ఇవన్నీ - 'పుస్తకం' అనే ఓ 'వింత వస్తువ' మాయ లో జరుగుతూంటాయి. లోకమంతా ఒక 'మాయ' ఐతే, పుస్తకం ఒక 'విష్ణుమాయ'! చాలా మంది పుస్తక ప్రియులకి పుస్తకాలు వేన వెర్రిగా కొనడం అలవాటు. కొందరు కేవలం 'అలంకరణ కే ' కొంటారు. కొందరు పుస్తకాల్ని బహుమతులు గా ఇస్తూంటారు. కొందరు కొన్ని "అత్భుత పుస్తకాల్ని" ఎంతో అపురూపంగా దాచుకుంటారు. కొందరు పుస్తకాల కి పెట్టినంత ఖర్చు ఇంకే వస్తువకీ పెట్టరు. కొందరు పుస్తకాలు అరువివ్వరు. కొందరు (99.9% మంది) అరువు తీసుకున్న వాళ్ళు వాపసు ఇవ్వరు. పుస్తకం 'పోయిందీ - అనగా వాపసు రాలేదు, రాదు!' అని రియలైస్ అయిన్నాడు అన్నం సహించకపోవడం చాలా మందికి అనుభవం. కొన్ని అపురూపమైన సెంటిమెంట్లు అతుక్కున్న పుస్తకాలుంటాయి. రచయిత స్వయంగా సంతకం చేసిచ్చినవి, ఫలానా పాండీ బజారులో మండుటెండలో రోడ్డు పక్కన కొన్నవి, ఎవర్నో బ్రతిమలాడి ఎక్కడ్నించో తెప్పించుకున్నవి - ఇలా. ఎవరి లైబ్రరీ వారికి అపురూపమైన గని. పుస్తకం మహా మాయ. ఆ మాయ లోంచీ బైటపడ్డం కష్టం.
ఫలానా 'పుస్తకం మా దగ్గరుంది, ఫలానా 'పుస్తకం' చదివానూ అని చెప్పుకోవడం కొందరికిస్టం. ఏదో ఒక పుస్తకం చదివి ట్రాన్సు లోకి వెళిపోయి, అదేదో లోకాన్ని సొంతంగా సృష్టించేసుకుని, తీవ్రంగా అభిమానించే జనం కొందరు. వీటన్నిటిలో, పుస్తకాన్ని పక్క వాడికి పంచడం అనే పెద్ద హృదయం చాలా తక్కువ మందికి వుంటుంది.
ప్రతి పుస్తకానికీ ఒక చరిత్రుంటుంది. సాధారణం గా మన దగ్గర ఏదైనా పుస్తకం తాలూకూ కాపీ అదనంగా ఉన్నపుడు ఏ స్నేహితులకో గిఫ్ట్ గా ఇస్తాం. కొన్ని చదివినా నచ్చని పుస్తకాలూ ఉంటాయి. కొన్ని చదివి, ఇంకోరితో చదివించేంత మంచి పుస్తకాలూ వుంటాయి. కొందరు పుస్తక ప్రియులకు, ముఖ్యంగా వృద్ధాప్యం లో వున్న వాళ్ళ దగ్గర కుప్పలు గా పేరుకుపోయిన అమూల్య సంపదని పరిరక్షించే స్పూర్థి ఉన్న వారసులు ఉండకపోవచ్చు. పుస్తకం తాలూకూ ధన్యత అది నలుగురు చదివితేనే కదా చిక్కేది. పుస్తకం షెల్ఫుల్లో పడి ధూళి పేరుకునే బదులూ, దాన్ని నమ్మకంగా చూసుకునే ఏ లైబ్రరీ కో ఇద్దామని చాలా మందికి వుంటుంది.
కొందరు పుస్తకాల్ని ఇష్టం వొచ్చినట్టు పేర్చి, నాశనం చేస్తారు. లైబ్రరీ సైన్సు చదువుకున్న వాళ్ళనడగండి. పుస్తకాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలో. నాకు తెలిసి ఒక పెద్దాయన, అపురూపమైన తెలుగు వాగ్మయాన్ని ట్రంకు పెట్టెల్లో సంవత్సరాలు గా పెట్టి ఆఖరికి చెదల పాలు చేసారు. ఆయన పోయాకా, పెట్టె తెరిచి చూస్తే, పిండే మిగిలింది. ఆయన కి ఆ పుస్తక సంపద అంటే తెగ మోహం. ఎవరికీ ఇచ్చేవారు కాదు. అపుడపుడూ రిఫర్ చేసే వారేమో గానీ, ఎందుకనో అవన్నీ పాడైపోయాయి.
