కొన్ని సార్లు జనాల క్రియేటివిటీ మనల్ని ఆశ్చర్య పరుస్తుంది.
1) మా ఇంటి వైపు కార్ఖానా లో పోలీస్ స్టేషన్ పక్కన కేక్ బాస్కెట్ అని ఒక బేకరీ వుంది. ఆరు సంవత్సరాలు గా ఆ దారెమ్మట పోతూ ఒక్క సారి కూడా చూళ్ళేదు నేను. ఈ మధ్యే చూసా. ఆ షాపు బోర్డ్ మీద పైన ఇంగ్లీష్ లో Cake Basket అని రాసి వుండగా, కింద తెలుగు లో ఇలా రాసి వుంది.
"కేక బాస్కేటు" (ఇంకా నయం కుక్క బిస్కెట్ అని రాయలేదు)
2. ఈ మధ్యే రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం మీద 'చందమామ' కవల సోదరుణ్ణి చూసా. కూకట్ పల్లి నుంచీ ప్రచురిస్తున్నారు. అక్షరాలా అదే ఫాంటు, అదే సైజు.. అవే రంగులూ, అదే రకం (వపా) ముఖ చిత్రాలు. అదే రేటు. ఇది చందమామ డూప్లికేటు. - పేరు 'చంద్రబాల' ! కానీ కే.టీ.ఆర్.(తెలంగాణా కి కాబోయే ఉప ముఖ్యమంత్రి) లా 'నథింగ్ షార్ట్ ఆఫ్ హైద్రాబాద్' తరహా లో 'నథింగ్ షార్ట్ ఆఫ్ చందమామ' అని తీర్మానించుకుని కొనలేదు.
3. రాష్ట్ర విభజన తీర్మనాన్ని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టించేదుకని తెలంగాణావాదులు ఈ సారి తిరుగులేని అస్త్రం ఉపయోగించారు. చిదంబరం కోర్టులకీ, ప్రణబ్ ముఖర్జీ విదేశాలకీ, అమ్మ గారు విశ్రాంతికీ, ప్రధాన మంత్రి సిక్కిం కీ వెళిపోయిన రోజుల్ని వ్యూహాత్మకంగా ఎంచుకుని, స్కూళ్ళు మూసేయించారు. ఇన్నాళ్ళు వరసపెట్టి పిలకాయలు ఇళ్ళలో ఉండడం, ఫాలోడ్ బై దసరా సెలవులూ .. ఇలా పిల్లలు ఇళ్ళలో వీరంగం సృష్టించడం, వాళ్ళని కాస్కోవడానికి అమ్మో, నాన్నో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇళ్ళలో ఉండడం.. లాంటి విపరిమాణాలూ, పిల్లలు ఇళ్ళు పీకి పందిళ్ళెయ్యడం.. ఇలా ఎడతగని కష్టాలను ఎనాళ్ళని హైద్రాబాదీలు అనుభవించాలి ? అందుకే వీళ్ళు ఓర్చుకోలేక తెలంగాణా గొడవేందో, ఈ లొల్లేందో తొందరగా వొదిలిపోవాలని కోరుకునేట్టు (మనుషుల్లో పరివర్తన వచ్చేట్టు) సమైక్యవాదం మీద కుట్ర చేసేస్తున్నారు. ఫలితాలు పాజిటివ్ గానే ఉన్నట్టున్నాయి.
Pages
▼
23/09/2011
22/09/2011
Going Solo - Roald Dahl
*మాదీ బాగా మధ్య తరగతి కుటుంబమే చిన్నప్పట్నించీ ! (*ఒక ప్రముఖ బ్లాగర్ బజ్ లో రాసిన ఒక బాగా నచ్చిన వాక్యం) బోల్డన్ని డబ్బులు పోసి ఒరిజినల్ కొనలేక ఫుట్పాత్ మీద దొరికే జెనెరిక్ వెర్షన్ పుస్తకాలు కొనే రకం నేను. (కొంటే గింటే!) అదో ఆనందం ! అదో తుత్తి. పైగా మేం ముగ్గురం అక్కచెల్లెళ్ళం చదువర్లం కాబట్టి షేరింగ్ బిజినెస్ లో కొనాలి. మా చెల్లెలు మంచిది - పుస్తకం విలువ తెలిసిందే. కానీ అక్కయ్య కి కొంచెం స్వార్ధం (పుస్తకాల విష్యంలో మాత్రమే లెండి) ఎక్కువ కాబట్టి - ఒకసారి తీస్కెళ్ళిన పుస్తకం మళ్ళీ తిరిగి రావడం కష్టం. అలా అని నిర్లక్షం ఏమీ వుండదు. చక్కగా వాళ్ళింట్లో మంచి లైబ్రరీ తయారు చేసింది. కాపోతే వాటి మీద కాపీ (ప్రతి) రైట్లు మనకి పోతాయి. అందుకే కొన్ని పుస్తకాలు చవకలోనే కొనడానికి ప్రయత్నిస్తాను. కొన్నైతే కొనను. లైబ్రరీ నించీ తెచ్చుకోవడం ! తిరిగిచ్చేయడం. అంతే !
