Pages

10/11/2008

నా వీర గాధ - పార్ట్ 3

ఇదంతా రాస్తున్నానని తెలిసి ఒక ఫ్రెండ్ చేతుల్లో చీవాట్లు తిన్నాను. నీకు ఈ హిస్టరీ అంతా దునియాకి చెప్పాల్సిన అవసరం ఏమిటి ? నీకు సానుభూతి కావాలి - నీకు ఆ స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి - అందుకే ఇదంతా తవ్వుతూ - గోల చేస్తున్నావని అరిచాడు. నేను తనకి విషయం ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేదు. కోపం తగ్గనే లేదు. ఇంతకీ నా అత్యంత సన్నిహిత విషయాలు చెపుతున్నందుకు నాకూ ఆశ్చర్యంగానే ఉంది.

అయినా ఇది ఎవరికో ఒకరికి పకిని వస్తుందని ఆశించే రాస్తున్నాను. ఇది స్పూర్తి కలిగించడానికి కానే కాదు. అసలు అక్కడంత సీన్ లేదు. ఇది చెప్పడానికి కారణం ఒక్కోసారి పరిస్థితులు ఇలా కూడా ఉండొచ్చు ! నడుం నొప్పి చాలా కామన్ మనలో ! ముఖ్యంగా అమ్మాయిలలో ! సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో - ఎక్కువ దూరాలు ద్విచక్ర వాహనం డ్రైవ్ చేసే వాళ్ళలో ! ఇలా ఎందరో మనలో ఉండొచ్చు హెల్ప్ కావల్సిన వాళ్ళు.


దీనికి చికిత్స ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం వొళ్ళు దగ్గర పెట్టుకుని అంటే - బరువులు ఎత్తకుండా, కింద కూర్చోకుండా (నడుము నొప్పి ఉందని కింద నేల మీద పడుకుంటారు కొందరు - కానీ దాని వల్ల హానే ఎక్కువ జరుగుతుంది) - మంచి ప్రోటీన్ డైట్ తీసుకుని - ఇలా కొన్ని మార్పులు చేసుకుంటే, (వెస్ట్రన్ కమోడ్ వాడడం కూడా - ఒక మంచి విషయం) చాలా వరకూ రిలీఫ్ దొరుకుతుంది.


నా వరకూ - నేననుభవించిన కష్టం - ఇంకెవరూ అనుభవించకూడదని ఒక ఆశ. అయితే దురదృష్ట వశాత్తూ ఎవరికైనా ఇలాంటి బాధ ఎదురవచ్చు. దీని వల్ల ప్రపంచం తల్లక్రిందులైపోదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.

పెళ్ళి కావల్సిన ఆడపిల్లలకు ఇలాంటి సర్జరీ చేయించడానికి అమ్మా, నాన్నలు త్వరగా ముందుకు రారు. ఇది చాలా తప్పు. ఎవరో ఏదో అనుకుంటారని కాక, మన పిల్లని రక్షించుకోవడానికి మనం ప్రయత్నించడం హ్యూమన్ !


ఈ పరిస్తితుల్లో నా వరకూ అయితే, లైఫ్ చాలా మంచి twists and turns తీసుకుంది. ముఖ్యంగా మా చుట్టాల్లో అందరికీ, మా హీరో చాలా ప్రియమైన వ్యక్తి అయిపోయారు - హీరో, నేనూ 'ఎవరూ - ఏమిటి - ఎక్కడా ?' - అని ప్రశ్నలు వేసుకోకుండానే, (ఝుంపా లాహిరి ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మాలడీస్ లో చెప్పినట్టు ఎవర్నో ఒకర్ని పెళ్ళాడాలి కాబట్టే) పెళ్ళి చేసుకున్నాం !

ఆ తరవాత హీరో కారణం చెప్పేరు. వాళ్ళ నాన్నారు (మా మావయ్య గారు) ఈ అబ్బాయి ముందు రెండు ఆప్షన్స్ ఉంచేరుట - అవి 'యెస్!' మరియూ 'ఓకె!' - కాబట్టి మా హీరో నిర్ణయం ఏమో గానీ, పైన స్టార్లు మాత్రం మమ్మల్ని కలిపాయి. ముఖ్యంగా ఇద్దరి అమ్మకూ నాన్న కూ నచ్చిన సంబంధం. ఇలా.. కేవలం తల్లీ దండ్రీ నిర్ణయించేరు కాబట్టి మా పెళ్ళి జరిగింది.

