రాత్రి నాకొక కల వచ్చింది. భయంకరమైన కల. న్యూక్లియర్ డీల్ త్రూ అయిపోయింది. ఆంధ్రా వాటాగా, తెలంగాణా లో మొదటి పవర్ ప్లాంట్ పెట్టారు. ఎలక్ట్రిక్ కార్లూ, ట్రాములూ నడుస్తున్నాయి హైదరాబాదులో. పవర్ ప్లాంట్ పెట్టారు కాబట్టి తెలంగాణా అంతా విపరీతంగా చెట్లు నాటారు. ఆ చెట్లకి గోదావరి నుంచీ, కృష్ణ నుంచీ తీసుకొచ్చిన జలాలతో పోషణ అందిస్తున్నారు. దక్కన్ ప్రాంతం అంతా చల్లగా అయిపొయింది.
కోస్తా అంతా సముద్రం నుంచీ తీసి, శుద్ధి చేసిన మంచి నీటితో వ్యవసాయం చేస్తున్నారు. రాయల సీమ లో ఫాక్షనిస్తులు అంతా, బుద్ధి తెచ్చుకుని తిరుపతి లో చిన్నజియ్యర్ స్వామి మఠం లో చేరిపోయారు. హైదరాబాద్ లో ఊరు పొడుగునా ఎలెక్ట్రిక్ ట్రైన్లు నడుస్తున్నాయి. చవక లో రవాణా సాధనాలు లభిస్తున్నాయి కాబట్టి ఆటోలను నిషేదించారు. ట్రాఫిక్ సమస్య తీరింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో, బేస్మెంట్ లో ట్రైన్ స్టేషన్ కట్టారు. అక్కడ ట్రైన్ పట్టుకుని, రాష్ట్రం లో లేదా.. హైదరాబాద్ జంట నగరాల్లో.. ఎక్కడకన్నా వెళ్లొచ్చు!
చిరంజీవి, చంద్ర బాబు, జయప్రకాష్ నారాయణ కలిసి రాజకీయ కూటమి పెట్టారు. ఎలా అయినా కాంగ్రెస్ ని గద్దె దించాలని రవీంద్ర భారతి బయట బహిరంగ సభ లో కఠినశపధం చేసారు. బోల్డంత బెట్టింగ్ జరుగుతుందని ఐపీఎల్ మాచుల్ని నిషేధించారు. చెత్త సినిమాలు తీసీ తీసీ విసిగిపోయారని నిర్మాతలకూ, దర్సకులకూ బ్రేక్ గా - తెలుగు సినిమాల్ని కూడా కొన్నాళ్ళు నిషేధించారు. పిల్లలూ, పెద్దలూ కలిసి మెలిసి సాయంత్రాలు ఆటలూ, వాకింగులూ అయాక, ఇల్లు చేరి, చదువుకుంటున్నారు.
రాష్ట్రం లో ''హరిత విప్లవం - ౨'' మొదలయింది. బియ్యం, నూనె, కూర గాయలూ, పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. కరెంట్ ఇష్టం వచ్చినంత ఉంది కాబట్టి, వ్యవసాయానికి నీళ్ళ కరువు లేదు. దూర ప్రాంతాలనించీ కూడా నీరు తెప్పిస్తున్నారు - అంచెలలో - పైపుల ద్వారా, ప్రాజెక్ట్ ల ద్వారా ! రైతులందరికీ మంచి ఒళ్టేజీ తో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. పల్లెటూళ్ళలోఇష్టం వచ్చినన్ని బడులూ, ఆస్పత్రులూ కట్టిస్తున్నారు. అన్నింట్లో ప్రగతి తన్నుకొచ్చేసి కనిపిస్తూంది. ముఖ్యంగా అందరూ మూడు పూటలా అన్నం తింటున్నారు. చిన్న పిల్లలంతా చదువు కుంటున్నారు. పిల్లలకు ఎవరూ పని ఇవ్వట్లేదు. పని కోసం వస్తె, స్కూల్ లో చేర్పిస్తున్నారు.
వంట గాసు కనెక్షన్లు అందరూ వాపసు చేస్తున్నారు. ఇపుడు ఇళ్ళల్లో కరెంటు స్టవ్ లు అందుబాటులోకి వచ్చాయి. కాలుష్యం తగ్గింది. పట్నాలలో కూడా స్వచ్చమైన గాలి అందుబాటులో ఉంది. ప్రజలు హాబీ గా కాలనీ లలో, పార్కులు కట్టించుకుంటున్నారు. చెట్లు నాటుతున్నారు. అయినా హైదరాబాదు వేడెక్కి పోతుందని భయపడి వారానికో రోజు బత్తీ-బంద్ చేస్తున్నారు. ఊరంతా రీసైక్లింగ్ పెద్ద ఫాషన్ అయిపోయింది.
...........*(^%&^*%^&£%$£...... $$$£$"£"£$%$£
.... ....."$"$^$%^&%^*^&*^&*%*.....
.........^&*%^&$%^£$$%£&*********
...హుష్ ! తెలివోచ్చి బంగారం లాంటి కల చెడిపోయింది.
(సుమన్ + ప్రభాకర్ ఈ టీవీ ని వోదిలేస్తున్నారని విని.. ఆ అలౌకిక ఆనందంలో నిద్దరోవటం వల్ల వచ్చిన కలవరింతలు ఇవి.. తప్పట్టుకోకుండా ఈ ఊహా - భరిత ప్రేలాపన ని క్షమించండి)
చప్పట్లు...చాలా సార్లు.
ReplyDelete-- విహారి
telugu lo ela type cheyyali? katti lanti kala kada..nenu ide aalochana to padukotaaniki veltunna, naaku ee kala continuation vaste bagunnu..
ReplyDeleteVihari garu
ReplyDeleteThannx.
khushi
ReplyDeleteaunu. katti lanti kala.
Telugu lo type cheyyalante... abdul kalam ki girl friend gaa puttali. :D
Adurs..... me kala
ReplyDeleteసూపర్!!! ఆ ఆఖరున మీరు రాసినది చదివి (ఈ టీవీ గురించి) కింద పడి దొర్లి దొర్లి నవ్వాను!
ReplyDeletewww.gambholajamba.blogspot.com
మీ కల వింతగా ఉది!
ReplyDeleteమీరు కలగన్నవి అన్నీవాంఛనీయమని అనుకోను. ఇప్పటికే సుమన్ ప్ర్భాకరుల ప్రస్థానంతో మన తెలుగు బ్లాగర్లు అల్లాడుతున్నారు, రెడీమేడ్ ఎవర్ గ్రీన్ టాపిక్ పోయిందే అని. ఇహ తెలుగు సినిమాల్ని నిషేధిస్తే నా లాంటి వాళ్ళు కచ్చ రేగినప్పుడల్లా ఎవర్ని ఆడిపోసుకోవాలి?
:-)
చాలా బాగా రాశారు.
నరసింగ్ రావ్ గారు, ఆదిత్య - థాంక్స్.
ReplyDeleteకొత్త పాళీ గారు..
సినిమాలు కేవలం తాత్కాలికంగా ఆపేసారు. పూర్తి గా ఆపేస్తే తెలుగు వాళ్లు ఎలా కళాపోసన చేస్తారు చెప్పండి ?
కొసమెరుపు భలే ఉంది. సుమన్+ ప్రభాకర్ ఈ టీవీ విడిచిపెడితే ఇంతమంచి కలరావటం మహబాగుంది. వారి హింస ఎంతదారుణమో చెప్పకనే చెప్పారు.
ReplyDelete