లెస్ మిసెరబుల్స్ - నిజానికి ఫ్రెంచు పదం - దాన్ని సరిగ్గా 'లే మిసారబ్' అని పలకాలి. ఈ సినిమా కి చాలా వెర్షన్లు ఉన్నాయి. ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో 1862 లో రాసిన నవల ఇది. దీన్ని ఇదే పేరుతో సినిమాగా తీసారు. కొన్ని సార్లు కొంచెం కొంచెం మార్చారు. ఇలాంటి క్లాసిక్ ని పరిచయం చెయ్యబోయే ముందు 'ఏమైనా తప్పులు ఉంటే మన్నించమని మిమ్మల్ని కోరుకొంటూ, మొదలు పెడతాను.
ఇపుడు చెప్పబోయేది, 1998 లో తీసిన సినిమా గురించి. అసలు మూల కధ ఇది. అసమానమైన బలవంతుడు - వాన్ షువాన్, ఆకలికి తట్టుకోలేక, రొట్టె దొంగతనం చేసినందుకు గాను 19 ఏళ్ళ పాటూ, భయంకరమైన కారాగార శిక్ష అనుభవించి, పెరోల్ మీద విడుదల అవుతాడు. నిర్దాక్షిణ్యమైన జైలు జీవితం, బాల్య చాంపల్యం వల్ల తరచుగా తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాల మూలంగా కూడా, అనుభవించిన శిక్షలూ, అతన్ని జంతువులా మారుస్తాయి. పెరోల్ మీద వచ్చిన నేరస్తుడికి ఎవరూ నిలువ నీడనివ్వరు. ఆకలితో, చలితో దారుణమైన పరిస్థితుల్లో ఒక క్రైస్తవ మత గురువు, అతనికి భోజనం పెట్టి, ఆశ్రయం ఇస్తాడు.
రాత్రి ఆ ఇంట్లోనే వాన్ షువాన్ కొన్ని వెండి వస్తువులు దొంగిలించి, అడ్డొచ్చిన మత గురువుని కొట్టి పారిపోతాడు. ఆ రాత్రే దొంగని పోలీసులు పట్టుకుంటారు. అతను ఆ వస్తువులు మతగురువు ఇచ్చాడని చెప్పడం వల్ల, అతన్ని తీస్కొచ్చి మతగురువు ముందు నిలబెడతారు. మతగురువు అప్పుడు ఆ దొంగతనాన్ని వెల్లడించకుండా, వాన్ షువాన్ ను క్షమించి, ఆ వెండి ని తనే ఇచ్చినట్టు చెప్పి, మరి రెండు వెండి దీపపు సమ్మెలు ఇచ్చి పంపేస్తాడు. మతగురువు చూపిన కరుణ, అతని క్షమాగుణం, జీవితం లో మొదటిసారి అనుభూతికొచ్చిన మానవత్వం, వాన్ ను మారుస్తాయి. గతాన్ని మరీచి, కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ, కొత్త వూరికి పారిపోయి మంచి వాడిగా స్వతంత్రం గా బ్రతుకుతూ, చిన వ్యాపారాన్ని కూడా ప్రారంభించి, అంతలోనే మంచిపేరు సంపాయించి, ఆ వూరికి మేయర్ అవుతాడు కూడా.