నేను కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నా, హీరో కూడా కొత్త లో నాతో బెరుగ్గా మాటాడినా కొన్నాళ్ళకే ఈ అబ్బాయి లో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అర్ధం అయిపోయింది. మొత్తానికి వొళ్ళు బాగు చేయించుకుని, దిల్లీ షెహర్ కి ప్రయాణం కట్టాను. స్టేషన్ కి నా ఫ్రెండ్స్ వచ్చారు - తెల్లారి మంచులో, చీకటిలో ! ఇక్కణ్ణుంచీ వీళ్ళకి నాతో కంచి గరుడ సేవ అయిపోయింది. పాపం చాలా చాలా సాయం చేసారు. నేను ఆఫీసుకి వెళ్ళాలంటే, హాస్టల్ లో ఎవరో ఒకరు నాతో పాటూ ఆటో లో సాయం వచ్చేవారు. దాదాపు అందరం రైసినా హిల్ (రాష్ట్రపతి నిలయం, సౌథ్ బ్లాక్, నార్త్ బ్లాక్ ఉన్న కొండ) కి అటూ ఇటూనే ఉద్యోగాలు చేస్తుండటంతో ఎవరో ఒకరు షేరింగ్ ఆటో నాకోసం ఎరేంజ్ చేసే వారు.

తిరిగొచ్చేటపుడు మా ఇంకో ఫ్రెండ్ అటుగానే వెళ్తూ, నన్ను నా ఆఫీస్ దగ్గర పిక అప్ చేసుకునేది. హాస్టల్ మెస్ లోంచీ భోజనం నాకు బెడ్ డెలివరీ అయ్యేది. ఈ రోజుల్లో కూడా రూం మేట్ కొంచెం హింస పెట్టినా, ఫ్రెండ్స్ మాత్రం, వెన్ను దన్నుగా నిలిచేరు.

ఆఫీసు లో కూడా బోల్డంత సాయం ! అప్పటికి నేను కోలుకోవడం దాదాపు ముగిసినట్టే, నడక వచ్చేసింది, మెట్లెక్కడం వచ్చేసింది, అయినా, బస్ ఎక్కలేకపోవడం, త్వరగా నడవలేకపోవడం - తూగుతూ, నడవడం లాంటి ఫీట్లు జరిగేవి.

ఇలాంటి రోజుల్లోనే హీరో ఎందుకో పనుండి డిల్లీ వచ్చేరు (నన్ను చూడటం, కలుసుకోవడం, తెలుసుకోవడం కూడా ఒక పనే !) అప్పటికి పెళ్ళి కి 2 నెల్ల టైం ఉంది. హాస్టల్ బయట హీరో ని చూసి - ఎందుకో కొంచెం స్మార్ట్ గా నడుద్దామని ట్రై చేసి, కాళ్ళు సహకరించక, ఢాం అని కింద పడ్డాను. తిరిగి నా అంతట నేనే లేచేంత శక్తి లేనే లేదు. అపుడు హీరో నే నన్ను పట్టుకు లేపారు ! (మా కనెక్షన్ మొదలయింది.. కానీ) నా పాదం లో చిన్న ఫ్రాక్చర్ అయింది.

ఫ్రాక్చర్ సంగతినాకు తెలియలేదు. తిరిగి పైకొచ్చి, (2 అంతస్థులు మెట్లెక్కి) నాలుగయిదు పెయిన్ కిల్లర్లు వేసుకుని, స్పోర్ట్ షూ ఒకటి గాట్టిగా పాదాలకు బిగించేసి, మా అబ్బాయి తో దిల్లీ దర్షన్ కు బయలు దేరాను. నేనే డ్రైవింగ్, తను నా వెనుక పిలియన్ ! ఎలానో - కుంటుకుంటూ లోటస్ టెంపుల్ చూపించాను, (అక్కడ బాగా నడవాలి) - తనకి ఏదో షాపింగ్ పని ఉంటే పాలికా, చాందినీ చౌక్, కనాట్ సర్కస్ - అన్నీ తిప్పాను. రాత్రి స్టేషన్ దగ్గర వొదిలేసి, ఇంటికొచ్చి ఇంకోసారి మంచం మేద ఢాం అని పడిపోయాను.