కొందరికి ఇంట్లో ఎటు చూసినా పేరుకు పోయిన పుస్తకాల్ని చూస్తే విసుగ్గా వుంటుంది. ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ లో అన్నీ తూకానికి వేసినా వెయ్యొచ్చు. కొందరికి కొన్ని కాలక్షేపం నవలల్ని వొదిలించుకోవాలనుంటుంది. ఇవీ చాలా మటుకూ, తూకానికో, విదేశాల్లోనైతే, రీ సైక్లింగ్ కో పడేస్తారు.
వీటన్నిటికీ పరిష్కారంగా ఒక సోషల్ నెట్ వర్కింగ్ బుక్ క్లబ్ ని ఎవరో పుస్తకప్రియులే కనిపెట్టారు. దీని పేరు 'బుక్ క్రాసింగ్'. ఈ క్లబ్ లో చేరిన పుస్తకాలు ప్రపంచం అంతా ప్రయాణిస్తాయి. దీన్లో చేరిన సభ్యులు తమ పుస్తకాల్ని ఒక సైట్ లో రిజిస్టర్ చేసుకుంటారు. చేరిన ప్రతి పుస్తకానికీ ఒక యూనిక్ బుక్ క్రాసింగ్ ఐడీ నెంబరు ఇస్తారు. ఇది పుస్తకానికో గుర్తు అన్న మాట. మీరు ఇతరులతో షేర్ చేసుకోవాలనుకునే పుస్తకాన్ని ఆ ఐడీ ఒక లేబుల్ పై రాసి, మీ ఇష్టమైన పబ్లిక్ ప్లేస్ - సాధారణంగా పుస్తకం ఏమిటా అని చూసే వ్యక్తులు తారసిల్లొచ్చు అనుకునే ప్రదేశాల్లో, ఉదాహరణ కి - పబ్లిక్ లైబ్రరీల్లో / ఆర్ట్ గాలరీల్లో / కాలేజీ లో / బస్ లో / ట్రైన్ లో / విమానాశ్రయం లో - అలా విడిచిపెట్టొచ్చు. దీన్ని తరవాత ఎవరో మనం ఎరుగని వ్యక్తి మనం ఎరుగని టైం లో చూడొచ్చు. ఆసక్తి ఉంటే, ఆ పుస్తకాన్ని తీస్కెళ్ళి చదువుతారు. లేదా వొదిలేస్తారు. అలా చదివిన రీడర్ మళ్ళీ, ఆ పుస్తకాన్ని వేరేఅ చోట విడిచిపెట్టొచ్చు. పుస్తకం దొరికిన తరవాత, బుక్ క్రాసింగ్ సైట్లో కి వెళ్ళి, పుస్తకం ముందున్న యూనిక్ ఐడీ నెంబర్ ని ఎంటర్ చేస్తే, మనకు పుస్తకం చరిత్రా తెలుస్తుంది, సైటు వాళ్ళకు / పుస్తక దాత కు పుస్తకం జాడా (ఎవరో ఒకరు చదివారన్న తృప్తి) దొరుకుతుంది. ఇది పూర్తిగా ఉచితం, ఎక్కువ స్వంత సమాచారం ఇవ్వనక్కర్లేదు గాబట్టి క్షేమం కూడా.
