మనసు లో బ్రెమ్మాండమైన టీ పార్టీ ని ఊహించేసుకుంటూ చిన్న విషయం చెప్పాలి. టీ తో పాటూ సమోసాలు బావుంటాయా - వేడి వేడి ఉల్లి పకోడీలు బావుంటాయా అన్నది కాదు ఇక్కడ సమస్య ! సమస్య అంతా టీ తోనే ! నాకు ఈ మధ్య చాయ్ చమక్కులు ఎక్కువయ్యాయి. చీటికీ మాటికీ టీ తాగాలని అనిపిస్తూంది.
ఒక్కో సారి నాకు పిచ్చి ఎక్కుతుంది. టీ తాగాలని! చాయ్ చాయ్ అని పలవరించేస్తూనే పని చేస్తూ ఉంటాను. ఏమాట కామాటే చెప్పుకోవాలి - మా ఆఫీసు లో చాయ్ చాలా బావుంటుంది. కానీ మరీ కుంచెమే దొరుకుతుంది. అదీ పూర్తి పాలలో మరిగించిన ఇరానీ చాయ్ లాంటి చాయ్ ! అసలు ఇరానీ చాయ్ ఎందుకంత బావుంటుంది ? అసలే వాతావరణం చల్లగా ఉంది. చాయ్ కావాలా అని ఎవరన్నా అడగడమే ఆలీశం... నేను ఆవేశంగా బయల్దేరిపోతున్నాను.
సాయంత్రం అందుకే , ఇంటికి రాగానే ఇన్ని మిరియాలు దంచేసి, నీళ్ళలో మరిగించేసి, అంత పంచదార పోసేసి, మరిన్ని పాలు పోసేసి(అఫ్ కోర్స్ - టీ పొడి కూడా వేసేను)- టీ కాచేసి, తాగేను. ఆకాశం లో చుక్కలూ, చందమామా, మేఘాలూ అన్నీ కనిపించేయి. (చాలా బావుందని అర్ధం)
చాయ్ అంటే పిచ్చే ! చలి లో మేమిద్దరం (నేనూ, హీరో )ఇండియన్ టీ తాగుదామని ఒక అజాద్ - కాష్మీరు వాడి దుకాణానికెళ్ళి మూడు వేళ్ళు చూపించి షుగర్ అంటే - చెక్కగా యేలకులు దంచి వేసిన ఇంగ్లీష్ చాయ్ - స్కిం చేసిన పాలు కొంచెం కలిపి, మూడు స్పూన్ల పంచదార పోసి, పాయసం లా చేసిస్తే, చప్పరించుకుంటూ తాగేవాళ్ళం బెడ్ ఫోర్డ్ లో ! (ఇంట్లో చేసుకోవచ్చు గానీ - చలి లో బయట చాయ్ తాగడం భలే కమ్మగా ఉంటుంది - వర్షం లో కూడా !!!)
పై ఇంట్లో ఉండే తమిళ స్నేహితురాలు అల్లం పిండి (మీరు సరిగ్గానే చదివారు - గ్రౌండ్ జింజర్) వేసి మరిగించి చేసే చాయ్ కూడా ఇష్టమే. అసలు చాయ్ అనే బ్రహ్మ పదార్ధం కలిస్తే, పంచదార ఉన్నా, లేకపోయినా, పాలు ఉన్నా లేకపోయినా - ఇంగ్లీష్ చాయ్ లాగా వేడి నీళ్ళ పాళమైనా - చాయ్ అంటే తెగ ఇష్టమైపోయింది ఆ మధ్య !
మా ఫ్రెండ్ అయితే పాల లో మిరియాలూ, దాల్చిన చెక్కా, అల్లమూ కలిపి దంచి వేసి, దాన్లో చాయ్ పత్తీ మరిగించి బ్రెహ్మాండమైన చాయ్ తయారు చేస్తుంది. అలా చెయ్యాలని చాలా సార్లు ప్రయత్నించి - ఆ టేస్ట్ వచ్చినా రాకపోయినా ఆ టీ మాత్రం శుబ్బరంగా సేవించేసే దాన్ని. హీరో తో కలిసి ఊటీ వెళ్ళినపుడూ బోల్డన్ని టీ వెరైటీ లు తెచ్చి అందరికీ గిఫ్టులిచ్చేము. అందులో మసాలా టీ, చాక్లెట్ టీ - కారం టీ కూడా ఉన్నాయి.
