Pages

22/10/2008

చంద్రయాన్ - నా గ్లాస్ ఎలివేటర్ లో !

చంద్ర యాన్ కి అంతా సిద్ధపడుతూ ఉండగా.. నాకు కొంచెం నోస్టాల్జియా.. జూల్స్ వెర్న్ 'భూగర్భం లోకి ప్రయాణం ' గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు 'చార్లీ ఎండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ తీసి చదువుతున్నాను. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయినపుడు పిల్లల్లో 'రాకెట్ సైంటిస్ట్ ' అయిపోదామని కొత్త కలలు పుట్టేయంట. మన చంద్ర యాన్ కూడా ఎంత మంది పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తుందో తెలియదు గానీ.. నాలో పిల్ల మనస్తత్వాన్ని ని మాత్రం తట్టి లేపింది. ఈ పుస్తకం చదువుతూ నిద్రపొయానేమో రాత్రి - గ్లాస్ ఎలివేటర్ లో తేలుకుంటూ (మరి గురుత్వాకర్షణ శక్తి ఉందదు కదా..) చందురుడి పక్కనుంచీ క్రాస్ అయి స్పేస్ లోకి వెళిపోయినట్టు కల వచ్చింది. భలే భలే గా ఉందీ అనుభవం. రాకేష్ శర్మ ఎక్కడున్నారో గానీ మీకో పెద్ద వీర తాడు !


చార్లీ ఎండ్ చాక్లెట్ ఫేక్టరీ తర్వాత - ఈ గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ నాకు ఇష్టం. ఇలాంటివి తెలుగులో వస్తే బావుణ్ణు. కొన్ని విషయాలు పంచతంత్రం తరహాలో చక్కగా కధల్లాగా, ముఖ్యంగా సైన్స్ సంగతులు పిల్లల భాష లో చెప్తే మన దేశం లో కూడా స్టూడెంట్స్ లో సైన్స్ మీద ఉత్సుకత పెరుగుతుంది. సో, ఇలాంటి సైన్స్ ఫిక్షన్లు పిట్ట కధల్లా.. అంతంత పెద్ద కళ్ళు చేసుకుని వినే పాపాయిల కోసం చెప్పాపంటే ఎంత బావుంటుందో చూడండి. ఈ గ్లాస్ ఎలివేటర్ గురించి తరవాత రాస్తాను.

చంద్ర యాన్ కి మాత్రం నా బోల్డన్ని శుభాకాంక్షలు. మన దేశం లేటు గా అయినా లేటెస్ట్ గా చందురుడి మీదికి వెళ్ళ బోతోంది. గుడ్ లక్.

9 comments:

  1. గ్లాస్ ఎలివేటర్ గురించి త్వరగా టపాయించాలి అని తెలియచేసుకుంటున్నాం అధ్యక్షా !

    ReplyDelete
  2. అనువాద కార్యక్రమం మీరే ఎందుకు మొదలెట్టగూడదూ?

    ReplyDelete
  3. Kotta palee garu


    Roald Dahl foundation ఊరుకుంటుందా ? అయినా.. నేను చెయగలనా ? నాకు అనుమానమే ! మీ సూచన మాత్రం చాలా హాయిగా మనసుని హత్తుకుంది. నేనైనా, ఇంకెవరైనా... తెలుగు పిల్లకాయల్ని కుంచెం పుస్తకాల వైపు లాగితే, (ఈ కార్టూన్ యుగంలో !!) అది అద్భుతమే అవుతుంది.

    ReplyDelete
  4. చైతన్యా.. తప్పకుండా రాస్తాను. మరి మీరు చదవాలి తప్పకుండా!! అదీ డీల్. ఒకె నా ?



    సీ బీ రావు గారు. థాంక్స్.

    ReplyDelete
  5. సుజాత గారు,

    అలా అలా వెళ్ళి దారితప్పి పోకుండా తిరిగొచ్చి టపా కూడా రాసేసారు బాగుంది.

    ReplyDelete
  6. మీ అనుమానానికి మూడు జవాబులున్నై.
    1. ఎక్కడో ఒక వెయ్యి కాపీలమ్ముకునే మారుమూల తెలుగు భాష గురించి ఘనత వహించిన ఢాల్ గారి ఫౌండేషను పట్టించుకోక పోవచ్చు. పట్టించుకున్నా వాళ్ళు పెద్ద పీకేదేం లేదు.
    2. బాబూ, మేము తమ రచనలకి వీరాభిమానులము, మా భాషలోకి తర్జుమా చెయ్యకుండా ఉండలేకపోతున్నాము అని ఒక వినతిపత్రం పంపితే వారు ఆమోదించనూ వచ్చు.
    3. అసలా గోల ళేకుండా కథని తగినంత స్థానికీకరించి "ఫలానా కథతో ఇన్స్పైర్ అయి" అని ముందు పేజీలో వేసేసుకోవచ్చు.

    ఐనా మీ పిచ్చిగానీ, యథాతథం కాపీలనే, ప్రస్తుతం విరివిగా రస్తున్న కమర్షియల్ ఆంగ్ల రచయితలే ఏం చెయ్యట్లేదు. ఎప్పుడో దివంగతులైన ఢాల్ గారు పట్టించుకుంటారా .. ముందు రాయడం మొదలు పెట్టండీ! మిగతా సంగతి తరవాత చూద్దాం!!

    ReplyDelete
  7. అవును మీరు అనువాదాలు మొదలెట్టండి.

    ReplyDelete
  8. http://navatarangam.com/2008/10/ore-kadal/

    మీరడిగిన ‘ఒరే కడల్’ విశ్లేషణ, నవతరంగంలో చూడండి.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.