సడన్ గా ఏ బస్ లో నో మీకో మంచి పుస్తకం దొరికిందనుకోండి ! ఎంత థ్రిల్ అవుతారు ? అలానే ఆ విషయం దాత కి సైట్లో తెలియజేస్తే, దాత కూడా థ్రిల్ అవుతారు. పుస్తకం ఒక మంచి నేస్తం. ఈ పుస్తకాల ద్వారా మనం మరిందరు మనుష్యులతో ఒక లాంటి స్నేహమే చేస్తున్నాం. పుస్తకాన్ని మరో మనిషి తో పంచుకోవడం ద్వారా ఒక లాంటి మానవీయ బంధమేదో ఏర్పరుచుకుంటున్నం. ఈ సైట్ లో చేరడం ద్వారా మన పుస్తకాలకి రెక్కలిస్తాం. (మళ్ళీ మన దగ్గరికి రావనుకోండి. పుస్తకాలు మనల్ని విడిచి వెళ్ళిపోతాయి).
ఇదో చెత్త కాన్సెప్ట్. మన దేశం లో వర్క్ ఔట్ కాదేమో అని అనిపిస్తూందా ? ఎంత వీలయితే అంత.. చూద్దాం అనే పద్ధతి లో నైనా ఈ పద్దతిని మనం కూడా మొదలు పెట్టొచ్చు. ఇంటర్నెట్ వాడకం మన దేశం లోనూ ఎక్కువయింది. సోషల్ నెట్ వర్కింగ్ అయితే లెక్కే లేదూ. ఏమో చెప్పలేం. మన దేశం లోనూ హిట్ కావచ్చు. పైగా పబ్లిక్కు కి మంచి పుస్తకాల్ని దానం చెయ్యడం చాలా మంది వల్ల కాదనుకోండి. ఇలాంటి 'ప్రయాణించే పుస్తకాలూ బహుశా చాలా మంది 'వొదిలించు కుందామనుకునే రకం చెత్త పుస్తకాలేమో ' అని సందేహం కూడా రావచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలంతే, ఈ సైట్ ని ఓసారి దర్శించొచ్చు.
వీళ్ళు చెప్తూన్న లెక్కల ప్రకారం, ప్రపంచ వ్యాప్తం గా ఈ (ప్రపంచ పుస్తక భాండారం అనొచ్చు) 9,667,897 పుస్తకాల్ని 1,807,007 గురు సభ్యులు షేర్ చేసుకుంటున్నారు. సరే. అన్నిట్నీ గాలికి వొదిలేయక్కర్లేదు. ఇష్టమైన పుస్తకాల్ని సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. సైట్ వాళ్ళు నిర్వహించే పుస్తక సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇంకా, ముఖ్యంగా, కొనుక్కో బోయే పుస్తకాల మీద డిస్కౌంటు పొందొచ్చు. 'అరుదైన పుస్తకాల్ని సేకరించొచ్చు.
ఇలా పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా, చాలా సంతోషాన్ని పొందే వాళ్ళు ఎందరో వున్నారు. ఒక చిన్న అడుగు అటు వేద్దామనుకునే వాళ్ళ కోసం ఈలింకు : http://www.bookcrossing.com/about
పుస్తకాల్ని షేర్ చేసుకోదలచుకుంటే, వీళ్ళ సహాయంతో మొదట పుస్తకాన్ని లేబుల్ చెయ్యాలి. ఈ బుక్ క్రాస్ సభ్యులు మన దేశం లో కూడా వున్నారు. (ఓ తొమ్మిది పుస్తకాలనుకుంటాను - ప్రయాణిస్తున్నాయి మన దేశం లో కూడా) పుస్తకాల పురుగులు పుస్తకాలు కేవలం చదువుతాం అనుకునేవాళ్ళు కూడా స్వాగతం. అదీ దీని సంగతి.
PS: నాకెలా తెలిసిందనుకుంటున్నారా ? మొన్న నాకో పుస్తకం మా వూరి మ్యూజియం లో దొరికింది. ఏమిటా అని తెరిచి చూస్తే, ఒక లేబుల్ - దాని మీద, 'మీకిష్టమైతే ఈ పుస్తకాన్ని తీసుకోండి చదవండి, మా సైట్ ని దర్శించండి - అని ఒక నోటూ, పుస్తకం జాతక చక్రం తాలూకూ ఐడీ నెంబరూ కనిపించాయి) పుస్తకం చదవలేదింకా. కానీ సైట్ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించి, టైం కుదరగానే ఇలా బ్లాగుతున్నా. అది విష్యం.