టీ పిచ్చి ఈ మధ్య ఎక్కువ అయింది. అయితే తాగడానికే వీలు చిక్కట్లేదు. స్ట్రాంగ్ టీ - అంటే కొంచెం ఎడం. టీ అంటే అంత చిక్కగా ఉండకూడదూ, రంగూ ఉండకూడదు, రుచి కూడా మరీ ఉండకూడదు. ఇదేమి తిక్క కోరిక అని ఆశ్చర్యం గా ఉందా ? ఇలా అయితేనే ఎన్నిసార్లన్నా తాగగలం. రంగూ రుచీ చిక్కదనం - ఏడ్ గుర్తొచ్చిందా ? టీ ఏడ్ లు ఎప్పుడైనా చూసారా ? అమ్మాయికీ అబ్బాయికీ ఈ బాగ్ బక్రీ చాయ్ వల్ల పెళ్ళి నిశ్చయం అయిపోతుంది. జెమినీ చాయ్ వల్ల కుటుంబం లో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయి. కేరళా వాళ్ళయితే మరీనూ - అందరూ కలిసి కావ్యా మాధవన్ పెళ్ళి అయితుందని ఏడుస్తున్నారా ? అదేదో 'కణ్ణన్ దేవన్' టీ మాత్రం కొనడం మాన్లేదు.
గేదె పాలలో కలిపే ఏ బ్రాండ్ టీ అయినా అత్భుతమే ! నేనూ ఎవెరీ డే మిల్క్ పౌడర్ తో పాలు చేసి చాయ్ చేస్తా.. నాకయితే పర్లేదు గానీ చుట్టు పక్క వాళ్ళే విచిత్రంగా చూస్తారు. ట్రైన్ లో టీ లా ఉందని ఆక్షేపిస్తారు. ఎలా ఉన్నా.. అనవసరం. టీ కదా - తాగేయడమే.
మా తోటికోడలు బ్రహ్మాండమైన లెమన్ టీ, ఇంకేదో - వాము తో ఒక రకం టీ, దాల్చిన చెక్క తో ఒక రకం టీ, ఇలా చాలా వెరైటీ లు చేస్తారు. వీటన్నిటి కన్నా మా హాస్టల్లో నీళ్ళు నీళ్ళు గా అతి పల్చగా చేసే టీ పెద్ద గ్లాసులో పట్టేసుకుని తాగేయడం చాలా రిఫ్రెషింగ్ గా ఉండేది. ఆ టేస్ట్ ఇంకెక్కడా రాలేదు. ట్రైన్ కేటరింగ్ వాడు కూడా ఆ రుచి, ఆ మేజిక్ తీసుకు రాలేడు. 'ఇంత చాయ్ పత్తీ అప్పివ్వండి వొదిన గారూ' (ఈ రోజుల్లో అలా పిలుచుకోవట్లేదు - మాలాంటోళ్ళు వయసు మీద పడినట్లుంటుందని పిలవనివ్వడం లేదు కూడా) అని ఎవరన్నా అడిగినా నాకు వారంటే ఇస్టమొచ్చేస్తుంది. ఇద్దరం చాయ్ క్లబ్బు సభ్యులం కాబట్టి ! చలికాలానికీ - తేనీరు సేవనానికీ దగ్గర సంబంధం ఏదో ఉన్నట్టుంది.
అయినా - ఈ రోజు నాకేదో అయింది - టీ టీ అని పలవరించి, టీ తాగి, టీ గురించి రాసేస్తున్నాను. ఇందుమూలంగా తెలియజేయునదేమనగా, నాకు టీ ఇష్టం (అన్ని సార్లూ కాదు గానీ.. ఇంటికెళ్తే అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ రుచి కి ఇంకేదీ సరి కాదనుకోండి!!!!) కాబట్టి మంచి టీ తయారీ విధానాలు తెలియచేస్తే మీ పేరు చెప్పుకుని కమ్మని చాయ్ తాగుతూ బ్రతికేస్తా.
ippude english vaalla laga bhojanam tarvata tea traagutuu ...
ReplyDeletemi tealanu kudaa taste chesaa.
though I prefer coffee to tea.
ఇంత చాయ్ పత్తీ అప్పివ్వండి వొదిన గారూ ..!!
ReplyDeleteమాటలతోనే టీ తాగించేశారు. నిజం టీ ఎప్పుడు?
ReplyDelete-cbrao
San Jose, CA.
మీ కబుర్లు బాగున్నాయి, అర్జెంటుగా నేను టీ తాగాలి.
ReplyDeleteనేను మా ఇంట్లో స్పెషల్ టీ చేస్తాను. గిన్నెలో చిక్కటి పాలు వేసి మరుగుతూ ఉంటే టీ పౌడరు, చక్కెరతో పాటూ కొంచెం అల్లం తొక్కు వేసి నాలుగైదు సార్లు టీ పొంగనివ్వాలి. అపుడు ఉంటుంది టీ, నా సామిరంగా...
గమనిక : గిన్నె మాత్రం తోమేటపుడు కష్టమవుతుంది, అడుగు అంటుకుని.
ఈ టీకి నేనూ రెఢీ!
