Pages

17/06/2024

‘నాళై’ - A. Muthulingam (Original in Tamil)

‘నాళై’  - A. Muthulingam (Original  in Tamil)

రేపు - అనువాదం అవినేని భాస్కర్  (https://eemaata.com/em/issues/201704/11094.html)

***

ఈ కథ ని 'పిల్లల కోసం వెబ్ సిరీస్' తీద్దామని ఒకరు సంకల్పించి పిల్లలు protagonist /  సబ్జెక్ట్ గా ఉన్న (ప్రముఖ) కథలని సూచించమంటే, కుదించి, ఇలా రాసాను. దురదృష్టవశాత్తు ఇది ఎంపిక కాలేదు.  కానీ బ్లాగ్‌లో పెట్టేస్తే ఎవరైనా చదువుతారని పోస్ట్ చేస్తున్నాను. 

***

శ్రీలంక లో యుద్ధం జరుగుతున్న రోజులు.  అనాధలయిపోయిన ఇద్దరు పిల్లల కథ ఇది. ఒక కేంప్ లో యుద్ధ బాధితులకు భోజనం ఇస్తున్నారు. అక్కడ వరుసల్లో నిల్చున్న వారందరికీ సూప్ పోసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పిల్లలకి పేర్లుండవు. పెద్దాడు అన్న, చిన్నాడు తమ్ముడూ. అంతే. అయితే, వీళ్ళు ఆ కేంప్ లో దొరికే రొట్టె, సూప్ తప్ప ఇంకే ఆధారమూ లేనోళ్ళు. కానీ కేంపులకు వెళ్ళడం, క్యూలలో నిల్చోవడం, వేచి ఉండడం, అదీ చిన్నపిల్లవాడితో చాలా కష్టం. అందుకే అన్న తమ్ముడికి ఇవాళ కేంప్ లో మాంసం ఇస్తార్రా అని ఆశ పెట్టి కేంపు కు నడిపించుకుంటూ తీస్కెళ్తాడు. 

చిన్నాడు ఎంతో ఆశ పడి వస్తాడు. వాళ్ళకు మాంసం లాంటి luxury దొరికి ఎన్నో రోజులయిపోయింది. ఈ తిండి యాత్ర చెయ్యకపోతే ఇంకో దిక్కు లేదు. పెద్దాడు కూడా చిన్న పిల్లాడే. వాడికి తమ్ముడు తప్ప ఇంక   ఎవరూ లేరు. వాళ్ళ తల్లిదండ్రులూ, బంధు వర్గమూ ఏమయ్యారో ఎక్కడా వుండదు.   వీడినీ తననీ బ్రతికించుకుని ఉంచుకోవడం పెద్దాడి మొదటి ప్రయారిటీ. 

ఆ రోజూ వాళ్ళు అలా వస్తారు. ఎందరో మనుషుల తరవాత వీరి వంతు వస్తుంది. పెద్దాడు కూడా మాంసం ఆ సూప్లో దొరుకుతుందేమో అని ఆశ పడతాడు కానీ దొరకదు. తమ్ముడు నిరాశపడిపోతాడు. వీళ్ళకి దొరికిన ఇంత బ్రెడ్ లోనూ కాస్త తీసి వీధికుక్కకు పెడతాడు తమ్ముడు. అర్ధాకలితో ఉన్నా, వీళ్ళ మనసులు మంచివి. 

రేపు తప్పకుండా మాంసం ఇచ్చే కేంపు కు తీస్కెళ్తాను అని పెద్దాడు చిన్నాడికి ప్రామిస్ చేస్తాడు. ఆ కేంపు పది మైళ్ళ దూరంలో ఉంది. కానీ 'రేపు' మీద ఆశ వాళ్ళ జీవన రధాన్ని లాక్కెళ్తూండడం వల్ల, 'రేపు తప్పకుండా నీకు మాంసం పెట్టించే చోటుకు తీస్కెళ్తానని' పెద్దాడు నిర్ణయించుకుంటాడు. 

ఆ "రేపు" నిజంగా వస్తుందో రాదో గానీ, ఆ ఆశ అనే  driving force ని ఆధారంగా చేసుకుని,  ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారో చెప్తుంది ఈ కథ.  యుద్ధాల్లో, ఉత్పాతాల్లో, మొదటగా బాధితులయ్యే పసివాళ్ళ గురించి, చెప్పిన కథ ఇది. వాళ్ళలో నిజానికి చుట్టు పక్కల జరిగే పరిణామాలు కుంగదీత కు గురిచేసేటట్టే ఉన్నా, వీళ్ళందరూ తరాలుగా ఆ ఆశని ఆధారగా జేసుకునే, adversity తో   పోరాడారు. వీళ్ళ అమాయకత్వమూ, మంచి మనసూ చల్లగా ఉండాలి. ఈ కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని వాళ్ళకి ఆ దేవుడు కలిగించాలి అని పాఠకుడికి అనిపిస్తుంది. 

***

No comments:

Post a Comment

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.