ఆన్లైన్ లో సాఫ్ట్ కాపీల్ని పంచుకోవడం లా కాకుండా, "నిజ (అంటే ??!) జీవితం" లో నిజం పుస్తకాల్ని పంచుకోవడం - అంత ఎథికల్ విష్యం కాపోవచ్చు వ్యాపారాత్మకం గా. కానీ 'మంచి తనం ', 'మంచి ఉద్ద్యేశ్యం ', 'పుస్తకాల్ని పంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం', 'పుస్తకాల ద్వారా స్నేహితుల్ని సంపాదించుకోవడం', 'మనిషి కి మనిషి కనెక్ట్ కావడం", కొంచెం మంచి విషయాలు గా తోచాయి.
ఇలాంటి ఇతర ప్రముఖ పుస్తకాలు పంచుకునే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఎవరికన్నా తెలిస్తే తెలియపరచకలరు. (నాకు తెలీటం ఇదే మొదటి సారి కాబట్టి ఇంకా ఎక్కువ సైట్లు ఏమన్నా ఉన్నాయేమో అనే ఆసక్తి ఉంది.)
Sorry for being pessimistic..
ReplyDeleteకానీ అలా రైల్లోనూ బస్సుల్లోనూ మానిటరింగ్ లేకుండా వదిలేసిన పుస్తకాలు సేఫ్ గా ఉండే అవకాశమ్ ఎంతవరకూ ఉందంటారు మన దేశంలో :-)
ఆ క్రాస్ ఐడి ఏ సమోసాల పొట్లంలోనో పల్లీల పొట్లంలోనో కనిపిస్తుందేమో కొన్నాళ్ళకి :-))
ReplyDeleteనీ స్నేహితుల్ని చూసి నువ్వేమిటో అంచనా వేయచ్చు అనేది పాత పాట.. కానీ, 'నువ్వు చదివే పుస్తకాలేమిటో చెప్పు నీ గురించి నే చెప్తాను ' అన్నది ఇప్పటి ట్రెండ్ :)
మీ టపా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది, సుజాతా! ఈ క్లబ్ గురించి ఇప్పుడే వింటున్నాను.. కానీ, పరంతూ... మన పుస్తకాన్ని అలా అనాధలా వదిలేయడానికే అసలు సిసలు పెద్ద మనసు అవసరం కదా!! అఫ్కొర్స్ ఈ బుక్ క్రాసింగ్ కాస్త పాపులర్ అయిన తర్వాత ఇంతలా ఆలోచించమేమో!
ఏమైనా అలా ఊహించని విధంగా ఒక మంచి పుస్తకం దొరికితే భలే హేపీగా అనిపిస్తుంది కదా! :)
వేణూ శ్రీకాంత్ గారు,
ReplyDeleteమరేనండీ.. మేకలూ, ఆవులూ లేని చోట, దగ్గర్లో మిర్చీ బజ్జీల వాడు లేని చోటా చూసుకుని విడిచిపెట్టాలండీ. :D
కిరణ్ గారూ
ReplyDeleteఅవును. పుస్తకాలు అలా ఏమైపోతాయో తెలీకుండా వొదిలేయడం కష్టమే. చంద్రశేఖర్ అజాద్ గారిదో చిన్న పిల్లల కధ వుంటుంది. అందులో ఒక చిన్న పిల్లాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. వాడికో కల వస్తూంటుంది. మైసూర్ పాకు ఇటికల్తో చేసిన ఇల్లు, జాంగ్రీ కంతల కిటికీలూ, అరిసెల్తో చేసిన ఫ్లోరూ, లడ్డూల సోఫాలూ - ఇలా.. వాడికి దార్లో రూపాయలు (పైసలు అనుకుంటా) కూడా దొరుకుతుంటాయి కలల్లో (మిఠాయిలు కొనుక్కునేందుకు). అలా మనకీ అలా మంచి పుస్తకం దొరికిందనుకోండి.. భలే కదా.
Interesting ! Thanks for sharing. But I really doubt about this in India. Chances of throwing into trash with out even opening the book are more.