రెండురోజులకు నొప్పి తగ్గక, కాలు ఫుట్ బాల్ లా వాచేస్తే - అపుడు జంతర్ మంతర్ పక్కన ఒక చారిటీ హాస్పిటల్ లో ఎక్స్-రే (అక్కడే మాకు దగ్గర్లో ఒక ఎక్స్-రే మిషీన్ ఉండింది) తీయించుకుని, డాక్టర్ కు చూపించుకున్నా. కచ్చా ప్లాస్టర్ వేయాలన్నరు. కానీ అది చారిటీ ఆస్పత్రి కాబట్టి, బయటే వేయించుకోమన్నారు.

బయట - సరే చూద్దాం అనుకుంటూండగా, మా ఫ్రెండ్స్ కుట్ర చేసేసి, నన్ను రాం మనోహర్ లోహియా హాస్పత్రి ఎమర్జెన్సీ కి రాత్రి కి రాత్రి తీసుకెళ్ళి ప్రభుత్వ కచ్చా ప్లాస్టర్ వేయించేసారు.


మావయ్య కొడుకు డెహ్రాడూన్ లో ఉన్నాడని చూడ్డానికొచ్చి డిల్లీ లో ఆగి, నన్ను కలవడానికి మా ఆఫీసుకొస్తే నా కవచం, కాలికి తెల్లని ప్లాస్టర్ తో కుంటుకుంటూ దర్శనం ఇచ్చాను! ఈ స్థితి లో మావయ్య నన్ను చూసి చాలా ఫీలయిపోయాడు - కానీ కనిపించనీలేదు.

ఇది చిన్న ఫ్రాక్చర్ కాబట్టి, పెళ్ళికి ముందే ప్లాస్టర్ విడిపోయింది. నన్ను, నా సామాన్లనూ ఫ్రెండ్సే బండి ఎక్కించారు. మొత్తానికి ఎలానో వైజాగ్ చేరాను. నా పెళ్ళికి ఒక్క వస్తువా నేను కొనుక్కోలేదు. రాయల్ గా వెళ్ళి, అమ్మ, నాన్నా ల షాపింగ్ లో, అక్కయ్య, చెల్లిల్ల ప్లానింగ్ లో పెళ్ళి కొడుకు వాళ్ళు మా వూరొచ్చి చేసుకున్నారు కాబట్టి - ఒక్క సేఫ్టీ పిన్ను కూడా కొనుక్కోకుండా పెళ్ళి చేసేసుకున్నాను. పెళ్ళి - పీటల మీద కాకుండా బెంచీల మీద అయింది.


అయితే మా అబ్బాయి మాత్రం ఈ కుంటుతూ, నొప్పితో వికారంగా (మొహంలో నవ్వు అనేదే ఉండేది కాదు) ఉన్న పెళ్ళి కూతుర్ని తన ఫ్రెండ్స్ కీ చుట్టాలకూ పరిచయం చెయ్యడానికి సిగ్గుపడిపోయేవాడు.


మేము కస్టం-మేడ్ ముగుడూ పెళ్ళాలం కానే కాదు. అయితే మేమిద్దరం కోతులే కాబట్టి తొందరగా కలిసిపోయాము. ఇప్పటికీ వీరోచితంగా కొట్లాడుకున్నా, తన పట్ల నాకు 'కృతజ్ఞత' / తనకి నా పట్ల 'ఏదో ఉద్ధరించేనన్న ఫీలింగ్ / జాలి ' లాంటి సంగతులు రాకుండా పిచ్చ పిచ్చగా కొట్లాడుకుంటాం. ఇప్పటికీ - నేను చెయలేని పనులని ఏకరువు పెడుతూ ఉంటాను. నా బలహీనతలు తనకు తెలుసు. నాకోసం తను ఉన్నాడన్న నమ్మకం కూడా నాకుంది.


నాకు వీటన్నిట్నీ మించిన విషయం - నా చుట్టు పక్కల వారి సహానుభూతి. (సానుభూతి కాదు- సానుభూతి కోరుకోవాల్సిన పరిస్థితి లో నేను లేదు. అదంతా అయిపోయింది) మనిషి కి మనిషి సాయం. మనిషి కి మనిషి అండ ! ఇలా చుట్టు పక్కల మనుషుల్లో పోసిటివ్ స్పిరిట్, సాయపడే తత్వం - వీటిని గమనించే అవకాశం, అమ్మా నాన్నల గ్రిట్, దేవుడిచ్చిన శక్తి - ఇవన్నీ నా మీద నాలో ఉండే జాలి (ఇది నాకే ఎందుకయ్యింది ? నేనేమి చేశాను ? లాంటి ఫీలింగ్స్)ని ఎదుర్కోవడానికి సహాయపడ్డాయి.

