1) ఏ వయసు కి ఆ ముచ్చటా - అంటూ ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణాలు తీసే వాళ్ళెందరో కనిపిస్తారు. పాతికేళ్ళు దాటిన ఆడపిల్లలు, ఎందుకు చెల్లట్లేదో అని తెగ కంగారు పడిపోయి, వాళ్ళ తల్లీ తండ్రుల బుర్ర తినేసి.. వేయించుకు తినే ప్రాణులు ఎక్కువ. అందరూ సోనియా గాంధీ లాగా ఆచీ తూచీ అడుగులు వేస్తే సమస్య ఏముంది ? పెళ్ళి కాని పిల్లల్ని అమ్మో ముప్ఫయి వచ్చేస్తోందనో - దాటిపోతుందనో - కంగారు పెట్టేసి, ఒత్తిడి చేసేస్తే, వాళ్ళూ, నిజమేనేమో - అని భయపడిపోయి, చాలా మటుకూ నష్టపోతున్నారు. ఇంతా డబ్బులిచ్చుకుని, (కట్న కానుకలు), డబ్బు వెదజల్లి - చేసుకున్న ఐశ్వర్యా రాయ్ లకు (అలా లేకపోయినా, ప్రొఫెషనల్ కోర్సు చేయకపోయినా, మంచి ఉద్యోగం లేకపోయినా .. పెళ్ళి కావడం కష్టం) తరవాత తగిలే షాక్ లు ఎలా ఉన్నాయంటే - గుండెలవిసిపోతున్నాయి.
తమిళ నటి మనోరమ - సాంప్రదాయ వాదులని ధిక్కరించి పెళ్ళికి ముందు 'ఆరోగ్య పరీక్ష లు చేయించుకోవాలని, అది చట్టం చేయాలని' పోరాడుతున్నారంట. ఎందుకు పోరాడకూడదు ? పెళ్ళయ్యాక, నపుంశకుడయిన భర్త, సమాజానికి ఏదో నిరూపించుకోవడానికే కట్న కానుకలూ, ఆర్భాటాల మధ్య పెళ్ళాడి, ఆనక 'నీకు విడాకులిస్తాను, ఇంకోర్ని పెళ్ళీ చేసుకో!' - అని సినిమాలో నాగేశ్వర రావు లాగా ఉత్తమమయిన డైలాగు కొడుతున్నాడు. లేదా, తమిళ నాడు లో అత్యధిక శాతం భర్తల లాగా, అమాయక భార్యలకు 'హెచ్. ఐ. వీ.' ని బహుమతి గా ఇస్తున్నారు. పెళ్ళి కాకపోతే, ఆడదాని జీవితం ఏమవునో అని తల్లి తండ్రులే, పెద్దగా అబ్బాయిల గురించి విచారించకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అదీ చింతించాల్సిన విషయం.
పూర్వం లాగా అటు అన్ని తరాలూ.. ఇటు ఇన్ని తరాలూ తెలిసి ఉన్న సంబంధాలు రావడం ఈ ఫాస్టు యుగం లో కష్టం కాబట్టి, ఇంజనీరు అల్లుడు ఇంటరు కూడా పాసవ్వలేదన్న విషయం పెళ్ళయ్యాక తెలుసుకుని నోరెళ్ళబెట్టడం లాంటి చిలిపి పనులకు తల్లి తండ్రులు ఒడికట్టడం మానాలి. అన్నీ బావుంటే, సాడిస్టిక్ లక్షణాలున్న పెళ్ళి కొడుకులు. మానసిక రోగులూ, అనుమానపు పక్షులూ - వీరి బారిన అమ్మాయిని పడేయటం ఎంతవరకూ సబబు ? ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు - మోసగాళ్ళ కు ఆడపిల్లల ను ఇచ్చి పెళ్ళి చేయడం - సగం, సమాజపు ఒత్తిడి కి లొంగిపోవడం మూలంగానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి సమాజంలో చూస్తున్నాం కాబట్టి - ఎపుడన్నా తెలిసిన సర్కిల్లో వయసు మీరిన కన్నె పిల్ల కనిపిస్తే - ఎపుడు పెళ్ళి అని ఏడిపించడమో, అయ్యో పెళ్ళి కాలేదా అని విచారించడమో చేయకూడనిపిస్తూ ఉంది. ఏమో బాబూ ! అది తప్పు ! రోజులు మారాయి.
(నేను ఏకపక్షంగా రాసినా, ఇంతటి బాధ అబ్బాయిలకి ఉండదా అని ఎవరికన్నా కోపం వచ్చినా - ఆ పరిస్థితి ని ఎదుర్కొనే మహిళ కి జరిగినంత అన్యాయం శాతం 'ఎక్కువ' అనిపించే రాశాను)
2) నయీ దిల్లీ రోజుల్లో, కిరన్ బేడీ - బంగ్లా పక్క నుంచీ తాల్ కటోరా ఉద్యానవనానికి (పొద్దున్న వాకింగు కి మాత్రమే !) వెళ్ళేటపుడు -అంత సింపుల్ ఇంట్లో ఉంటూందా ఆవిడా ? అని ఆశ్చర్య పోయేవాళ్ళం. బిర్లా మందిర్ కి సింపుల్ గా వచ్చేస్తూ ఉండేది ఆవిడ - పెద్ద స్కార్పియో లో ! చిన్నప్పట్నించీ ఆవిడ ఒక యూథ్ ఐకాన్! తొలి మహిళా ఐ.పీ.ఎస్. అధికారి. ఢిల్లీ ట్రాఫిక్ ని ఒక దారికి తెచ్చిన స్మార్ట్ పోలీస్. యునైటెడ్ నేషన్స్ లో భారత దేశం తరపున పని చేసిన వ్యక్తి. ఇపుడు - సెలెబ్రిటీ జడ్జ్ ! ఆప్ కీ కచేరీ లో ! అది సరే ! ఈవిడ - ఒక వాణిజ్య ప్రకటన లో కనిపిస్తున్నారు ఈ మధ్య ! అదీ స్త్రీ ల సౌందర్య సాధనం, మచ్చలు లేని ముఖ వర్చస్సు కోసం... నో మార్క్స్ క్రీం ను కిరణ్ బేడీ సిఫారసు చేస్తున్నారు.
