నువ్వోస్తావని సాయంత్రం అంతా ఎదురు చూసాను
చెట్ల నీడన పిచ్చుకల తో కబుర్లు చెబుతూ !
చల్ల గాలి తెమ్మెరలు కదిలిస్తున్న
ఆలోచనల తో ఆటలాడుతూ !
రావేమో లే అని అనిపించి నిట్టూర్చేసరికీ,
చుట్టూ నిరాశలా కమ్ముకుంది చీకటి.
రాత్రి లోగిల్లోకి ఎదురు చూపుని నెట్టి -
'వస్తే లేపుతావు లే!' అని - మత్తు గా నిద్ర పోయాను.
నువ్వు రానే లేదు !
దీర్ఘ - సుషుప్తి లోంచీ నన్ను లాగడానికి!
వస్తే లేపుతావులే అనుకోడంలో తృప్తి వుంది, చివరిలైనులో దీర్ష సుషుప్తి అన్నపదం ముగింపుని సూచిస్తోంది. మీఅభిప్రాయం అదేనా.
ReplyDeleteమరో మాట. మీరు నా ఇంగ్లీషుతూలికకి లింకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
మాలతి
మాలతి గారు..
ReplyDeleteచాల థాంక్స్. నా అభిప్రాయం అదే ! ఆ వేచి ఉండడానికి ఒక ముగింపు - కొనసాగింపూ.. అన్నీ సుషుప్తి లోనే. మీ ఇంగ్లిష్ తుళిక చాలా బావుంటుంది. అందుకే లింక్ ఇచ్చాను. తుళిక అంటే అర్ధం ఏమిటి ?
తుళిక కాదనుకుంటానండి... తూలిక అయ్యుంటుంది... అంటే పక్షి ఈక... "హంస తూలికా తల్పం" అనేమాట వినేఉంటారు
ReplyDeleteసరే, సజాతా, థాంక్స్. కవిత బాగుంది. తూలిక ఆర్.యస్.జీ. గారు చెప్పిందే, ఈక అనీ, కుంచె అనీ కూడా చెప్పుకోవచ్చు.
ReplyDeleteమాలతి
మాలతి గారు
ReplyDeleteఆర్ ఎస్ డీ గారు.. థాంక్స్. :D