వీటి మధ్యలో పెళ్ళి జరగడం, ఒక్క సారి మార్పు - అదిచ్చిన టెన్షన్, కొత్త రోల్ లో నన్ను నేను హెల్ప్ లెస్ గా ప్రొజెక్ట్ చేసుకోకుండా ఉండటానికి పడిన తంటాలలో త్వర త్వరగా నా మానసిక పరిస్థితి మెరుగుపడింది. ట్రాన్స్ఫర్ కూడా అయ్యాకా, కెరీర్ మాత్రం బాగా దెబ్బ తిన్నది - కానీ ఏదో సాధించానన్న తృప్తి మిగిలింది. పెళ్ళి తర్వాత హీరో తో కలిసి ఉండటానికే మంచి కెరీర్ ను త్యాగం చేసేసాను. ఇపుడు ఈ సర్దుకుపోవడాల్లో సర్దుకుపోయాను.

ఇదంతా - కేవలం నా గురించి చెప్పడానికి కాకుండా - ఎవరైనా, నా లాంటి కష్టాలు ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ అనుభవాలు పనికి వస్తాయేమో అని చెప్తున్నాను.

ఈ అనుభవం నాలో ధైర్యాన్ని కలిగించినా, (కొన్ని విషయాల్లో చాలా ధైర్యం, కొన్ని విషయాల్లో చాలా సున్నితత్వం వచ్చాయి అని నమ్ముతాను) కలిగించకపోయినా, నొప్పిని నేను తట్టుకోగలననీ, ఎదుర్కోగలననీ, ఒక నమ్మకాన్నిచ్చింది.

నొప్పి అలవాటయిపోవడం ఒక వింతైన ఫీలింగ్. నిజానికి కాన్స్టెంట్ (constant pain) నొప్పి, బాధ అనుభవించే మనిషి తనలో అహాన్ని మొదట జయిస్తాడు. నొప్పి ముందు మనమెంత ?! అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఈ నొప్పిని జయించడంలో నాకు సహకరించిన అందరికీ, నా డాక్టరు కీ, డా.వినోద్ కీ, అఫ్ కోర్స్ అమ్మా నాన్నలకీ, చెల్లీ, అక్కలకీ, నడక నేర్చుకుంటూ పడిపోయిన నన్ను ఎన్నో సార్లు లేపిన సురేష్ కీ, ప్యూర్ వెజిటేరియన్ అయినా, హాస్టల్ లో నాకు మంచి ఫుడ్ లేదని చెప్పి ఉడికించిన ఎగ్స్ తెచ్చిచ్చి - నన్ను తన బండి మీద మహారాణిలా తిప్పి - ఎన్నో సార్లు నాకు వంట చేసి భోజనం పెట్టిన నా బెస్ట్ ఫ్రెండ్స్ కీ - ఆఫీసులో కొలీగ్స్ కీ, నవ్విస్తూ, నా కోసం ప్రార్ధిస్తూ నన్ను గుడ్ స్పిరిట్స్ లో ఉంచిన మావయ్యలూ, చిన్నాన్నలకూ, అత్తలకూ, ముఖ్యంగా సమయానికి వాకర్ అరువు ఇచ్చిన నానమ్మకీ - ఇలా ప్రతీ ఒక్కరికీ బోలెడన్ని థాంకులు ! మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీ అందరి కడుపునా పుట్టకుండానే ఎలానో ఓలా వచ్చే జన్మల్లో తీర్చేసుకుంటాను.


అన్నట్టు హీరో కి కూడా థాంక్స్ ! క్రైసిస్ లో నా చెయ్యి పట్టుకున్నందుకు ! నాతో పాటూ ఈ పెళ్ళి అనే సర్కస్ లో చిక్కుకుపోయినందుకు !


ఇప్పటికీ - ఇంకా ఫీట్లు జరుగుతూనే ఉన్నాయి. ఏవో చిన్నా, చితకా!! - కానీ నాకు మాత్రం భలే ధైర్యం వచ్చేసింది. ఇలాంటి చిన్న ఫీట్లు ఏముంది లే - పెద్ద ఫీట్లు చేసేసిన అనుభవం ఉంది - అని లెక్చర్ ఇచ్చేసుకుంటా, నాకే నేను ! ఇదో కొత్త అహం ! అయినా బావుంది. ఈ అహాన్నే రక్షణగా చేసుకుని బ్రతికేస్తున్నాను.