ముచ్చట కలిగింది. ఆత్మ స్థైర్యానికీ, సాహసానికీ, తెలివితేటలకూ - ప్రతీక అయిన ఒక మాజీ పోలీస్ అధికారిణి - నో మార్క్స్ - రహో అంటూన్నారు. అయితే, మెచ్చుకోవాల్సిన విషయం - ఆ ప్రకటన రూపకర్తలు - ఈ ఐకాన్ ను ప్రకటనకు ఎంచుకోవడం. నేటి మహిళ ను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారంటే, మన స్టాండర్డ్ పెరిగిందనే అనుకోవాలి. పిచ్చి పిచ్చి గా - ఆత్మ విశ్వాసానికి - చర్మం రంగుకూ - లింకులు పెట్టే, మార్కెట్ రంగం, 'బే దాగ్' (మచ్చలు లేని) సౌందర్యం కోసం, మచ్చ లేని వ్యక్తిత్వాన్ని - ప్రతీకాత్మకంగా చూపించడం, సంతోషించదగ్గ పరిణామం.
3) పనిలో పని గా ఇంకో వాణిజ్య ప్రకటన ని కూడా ప్రస్తావిస్తాను. ఒక చిన్న పాప, కార్పెట్ మీద పడుకుని పుస్తకం చదువుతూ ఉంటుంది. ఆ పాప తండ్రి పక్కనే సోఫాలో పేపరు చదువుతూ ఉంటాడు. తల్లి లాప్ టాప్ లో ఏదో చేస్తూ ఉంటుంది. పాప అపుడే చదువుతున్న పుస్తకం మూసేసి, అందులో రాకెట్ బొమ్మని చూపించి - నాన్నా నేను పెద్దయ్యాక ' ఇది ' (వ్యోమగామి) అవుతానూ అంటుంది. ఇందులో నాకు చాలా నచ్చింది.. ఆ పాప ను ఎన్నుకోవడం. భారత సమాజం లో ఆడ పిల్లల ఏంబిషన్ కి ప్రాధాన్యం ఇస్తున్నారూ అంటూ ఏదో భరోసా ఇస్తున్నట్టు ఉంటుంది ఆ ప్రకటన.
ఆ పాప ముఖ్యంగా పుస్తకం చదువుతూ ఉండటం ముచ్చట గొలిపే అంశం. ఎందుకంటే, ఈ రోజుల్లో ఎంత మంది పిల్లలు - టీ.వీ కి అతుక్కోకుండా పుస్తకాలు చదువుతున్నారు ? అలాంటి వాతావరణం ఏదీ ఇళ్ళలో ? పైగా, ఆ అమ్మాయి లక్ష్యం, లక్ష్యం పట్ల ఆమె కున్న సందేహాలూ, తండ్రి ఇచ్చే భరోశా - ఇవన్నీ భవిష్యత్తు ని ఎంతో ఆశావహం గా చూసేలా చేస్తాయి.
You can watch the video here : http://www.youtube.com/watch?v=4y6uigiQ5EE
రెండో యాడ్ మీరన్నట్టే బావుంది కానీ కిరణ్ బేడీని లాంటి ఐకాన్‌ని సౌందర్య సాధనాల ప్రకటనలకి మోడల్‌గా 'దించడం' నాకు నచ్చలేదు.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఅవును. పెళ్ళికి ముందు అబ్బాయిలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి - అమ్మాయిలు కన్యాత్వ పరీక్షలు చేయించుకోవాలి.
ReplyDeleteఅమ్మాయిల పెళ్ళిళ్ళ విషయం లో మీరు చెప్పిన పాయింట్లు ఒప్పుకుంటా.. కనీ అబ్బాయికి అవలక్షణాలు లేవని తెలుసుకోడం ఎలా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న..
ReplyDeleteసిల్లీ కబుర్లేంటి, సీరియస్ కబుర్లే!
ReplyDeleteసుజాత ముందు గా అభినందనలు ఇంత వివాదాస్పదమైన (అయ్యే చాన్సెస్ వున్న) టాపిక్ తీసుకున్నందుకు, ఇదుగో నా ఐదు పైసల వాటా దీని మీద.
ReplyDelete1":ఏ వయసు కి ఆ ముచ్చటా - అంటూ ముఖ్యంగా ఆడపిల్లల ప్రాణాలు తీసే వాళ్ళెందరో కనిపిస్తారు. " అవును అంటారు వయసు పెరిగే కొద్ది ఆడపిల్లలకు ఆలోచన, వ్యక్తిత్వం, సొంత అభిప్రాయాలు పెరుగుతాయి కదా మరి.
2."తమిళ నటి మనోరమ - సాంప్రదాయ వాదులని ధిక్కరించి పెళ్ళికి ముందు 'ఆరోగ్య పరీక్ష లు చేయించుకోవాలని, అది చట్టం చేయాలని' పోరాడుతున్నారంట. ఎందుకు పోరాడకూడదు ?" అవును ఎందుకు పోరాడకూడదు, ఇద్దరికి టెస్ట్ లు చెయ్యాలి, శరత్ గారన్నట్లు కన్యాత్వాన్ని కాదు (అసలు అలాంటివి వుంటాయా... మీరు తెలుగు సినిమాలు చూడటం తగ్గించండి శరత్) బ్లడ్ వర్క్ అలాంటివి తప్పకుండా చేయించుకోవాలి.
ఇంక అబ్బాయి గుణ గణాలు తెలుసు కోవటం అనేది నిజం గా ఒక చాలెంజ్ అమ్మాయి తల్లి తండ్రులకు, ఏ తలకు మాసిన వెధవ పెట్టేడో వేయి అభద్దాలాడి ఐనా ఓక పెళ్ళి చెయ్యమని వాడిని, దానిని యధా శక్తి వాడి, ఇంకా కొంచం పొడిగించి... వెయ్యి అభద్దాలాడైనా ఒక కాపురాన్ని నిలబెట్టాలి వంటి సామెత లు వాడే వాళ్ళను... కొరత వెయ్యాలన్నత చిరాకు అనిపిస్తుంటుంది. ఈ మధ్య న ఇంకో ఆర్గ్యుమెంట్ విన్నా " లోటు పాట్లు లేని మనుష్యులెవ్వరు వుంటారు అండి, ఏదో గుట్టు చప్పుడు కాకుండా సర్దుకోవాలి కాని, ఈ మధ్య కాలం ఆడపిల్లలకు ప్రతి దానికి రోడ్డు న పడటం అలవాటు అయ్యింది" అని.really, కొంచమో కుంచమో నువ్వెవరు నిర్ణయించటానికి ఇలా దారిన పోయే దానయ్యలతోనే కదా గొడవ... ఎంత దగ్గర నుంచి చూసే వాళ్ళకు కూడా మనిషి లో వుండే సాడిస్టిక్ కోణం తెలియటం కష్టం, కొందరు పెళ్ళాన్నే అలా చేస్తుంటారు బయట ధర్మ రాజల్లే పోజ్ లు పెట్టే వాళ్ళు కూడా వుంటారు,
ఈ మధ్యన ఆడ పిల్లలను ఎక్కువ గానే చూస్తున్నాము ప్రకటనలలో ఆత్మ విశ్వాసానికి ధైర్యానికి ప్రతీక గా మంచి మార్పు కేవలం సౌందర్యాన్ని వొలకబోసే పాత్రలు కాకుండా..
