Pages

11/09/2010

గణేశ ప్రార్ధన



తొండము నేకదంతమును
దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ!
ఓయీ గణాధిప ! నీకు మ్రొక్కెదన్.

తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
ఫలితము సెయుమయ్య నిను
ప్రార్ధన చేసెదనేకదంత! నా
వలపటి చేతిఘంటమున
వాక్కున నెప్పుడు బాయకుమీ
తలపున నిన్ను వేడెదను
దైవ గణాధిప! లోకనాయకా !!

5 comments:

  1. వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు, మీ కుటుంబానికి
    వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

    SRRao

    శిరాకదంబం

    ReplyDelete
  4. సూర్యుడు గారు

    సావిరహే గారు

    రావు గారు

    ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. కూసంత లేట్ గా, వినాయక చవితి 9 రోజులు కదా అందుకే ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.