Pages

30/11/2008

Missing



నాయనా.. నువ్వెక్కడున్నావు ? ఇంటి దగ్గర మీ మరాఠా అమ్మ నీ కోసం బెంగెట్టుకుంది. నీ సేన కూడా అయిపు లేదు. వీళ్ళందర్నీ వెంట బెట్టుకుని ఎక్కడ దాక్కున్నావబ్బా ? నీ ఆచోకీ తెలియక మరాఠ్వాడా మొత్తం తల్లడిల్లుతూ ఉంది. అసలు సిసలు మరాఠా ప్రజానీకానికి అన్న లాంటోడివి, నువ్వే ఇలా చేస్తే ఎలా నాయనా..?

ఇంటికి త్వరగా రా. అసలు మీ అనుమతి లేకుండా వచ్చిన నాన్-మరాఠా టెర్రరిస్టులూ, వాళ్ళ నుంచీ నాన్-మరాఠా మరియూ మరాఠా ప్రజల్ను రక్షించిన నాన్-మరాఠా సైన్యమూ, కమేండోలూ, వీళ్ళను చూసి నొచ్చుకుని ఇంట్లోంచి పారిపోయినావా నాయనా ?

ఇంటికొచ్చెయ్యి బాబూ.. నిన్నెవరూ ఏమీ అనరు. రెండ్రోజుల్లో రాష్ట్రం నీ చుట్టూనే తిరుగుతుంది లే! నీ ప్రాణాలకు ఒక 10 మంది నల్ల పిల్లుల్ని అడ్డు పెడతాం గానీ, గమ్మున టీవీ ల్లోకీ, పత్రికల్లోకీ తిరిగి రా బాబూ !

గమనిక : పై ఫోటో లోని వ్యక్తి, 26 నవంబరు 2008 తేదీ రాత్రి 9:30 గంటల నుంచీ కనిపించట్లేదు. తప్పిపోయినపుడు తెల్లని కుర్తా, పైజామా ధరించి ఉన్నారు. నిద్రలోనూ, మెలకువ లోనూ జై మహరాష్ట్రా అంటూ అరవడం అలవాటు. కేవలం మరాఠీ లో నే మాట్లాడగలరు. చత్రపతి శివాజీ మేనల్లుడి నని ఆయన నమ్ముతూ ఉంటారు. ఆచోకీ తెలిపినవారికి ఆకర్షణీయమయిన బహుమతులు ఇవ్వబడును.

32 comments:

  1. hahaha.. chk 2day's times of india... :)

    ReplyDelete
  2. మరేనండొయ్,
    హడావిడిలో మర్చేపొయాం. ఈ సేనలన్నీ ఏ కలుగులో దాక్కున్నట్టు

    ReplyDelete
  3. ఎవడో ఇబ్రహీం అంట..వాడితో బేరసారాలు అడుతున్నాడంట..!

    ReplyDelete
  4. తప్పిపోయిన మరాఠా మహావీరునికి తెలుగు వస్తే బాగుండేది. ఇంగ్లీషులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేయిస్తే బాగుంటుంది.

    ReplyDelete
  5. ఆకర్షణీయ బహుమతిగా పట్టిచ్చినవాళ్ళకి ఏకంగా మంత్రి పదవే ఇచ్చేస్తే సరి కదా(మళ్ళీ బహుమతులు వాటిని రాపింగ్ చెయ్యడం దండగ కదా)..(ఇంకొక్క మాట..దొరగ్గానే ఆ చెత్తగాణ్ణి వాడి అనుచర గణాన్ని శూలారోహణం చేయిస్తే మహరాష్ట్రకి పట్టిన పెద్ద శని వదుల్తుందేమో?.మాయబజార్లో ఘటొత్కచుడు గుర్తొచ్చాడు ఎందుకో)

    ReplyDelete
  6. వాళ్ళు వచ్చిన పనులు చేసేసుకుని వెళ్ళిపొయ్యారుగా! వారితో పేచి ఏముంటుంది?

    ReplyDelete
  7. బాగా వాతలు పెట్టారు!

    ReplyDelete
  8. అయిన దానికి కాని దానికి ఎగేసుకుంటూ అన్నింట్లో వేలు పెట్టె కొడుకు గురించి ఒక్క చానల్ కూడా, ఒక్క పత్రికలో కూడా వీడి ప్రస్తావన లేదు. కొడుక్కి ఉగ్రవాదులను చూసి -- -- పడిందేమో. ఎక్కడో కలుగులో దాక్కొని ఉంటాడు పిరికి వెధవ. వీడు వీడి చంచాలు త్వరలో బయట పడతారు... మరి శవాల మీద రాజకీయాలు చేసి కమిషన్లు కొట్టాలి కదా ..

    ReplyDelete
  9. Medha..

    I will check it. thanx.