పైన నేను ప్రకటించిన విషయాలన్ని నా జీవిత కాలం లో నా అనుభవాలనుంచో లేదా నేను దగ్గర నుండి చూసి కౌన్సిలింగ్ చేసిన వ్యక్తుల వే...
దిని బదులు అసలు ఏవరు పేళ్ళె చేసుకోకపోతే ఏ బాధ లేదు.
ReplyDelete1-2-3 వేటికవే సుజాత. మంచి అంశాలు. సిల్లీవి కాదివి శిలాక్షరాలు. ఆ మూడోది నాకు చాలా ఇష్టం. ఆ పిల్లదాన్ని బుగ్గలు పుణికి ముద్దుపెట్టుకోవాలన్నంత ముచ్చట నాకు.
ReplyDelete@శరత్:ఎయిడ్స్ గురించి చర్చిస్తుంటే కన్యాత్వం పరీక్షలేమిటి బుల్షిట్!
ReplyDelete@ భావన, కత్తి
ReplyDeleteహి హీ. నేనేదో సీరియస్సు సర్కాస్టిక్కుగా వ్రాస్తే మీరు కూడా అది నిజమనుకుంటే ఎలా! నాలాంటి వాడు అసలు కన్యాత్వ పరీక్షలకి మద్దతు తెలుపుతాడా!
ఏమోనండి, ఇలా మగవాళ్ళ(కే) శారీరక ఆరోగ్యపరీక్షలూ, మానసిక ఆరోగ్య పరీక్షలూ, జెనెటిక్ పరీక్షలూ, క్రెడిట్ పరీక్షలూ, బ్యాక్ గ్రవుండ్ పరీక్షలూ, డ్రగ్ టెస్టులూ, క్రిమినల్ చెక్సూ చేస్తూపోతే ఇక పెళ్ళికి ఎవరు మిగులుతారబ్బా! మగవారికి మాత్రమే పరీక్షలంటే నా మగజాత్యహంకారానికి నచ్చక పోటీగా ఆడవారికి కన్యాత్వ పరీక్షలనేశా.
పవన్ అన్నట్లుగా ఈ లంపటాలు అన్నీ పెట్టుకునేబదులుగా పెళ్ళి అనే లంపటమే పెట్టుకోకుండా సహజీవనం సాగిస్తే పోలా. ఎప్పుడు ఏ లోపం ఎవరిలో తెలిసివచ్చినా ఎంచక్కా, హాయిగా విడిపోవచ్చు కాదూ.
మనోరమ ప్రస్థావించిన ఆరోగ్య పరీక్షలు కేవలం ఎయిడ్స్ టెస్టులు గురించి/మాత్రమే కాదని నా అవగాహన. ఈ టపాలో చూసినా అదే తెలుస్తోంది. ఎయిడ్స్ టెస్టులు చేయించే విషయంలో ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. ఒక పెళ్ళి కొడుకు నపుంసకుడా కాదా అన్న పరీక్ష కావాలంటే అలాగే పెళ్ళి కూతురిలో కూడా అదే రకమయిన పరీక్షలు డిమాండ్ చేయడం సహేతుకమే అవుతుంది. ఉదాహరణకు లైంగిక పరంగా జడత్వం వుందా అన్నది. అమ్మాయి చూడటానికి ఎంత అందమయినది అయినా అలాంటి జడత్వం వుంటే ఇక సంసారం ఏం చేస్తుందీ?
@sarath WEll said
ReplyDeleteమనోరమ ప్రస్థావించిన ఆరోగ్య పరీక్షలు కేవలం ఎయిడ్స్ టెస్టులు గురించి/మాత్రమే కాదని నా అవగాహన. ఈ టపాలో చూసినా అదే తెలుస్తోంది. ఎయిడ్స్ టెస్టులు చేయించే విషయంలో ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. ఒక పెళ్ళి కొడుకు నపుంసకుడా కాదా అన్న పరీక్ష కావాలంటే అలాగే పెళ్ళి కూతురిలో కూడా అదే రకమయిన పరీక్షలు డిమాండ్ చేయడం సహేతుకమే అవుతుంది.
haaa......nijamgaanae silly post.......on serious issues......
silly
ఈ టపాని ఒక్కొక్కరూ ఒక్కో లా స్వీకరించారు. ఏమయినా, తన దాకా వస్తే గానీ నొప్పి తెలియదు.
ReplyDeleteఅమ్మాయిలని - 'ఈ అమ్మాయే కావాలి !' అని పట్టు పట్టి పెళ్ళి చేసుకుని కూడా - పెళ్ళయాకా సాధించే భర్తలు ఉంటూన్నారు. ఈగో, అభద్రతా భావాలూ - ఇలా కారణాలు ఏమయినా కావచ్చు - పెళ్ళి అనేది సుడిగుండంలా మారుతూ వస్తూంది. ప్రేమ అంటే ఏదో హక్కు భుక్తం లాగా - తాను ప్రేమించేస్తే, అమ్మాయి తనని పెళ్ళాడేయాలి. పెళ్ళాడేసాకా, తను చెప్పినట్టు వినాలి... అనుకునే మనస్తత్వం ఎక్కువయింది. వాటిల్లో ఏమాత్రం తేడా వచ్చినా భరించలేక పోవడం, నేరాలకు పాల్పడటం కూడా ఎక్కువ అయింది. స్త్రీ లకు ఒక స్వతంత్ర వ్యక్తిత్వం, అభిప్రాయాలూ, భావాలూ ఉంటాయన్న విషయాన్ని స్వీకరించలేకపోవడం, ఫలానా చీర రంగూ, గాజుల సెలెక్షనూ కన్నా ఎక్కువ గా ఒక స్త్రీ ఆలోచించగలదనే చిన్న వివేచనా లోపం - ఈ అర్ధం చేసుకోలేకపోవడానికి కారణం.
ఎవరికైనా, శారీరక,మానసిక, లైంగిక లోపాలు ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. అవి, జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నపుడు వాటిని దాచి పెళ్ళాడటం, నేరమే !