ReplyDeleteCB Rao garu
ReplyDeletemeru hyd raangane..! Welcome. eppudainaa, ekkadainaa... miru ma intikochina, memu i intikochina.. :D
sujji
ReplyDeleteSure ! miko huggu kooda !!!
Shree
ReplyDeletethaanks thaanks. So.. pongulu important annamata !
kRshnuDu garu
ReplyDeletethaanks. Coffee is addictive though. :D (Tea is also addictive to some extent)
mahesh garu
ReplyDeleteaunu. manam plan cheddam.
నన్ను మీ చాయ్ క్లబ్బులో చేర్చుకోండి ప్లీజ్.. అందరికీ పార్ 'టీ ' ఇచ్చుకుంటా. జై బోలో టి మహరాజ్ కి
ReplyDeleteచాలా బాగుందండీ... నాది కాఫీ పార్టీ నే కానీ మీరు చెప్పిన మసాలా టీ అల్లం టీ ఇరానీ చాయ్ లాంటివి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను.
ReplyDeleteప్చ్ మీరంతలా వర్ణించేస్తూంటే నోరూరిపోతోంది, కాని నేను ఎప్పుడూ టీ రుచి చూడలేదు. నాకు దాని వాసన అస్సలు పడదు, వెంటనే వాంతులు వస్తాయి. ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టుకుని మరీ మా వారికి చాయ్ పెడతా, కాకపోతే నేను పెట్టే చాయ్ చాలా బాగుంటుంది అని మా జనాలు ఒక సెర్టిఫికేట్ ఇచ్చేసారు నాకు... ఏదేమైనా మీ చాయోపాఖ్యానం బాగుంది
ReplyDeleteకాఫీలకి, టీలకీ ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ(రైల్లో తప్ప)! అసలు టీ పెట్టేప్పుడు పాలల్లో టీ పొడి వెయ్యకూడడు. ముందు నీళ్లలో టీ పొడి మరిగించి, అప్పుడు పాలు, ఇతరాలు(అదే, అల్లం, ధనియాలు, వాము, ఆవాలు వగైరాలు) కలిపి మరికొంత సేపు మరిగించాలి. అప్పుడు సూప్పర్ గా ఉంటుంది.
ReplyDeleteసరే, సుజాతా, వచ్చేయండి, మంచి టీ కొట్టేద్దాం!
ఈ చాయ్‌లు కాఫీలకి నేను దూరం కాని నేను పెట్టే టీ చాలా బాగుంటుంది(అట). ఎప్పుడైనా మంచి టీ తాగాలనిపిస్తే మా ఇంటికి వచ్చేయండి:)
ReplyDeleteమీ ఈ టపా మాత్రం పురాణం గారి "ఇల్లాలి ముచ్చట్లు" ని గుర్తుకు తెచ్చింది.
ఏమాట కామాటే టి పేదల పాలిటి అమృతం.
ReplyDeleteబుర్ర హీటెక్కినప్పుడు ఓ టి కొడితే ఆహా నా రాజ ..
ఒక గ్లాసు టీ ఇద్దురు :):)
ReplyDeleteనాకెంత ఇష్టమో టీ అంటే
ఎంత అంటే
ఉపవాసం వుండే రోజు కూడా దేవుడా మంచి నీళ్లు అయినా తాగకుండా వుంటాను కాని టీ మాతరం తాగుతా అని దణ్ణం పెట్టేసుకున్నా :):):):)
ఈ మధ్య బాగా తగ్గించా టీలు తాగటం,ప్రస్తుతం పది నుంచి పన్నెండు కప్పులే,యూనివర్శిటీ రోజుల్లొ 23 కప్పుల రికార్డొకటి నా పేరు మీద ఉండేది,కానీ తర్వాత బద్దలయ్యింది,మృగరాజు సినిమా లో చాయ్ పాట తర్వాతకూడా ఈ టీ వ్యామొహం తగ్గకపోవటం గమనార్హమని గంభీరంగా శెలవిస్తున్నా,
ReplyDeleteఒకసారి ఋషికొండ-భీమిలి మధ్యలో ఒక కమ్మలింట్లో(తాటియాకు పాక)టీ తాగాక ’దిమ్మ తిరిగి బొమ్మ" కనపడటమంటే ఏంటో తెలిసింది,అంత గొప్పగా ఉందా టీ.కానివ్వండి మళ్ళీ వస్తా :)
"టీ తాగని వాడు పోతుటీగై పుట్టున్ "...అన్నాట్ట శ్రీశ్రీ. తేనీరోపాఖ్యానం బావుంది.
ReplyDeleteనేను గల్ఫ్ కెళ్ళి నెలరోజులు , కక్కుర్తిగా authentic ఇరానీ చాయ్ తాగేను. ఇప్పుడు మీ టపా చదవగానే నాలుక జివ్వుమంది, అది గుర్తొచ్చి.
