కొన్ని సార్లు జనాల క్రియేటివిటీ మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.
1) మా ఇంటి వైపు కార్ఖానా లో పోలీస్ స్టేషన్ పక్కన కేక్ బాస్కెట్ అని ఒక బేకరీ వుంది. ఆరు సంవత్సరాలు గా ఆ దారెమ్మట పోతూ ఒక్క సారి కూడా చూళ్ళేదు నేను. ఈ మధ్యే చూసా. ఆ షాపు బోర్డ్ మీద పైన ఇంగ్లీష్ లో Cake Basket అని రాసి వుండగా, కింద తెలుగు లో ఇలా రాసి వుంది.
"కేక బాస్కేటు" (ఇంకా నయం కుక్క బిస్కెట్ అని రాయలేదు)
2. ఈ మధ్యే రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం మీద 'చందమామ' కవల సోదరుణ్ణి చూసా. కూకట్ పల్లి నుంచీ ప్రచురిస్తున్నారు. అక్షరాలా అదే ఫాంటు, అదే సైజు.. అవే రంగులూ, అదే రకం (వపా) ముఖ చిత్రాలు. అదే రేటు. ఇది చందమామ డూప్లికేటు. - పేరు 'చంద్రబాల' ! కానీ కే.టీ.ఆర్.(తెలంగాణా కి కాబోయే ఉప ముఖ్యమంత్రి) లా 'నథింగ్ షార్ట్ ఆఫ్ హైద్రాబాద్' తరహా లో 'నథింగ్ షార్ట్ ఆఫ్ చందమామ' అని తీర్మానించుకుని కొనలేదు.
3. రాష్ట్ర విభజన తీర్మనాన్ని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టించేదుకని తెలంగాణావాదులు ఈ సారి తిరుగులేని అస్త్రం ఉపయోగించారు. చిదంబరం కోర్టులకీ, ప్రణబ్ ముఖర్జీ విదేశాలకీ, అమ్మ గారు విశ్రాంతికీ, ప్రధాన మంత్రి సిక్కిం కీ వెళిపోయిన రోజుల్ని వ్యూహాత్మకంగా ఎంచుకుని, స్కూళ్ళు మూసేయించారు. ఇన్నాళ్ళు వరసపెట్టి పిలకాయలు ఇళ్ళలో ఉండడం, ఫాలోడ్ బై దసరా సెలవులూ .. ఇలా పిల్లలు ఇళ్ళలో వీరంగం సృష్టించడం, వాళ్ళని కాస్కోవడానికి అమ్మో, నాన్నో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇళ్ళలో ఉండడం.. లాంటి విపరిమాణాలూ, పిల్లలు ఇళ్ళు పీకి పందిళ్ళెయ్యడం.. ఇలా ఎడతగని కష్టాలను ఎనాళ్ళని హైద్రాబాదీలు అనుభవించాలి ? అందుకే వీళ్ళు ఓర్చుకోలేక తెలంగాణా గొడవేందో, ఈ లొల్లేందో తొందరగా వొదిలిపోవాలని కోరుకునేట్టు (మనుషుల్లో పరివర్తన వచ్చేట్టు) సమైక్యవాదం మీద కుట్ర చేసేస్తున్నారు. ఫలితాలు పాజిటివ్ గానే ఉన్నట్టున్నాయి.
మంచి ఆసికాలాడారు. బాగుంది.
ReplyDeleteఅయితే సిమ్లిపల్ టైగర్ రిజర్వ్ లా పులులు లేక ఎండిపోయి,
లేక పోతే పులి మీద పుట్ర లా " టపా మీద టపా "
మన ఇద్దరి బ్లాగులూ ఇలా రోదిస్తున్నాయేంటి.
చూద్దాం ఎప్పుడో ఒకప్పుడు జ్ఞాన పీట మీద కూర్చోలేక పోతామా ...!!
