సంకేత స్థలానికి చేరుకోవాలని వొంటరిగా బైలుదేరాను. నిశ్శబ్ద మైన చీకట్లో నా వెంబడి వొచ్చేది ఇది ఎవరు ?
అతని సామీప్యాన్నుంచి తప్పుకోవాలని దూరంగా జరుగుతాను. కానీ అతన్నుంచీ తప్పించుకోలేను.
తన డంబాచారంతో భూమినుంచీ దుమ్ము రేపుతాడు. నేను పలికే ప్రతి మాటకీ తన అరపుల్ని జత చేస్తాడు.
ప్రభూ ! అతనే. అతనే నా అహం. వాడికి సిగ్గులేదు. వాడితో కలసి, నీ ద్వారాన్ని సమీపించాలంటే నాకు సిగ్గు.
:)
ReplyDeleteఅహమ్ గురించి భలే చెప్పారండి.
అహానికి సిగ్గులేదు..
ReplyDeleteఅహం మోసే మనుష్యులకి అవతలి మనస్సులలో విలువలేదు..
బాగా రాశారు.
ఇంకా కొద్దిగా enlarge చేసుంటే బావుండేదని నా అభిప్రాయం.
బాగా వ్రాసారు.... కాస్త పొడిగించుంటే బాగుండేదనుకుంటా.
ReplyDeleteగీతాంజలి (చలం అనువాదం) అంటే నాకెంతో ఇష్టం. గొప్ప భావాలను టగూర్ అక్షరీకరించిన తీరు అద్భుతం. టగూర్ రచనలోని భావాన్ని చలం అనువాదం ఏమాత్రమూ సజలం చెయ్యలేదు. గీతాంజలినుంచి స్ఫూర్తి పొందినదేదైనా కూడా నాకిష్టమే!
నాకూ కొంచంపొడిగించుంటే బాగుండేది అనిపించింది
ReplyDeleteమొత్తానికీ బాగారాసారు
ఇది నేను రాయలేదు. చలం గీతాంజలి లో నాకు నచ్చిన ఒక కవిత ఇది.
ReplyDelete