    ReplyDelete
  10. Lakshmi, Chaitanya garu

    Thanks.

    ReplyDelete
  11. లలిత గారు

    అదే కదా కధ ! ఆ కలుగులన్నిటిని ఎం-సీల్ వేసి మూసేయాలి.

    ReplyDelete
  12. బాబు గారు

    ఎవరా ఇబ్రహీము ? ఏమా కధ ? ఏమి బేరము ? :D

    ReplyDelete
  13. సీతారాం రెడ్డి గారు

    థాంక్స్. టైంస్ ఆఫ్ ఇండియా లో వేస్తే చదువుతాడో లేదో ! సామ్నా లో వేయించాలంటారా ? :D

    ReplyDelete
  14. శ్రీనివాస్ గారూ

    మాయాబజార్ భాష బావుంది. దేశానికి పట్టిన దుషటచతుషటటయాల్లో ఈయనొకరు. జనాల్ని కలిపినవాడెవరూ ఇంత త్వరగా పతాక శీర్షికలకెక్కరు. ఏ రామన్ మేగసేసే నో వస్తే గానీ (దానికో 30 ఏళ్ళు పడుతుంది కదా) రాని ఫేం జనాల్ని విడగొడితే వస్తుంది. (వీజీగా, షూర్ గా, ఇన్స్టంట్ గా !) అదీ పద్ధతి.

    ReplyDelete
  15. సుజాత గారూ

    థాంక్స్.

    ReplyDelete
  16. మగవాడు గారు

    అదే కదా ఈయన ప్రాబ్లం ! అందుకే బాధ పడి / భయపడిపోయి, వీధిలోకి తొంగి చూళ్ళేదు. నిజంగా శివాజీ వారసుడయితే కనీసం మీడియా ముందుకొచ్చి నాకు కోపమొచ్చిందీ అని అరవాలిసింది. అదీ చెయ్యలేదు.

    ReplyDelete
  17. కొత్త పాళీ గారు

    మహేష్ గారు

    సీ బీ రావు గారు

    థాంకులే థాంకులు ! ! !

    ReplyDelete
  18. కొత్త పాళీ గారు

    మహేష్ గారు

    సీ బీ రావు గారు

    థాంకులే థాంకులు ! ! !

    ReplyDelete
  19. మధు గారు

    శ్రీ గారు

    థాంక్స్.

    ReplyDelete
  20. కృష్ణారావు గారు

    అయ్య బాబొయ్ ! ఆవేశం వొద్దు ! ఈ రాజ్ థాకరే మాత్రమే కాదు. అసలు రాజకీయ నాయకులందరూ అలానే ప్రవర్తించారు. అందుకే పార్లమెంట్ మీద అక్షరాలా దేశనాయకులందరూ సెషన్ లో ఉన్నపుడు దాడి జరిగినప్పుడు కూడా 'చంపేయాల్సింది - రాజకీయ నాయకుల్ని - పీడా విరగడయ్యేది !' అని జోకులేసుకున్న జనం, ఈ ముంబయి దాడుల బాధితుల లో అద్దంలో తమను చూసుకున్నట్టు ఉలిక్కిపడి, తీవ్రవాదాన్ని ఒక్క కంఠం తో ఖండించారు.

    ReplyDelete
  21. రాజ్ థాకరే పై చిటపటల టపా అదిరింది. But he has too little to comment on an issue like terrorism, might have atleast show his grief and condolences. కాని ప్రెస్ వారు ఊరుకుంటార? గీచి గీచి అడుగుతారు.. అందుకే, పాపం! మా వైపు ఐతే రాలేదు. ఒకసారి, వంటగదిలో, గొడ్లచావడి లో వెతికారా? ప్రయత్నించండి.

    ReplyDelete
  22. అసలిక్కడ కామెంటు రాయకూడదనుకున్నా..ఎందుకంటే కూడలి/జల్లెడలొ కనిపించగానే చదివా,చదువుతుంటే నవ్వు.పిచ్చ నవ్వు.పిచ్చి నవ్వు వెంబడి దగ్గు ఎంత దగ్గొచ్చిదంటే అసలీ అమ్మాయి రాసిందేది ఇక చదవకూడదు అన్నంత(నా దగ్గు కు మా ఆవిడ సీరియస్ అయి అరిచిందనుకుంటున్నారా ఉత్తిదే)కానీ తప్పలేదు.ఇక్కడెవరో అన్నట్లు ఆ వంటగదిలో వెతికించారా లేదా?? :)

    ReplyDelete
  23. 'రెండు జళ్ల సీత' అని మీరు ఓ కామెడీ భ్లాగు మొదలుపెట్టొచ్చు(రె.రె.ఆ. స్ఫూర్తితో)
    టపా అదిరింది...నవ్వులే నవ్వులు:-)

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.