అయితే అతని కారాగార వాస శిక్షా సమయం లో, జావెర్ అనే ఓ పోలీసు తో వృత్తిపరమైన పరిచయం - దొంగా పోలీసు బంధం ఏర్పడుతుంది. వాన్ షువాన్ పెరోల్ మీద విడిదలయి, తిరిగి అంతూ పొంతూ లేని తన శిక్ష ని అనుభవించడం మాని, ఎటో పారిపోవడం ప్రభుత్వానికి, పోలీసులకూ కిట్టదు. అందుకే వాన్ గొంతు మీద కాలం అనే కత్తి వేలాడుతూనే వుంది. అతను ఎప్పటికైనా చట్టానికి పట్టుబడే అవకాశాలున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వాన్ నెలకొల్పిన ఒక ఫాక్టరీ లో ఫోంటైన్ అనే బీద అమ్మాయి పని చేస్తూ ఉంటుంది. ఓ రోజు వాన్ ఉండే ఊరికే జావర్ ఇన్స్పెక్టర్ గా రావడం, ఈ మేయర్ గా ఉన్న వాన్ ని కలుసుకోవడం జరుగుతుంది. మేయర్ వాన్ చూస్తూనే జావర్ ని గుర్తుపడతాడు. ఇన్స్పెక్టర్ కూడా ఈ పెద్దమనిషి ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటాడు. ఈ టెన్షన్ లో ఉండడం వల్ల ఓ రోజు ఫోంటైన్ కి గ్రామం లో ఒక కూతురుందని, ఇలాంటి శీలం లేని పెళ్ళి కాని పిల్ల తమ ఫాక్టరీ లో పనిచెయ్యడం మంచిది కాదనీ, వర్కర్లు కంప్లైంటు చెయ్యడం తొందరపడి ఫోంటైన్ ని ని పని లోంచీ తొలగిస్తాడు.
ఒంటరి తల్లి ఫోంటైన్, తన ఏకైక కుమార్త కోసెట్ గురించి ఎలా గో ఒక లా సంపాదించవలసిందే. ఈ పని పోవడం వల్ల దాదాపు రోడ్డు మీదికొచ్చిన ఆమె బ్రతుకు, ఆమే ను వ్యభిచారి గా మారుస్తాయి. అందేమైన తన పళ్ళనూ, జుట్టు నూ కూడా అమ్ముకుంటుంది. చలి లో, అనారోగ్యం తో సతమతమవుతూ, విటుల కోసం బజార్లో నిలబడ్డ ఆమెను ఓ జులాయి అవమానిస్తాడు. చిన ఘర్షణ జరుగుతుంది. అయితే ఈ బక్కచిక్కిన ఆడది, ఆ మృగం తో పోరాడలేకపోయినా సరే, ఆ అహంకారి, అక్కడే డ్యూటీ లో వున్న జావెర్ కు కంప్లైంట్ చెయ్యడం, జావెర్ ఆమె ను అర్రెస్ట్ చేసి తీసుకుపోవడం జరుగుతాయి. ఈ లోగా అతని మేలు కోరే ఒక వర్కర్ వాన్ షువాన్ కు ఫోంటైన్ దీనత ని చెప్పడంతో చలించిపోయిన వాన్ షువాన్ ఉన్నపళంగా ఇన్స్పెక్టర్ వద్దకు పోయి, మేయ్హర్ గా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆమెను విడుదల చేయిస్తాడు
ఫోంటైన్ కూతురు కోసెట్ ఒక ఫ్రెంచు గ్రామం లో ఒక స్వార్ధపరులైన దంపతుల సంరక్షణ లో వుంటుంది. వాళ్ళు కోసెట్ ని బాగా చూసుకుంటున్నామని తల్లిని నమ్మిస్తూ, డబ్బు కావాలనీ అదనీ ఇదనీ, ఫోంటైన్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటారు. నిజానికి వాళ్ళు కోసెట్ ను బానిస లాగా వాడుకుంటూ, తిండి కూడా పెట్టకుండా ఆ చిన పిల్లను నానా కష్టాలకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళకో పూటకూళ్ళిల్లు వుంటుంది. అక్కడ కోసెట్టే పనిమనిషి. అయితే ఈ విషయాలు తెలీని ఫోంటైన్, సంపాయించి పంపేది.
