ఈ యానిమేటేడ్ సినిమా చూద్దామని ఎదురు చూస్తున్నా. చిన్నప్పుడు 'బాల భారతం'.. లాంటి ప్రత్యేకంగా పిల్లల కోసం తీసిన సినిమాలు ఉండేవి. ఇప్పుడు హనుమాన్, ఘతోట్కచ్ (ఎన్ని సార్లు టైప్ చేసినా.. ఇలానే వస్తుంది..), లాంటి పురాణ కదల హీరోలతో పిల్లల కోసం సినిమాలు రావడం చాలా బావుంది. వాల్ట్ డిస్నీ వారి రామాయణం చూసారా..''అసలు ఎంత కష్టపడి ఈ సినిమాలు తీస్తారో.. అంత మజా ఏ మామూలు సినిమాలు ఇస్తాయి !?'' అనిపిస్తుంది. తింటే గారెలు తినాలి, వింటే భరతం వినాలి, చూస్తే ఇలాంటి యానిమేటేడ్ సినిమాలు చూడాలి!
నిజమే నిజం సినిమాకన్నా యానిమేషన్ లో కొన్ని సినిమాలు బాగుంటాయి.అదీ ధియెటర్ లో చూస్తే మరీను. నేను ‘లయన్ కింగ్’ చూసి ఢంగైపోయా ఒకప్పుడు.
ReplyDeleteసుజాత గారు,
ReplyDeleteబాలభారతం ఎప్పటికీ నా ఫేవరెట్ సినిమా! ఇప్పటికీ animation సినిమాలు మా పాపతో కలిసి చూడ్డం నాకిష్టమైన పని. ఈ మధ్యనే enchanted చూశాము మేమిద్దరం! ఘటోత్కచ్ కోసం ఆబగా ఎదురు చూస్తున్నాం!
మహేష్ గారు, సుజాత గారు..
ReplyDeleteథాంక్స్. నేను కూడా Ghatotkach కోసం ఎదురు చూస్తున్నాను. 'మే హూ ghatotkach..' అన్న పాట అనుకోకుండా నాలుక చివర నలుగుతూ.. బయటికే హమ్ చేసేస్తుంటే... మా ఆయన, నవ్వుతున్నారు. లయన్ కింగ్ ని చూసి నేనూ ఎంజాయ్ చేశాను.
ప్రోమో అదిరిపోయింది. తెలుగులో వస్తే బాగుండును.
ReplyDelete