అన్నట్టు - ఆ తరవాత వచ్చే ముందు, రాష్ట్రపతీ నిలయం - ముఘల్ గార్డెన్ తిరిగాను హీరో తో (అంటే బోల్డంత నడక !) సర్జరీ జరిగిన ఏడాదికల్లా, పూనే - బెంగుళూరు హైవే లో చిన్న చిన్న కొండల మీదికి సాయం లేకుండానే షికారుకెళ్ళాను. ఆ కొండ ఎక్కినపుడు - ఏడాది క్రితం పరిస్థితి కీ అప్పటికీ తేడా తలచుకొని ఎవరెస్టు ఎక్కినంత ఆనందంగా ఫీల్ అయ్యాను. ఈ ఆనందం నాలో చాలా గర్వాన్ని నింపేసింది. వస్తే వొచ్చింది నడుము నొప్పి - నన్ను నాకే హీరోయిన్ లా ఫీల్ అయ్యేలా చేసింది - అనుకున్నాను.

ఈ తరవాత నుండీ - ఎవరు నొప్పన్నా - నా మనసు ఆ నొప్పిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదీ విషయం.

40 comments:

  1. i cannot resist reading the post.
    bollojubaba

    ReplyDelete
  2. వీరగాధ -1 నుంచి -3 కొచ్చేసరికి ఇంతింతై వటుడింతయై అన్నట్టు మీరు పెరిగిపోయినట్టు అనిపించిందండోయ్. మొత్తమ్మీద బాగానే లాగించారు.

    కొంతలో మీ ప్రోబ్లెం అదృష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే లుంబార్ రీజియన్ బదులు సెర్వికల్ రీజియన్ లో మీకు సర్జరీ జరిగి ఉంటే ఇంక అంతే సంగతులు. అలా కానందుకు రోజూ దేముడికి దణ్ణం పెట్టుకోండి.

    ఇంకొక్క విషయం. మిమ్మల్ని ట్రీట్ చేసిన డాక్టర్ల పేర్లు ఎడ్రస్సులూ ఇక్కడ ఇస్తే కావల్సిన జనానికి బాగుంటుందేమో?

    ReplyDelete
  3. really meeku hatsoff sujatha gaaru..nenu mayuri cinema chusaanu, karthayam chusaaanu. kaani avi cinemaalu(mayuri real story ani vinnanu)..

    kaani meeru nijamina hero.. sorry heroin..mee family members nijangaa great andi..

    ReplyDelete
  4. Don't you have comment moderation Sujata gaaru?

    You can avoid comments like the above one left by anonymous guy..

    There was no need for him to talk about the area of surgery. S/He could have communicated the samething with different set of words too.

    ReplyDelete
  5. Kumar
    Cervical means neck area. Time to refresh your vocabulary. Huh?

    ReplyDelete
  6. సుజాత గారు,
    ఎలానో తెలియదు కానీ ,రెండో పార్ట్ మిస్ అయ్యాను. మూడో భాగం మధ్యలో ఉండగా మెలకువ వొచ్చింది.మళ్లీ వెనక్కు వెళ్ళి మొత్తానికి పూర్తి చేశాను. బాధను కూడా బ్రహ్మాండంగా వర్ణించారు. అభినంధనలు.
    అజ్ఞాత వ్యక్తి చెప్పినట్టు మీరు సంప్రదించిన వైధ్యుల వివరాలు అవీ, ఇస్తే మీరు ఆశించిన ప్రయోజనం పూర్తిగా నెరవేరుతుందేమో. అభ్యంతరాలు లేకపోతేనే సుమా!

    ReplyDelete
  7. badha ni inta andangaa koodaa cheppochhaaaa heroine gaaru

    chinna debba tagilitene tattukolekapotunnnam ee rojulllo
    elaa tattukunnarandee babu ???

    mee life ye cheeku chintaa lekundaa haayi gaa saagipovaalani mansaraa korukuntundi mee lachhimi

    ReplyDelete
  8. బాగున్నాయండీ మీ వీరగాధ టపాలు! ఇవి నిజంగానే చాలామందికి స్ఫూర్తినిస్తాయని అశిస్తున్నాను.

    ఇంత భయంకరమయిన నొప్పి నుండి బయటపడిన మీరు నిజంగా జగదేక వీరనారి!

