ఏమిటంటే - ఫేమిలీ డ్రామా, డబ్బున్న మారాణుల సీరియళ్ళూ, సినిమా వాళ్ళ రకరకాల ప్రోగ్రాంలూ, వాళ్ళలో వాళ్ళనే భళా అని చరుచుకునే ఇంటర్వ్యూ లూ కాకండా - రియాల్టీ - అచ్చమైన రియాల్టీ షోలు గురించి చిన్న లెక్చర్ ! వీటిల్లో న్యూస్ చానెళ్ళను చేర్చలేదు. ఎందుకంటే, అందులో, వీలైతే కొంచెం న్యూస్, మిగతా టైం పాస్(చర్చలు, ఇంటర్వ్యూలు వగైరా), భజన, కవరింగ్, సిన్మా, గాసిప్, నేరాలూ, దర్యాప్తు ల్లో తరీఖాలూ - కొంచెం - మాల్ మసాళాల్తో కుక్కేసి, జనాల్కి ఆలోచించడానికి టైం లేకండా చేస్తారు కాబట్టి.
అందరికీ తెలిసిన విషయాలే గానీ - ఇంకోసారి రియాల్టీ షో ల లో రకాల్ని చూద్దాం.
సెలెబ్రిటీ షోలు - మన దేశంలో సాధారణంగా ఇవి నచ్ బలియే లాంటి డాన్స్ షో లు, Big Boss లాంటివి.
ఆటపట్టించే షోలు - ఎం.టీ.వీ. బకరా లాంటివి
గేం షోలు - కౌన్ బనేగా కరోర్ పతీ లాంటివి
టేలెంట్ హంట్ లు - సరేగమపా, ఇండియన్ ఐడల్, The Great Indian Laughter Challenge లాంటివి.
మేక్ ఓవర్ లు - నయా రూప్ నయీ జిందగీ లాంటివి
డేటింగ్ షోలు - రాఖీ కా స్వయంవర్ లాంటివి
భీభత్స సాహస షో లు - Who dares wins లాంటివి
న్యాయం షోలు - కిరణ్ బేడీ 'ఆప్ కీ కచేరీ' లాంటివి
ఇలా జన సామాన్యాన్ని ఒక ఊపు ఊపేసే ఈ షోలు చాలా మటుకు విదేశాల్నుంచీ ఎత్తుకొచ్చిన ఐడియాల్తోనే తయారయ్యాయి. వీటిల్లో మన దేశ వాతావరణాన్ని బట్టి, ఉద్దేశ్య పూర్వకంగా కొన్ని కార్యక్రమాల్ని కాపీ కొట్టలేక పోయారు. Eg. 'ఎప్రంటీస్' లాంటి ఉద్యోగ వేట షోనో, వంటా వార్పుల వీరుల 'హెల్స్ కిచెన్' లాంటి ప్రోగ్రాములూ, 'ఎక్ట్రీం మేక్ ఓవర్ - హోం ఎడిషన్' లాంటి డబ్బుల్తో కూడుకున్న షోలూ ఇంకా మనకి చేరలేకపోయాయి. ఇపుడు సచ్ కా సామ్నా ! సెన్సేషనల్ హిట్ట్ ! దీన్ని గురించి పెద్దల సభ లో కూడా చర్చలూ, గొడవలూ జరుగుతున్నయి. మరి ఏ పబ్లిసిటీ అయినా మంచి పబ్లిసిటీ నే అని, ఈ కార్యక్రమానికి టీ.ఆర్.పీ.రేట్లు, తద్వారా ఆదాయం పెరగడం జరుగుతుంది. ఇదెన్నాళ్ళు ?
ఒక విధంగా చూస్తే, మన దేశంలో ఎక్కువ అమ్ముడయేవి డాన్సూ, పాటల షోలు. మిగతా కార్యక్రమాల సంగతి కొస్తే, డబ్బు గెలుచుకోదగ్గ క్విజ్ ప్రోగ్రాములు తర్వతి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఈ షో ల వల్ల లాభపడేది ఎవరు ? చివరాఖర్న టీ.వీ మరియూ కార్యక్రమ నిర్మాతలే ! అయితే రియాల్టీ షో లో, మామూలు షో ల కన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయి. జనాల్లో ఉన్న కాంపిటీటివ్ స్పిరిట్ ని అది కాస్తో కూస్తో బయటకు తెస్తుంది. భూమి చిన్నది అనే ఫీలింగ్ నీ కలిగిస్తుంది.
ఇవన్నీ చూస్తే, రియాల్టీ షో ల ముసుగు లో టెలివిజన్, ఇంకొన్ని మంచి పనులు చెయ్యొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. వివిధ రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగాల నుంచీ స్పాన్సర్ షిప్ స్వీకరించి, ఏ పల్లెలోనో ఒక మంచి స్కూలు భవనం నిర్మించవచ్చు. దీని వెనక స్కూలు పిల్లల, తల్లితండృల ఎమోషన్సూ, పల్లెలో జీవితం గురించి ఇబ్బందుల గురించీ, సంఘ సేవ గురించీ కవర్ చేస్తూ, ఆయా సంస్థలకు ప్రచారం చేసి పెట్టొచ్చు. దీన్లో సిమెంటూ, ఇటుకా, కలపా, ఇంజనీరింగూ, డిజైనూ, ఇంటీరియరూ, రంగులూ - ఇలా అన్నీ, దేశంలొనే ద బెస్ట్ ఉత్పత్తులతో తయారుచేసాం అని చెప్తూ ఆయా ఉత్పత్తుల, సేవల గురించి ప్రచారం చేయొచ్చు. పైగా, నగరాల్లో కోట్ల లో వ్యాపారం చేసే రియల్ ఎస్టేటు వ్యాపార్లు పల్లెలో ఒక స్కూలు కో, ఆస్పత్రికో సరిపడేంత స్థలాన్ని విరాళం ఇస్తే, పుణ్యమూ, ప్రచారం అనే పురుషార్ధమూ దక్కించుకున్నవాళ్ళు అవుతారు.