చాలా మంది మగ వాళ్ళకు ఈ విషయాల్లో సున్నితత్వం అర్ధం కాదు. వాళ్ళు 'కన్యాత్వానికి ' ఇచ్చిన ప్రాధాన్యత 'నైతికత' కు ఈయకపోవడం ఎక్కువ. ఇది భారతీయ మగ (Indian Male) మనస్తత్వం !
లోపాలనూ, రోగాలనూ దాచిపెట్టి పెళ్ళి చేసుకుని, కొంత కాలం వైవాహిక జీవితం గడిపి, ఆ అమ్మాయిల చావుకో, నైరాశ్యాలకో కారణం కావడం ఎంత వరకూ సబబు ? ఒక సారి పెళ్ళయి, విడాకులు తీసుకున్న స్త్రీ ని ఎవరు మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు ? ఆ అమ్మాయి ఇంక జీవితాంతం ఒంటరిగా, సమాజం లో తన వంతు చాలెంజులని ఎదుర్కొంటూ గడపాలి. ఇల ఒక అమ్మాయిని కార్నర్ చేసి, ఆ అనవసరమైన ఆర్డియల్ ని, కష్టాన్నీ ఎందుకు ఇస్తారు ? ఈ విషయాన్ని వేళాకోళం గా లేదా మగవాళ్ళ కి జరుగుతూన్న అవమానంగా భావించే వాళ్ళు, అర్ధం చేసుకోలేరు. ఇందులో అమానుషత్వం వాళ్ళకి కనిపించదు.
పూర్వకాలం లాగా ఇదేదో మీ అక్కా చెల్లికీ, కూతురికీ అయితే గానీ అర్ధం కాదండీ అని చెప్పే ఉద్దేశ్యాలు మాకు లేవు. మన మన వ్యక్తిగత అనుభవాలను బట్టీ మన అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొందరు కొందరిని విపరీతంగా ద్వేషిస్తారు. స్త్రీ ల మీద తమ సుపీరియారిటీ ని నిరూపించుకోవడానికి పెళ్ళి ని ఆయుధంగా వాడుకుంటారు ఇంకొందరు. ఇలాంటి విపరీత ధోరణులు ఎక్కువయ్యే కొద్దీ - ధైర్యం, సత్తా కలిగిన స్త్రీ లు ఎదుర్కొని, బ్రతుకీడ్చగలిగే వాళ్ళు బ్రతుకుతారు. లేని వాళ్ళు - ఒకే సారి ఆత్మ హత్య చేసుకునైనా లేదా సంవత్సరాలు గా హింస పడైనా మౌనంగా, అంగుళం అంగుళం గా చస్తూ బ్రతికైనా చస్తారు. అనవసరంగా ఇంకో బ్రతుకుని పెళ్ళి పేరుతో కాంప్లికేట్ చేసే అధికారం ఎవరూ ఎవరికీ ఇవ్వలేదు.
శరత్ గారు & గొగినేని గారు,
So, పెళ్ళి పేరుతో కొందరు చేస్తున్న అకృత్యాలకి అడ్డు కట్ట వేయడానికి ఏ చిన్న ప్రయత్నం అయినా మంచిదే. దీన్ని అవమానంగా భావించే వాళ్ళు, తమ శీలాన్ని కూడా పరీక్షలకు పెడతారా ? 'చా ! అసలలాంటిదే లేదు !' అని వాదిస్తారా ? శీలానికి, ప్రాణానికీ సంబంధం లేదు కాబట్టి ఒక్క ఆరోగ్య పరిక్షకే ఒప్పుకుంటారా ? పోనీ శీలం, నైతికతలను పక్కన పెట్టి, సహ జీవనంలో (Eg : Marriage) ఒక మనిషి ఇంకో మనిషి తో ఎలా ప్రవర్తించాలో, ఒకరి అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్నీ ఎలా గుర్తించాలో నేర్చుకుంటారా ?
ఈ ప్రశ్నలు మిమ్మల్ని సూటిగా అడిగినవి కావు. వీటికి సమాధానం ఇవ్వాలని కష్టపడొద్దు. ఇదంతా సాధారణ చర్చే. సామజిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలను చర్చించేంతటి విజ్ఞానం నాకింకా అబ్బలేదు.
భావన గారూ..
ReplyDeleteచాలా బాగా చెప్పారు. మెనీ థాంక్స్. నేను ఈ టపా రాసాకా, కొందరి మనో భావాలు (బ్లాగర్లవి కావు) దెబ్బ తింటాయని, వాళ్ళని బాధ పెట్టకూడదనీ, దీన్ని డిలీట్ చేద్దాం అనుకున్నా. కానీ మీ వ్యాఖ్య లో ఆవేశాన్ని చూసి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన స్త్రీ ల కు కౌన్సిలింగ్, స్నేహితులూ, సమాజమూ ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ ల గురించి కనీసపు ఆలోచన కలిగించగలిగినా, నా టపా పనికొచ్చినట్టే.
@Srinivas :
ReplyDeleteహా హా ! మరేం పర్వాలేదు. 'కిరణ్ బేడీ తక్కువ కాలేదు. ప్రకటనే ఎదిగింద' ని నాకు అనిపించింది. Anyway. This is just an Ad.
This comment has been removed by the author.
ReplyDelete@ Murali,
ReplyDeleteఅవును కష్టమే ! కానీ అబ్బాయి తరఫు వాళ్ళు పెళ్ళికి తొందర పడుతూన్నా, అమ్మాయి తరఫు వాళ్ళకి ఆలోచించుకోవడానికి వ్యవధి ఇవ్వకున్నా - అమ్మాయి పట్ల అతి ప్రేమా, అతి చనువూ - ప్రదర్శిస్తున్నా, అనుమానించొచ్చు. చాలా సందర్భాల్లో బాధితులు ఈ నాటకాలకి పడిపోతారు. అబ్బాయి - 'మీ అమ్మాయే కావాలంటున్నాడని ' పదే పదే చెప్పడం కూడా మంచిది కాదు. అమ్మయిలేమో చాలా బాగా చూసుకుంటాడేమో అని పెళ్ళికి సరే అంటారు. ఆ తరవాత - అంతా మిధ్య అని తెలుస్తుంది.
కాబట్టి - మోసాలు పెరుగుతున్న ఈ ఏజ్ లో అమ్మయిలయినా, అబ్బాయిలయినా పెళ్ళికి తల పైకీ కిందికీ ఆడించే ముందు - కొంచెం ఆలోచించుకోవాలి.
@కొత్త పాళీ గారు - థాంక్స్.
ReplyDelete@ పవన్ - హమ్మా - అలా అని పెళ్ళి ఎగ్గొట్టి ఆనందం గా ఉండిపోదామనే ?!