    మీ హీరో కి నా నమస్కారాలు తప్పకుండా తెలపండి!

    ReplyDelete
  9. బాధ పడకుండా చదివింది ఈ పార్టే సుజాత గారూ! మొత్తానికి మీరు విజేత. మీరు హాయిగా నూరేళ్ళు చల్లగా, హీరోతో కొట్లాడుతూ, మీరు చెప్పిన సరికొత్త అహం తో(ఇది లేకపోతే లైఫే లేదు సుజాతా)నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వీరగాధ ఎందరికో ధైర్యాన్ని పంచి ఇవ్వడం ఖాయం.

    ReplyDelete
  10. Dear Mr Anonymous...

    Ha Haa :-) You are right..I stand corrected.

    By the way my vocabulary is OK :-). For some reason, I read that as 'pelvic' in stead of cervical..and guess what..I jumped the Gun!! :-)

    Sorry my friend..Yet another example of reading twice before you respond huh?

    ReplyDelete
  11. Anonymous gaaru, I forgot to mention that, I guess I jumped the Gun too quick, out of my respect for Sujaata gaaru..

    I have no idea about her, but she was in my dreams last night. Seriously..

    My elder sister's name is Sujaata too..

    ReplyDelete
  12. బాధా,కష్టం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని(అంటే ఇతరులకి తెలియదని కాదు కానీ అది గ్రహించడానికి కొంచం సున్నితమయిన మనస్తత్వం ఉండాలెమో)..మీరు ఆ బాధ అనుభవించారు కాబట్టే ఇంకెవరు అలా ఇబ్బంది పడకూడదని గ్రహించి మంచి మాట సాయం(సమాచారం)అందించారు.ఆనందంగా జీవితాన్ని సాగించండి.

    ReplyDelete
  13. కష్టాలు - సానుభూతి - కోపం - ధైర్యం - అనురాగం - అప్యాయత - ఇంకా చాలా ఉన్నాయి మీ వీర గాధలో.

    మీరు, మీ హీరో నిజజీవిత హీరోలు.

    ReplyDelete
  14. Bowing you..
    అలా ఒకసారి ఊహించేసుకోండి.

    ReplyDelete
  15. Kumar (and others)
    There is also some misunderstanding with words "Cervix" and "cervical spine" since they confuse with similar wording. Cervical spine is neck area and is the most uncovered area even in a physically challenging game like NFL. Once that region is damaged they can fuse cervical bones but the pain almost always NEVER ends. Head aches, nausea, problems to shift head to sides and every sort of thing follows and there is absolutely no relief. Some people might experience temporary relief but it will come back. What Sujata varu had was bone fusion in lumbar region. Cervical fusion can lead to paralysis neck down if things go wrong. And one has to wear a neck brace for REST OF HIS/HER LIFE if that happens. The worst thing is that the pain can flare up and come back repeatedly.

    Sujata garu is pretty lucky - given her scooter accident, getting thrown off the bike and yet only getting the damage she had - at least in my opinion.

    There are dozens of NFL stars whose necks(cervical spines, that is) are done in a nasty game, who would never walk again. They cannot even lift a finger. She probably mentioned this somewhere in her veeragadha. Google for more information on C1-C5 spinal bones, fusion etc.

    ReplyDelete
  16. సుజాత గారూ మంచి పని చేసారు ఆపరేషన్ చేయించుకొని.. బాబాలు, అమ్మలు, భగవాన్లు, మాతలూ , స్వాములు, తాయత్తులు, బూడిదలు, చేతబడులు జోలికి పోకుండా

    ReplyDelete
  17. చాలా inspiringగా ఉంది మీ వీర గాధ.

    ReplyDelete
  18. బాబా గారు

    థాంక్స్.

    ReplyDelete
  19. Mr.Anonymous

    I 100% agree with you. I always considered that I am lucky. Very lucky indeed.

    I am so happy for your detailed comment here. Cervix cancer is also a very prominent trouble I m surprised to know that in India, we dont consider it as a major issue. In the western world, every woman who is sexually active, mandatorily has to undergo a popsmear test to detect cervix cancer.

    Thanks a lot for explaining about cervical spine. I wish the patients some releif from pain with the present know how. I wish we know even better, to find a cure for this.

    ReplyDelete
  20. రాఘవ్ గారు

    అంత లేదు. అయినా సుధాచంద్రన్ కి మీ తరపునా, నా తరఫునా కూడా ఒక హేట్సాఫ్ !