తన మూలంగానే నిర్భాగ్యురాలైన ఫోంటైన్ సంరక్షణ బాధ్యత ను స్వీకరిస్తాడు వాన్ షువాన్. అయితే, అనారోగ్యురాలైన ఫోంటైన్, చావు ముంచుకొస్తోందని గ్రహించి, కోసెట్ గురించి బాధపడుతూ ఉంటుంది. ఈ లోగా జావెర్ 'మేయర్ వాన్' వద్దకు వచ్చి, అసలయిన 'వాన్ షువాన్' దొరికాడనీ, తమర్ని అనుమానించినందుకు మన్నించవలసిందనీ కోరుతాడు. అయితే, తన స్థానంలో ఎవరో అమాయకుడు జైలు పాలయి, దారుణమైన జీవితం గడపడం ఇష్టం లేని వాన్ షువాన్ ,తిన్నగా కోర్టు కి వెళ్ళి, తన అసలు అస్థిత్వాన్ని వెల్లడిస్తాడు.
చకితులైన కోర్టు వారినీ, పోలీసులనీ, తనే వాన్ షువాన్ అనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ప్రూవ్ చేసి, తనని అరెస్టు చెయ్యొచ్చనీ చెప్పి, అమాయకుణ్ణి విడుదల చేయించి, ఇంటికొస్తాడు. ఈ సంఘటన తో కుపితుడైన ఇన్స్పెక్టర్ జావెర్, ఆఘమేఘాల మీద మేయర్ ఇంటికొచ్చి, అతన్నీ, అతను విడుదల చేసిన ఫోంటైన్ నీ అరెస్టు చెయడానికి వస్తాడు. ఆ షాక్ లో ఆ నిర్భాగ్యురాలు ప్రాణాలు విడుస్తుంది. ఆమెకు కోసెట్ ను సొంత తండ్రి లా చూసుకుంటానని వాగ్దానం చేస్తాడు వాన్. అప్పటికి కొన్ని రోజులు గ ఆమె తో గడపడం వల్ల వాన్ కు ఫోంటైన్ అంటే ప్రేమ కలుగుతుంది.
ఆ తరవాత తన్ను పట్టుకోవడానికొచ్చిన పోలీసుల్ని తప్పించుకుని, కోసెట్ ఉన్న గ్రామానికి వెళ్ళి, అక్కడ్నించీ ఆమెను రక్షించి, పారిస్ తీస్కొచ్చి, తనని ఒక కాన్వెంటు లో సాకి, ఆ తరవాత మెల్లగా వేరే జీవితం ప్రారంభిస్తాడు. ఈ కోసెట్ పెరిగి పెద్దవడం, ఆమె ప్రేమ, ఫ్రాన్సు లో విప్లవం (ఫ్రెంచు విప్లవం కాదు) జావెర్ కూ, వాన్ కూ మధ్య ఘర్షణా.. ఇవన్నీ చాలా పెద్ద కధ.
To be continued...
Note : I invite 'corrections' if any, from the kind hearted readers, because my memory is poor.
"ఇవన్నీ చాలా పెద్ద కధ "
ReplyDeleteYes, చా......లా.... పెద్ద కథ :)
మూడు వారాల క్రితమే కొన్నానీ పుస్తకం. నా కోసం కాదు :)అమ్మాయి కోసం. నేను కొన్న ఎడిషన్(పేపర్ బాక్) లో 1232 పేజీలున్నాయి. ఒక జీవితకాలం పడుతుంది నాకు చదవడానికి, అందుకని లైట్ తీస్కున్నా.
Eagerly waiting for the next part.
And yes, Big Thanks for this post.
లె మిసెరాబ్ల్ గురించి మీరు చెబుతున్న కథ 2012లో విడుదలైన చిత్రమైతే అది ఓ అద్బుతమైన సంగీత నాటిక గా రూపొందిచ్చారు అనిగూడా చెప్పాలి.
ReplyDelete"దాన్ని సరిగ్గా 'లే మిసారబ్'"
ReplyDeleteచిన్న సవరణ:
లె మిసెరాబ్ల్ సరైన ఉచ్చారణ