@ఉష గారు, మహేష్ గారు - థాంక్స్.
hahahaha......
ReplyDelete...బాగుంది........సమాధానం ఇచ్హినా ,మీరు మీదె correct అనుకునే స్థితిలో వున్నారు...కాబట్టి నేను explanation ఇవ్వదలచుకోలేదు.
నేను silly అని ఎందుకన్నాను అంటే,మీరు ఏదొ మగవాళ్ళ గురించి చదివేసినట్లు మాట్లాడారు.thats y i told silly analysi on serious issues.
as u said "మన మన వ్యక్తిగత అనుభవాలను బట్టీ మన అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. "
అలనే అందరికి కొన్ని అనుభవాలు నేర్పినవి వుంటాయి.మీ అభిప్రాయమే correct అని అనుకోకండి.
ముందు మగ, ఆడ అని differentiate చేసి analyze చెయడం మానండి.
సామజిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలను చర్చించేంతటి విజ్ఞానం నాకింకా అబ్బలేదు.
మీకు ఈ serious issues analyze చెసెంత విజ్ఞానం లేదనే నేను చెప్పేది.
లేటుగా కామెంటు పెడుతున్నందుకు..
ReplyDeleteసరే!! నా ఐదుపైసలు-
పరీక్షలు అవసరమా లేదా. అబ్బాయిలకే అవసరమా, అమ్మాయికెందుకు అవసరంలేదు..లాంటివటికన్నా -
పెళ్ళికి ముందు అసలు పిల్లాడుకానీ పిల్లకాని పెళ్ళికి రెడీయా? అనే విషయాన్ని తెలుసుకోవాలి.
పెళ్ళికి రెడీయా అని కొన్ని రూల్స్ ని రూపొందించుకోవాలి. పిల్లనికానీ పిల్లాణ్ణికానీ ఆ రూల్స్ ఇంజన్ మీద రన్ చేయించాలి.
పెళ్ళికి పరీక్షలు అవసరమున్నా లేకున్నా - పెళ్ళి/అంటేఏంటి/ఎందుకు/ఎలా/సామాజిక బాధ్యత/కుటుంబాలకలయిక/ఎ/బి/సి/డి లాంటివిషయాలపై తప్పక *కౌన్సిలింగ్* ఇవ్వాలి ఇప్పించాలి.
భాస్కర రామ రాజు గారు -
ReplyDelete100% ఏకీభవిస్తున్నాను. థాంక్స్. లేటు గానన్నా లేటెస్టు గా ఫస్టు క్లాసు అభిప్రాయం చెప్పినందుకు.
గోగినేని గారు
ReplyDeleteమీరు కూడా కరెక్టే ! నేను నాణానికి ఒక వైపే ఆలోచించాను. కానీ - ఆ విషయాన్ని ఒప్పుకున్నాను కూడా.
ఇంకోటి - నేను ఈ విషయాన్ని ఎనలైజ్ చేయలేదు. అంత సీను లేదు గానీ, ఇలాంటివి ఒక వేళ మనకే జరిగితే ఆ సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలో అని మనం ఆలోచించుకోగలిగితే చాలు. జరిగిపోయిన దాన్ని మార్చలేం కాబట్టి, మనం జరగబోయేదైనా చేజారిపోకుండా చూసుకోవాలన్నదే నా అభిప్రాయం.
గోగినేని గారు - ఇంకా చాలా ఆలోచించాకా - నాకే అనిపిస్తూంది. అమ్మాయిలయినా, అబ్బాయిలయినా, ఎవరూ వల్నరబుల్ కాదు. కష్టాలు లాంటివి ఎదురయినపుడు, ఆ క్షణానికి ఏదో అన్యాయం జరిగిపోయిందనీ.. ఇంకేది దిక్కు అని మనకి అనిపించినా, మన శక్తి సామర్ధ్యాలని బేరీజు వేసుకున్న తరువాత ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది. అంతవరకూ కాస్త 'మాట సాయం' / 'ఎవరన్నా అర్ధం చేసుకోవడం' - లాంటివి కావాలనిపిస్తుంది. మీ రెండో కామెంటు చూసాక, నా తప్పు అర్ధం అయింది. Im sorry.
ReplyDeleteఅందుకే పెళ్ళికి ముందు అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య డేటింగ్ అన్నది అవసరం. అందులో అన్ని విషయాలూ ఎంచక్కా పరీక్షించుకోవచ్చు! ఇద్దరి మధ్య అన్నీ నచ్చితే పెళ్ళి - నచ్చకపోతే స్నేహం - సింపుల్.
ReplyDelete@ భాస్కర్
పెళ్ళి చేసుకోవాలనుకునేవారికి ముందుగా పెళ్ళి గురించిన కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బెదరగొట్టేద్దామనే :)
గోగినేని గారు,
ReplyDeleteఈ ప్రపంచం లో పూర్తి గా చెడ్డవాళ్ళు వుండరు అలానే మంచి వాళ్ళు కూడా.. మనం మాట్లాడే విషయాన్ని బట్టి ఆడ,మగ తేడా చూపించాలా వద్దా అనేది ఆధారితమవుతుంది. ఆడ పిల్లల పెళ్ళి విషయం లో తల్లి తండ్రులు పడే తొందర వద్దు సమానత్వమే ముద్దు ఆలోచించి అడుగు వెయ్యండి అనే సుజాత చెపుతున్నారు అంతే కాని అది తేడా (differentiate as you said) చూపించటం కాదేమో అని నా అభిప్రాయం.
రెండవ విషయం: మీరు మిగతా అన్ని విషయాలు వదిలేసి (సుజాత గారు మూడు పాయింట్స్ కు సమాన ప్రాతిపదిక మీదే రాసేరు) మీరు కేవలం మగవాడి నపుంసకత అనే పాయంట్ మీదే చర్చిస్తున్నారు బహుశా అది మీ (మీ అంటే మీ ఒక్కరిది కాదు సామాన్య పరిభాష లో) మనోభావాలను దెబ్బ తీయటం మూలం గా నేమో మరి. ముందుగా ఒక మనవి. మొగవాడి నపుంసకత్వం ఆడవాళ్ళ కన్యాత్వం ఒకే గాటి లోనికి రావు మొగవాడి నపుంసకత్వం ఆడవాళ్ళ జడత్వం ఒక గాటి లోకి వస్తాయి ఆడవాళ్ళ జడత్వం పరిక్షించటానికి డాక్టర్స్ దగ్గరకు వెళ్ళనక్క రలేదు అది సమాజంలో ఆ స్త్రీ కు ఎదురయ్యే అనుభవాలను బట్టి, కుటుంబ పరిస్తితులను బట్టి స్త్రీ మనస్సులో డెవలప్ అయ్యే ఒక భావం, మొగవాడికి అంతే అని మీరు వాదించవచ్చు, కావొచ్చ్చు, కాని దానిని డాక్టర్స్ చెప్పగలరు కదా (అది భగవంతుడి సృష్టి మనమేమి చెయ్యలేము) కాని స్త్రీ కన్యాత్వం అనేది కేవలం నైతికం గా స్త్రీ ను దెబ్బ తీయటానికి వాడే భావజాల సముదాయం లో ఒక వీచిక.
