ఈద్ కా చాంద్ చాలా బావుంటుంది అని ఒక ప్రధ ! ఈ రోజు ఆకాశం కేసి చూద్దామంటే, భయం. ఆకాశానికి కావాలని మొహం చాటెయ్యడం, నాలాంటి వినాయకుడి కధ నమ్మేవాళ్ళకి బాహా అలవాటు. అలా అని రోజూ చుక్కలు లెక్కెడతామని కాదు.. కానీ, ఈద్ రోజూ, కార్తీక పౌర్ణమికీ, శరన్నవరాతృలప్పుడూ, ఆకాశం, చందమామా, వాళ్ళ వైఫులూ అంటే, కుంచెం ఉబలాటం కలుగుతుంది.
కానీ ఈ సారి వాళ్ళకి ఈద్ ముబారక్ అయితే, మనకి 'డాం డమారుక్' అయింది. చందృణ్ణి చూడ్డానికి కుదరదు. మనసు లాగుతుంది. కాబట్టి కాలక్షేపానికి ఇంకో సోర్సు వెతుక్కోక తప్పదు. టీ.వీ. బోరు కాబట్టి, చక్కగా ఇంటర్నెట్ పై పడ్డాను.
ఎప్పుడో జయా టీవీ లో అనుకుంటాను శ్రీమతి విశాఖా హరిజి గారి హరికధ విన్నానేమో - ఒక్క ముక్ఖ అర్ధం కాకపోయినా, చాలా ఎంజాయ్ చేయటం మంచి అనుభూతి. అసలు తామిళ్ వాళ్ళ హరి కధ ఎంత బావుంటుందో ! అనిపించింది.
మన టెల్గూ హరికధ కొంచెం ఎక్కువ గా జనాల్లోకి చొచ్చుకుపోవడానికనుకుంటాను.. పిట్టకధలూ, గెంతులాటలూ - ఇలా క్లాసికల్ చిత్రాన్నుంచీ, పక్కకు జరిగినట్టు నా అనుమానం. హరికధా పితామహులు చాలా మంది ఎన్నో రకాలుగా ఈ కళ ను ప్రభవిల్లజేస్తూ ఉండొచ్చు గాక. కానీ విశాఖా హరి లాంటి 'కొత్త తరాల్ని ' కూడా కలుపుకు పోతూనే, స్వచ్చంగా, మోడ్రన్ గా, క్లాసికల్ గా, గౌరవనీయంగా, ఒక పాప్ కచేరీలా ఆడియన్స్ ను మంత్ర ముగ్ధుల్ని చేసేది మాత్రం కొందరే !
ఈ వీడియో చూడండి.
ఈ హరికధల్ని 'సంగీత ఉపన్యాసం అని అంటారంట. ఎప్పుడైనా టీవీలో కనపడితే మాత్రం, ఈ హరికధల్ని వినబుద్ధవుతుంది. ఈవిడకున్న అభిమాన గణంలో విశేషంగా బ్లాగర్లూ, యువతా వున్నారుట.
'విశాఖా హరి' కార్యక్రమాల గురించి, ప్రత్యేకంగా బ్లాగులూ నడుస్తున్నాయి. ఈ వీడియోల్లో ఎందరు స్పెల్ బౌండ్ అయిపోయి వింటున్నారో చూడండి ! కచేరీ ల కన్నా విశాఖా హరి ప్రసంగాలు ఎక్కువ మంది ప్రక్షకులను ఆకర్షించడానికి తను చెప్తున్న / పాడుతున్న విషయం మీద ఆమెకున్న పాండిత్య ప్రతిభ, ఆ వ్యాఖ్యానం కారణం కావచ్చు. మనకూ ఏదయినా కచేరీ లో ఏ బాలమురళీనో పాటల్ని విడమర్చి చెప్తూ పాడుతూ మనల్నీ ఆ ఉత్కృష్ఠ భావ జలధిలో ఓలలాడిస్తుంటే ఎలా వుంటుంది ?
తెలుగు హరికధ కూడా ఈ టమిళుల హరికధ లాగా స్టాండర్డ్ ని పెంచుకుని, కొంచెం రూపాంతరం చెంది, ఎక్కువ మంది ప్రేక్షకులని ఆకర్షించేలా మారితే బావుంటుందేమో అని నా General (పామర) అభిప్రాయం.
పాండిత్యం ప్రతిభా ఇప్పటికే తెలుగు పండితులకు భక్తీ చానెళ్ళలో, ప్రవచనాల్లో, కావ్య విమర్శల్లో బాగా పనికొచ్చింది. అసలు ఏ చాగంటి వారో సౌందర్య లహరి (అరటి పండు వొలిచినట్టు) చెప్తుంటే, వినే వాళ్ళు మామూలు హరికధా కాలక్షేపం టీవీలో వస్తే ఎందుకు ఇష్టపడరు ? తెలుగు వాళ్ళకి మ్యూజిక్ మీద అంతగా ప్రేమ లేకనా ? కధ అనే ప్రక్రియ ఇష్టపడకా ? ఏమో ! ఏమో ! మీరే చెప్పాలి.
మీ డాం డమారుక్ బాగుంది.
ReplyDeleteమీరన్నట్టు టామిళ్ హరికథ బాగానే వుంది. కానీ, అదేదో కర్ణాటక సంగీత కచేరీలా లేదూ? అలా ఎంజాయ్ చెయ్యడం టమిళ్ వాళ్లకే చెల్లింది.
మనవైపు యేడాదికోసారో యెప్పుడో యే త్యాగరాజోత్సవాల్లోనో బాగా ఆసక్తి వున్నవాళ్లు కొంతమందీ, వృత్తి రీత్యా, అధికార రీత్యా, ఇంకా 'మనని గంధం చెక్కలు మోస్తున్న గాడిద అని యెవరైనా అనుకుంటారేమో' అనుకుంటూ అనుభవించే చాలామంది--ఇలాంటివి ఆస్వాదిస్తారు.
ఇక టెల్గూ హరికథకొస్తే, ఇప్పటికీ నవరాత్రులకీ అప్పుడూ గుళ్లల్లో, పెళ్లిళ్లలో హరికథలు చెప్పించేవాళ్లున్నారు.
వాళ్లతో పోలిస్తే, మన హరికథ మోర్ లైవ్లీ! యెటొచ్చీ, కథని ఓ నాలుగైదు గంటలు కొనసాగించాలంటేనే--ఈ పిట్టకథలూ, అన్నమాచార్య సినిమా పాటలూ, శ్రీరామదాసు సినిమా పాటలూ వగైరా! ఇంకా 'వాగ్దానం' సినిమాలో హరికథ లాంటి సన్నివేశాలూ!
అయినా మన తెలుగువాళ్లు చాలా ఫాస్ట్ లెండి. వీళ్లకి పాడేవాళ్ల గొంతు నొక్కేసి, రేకుడబ్బామీద దువ్వెన్న తో గీసినట్టు చేసి పాడించే పాటలూ, ఒక్కమాటా అర్థం కాకపోయినా, వెనకాల డప్పుల మోతా--ఇవన్నీ కావాలేమో!
మంచి టపా వ్రాసినందుకు, వీడియోలు వుంచినందుకు, ధన్యవాదాలు.
Sujata గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!
ReplyDeleteహారం
చాలా బాగుందండీ విశాఖా హరి గానం. ఆకట్టుకునే స్వరం. దాదాపు యమ్మెస్ లా అనిపించింది. మీకు ధన్యవాదాలు పరిచయం చేసినందుకు.
ReplyDelete