    ReplyDelete
  21. హనుమంత రావు గారు

    థాంక్స్. కొన్ని బాధలు - ఫన్నీ గానే ఉంటాయి. కుయ్యో మొర్రో అని మొత్తుకొనే స్టేజ్ దాటాకా, వెనక్కి చూసుకుంటే నవ్వే వస్తుంది. నేను మరీ ఎడ్వర్టయిస్మెంట్ ఇచ్చేస్తున్నాననుకోకపోతే నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ గారు - డా. విష్ణుప్రసాద్ - కె.జీ.హెచ్,విశాఖపట్నం లో ఆర్థోపెడీషియన్. నా ఫిసియో థెరాపిస్ట్ - డా.వినోద్ - సెవెన్ హిల్ల్స్ హాస్పిటల్ లో ఫిసియో థెరాపిస్ట్. వినోద్ గారికి బయట ప్రాక్టీస్ ఉన్నట్టు లేదు. నేను ఈ డాక్టర్ లు నా జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను మంచం మీంచీ లేచి నించోబెట్టి, నా జీవితాన్ని లిటరల్ గా నా చేతుల్లోకి గిఫ్ట్ లా పెట్టేరు. అందుకని.

    ReplyDelete
  22. లచ్చిమి గారు

    థాంక్స్. బాధ పడి లేచిన తరవాత, గతం లో నే ఒక ఏడాది పైగా ఉండిపోయాను. ఇపుడు నాకు అంత నొప్పి ఉండేదా అని ఆశ్చర్యం కలుగుతుంది. నేను చాలా లక్కీ కదా !

    ReplyDelete
  23. శ్రీ గారు

    థాంక్స్ అండీ. జగదేక వీరనారి !!!! మా హీరో కి తెలుగు చదవడం వస్తే బావుణ్ణు ! మా హీరో తరఫునుంచీ కూడా థాంక్స్. మీ పాప ఎలా ఉంది ?

    ReplyDelete
  24. సుజాత గారు

    చాలా థాంక్స్. ఎంత చల్లని మాట ! మీరన్నట్టు ఆ అహం లేకపోతే కష్టం. ఈ మాట నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది. ఎందుకో ఈ అహం లేకపోతే నా కసలు వ్యక్తిత్వమే లేదు అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ కధనంతా త్వరగా ముగించేసాను. అయినా నేను చెయ్యాల్సిన సర్కస్ చాలా ఉంది.

    ReplyDelete
  25. కుమార్ గారు

    థాంక్స్.

    ReplyDelete
  26. పప్పు గారు

    థాంక్స్. నా పాయింటు కేచ్ చేసారు. మాట సాయం నాకూ చాలా మంది చేసారు. వాళ్ళ ధైర్య వచనాలు వినకపోయి ఉంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుని - ఆ ఆలశ్యం కారణంగా ఇంకా డేమేజ్ జరిగి ఉండేది. అందుకే అందరికీ గో ఎహేడ్ చెప్దామనే నా ప్రయత్నం. నేను ఇప్పటికి చాలా మందికి (నడుము నొప్పని కంప్లైంట్ చేసేవాళ్ళకు) ఇలానే (భయపెట్టేసి) క్లాసు పీకి ఆ విష్యాన్ని సీరియస్ గా తీసుకునేలా చేశాను. ఎది చదివి ఒక్కరంటే ఒక్కరైనా సాయపడితే, నా కష్టం వృధా పోదు.

    ReplyDelete
  27. మరమరాలు గారు

    థాంక్స్. ఎక్కువ అయిపోయింది పొగడ్త - నవ్వొచ్చింది. అయినా థాంక్స్ !!!

    ReplyDelete
  28. ప్రతాప్ గారు

    అమ్మయ్యో ! థాంక్స్ థాంక్స్. :D

    ReplyDelete
  29. కృష్ణా రావు గారు,

    థాంక్స్. అవన్నీ చేసుంటే - ఇది జరిగుండేదే కాదు. చచ్చూరుకుండేదాన్ని ! :D

    ReplyDelete
  30. భవాని గారు

    థాంక్స్.

    ReplyDelete
  31. U r jus wonderful..Couldnt control myself crying reading ur experinece.First cried reading ur painful experience,finally cried with happines.Wish u continue to live happily all of ur life..