నిజమే ఇది సిల్లీ నే మనం ఇంత పెద్ద విషయాన్ని చర్చించటం కాని ఇది అత్యవసరం (yes it is silly to analyze such a serious topic, but you know what its compulsory and its mandatory, we all know that no one changes others opinions by arguments but still exchanging the ideas and arguing comes in that process of course is also part of learning process there is no barricade or way of justifying right and wrong here and there) ఆలోచించండి గోగినేని... ఆడ,మగ తేడాలు పక్కకు నెట్టేసి జరుగుతున్న వివక్షత, జరుగుతున్న దౌర్జన్యం, బలి కాబోతున్న అనేక జీవితాలు... ఆలోచించండి ఏది తేలికగా తీసెయ్య వద్దు... అదృష్టవశాత్తు మనకు లభించిన ఈ ఆరోగ్యమైన శరీరం, మనస్సు ను పెట్టి ఆలోచించండి లింగ బేధాలను పక్క న పెట్టి.
భాస్కర్ గారు, మంచి పాయంట్ చెప్పేరు...
ReplyDeleteశరత్ మీకు అన్నీ బాగా కామెడి అండి... ;_) మీరు చెప్పినది కూడా నిజమే కాని మరి అప్పుడు ఇక్కడి సొసైటీ లో పెళ్ళిళ్ళు ఇంత గా విఫలమవ్వటానికి కారణం.... (అబ్బో ఇది ఒక పెద్ద పోస్ట్ లా రాయొచ్చు అంటారా..)
ReplyDeleteగోగినేని గారు నేను చెప్పినదానిలో ఏదైన అభ్యంతరకరమైనవి వుంటే మన్నించమని అడగను కాని ఆలోచించండి అని మాత్రం చెప్పగలను. నిజమే ఎవరి అనుభవాలను బట్టి అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాము అది ఎవ్వరు కాదనలేని సత్యం, కాని అనుభవాల నుంచే కాక సమాజం నుంచి, వుత్తమ సాహిత్యం నుంచి (మళ్ళీ ఏది వుత్తమం అని వాదించుకోవచ్చు కావాలంటే :-)) అలానే చుట్టూపక్కల వ్యక్తుల అనుభవాల నుంచి కూడ మన అభిప్రాయాలు చాలా సార్లు ఏర్పడుతుంటాయి. అలాగే అభిప్రాయమంటేనే సాపేక్షం....
సుజాత గారు మీ పోస్ట్ ను హైజాక్ చేసేను అని ఫీల్ ఐతే సారి, రంగం నుంచి నిష్క్రమించుచున్నాను.
@ భావన
ReplyDeleteసిల్లీ కబుర్ల విషయంలోనన్నా కాస్త సిల్లీగా లేకపోతే ఎలాగండి :))
సిల్లీసిల్లీగా శరత్ భాయ్ -
ReplyDeleteబెదరకొట్టేయటమే బెస్టు డేటింగు కన్నా. కారణం చెప్పాలంటావా?
మనోళ్ళకి ఆంగ్లం సరిగ్గా రాదు. డేటింగ్ అంటే తప్పుగా ఇంటర్ప్రట్ చేసేస్కుని ఆ విధంగా ముందుకి వెళ్తారు (నారా చంద్రబాబు స్టైల్లో).
దానికన్నా, పిల్లలకి పెళ్ళి చేసవతల్నూకాలి అనే తల్లితండ్రుల ధోరణి గూర్చికూడా మీలాంటిపెద్దలు ఓ టపా వెయ్యాలిమరి. వాళ్ళకీ కౌన్సిలింగ్ అవసరం అని నా ఘట్టి ప్రఘాడ నమ్మకం.
పెళ్ళి కేవలం రెండుశరీరాలు పెనవేస్కునే వేదిక అనే మూసధోరణిలోంచి బయటపడాలి.
This comment has been removed by the author.
ReplyDeleteఏ "తలకు మాసిన వెధవ" పెట్టేడో వేయి అభద్దాలాడి ఐనా ఓక పెళ్ళి చెయ్యమని వాడిని"
ReplyDelete"ఈ మధ్య కాలం ఆడపిల్లలకు ప్రతి దానికి రోడ్డు న పడటం అలవాటు అయ్యింది" అని.really, కొంచమో కుంచమో నువ్వెవరు నిర్ణయించటానికి ఇలా దారిన పోయే "దానయ్య" లతోనే కదా గొడవ"
Just a curious question - How sure are you that the Women folk never use the above quotes? Would you like to replace Vedhava with "Vedhavadi" or Danaiah with "Daanamma"?
@sujatha
ReplyDeleteno need of sorry and all
మీకు ఈ serious issues analyze చెసెంత విజ్ఞానం లేదనే నేను చెప్పేది.
పైన నేను మన అందరికి అని రాద్దామనుకొని కూడా మీకు అని రాసాను .ఎమీ అనుకోవద్దు.
@bhavana
hahhahahaah
cool ............discuss చేయాలి కాదనను.కాని మీరు పైన ఇచ్హిన జవాబులు చూడండి నాకు అయితే discussion అనిపించలేదు.మగవాల్ల మీద కొపం కనిపించింది.
మంచి సాహిత్యం (might be chalam in ur point of view)అన్నారు,అవి కూడా కొందరి అభిప్రాయాలు మాత్రమే.
నేను నా అభిప్రాయం కన్నా morelsకే value ఇస్తాను.
మలక్ పేట్ రౌడీ గారు..
ReplyDeleteభలే ! పాపం కదా.. చిన్నపట్నించీ మగవాళ్ళనే టార్గెట్ గా చేసుకుని తిట్టుకోవడం మనకు అలవాటయిపోయింది.
పరీక్ష కెళ్ళొచ్చి, 'చెండాలంగా ఇచ్చేడు పేపరు!' అంటాం.
మార్కులు బా రాకపోతే 'సరిగ్గా దిద్దలేదు వాడు!' అనటం,
ఇలా అనేక సందర్భాల్లో ఆ తప్పేదొ 'మగవాడే !' చేసాడని నిర్ధారణ కి వచ్చేసి, ఒక మాట విసిరేస్తాం..