టీ టైమయ్యింది, ఒక సింగిల్ లాగించేసి వస్తా! లెమన్ టీ ఏర్పాఅట్లు చెయ్యండి, ఈ లోపు.
ReplyDeleteవేణు శ్రీకాంత్ గారు
ReplyDeleteథాంక్స్. నేనూ అంతే. ఇరానీ చాయ్, అల్లం చాయ్ నచ్చుతాయి. మిరియాల చాయ్ కూడా బావుంటుంది.
చైసా గారు
ReplyDeleteవెల్ కం. పార్ టీ కి నేను రెడీ !
లక్ష్మి గారు
ReplyDeleteటీ వాసన పడదా ? అయ్యో !
మాకు ఎపుడు టీ పెడతారు ? థాంక్స్.
సుజాత గారు
ReplyDeleteమంచి టిప్ ! ఫాలో అవుతా. నేనూ నీళ్ళలోనే టీ మరిగించి చేస్తా. అదేంటో - కొందరు బాగా మరిగితే రుచి అంటారు, కొందరు మరిగించకుండా వెంటనే దించేస్తే రుచి అంటారు ! ఏమో నాకు మరిగితే ఇష్టం. Thanks
వరూధిని గారు
ReplyDeleteఇల్లాలి ముచ్చట్లే మరి ! మాన్ నా మాన్ మే ఆప్ కా మెహెమాన్ - చూసుకోండి ఇంక ! టీ కోసం ఎంత దూరమైనా వస్తాను ! Thanks.
అశ్విన్ గారు
ReplyDeleteనిజమే ! అలాంటపుడు మాత్రం ఒక కప్ టీ దివ్యంగా పనిచేస్తుంది.
లచ్చిమి గారు
ReplyDeleteవెల్ కం. మా చాయ్ క్లబ్ లో మీకు పెద్ద పీట వేస్తాం. :D
రాజేంద్ర కుమార్ గారు -
ReplyDeleteమరీ అన్నోటా ? అన్యాయం సుమండీ ! ఏదయినా ఎక్కువ, కూడదు. మళ్ళీ వైజాగు గుర్తు చేసారు. మీకు నిష్కృతి లేదు. కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పిన చిన్ని చిన్ని జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి.
రవి గారు
ReplyDeleteఅబ్బ ! ఎలా ఉంది అథెంటిక్ ఇరానీ చాయ్ ? థాంక్స్.
మగవాడు గారు
ReplyDeleteఇక్కడ వ్యాఖ్యానించినందుకు థాంక్స్. లెమన్ టీ ఒకె - రెడీ చేస్తాను గానీ - మీ పేరు భలే ఉంది.
ఏమనుకోక పోతే ఒక జోకు చెప్తాను. నేను సేవులకి ఆంధ్రా వచ్చినపుడు, నాకు మా చెల్లి టీవీ లో 'ఒక్క మగాడు ' అని ఒక సిమ్రాన్ పాట చూపించింది. అప్పట్లో టీవీ లో మసాలా మిక్స్ అని, ఒక పాట వీడియో, ఇంకో పాట ఆడియో కలిపి ఫన్నీ గా కొన్ని వీడియోలు చూపించేవారు. ఆ ఆడియో కి హరిక్రిష్ణ డాన్స్ చూసి, ఇలాంటి వేరే వేడియో ఎదో కలిపేసి ఉంటాడని అనుకుని ఆ పాట సరదాగా చూసాను.
తరవాత మా చెల్లి, ఆ పాట లో హరికృష్ణే హీరో - సిమ్రాన్ అతని గురించే పాడుతుందీ అని రెండు రోజులు వాయించి చెప్తే గానీ నమ్మలేదు. ఆ తరవాత కాసేపు నోరెళ్ళబెట్టి, సెలవులయ్యీ దాకా నవ్వుతూనే ఉన్నాను. మీ పేరు చూస్తే ఆ విష్యం గుర్తొచ్చింది. మీరు హరికృష్ణ ఫాన్ అయితే ఈ జోక్ కి నన్ను క్షమించడి.
టీ జిందాబాద్!
ReplyDeleteహమ్మ్.. చలి లో వేడి వేడి మసలా టి తాగిగే ఆ మజానే వేరు. మా ఆఫీసులొ మంచి టి దొరకదు.. :(
ReplyDeleteకొత్త పాళీ గారూ
ReplyDeleteఫన్నీ ! థాంక్స్.
నిరంజన్ గారూ
ReplyDeleteఎంతన్యాయం ? ఘోరం.... టీ మాటకొస్తే - మీ వ్యాఖ్య కి థాంక్స్.
gaadida, ippudu naaku urgent ga mee neighbor chese tea lanti tea kavali..sayantram varaku aagali cheee..appati varaku vedhava decaf green tea ee dikku..
ReplyDelete