పిల్ల స్కూళ్ళు మూసేయించేస్తే అందరూ జై తెలంగాణా అంటారన్నమాట ! పిల్లల అల్లరికి అంత పవర్ వుందన్నమాట:)
ReplyDeleteఆత్రేయ గారూ..
ReplyDeleteఆసికాలంటే ఆసికాలే ! చాల్రోజులయిందండీ ఈ పదం విని. మ్న బ్లాగుల సంగతంటారా.. అదో ఇది లెండి. మూసెయ్యలేం.. రాయలేం. ఎప్పుడో మూడు ఉన్నప్పుడు రాయడానికి, మేమూ నెటిజనులమే అని చెప్పుకోవడానికి ఇదో వేదిక. (మనకి మూడ్ వస్తే చదివే వాళ్ళకి మూడుతుంది - అది వేరే విషయం) :D
మాలా కుమార్ గారూ..
ReplyDeleteఇప్పుడు ఒక్కొక్క పిల్లలు కావడం కూడా ఇబ్బంది గా వుంది. వీళ్ళని ఒంటరిగా వొదల్లేక, వెంటనే ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేసుకోలేక, ఆఫీసులు మానేసిన తల్లులు (సెలవులు పెట్టాల్సొచ్చిన) ఎందరో వున్నారండీ. చదువులు పోయాయని బెంగ కన్నా... ఈ ఇబ్బంది పెద్దదే !
ఆత్రేయ గారూ, సుజాత గారూ,
ReplyDeleteరోదించే టపాల విషయం లో మాత్రం నేనే ఫస్టండీ! నా టపాలు చూసినప్పుడల్లా నాకు తమతో తామే మాట్లాడుకునే పిచ్చి వాళ్ళు గుర్తొస్తారెందుకో!
ఒకటొ రెండో రోజుల్లో నేను దుకాణం మూసేద్దామనుకుంటున్నాను, సీరియస్ గా!
అన్నట్టు మీ రెండు టపాలూ బాగున్నాయి సుజాత గారూ!
శారద
good one. like the title
ReplyDeleteమూడో పాయింటు మీద నాక్కూడా అనుమానం ఉంది
ReplyDeleteబావుందండీ .
ReplyDeleteలల్లీయం అని నేనూ రాస్తే సిల్లీయం కి కవలసోదరిలా ఉంటుందేమో
శారద గారు ఎందుకండీ దుకాణం మూసెయ్యటం . మీకూ బజ్జొరం పట్టిందా !
శారద గారూ .. మీరు దుకాణం మూసెయ్యడం ఏమిటండీ ? మీ లాంటి వాల్ మార్టు లే మూసేస్తే మా లాంటి చిల్లర కొట్ట్లు ఏమయిపోవాలి ? Thnks
ReplyDeleteలలిత గారూ
ReplyDeleteహా హా. బజ్జొరం నాకూ వచ్చిందండొయ్ ! కానీ వాళ్ళు కాలక్షేపం కబుర్లు కాకుండా సీరియస్ కబుర్లు చెప్పుకుంటున్నారని ఇటొచ్చ.
హహహ బాగున్నాయండీ మీ ముచ్చట్లు. కొన్ని సార్లు జనాల క్రియేటివిటీ మనల్ని ఆశ్చర్య పరుస్తుంది ఈ వాక్యం చదవగానే నాకొక విషయం గుర్తొచ్చింది. మా ఇంటి నించి కాలేజీకి వెళ్ళే దారిలో ఒక చిన్న కొట్టు ఉండేది వాళ్ళు పిండి ఆడతారు. దానికి ఊరు పేరు లేదు కాని ఈ విధంగా రాసి ఉంటుంది ఇక్కడ అరిసెల పిండి అందంగానూ చలివిడి పిండి చక్కగానూ ఆడబడును అని.
ReplyDeleteయెమిటి...నెల్లూరా...పిలకాయలు అని వ్రాసారు.
ReplyDeletenice posting
హిహిహి బాగుందండీ;)
ReplyDelete