrious people in the world ? Do you think it will take us long to learn ? And what will become of your superiority when the yellow man can make as good guns as the white and fire them as straight ? You have appealed to the machine gun and by the machine gun shall you be judged. -
-----------------------------------------------------------------------
మొత్తానికి మూడొందల సంవత్సరాల చరిత్ర ముగిసింది. ఎందరో ఈ చరిత్ర లో కలిసిపోయారు. ఓపాయిడ్ సమస్య అగ్ర దేశాలని ఇప్పుడు వ్యవస్థీకృతంగా బాధిస్తుంది. ఇప్పటికీ ఓపియం వివిధ రకాలుగా మ్యూటేటెడ్ వెరైటీలలో ఉత్పత్తి అవుతుంది. యుద్ధాలలో తుడిచిపెట్టుకుపోయిన ఆఫ్గనిస్తాన్, సిరియా, యెమెన్ వంటి రాజ్యాలు బ్రతుకుతెరువు కోసం కొత్త రకం వంగడాల ఓపియం ను వాణిజ్య స్థాయిల్లో పండిస్తున్నాయి. లక్షలాదిగా మనుషులు కొత్త ఓపియం రకాల ఎడిక్షన్ లో పడి దారుణంగా చనిపోతున్నారు. ఇది ఆగిపోదు. వైద్య అవసరాల కోసం ప్రభుత్వ లైసెన్స్ తో కూడా ఓపియం పండుతోంది.
For countries with weaker law enforcement systems, such as those of Indian subcontinent and Africa, it will be close to impossible to regulate the flow of opiates. Pakistan already has a major heroin problem because of the steady inflow from Afganisthan. The same is true of the Indian state of Punjab. Matters are likely to become much worse in future, especially if many insurgencies in the region resort to poppy farming or drug running to fund their causes.
As Mark Twain famously observed 'History never repeats itself but it does often rhyme'. It is a measure of Opium's peculiar ability to insert itself into human affairs that it has created many echoes and rhymes between past and present. "చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవకపోయినా దానిలోని రిథం ఎప్పటికీ బ్రతికే వుంటుంది." ఓపియం విధానాల లాంటివే ఇప్పటి పర్యావరణ విధానాలు. ఎప్పటికీ బహుళ జాతి సంస్థలూ, లభాలు ఆర్జించే ప్రభుత్వాలూ, పర్యావరణం కోసం ఆలోచించవు. ప్రపంచం భూగోళాన్ని కాపాడుకోవడానికి అందుకే ఒకడుగు ముందుకు, పదడుగులు వెనక్కీ వేస్తుంటుంది. ఈ పర్యావరణ ప్రమాదాలలో, ప్రకృతి వికృతమైన పర్యవసానాలలో ప్రాణాలు కోల్పోయేది, బీదలూ, సాధారణ పౌరులే. శక్తివంతమైన వారు నిర్ణయించే జీవితం మనది.
Today, in a world where climate disruptions are intensifying and many formerly stable institutions are crumbling, it is more and more evident that much of what we have been taught about the past is untrue. Indeed, what was truly new about the great 'take-off' of the nineteenth century was that it created a system in which indifference to human suffering was not just accepted by teleologies and deceptive theories. What this led to was, for the most part, a kind of 'slow violence', inflicted not by weaponry but rather by inaction, and refusals to intervene.
అయితే ఏ రకంగా ఆకాలానికి అత్యంత శక్తివంతమైన ఓపియం వ్యాపారపు సామ్రాజ్యాన్ని ఓడించిన ప్రజాగ్రహం, చైతన్యం, సరికొత్త పర్యావరణ విధానాల మార్పుకూ ఏదో ఓరోజు ఊతమివ్వవచ్చు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా, భూమిని మరింత స్వచ్చంగా, నివాసయోగ్యంగా మార్చేందుకు మనిషి చేసే ప్రయత్నాలలో ఈ "లాభాపేక్షకుల" ఓటమి ఎప్పటికైనా జరగాలన్నదే ఒక ఆశ.
ఒకప్పుడు ఎదురన్నదే లేని ఓపియం సామ్రాజ్యం ఎలా కుప్పకూలిందో, లేదా ఇప్పటికీ ఓపియం చరిత్ర వివిధ దేశాల్ని, ఆయా దేశాల సంపన్నులనీ, వాళ్ళ ధనాన్నీ, ఎలా అంటిపెట్టుకునుందో, మన దేశంలో ఎందరు పెద్ద పెద్ద వాళ్ళ సంపద వెనక నల్లమందు సామ్రాజ్యపు చాయలున్నాయో చదివేందుకు, చరిత్ర నుంచీ మంచిని నేర్చుకునేందుకు, ఈ పుస్తకం చదవచ్చు.
--------------------------------------------------------------------------
"When Opium smokers craving comes on, their bodies feel shriveled and listless, their joints all stiff. They must rely on opium to fire themselves up. At the beginning of firing up, they wriggle like worms. A little more fired up and they begin to flow like a great river. Fired up for a good while, they brim and burst with energy and quickened in every limb they stream forth with indomitable heat. By the middle of the night they have even more energy to spare." ---
The use of the words 'energy' and 'fire' has deeply unsettling resonances in this age of intensifying climate change, when the burning of fossilized forms of carbon has at once energized the world into stupendous dance of acceleration while simultaneously entrapping it like the body of an addict, in coils from which it may never succeed in extricating itself. Today the fact that the world's relation with fossil fuels is indeed nothing other than a deadly and self-destructive addiction is widely acknowledged.
--------------------------------------------------------------------------
Thanks for sharing dear Sujata. This is totally unknown part of history.
ReplyDeleteThank you dear
Delete