ReplyDeleteఅలా పుస్తకాన్ని ఎక్కడైనా వదిలేయడానికి సుతరామూ నా మనసు ఒప్పుకోదు.లాభం లేదు. ఎవరైనా వదిలేసిన పుస్తకం నాకు దొరికిందా, చక్కగా చదూకుంటా. తర్వాత రూల్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తాను. ఈ సైటూ, కాన్సెప్టూ బాగున్నాయి కానీ మన దేశంలో నిజంగానే వర్క్ అవుట్ అవ్వదేమో!
ReplyDeleteవేణూశ్రీకాంత్, సమోసాల పొట్లంలోనా..అబ్బ, ఎంత నిర్దయగా చెప్పేశారు?నిజమే కావొచ్చు గాని)
Thanks for the post.
ReplyDeleteI don't know about this site.
I have the habit of leaving the books when i complete reading.
In the last 15 years i left many books in airports, on train, on cruise liners and in coffee shops across the world.
"ఎవరి లైబ్రరీ వారికి అపురూపమైన గని."
ReplyDelete"కొందరు పుస్తక ప్రియులకు, ముఖ్యంగా వృద్ధాప్యం లో వున్న వాళ్ళ దగ్గర కుప్పలు గా పేరుకుపోయిన అమూల్య సంపదని పరిరక్షించే స్పూర్థి ఉన్న వారసులు ఉండకపోవచ్చు. "
బావున్నాయి వాక్యాలు.
మీరిచ్చిన సైట్ వివరాలు బావున్నాయి. అయితే ఇది మన దేశంలో పెద్దగా పాపులర్ కాకపోవచ్చునేమోనండి..
నా తర్వాత చదివేవారు లేకపోతే ఏ లైబ్రరికో ఇచ్చేయమని రాసి పెట్టి ఉంచగలను కానీ possessive అన్నా, selfish అన్నా సరే నేనైతే ఎంత మాత్రం నా పుస్తకాలను అలా వదిలేయలేను.
బాగా ఆకట్టుకుని , నాతోనే ఉండాలి అని నేను అనుకున్నవి మాత్రమే తప్పేతే మిగిలిన పుస్తకాల విషయంలో పొజెసివ్ నెస్ చాలా తక్కువ నాకు . దానితోఒక మూడేళ్ళ క్రితం వరకు కూడా ఎక్కువ ప్రయాణాలలో వేరే వాళ్ళకి ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశ్యం తో చదివిన పుస్తకాలు వదిలేడం ఎక్కువగానే చేసేదాన్ని. అలాగే ఎవరన్నా ఇంట్లో చూసి అడిగినా మహా ఆనందం గా ఇచ్చేసేదాన్ని . ఇప్పుడు పేపర్ ఎడిషన్ గిఫ్ట్ చేయటానికి తప్పితే కొనడమే మానేసాను కాబట్టి ఆ ఛాన్స్ తక్కువే :-(
ReplyDeleteఎస్ ఇలాంటి ఒక క్లబ్ ఉంది అని తెలుసుకోవడం భలే ఉంది . దీని గురించి వివరాలు షేర్ చేసినందుకు బోలెడు థాంక్స్ మీకు .
పైన అనాన్ గారు ఎవరో నా ఫ్రెండ్ లాగా ఉన్నారు :-)
అర్జంట్ గా మీ దగ్గర చదివేసిన పుస్తకాలుంటే నాకు పంపండి. నేను చదివేసి మీరు చెప్పినట్లు గా ప్రజలకి పంచేస్తాను :)
ReplyDeleteమన దేశంలో ఈ బుక్ క్రాసింగ్ వర్క్ అవుతుందో లేదో తెలీదు గానీ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుందండీ..
ReplyDeleterecently i read a novel of yuddanapudi .it is 'airhostess'.
ReplyDeleteIn that novel one girl has the habit of leaving of books in aeroplane to leave the excess luggage.
okasari alage half book chadivi aa half chimpi plane lo vadilesi,migata half intiki techukontundi.
aa first half chadivina vadu suspense tattukoleka ee ammayiki phone chestadu(ante book lo phone number name rasi vuntundi lendi)
ala ala vallu love chesukoni pelli chesukontaru,adi kuda vallanu kalipina aero plane lo
naku mee post chaduvutune aa novel gurtu vachindi.
ee concept bagundi,ekkadyna surprise ga oka book dorikite chala exciting ga vuntundi.