అలానే దానయ్య, ఆకాశ రామన్న, సత్య హరిశ్చంద్రుడు .. లాంటివి కూడా అలవాటైపోయి ఉండొచ్చు.
దానమ్మ, ఆకాశ సీత - ఇవన్నీ మనం తరవాత పుట్టించినవే.
:D .. Thanks.
sujata gaaru,
ReplyDeletecomments లో మీరు వ్రాసినవన్నీ ఎంతో అనుభవంతో చెప్పినవి,ఇవి అనుభవిస్తే కానీ ఇతరులకు తెలియవు.భాస్కరరామరాజు గారు చెప్పినట్లు నేను తల్లితండ్రులతో counselling చేసాను.చాలా వరకు తల్లితండ్రులతోనే problems వస్తున్నాయి.మాకు అన్నీ తెలుసు అని వాళ్ళు గోరంతదాన్ని కొండంత చేస్తున్నారు.
భావన గారు,
ఈ మద్యన చాలామంది ఆడవాళ్ళు మీలాగే ఆవేశపడిపోయి యాసిడ్ పోయించుకుంటున్నారు.యాసిడ్ పోయించుకున్న ఆడవాళ్ళు police complaint ఇచ్చినవారే కావడం గురించి ఆలోచించండి.సుజాత గారి comment మళ్ళీ చదవండి.ఆవిడ చెప్పింది అక్షరాలా నిజం.
సుజాత గారు,
ఇది మీ బ్లాగ్ మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాసుకోవచ్చు,దీనికి మీరు sorry చెప్పవలసిన పనిలేదు.
దానమ్మ, ఆకాశ సీత - ఇవన్నీ మనం తరవాత పుట్టించినవే.
ReplyDelete__________________________________
I protest! "Daanamma" is my brainchild, my Patent :))
ఈ మద్యన చాలామంది ఆడవాళ్ళు మీలాగే ఆవేశపడిపోయి యాసిడ్ పోయించుకుంటున్నారు.యాసిడ్ పోయించుకున్న ఆడవాళ్ళు police complaint ఇచ్చినవారే కావడం గురించి ఆలోచించండి.
ReplyDelete___________________________________
నీహారిక గారూ,
అలా అని మి చెయ్యకపోయినా ఇబ్బందే కదా? "ఆడది అదేంచేస్తుందిలే" అనే కొత్త ట్రెండ్ మొదలౌతుంది
రౌడీ గారు: సామెతలు ఇద్దరికి వర్తిస్తాయి అండి. "వుట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది" "తోడుకోడలు తొడ కోసుకుందని తను మెడ కోసుకుంటానంది" "అత్తలేని కోడలుత్తమురాలు" ఇవి అన్ని కావాలంటె మొగవాళ్ళకు కూడా వేయొచ్చు. వెనకటి కో ఫెమినిస్ట్ ఒకావిడ పురుష సూక్తం అని వుంది కాబట్టీ ఇది పురుషులను పొగిడేది నేను చదవను అంది అట ;_) (ఫెమినిస్ట్ పురుష సూక్తం జోలికి ఎందుకు వస్తుంది ఫెమినిస్ట్ లందరు కమ్మ్యునిస్ట్ లు కాదా అనకండి, మళ్ళీ నీహారిక గారు మీ లాంటి వాళ్ళ మూలం గానే ఫెమినిస్ట్ అనే పదం బ్రష్టు పట్టి పోతుంది అంటారు :-)) ఇంక ఇంతకంటే అడగకండి రౌడీ గారు నాకు జ్యంధ్యాల, సుత్తి వీర బధ్ర రావు పూన తారు ఆనక మీ ఇష్టం మరి..
ReplyDeleteనీహరిక గారు: బాగా నవ్వించేరు :-) :-) మీరు చెప్పింది చూస్తే యాసిడ్ పోయించుకోవటం పోలిస్ కంప్లైంట్ ఇవ్వటం ఆడ పిల్లల తప్పు అంటారు ఐతే... వాళ్ళు నాలాంటి వాళ్ళే అంటారు.. :-) :-)
గోగినేని: నాకు కోపం ఏమి లేదు.. ఆవేదన తప్ప.. మొత్తం మీద ఎక్కువ శాతం అన్యాయం ఆడ వాళ్ళకే జరుగుతోంది అది వాళ్ళ అమాయకత్వమో అఝ్నానమో సంజామో చాలా ప్రభావితం చేస్తాయి అది పక్కన పెడితే మీరన్నారే "నేను నా అభిప్రాయం కన్నా morelsకే value ఇస్తాను" అది కరక్ట్. ప్రతి మనిషి కి అంతరాత్మ అది నిర్దేశించిన విలువలు వుంటాయి అవి దాటి నప్పుడే మరి ఈ గొడవలు...
భావన గారూ,
ReplyDeleteనేను అన్నది సామెతల్లో ఉన్నవాళ్ళ గురించి కాదు. సామెతలు అనేవాళ్ళ గురించి. ఏ తలకు మాసిన వెధవ ఆ రూలు పెట్టాడో, ఏ దారిన పోయే దానయ్య ఆ మాట అన్నడో అని మీరన్నారు కదా - దాని గురించి.
అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళలో మగవాళ్ళకన్నా అడవాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళని ఆడిపోసుకోవడంలో అర్ధంలేదని నా ఉద్దేశ్యం.
రౌడీ గారు ఒహ్ అలా అంటారా సారి నేను సరిగా అర్ధం చేసుకోలేదు.. ప్రత్యేకం గా మిమ్ములను (అంటే మొగ వాళ్ళను) ఆడి పోసుకోవాలని ఏమి కాదు పురుష సూక్తం లో పురుష లానే మనిషి అనే వుద్దేశం గానే వాడెను నేను మాత్రం అక్కడ, ఎందుకు వుండరు ఆడవాళ్ళు (తలకు మాసిన వాళ్ళు, దానమ్మ లు) చాలా మందే వుంటారు.. జెనెరల్ గా సమాజం ఎక్కువ గా మొగవాళ్ళ పక్షం వుంటుంది (ఆ సమాజం అంటే ఆడ మొగ ఇద్దరు కూడా) ఎందుకంటె బహుశా ఇది పితృస్వామ్య వ్యవస్త కాబట్టేమో.... జెనరల్ గా అంటే నా వుద్దేశం అధిక శాతమని. ఇంక మంచి చెడ్డ విషయం వస్తే అందరం మనుష్యులమే కదా. పోని లెండి వదిలేద్దాము నాకు గిల్టీ గా వుంది సుజాత గారి పోస్ట్ ను ఏమైన misuse చేసుకుంటున్నానేమో అని.