    ReplyDelete
  32. ఊరెళ్లి, వచ్చాక బ్లాగులు చూడక మీ వీర గాథ టపాలు మిస్ అయ్యాను.
    మీ అనుభవాలనుండి అందరికి మంచి సమాచారం అందించారు. ఇక్కడ మీరు సానుభూతి ఆశించటం కన్నా ఇది ఎవరో ఒకరికన్నా పనికొస్తే చాలు అన్న మీ నిశ్చయం కనిపిస్తుంది.

    ఏదైనా వినటం వేరు, అదే మనకి అనుభవంలోకి వస్తే! ఆ అనుభవం నాకూ ఉంది కాబట్టి అప్పుడు మీరు ఎంత బాధ అనుభవించి ఉంటారో అర్థం చేసుకున్నాను. ఇక్కడ కావల్సింది పాజిటివ్ ఆటిట్యూడ్, మన మీద మనకి నమ్మకం, నాకేం లేదు, నాకేం కాదు అన్న ఆత్మ విశ్వాసం, దానికి ఇంట్లో వాళ్ళ మద్దతు--ఇవన్నీ మీ కథలో నాకు కనిపించాయి and you have won the battle.

    మీ హీరోకి, మీ కుటుంబసభ్యులకి, మీ స్నేహితులకి, చివరిగా (కానీ ముఖ్యంగా) మీకు నా అబినందనలు.

    ReplyDelete
  33. మరమరాలు చెప్పినదాంట్లో కించిత్తు కూడా పొగడ్త లేదండి. మీరు హీరోయే!

    ఇంకోటి -మీ మనోబలమూ, స్థైర్యమూ, ధైర్యమే మీ ఆప్తులకు ధైర్యాన్నిచ్చి ఉండాలి.

    ReplyDelete
  34. Niru garu

    thanks for ur nice comment.

    by d way - I visited ur food blog. Its wonderful. Thanks again.

    ReplyDelete
  35. వరూధిని గారూ

    థాంక్స్.

    ReplyDelete
  36. చదువరి గారూ

    ఇంత కన్నా ఫ్లాటరింగ్ పొగడ్త ఇంతవరకూ విన్లేదు. కాసేపు ఆకాశం లో విహరించి ఇపుడే వస్తున్నా.. చాలా థాంక్స్ సర్ !

    ReplyDelete
  37. సుజాత గారు, ఈ రోజు ఈనాడు లో మీటపాగురించి ప్రస్తావించినది చూసి ఇప్పుడే మూడు భాగాలు చదివాను. గత నవంబర్ లో నేను కూడలి చూడకపోవడం వలన మిస్ అయినట్లు ఉన్నాను ఇ టపా..
    Very Very Inspiring post... మొదటి రెండు టపాలు చదివేప్పుడు కళ్ళు మసకబారి ఏకబిగిని చదవలేకపోయాను. నిజంగా అంత నొప్పి ఎలా భరించారండి బాబు. మీ మనోధైర్యానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే సమయానికి మీకు అండగా నిలిచిన మీ కుటుంబానికి మీవారికి స్నేహితులకి కూడా అభినందనలు. స్వల్ప అనారోగ్యానికి, చిన్న కష్టాలకు కృంగిపోయే వారికి మీ టపా చూపించాలి.

    ReplyDelete
  38. I read all 3 parts one thing i want to say "AMMA CHAALA GOPPADI".

    ReplyDelete
  39. చాలా స్పూర్తివంతంగా ఉంది మీ వీరగాధ. ఈ గాధ ని పదిమందితో పంచుకొని వారిలో మీరెంత ధైర్యాన్ని నింపి ఉంటారో మీరు ఊహించలేరు. పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  40. సుజాత గారు,
    ఈ మూడు పోస్ట్ లు ఇంతకుముందు చదివాను....ఇప్పుడు మళ్ళా చదివాను. నా పరిస్థితి మొత్తం గా కాకపోయినా ఒక రకం గా ఇంతే,,,17 సంవత్సరాల చిన్న వయసులో నాకా నొప్పి వచ్చింది...ఆరు సంవత్సరాలు బాధపడ్డాను,,ఈ మధ్యే ఒక ఆరు నెలలనుండి కాస్త తగ్గుముకం పట్టింది...కాస్త వ్యాయామం చేస్తూ వుంటే కంట్రోల్ లో ఉంటోంది...మీకెదురైన చాలా అనుబవాలు నాకూ ఎదురైనాయ్...ఏదో మొత్తానికి ఇప్పుడిలా మీ పోస్ట్ లు చదివి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకున్తున్నాను.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.