దీనికొక సినిమా హీరో చేత అపీలు చేయించొచ్చు ! ఏ మినరల్ వాటర్ కంపెనీ నో, ఫ్లోరైడ్ నీళ్ళు దొరికే ప్రాంతం లో రక్షిత మంచి నీటి పధకం, ఆయా దాతల, విరాళాల, స్పాన్సర్ షిప్ ల సాయంతో ఏర్పాటు చేసి చూపించొచ్చు. ఏడుపుగొట్టు జీవితాలని, మనం విసుక్కునే కొన్ని అభాగ్య జీవితాల్లో చిన్ని మంచి మార్పులు తేవొచ్చు. అయితె, ఇలాంటి దేశీ రియాల్టీ షోలను ఎవరు చూస్తారు ?
మనమే చూడాలి ! ఈ షోలను అందంగా శేఖర్ కమ్ముల - ఒక 'లాంచీ ట్రిప్పు'నీ, 'విశాఖ' నీ అమ్మినట్టు అందంగా పేక్ చేసి అమ్మాలి. రియాల్టీ షో వెనుక స్పాన్సర్ షిప్ అనే బోల్డంత తతంగం ఉంటుంది కదా. దాన్ని సంపాయించడమే కాదు, నిలబెట్టుకోవాలి. అయితే, ఇలాంటి అత్భుతమైన ఐడియాలు నా బోంట్లకు (చాలా తెలివైన వారికి) వస్తూంటాయి గానీ, అమ్ముడవవు.
ఇవన్నీ మన దేశంలో ఎందుకు జరగవు అంటే, టీవీ చూడటం అనే ఆర్టు మనవాళ్ళకు వంట బట్టలేదు. మన అంత ఫ్రీ దేశం ఎక్కడన్నా ఉంటుందా ? విదేశాల్లో లాగా టీవీ కి లైసెన్సు అంటూ డబ్బులు కట్టం కనక & టీ.వీ కొనుక్కోవడం, కేబులు కనక్షనో, డిస్షో తగిలించుకోవడం, సాకెట్లో ప్లెగ్గు పెట్టడం, టీవీ చూడటం - అనే ఈజీ విధానంలో చూస్తామా, అందుకే మనకి టీ.వీ. విలువ తెలియదు. ఇంట్లో ఆడవాళ్ళయితే సీరియళ్ళూ, మగవాళ్ళయితే వార్తలూ, ఆటలూ, పిల్లలయితే కార్టూన్లూ, ముసలాళ్ళుంటే, భక్తీ, పాత సినిమాలూ.. తప్ప ఇంకేవయినా చూద్దామని ఎవరికన్నా తోస్తుందా ? వెరైటీ కోసం చూసే రియాల్టీ షో లు పిల్లలతో చూడదగ్గగా లేకపోయినా పర్లేదు. ఇదీ మన మనస్థత్వం.
అందుకే రియాల్టీ షోలకి మన దేశ రియాల్టీ కాస్త జోడించి - బాధ్యతాయుతం గా ఎవరన్నా తీసేరే అనుకోండి - ఎంతమంది జనం చూస్తారంటారు ? అందుకే, ఈ రియాల్టీ టెలివిజన్ విదేశీ ఆత్మ తో మన కళ్ళకి గంతలు కట్టేసి మరీ పనికిమాలిన కలలు చూపించేస్తుంది. ప్రచారం కావాలనుకున్నవాళ్ళకు ప్రచారం, అవకాశాల్లేనివాళ్ళకు ఉపాధీ కల్పించేస్తూ - ఉరుకులు పరుగుల్తో దూసుకెళ్ళిపోతూ ఉంది - మరిన్ని కాపీ ప్రోగ్రాముల దిశగా !
ఇతి వార్తాః
Interesting perspective. One can give it a try!\
ReplyDeleteమంచి ఆలోచన అండి.. మనస్పూర్తిగా అభినందిస్తున్నా.. అమలు చేస్తే అద్భుతంగా ఉంటుంది..
ReplyDeleteGood said
ReplyDeleteఆలోచింపచేసింది.Very good
ReplyDeleteమీరు చెప్పిన అవిడియాలు ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకో బాగానే నడుస్తాయి అని అనిపిస్తుందండీ...మన దేశంలో దేన్నైనా గెస్ చెయ్యొచ్చుగానీ సగటు టీ.వీ ప్రేక్షకుల నాడి తెలుసుకోవటం కొంచెం కష్టమే. అందువల్ల ప్రసారం చేయనిదే అది హిట్ లేక ఫట్ అని చెప్పటం కొంచెం కష్టమే. అన్నట్టు మీ అయిడియాలు రిజిష్టర్డ్ అని పెట్టుకోండి ఎవరూ కాపీ కొట్టకుండా..
ReplyDeleteమంచి ఆలోచన. టీవీ రంగంలో ఉన్న కొందరు మిత్రులతో దీన్ని పంచుకుంటాను. చూద్ధాం. ఏమైనా ఉపయోగం ఉంటుందేమో.
ReplyDeleteబాగా చెప్పారు.
ReplyDelete