ReplyDeleteఆ సమాజం అంటే ఆడ మొగ ఇద్దరు కూడా
ReplyDelete____________________________
WOW, Can't believe I heard somebody (and more so a woman) say this. COOOL!!!!!
ఇన్నాళ్ళూ ఆకాశంలో సగం, హక్కుల్లో సగం - కానీ బాధ్యతలు ఎరగం అనే మహిళామూర్తులనే బ్లాగుల్లో చాలా వరకూ చూశాగానీ సమాజంలో సగం, కష్టనష్టాల్లో, నేరాల్లో సగం అనేవారిని చాలా తక్కువ మందిని చూశా . (Other than my friends) You are one of those few!!
By the way whatever I said was in a lighter vein, I want trying to get into a fight. I do see valid points in the post as well as the comments.
oops read "want" as "Wasnt"
ReplyDeleteBhavana garu
ReplyDeleteNiharika garu
Malakpet Roudy garu..
i am very happy - and thank you for your positive remarks. I appreciate your comments very very much.
నాకు ఆల్మోస్ట్ Eyes (కళ్ళు) లోంచీ Water(నీళ్ళు) వచ్చేసేయి.. ఆనందం తో! హీ హీ ! చాలా థాంక్స్.
ఇంత చర్చ జరిగితే నేనేమైపోయాను???!!!
ReplyDeleteమొత్తం చదివి మళ్ళా కామెంటుతాను.
అంతేనండీ సుజాత గారూ!! అంతే!!
ReplyDeleteవెనకున్న చెవులకన్నా ముందుచ్చొన కొమ్ములు వాడి.
నా కామెంటుని తుంగలో తొక్కి, మలక్ ని మెచ్చుకుంటున్నారన్నమాట.
>>దానికన్నా, పిల్లలకి పెళ్ళి చేసవతల్నూకాలి అనే తల్లితండ్రుల ధోరణి గూర్చికూడా మీలాంటిపెద్దలు ఓ టపా వెయ్యాలిమరి. వాళ్ళకీ కౌన్సిలింగ్ అవసరం అని నా ఘట్టి ప్రఘాడ నమ్మకం
ఏది, ఎక్కడ? దీని గురించిన ప్రతి వ్యాఖ్య ఎక్కడ?
నేను మీమీద, మలక్ మిద అలిగా.
భాస్కర్ గారు సామెతేదో తిరగల మరగలేసినట్లున్నారండి..
ReplyDelete"ముందొచ్చిన చెవుల కంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి" అనుకుంటా సామెత.. అంటె మీ సామెత కూడా అదే అర్ధం ఇస్తోంది ఇంచుమించు గా అటే రౌడి గారికి లా ఈ సామెత కూడా మీ brain child ఆ?
రౌడీ గారు థ్యాంక్స్ అండి మెచ్చుకున్నందుకు...
నేను ఇప్పుడే ఈ పోస్ట్ కామెంట్స్ తో సహా చదివాను. నాకు తెలిసున్నది చిన్న విషయం చెప్పాలనుకుంటునాను. ఏదైనా ఒక విషయాన్ని లోకరీతిగా చెప్పాలనుకున్నప్పుడు ఆడ, మగ అని చూడరు.
ReplyDeleteమాకు లాజిక్ లో ఒక సూత్రం ఉండేది.
all men are mortal
victOria is mortal
therefore victoria is a man
విక్టోరియా మగవాడన్నది ఎంతవరకూ సబబు చెప్పండి. అలాగే ఏదైనా జనాంతికంగా చెప్పాలనుకున్నప్పుడు ఇలాగే చెప్తారు. దానిని ఒక్కరికే అన్వయించుకోకూడదని నా అభిప్రాయం.
రోజులు మారాయంటున్నారు. ఇదివరకులాంటివి కాకుండా చదువులు మారాయి. ఉద్యోగాలు మారాయి. ఉద్యోగస్తుల సంఖ్యా ఎక్కువైంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీల సంఖ్య కూడా ఎక్కువైంది.
కాని అవి పెరిగినంత ఎక్కువగా మనిషిలోని సంస్కారం పెరగలేదనిపిస్తోంది. అదే పెరిగితే ఇన్ని యాసిడ్ దాడులు జరుగుతాయా?
సుజాత గారు,
ReplyDeleteమీ ఏంచుకునే ఏ టాపిక్ అయిన ఏంత పేద్దదైన చివరికి దాకా ఒక్క అక్షరం కుడా వదిలి పేట్టకుండా చదివిస్తారండి
ఇక ఈ పేళ్ళి అనే మ్యటర్ వద్దండి బాబు :))
చర్చకు మంచి విషయాలు వుంచి చర్చను బాగా కొనసాగించారు.
ReplyDeleteha ...ha..haa
ReplyDeleteబాగుందండీ.. మొత్తానికి సిల్లీ కబుర్లు అని మొదలు పెట్టి సీరియస్ డిస్కషన్ కొనసాగించారుగా :-) నన్ను అలోచనలో పడేసారు.
ReplyDeleteవాణిజ్య ప్రకటనల్లో అరుదుగా కనిపించే మంచి విషయాన్ని ప్రస్తావించారు. మచ్చలేని సౌందర్యం కోసం మచ్చలేని వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా తీసుకోడం నిజంగా ప్రశంసించదగిన విషయం.
గోగినేని: నాకు కోపం ఏమి లేదు.. ఆవేదన తప్ప.. మొత్తం మీద ఎక్కువ శాతం అన్యాయం ఆడ వాళ్ళకే జరుగుతోంది అది వాళ్ళ అమాయకత్వమో అఝ్నానమో సంజామో చాలా ప్రభావితం చేస్తాయి...!
ReplyDeleteఎక్కువశాతం ఆడవారికే అన్యాయం జరుగుతుందా..? హ హ హ ఎక్కడైన సరే ఇద్దరు వ్యక్తుల మద్యన మానసిక బలం , బలహీనతల ఆదారంగా మాత్రమే న్యాయం అన్యాయం ఉంటాయి అంతే గాని స్త్రీ, పురుష అంటు లింగ భేదం ఉండదు న్యాయ అన్యాయలకు..! కాస్త అంతక్షవులు తెరిచి చూడండి..! ఇక్కడ గోగినేని గారన్నట్లు తమ తమ అనుభవాల వలన అలా ఏకపక్షంగా అనిపించొచ్చు కేవలం ఆడవారు మాత్రమ అన్యాయం అయ్యే శాతం ఎక్కువని..కమల్..