బోల్డంత ఖరీదు పెట్టి కొనగలిగే పరిస్థితి లేక ఒకప్పుడు కటకటలాడుతున్నప్పుడు సెకండ్ హాండు కి కొన్న అపురూపమైన పుస్తకం (ఇప్పుడు నిక్షేపంగా పేపర్ బాక్ లో దొరుకుతుంది షాపుల్లో) తిరగేసినప్పుడల్లా ఒకరకమైన అత్భుతమైన ఫీలింగ్. నెమలి సింహాసనం మీదెక్కిన రకం జ్ఞాపకాలు. నాకే ఇలా వుంటుందో - మిగతా ఎవరికైనా వుంటాయో లేవో కానీ ఇలాంటి ఫీలింగ్స్.. కొన్ని పుస్తకాలంటే నాకో ప్రత్యేక అభిమానం.
అవి నా ఎడాలసెన్స్ తో పెనవేసుకుపోయిన జ్ఞాపకాలు. ఆ కాయితాల రంగూ, స్పర్శానుభూతి, రుచీ (చదివినపుడు కలిగే ఫీలింగ్), వాసనా మెదడు లోకి ఇంకినంత ఇష్టపడి చదివే రకాలు కొన్నున్నాయి. నా పుస్తక జ్ఞానం చాలా చిన్నది. సమీక్షలు చదివి నచ్చితే కొంటాను కాబట్టి - మినిమం గారంటీ. ఇలా చాలా ఇస్టపడి చదివినవి - చదువు, కన్యాశుల్కం, చెలియలి కట్ట, (తెలుగు లో) పూర్తి తృప్తి ని కలిగించాయి. ఇలాంటి కోవకి చెందిందే ఇప్పుడు చెప్పబోయే రాల్డ్ డాల్ రచించిన 'గోయింగ్ సోలో'. రాల్డ్ డాల్ నా అభిమాన బ్రిటిష్ రచైత. నేను చిన్నప్పుడు ఏవో బాల సాహిత్యం చదివాను గానీ అవి చందమామలూ, సోవియట్ సాహిత్యాన్ని, (రామయణ మాహాభారతాలూ, తి.తి.దే. వాళ్ళ పిల్లల పుస్తకాలూ, రామకృష్ణ ప్రభ, అమర్ చిత్ర కధ ఇవన్నీ భక్తి ప్రధానమైనవి కాబట్టి పక్కన పెట్టాలి) దాటి ముందుకి పెద్దగా పోలేదు. పెద్దయ్యాకే వాటిని ఎంజాయ్ చెయ్యడం ఎక్కువయింది. ఇరవయ్యి దాటాక రాల్డ్ డాల్ ని అభిమానించడం మొదలెట్టాననుకుంటాను. నాకు సాహస రచనలు ఇష్టం. ఫ్లయింగ్ (విమానాలు నడపడం),యుద్ధ వర్ణనా, బాల్యం, కొన్ని అనూహ్యమైన ప్లాట్లూ, ముఖ్యంగా సున్నితమైన హాస్యం వాత్సల్యం, .. ఇలా అన్ని రంగుల్నీ కలగైలిపిన ఇంద్ర ధనస్సు రాల్డ్. ఈయన జీవిత చరిత్రే గోయింగ్ సోలో. ఈ పుస్తకాన్ని కొన్నప్పుడు చేతిలో ఆట్టే డబ్బుల్లేవు. సెకండ్ హాండ్ షాపు లోనే సగం చదివి.. ఇక వొదిలి పెట్టడానికి వీల్లేదని నిశ్చయించుకుని, వొంద సమీకరణాల్ని పరిశీలించి, పర్సు తిరగేసి బోర్లించి చిల్లరతో కొన్నా. అదృష్టవశాత్తూ ఇది సేల్ లో దొరికింది. నా పుస్తకాల షెల్ఫు లో దీనిదో ప్రత్యేక స్థానం. చూసినప్పుడల్లా ఎంత ఇష్టపడి కొన్నానో జ్ఞాపక్కం వచ్చి గుండె బరువెక్కుతుంది.
అలా అని ఇదేమీ ఎమోషనల్ రచన కాదు. అసలు రాల్డ్ తన పాత్రలను ఎక్కువ ఇబ్బంది పెట్టడు. రాల్డ్ డాల్ కధలు ఎన్నిట్నో మన యండమూరి వీరేంద్రనాథ్ యధాతధంగా తెలుగైజ్ చేసి రచించేసి, పేరు ప్రఖ్యాతులు గడించారు. వీటిల్లో 'దుప్పట్లో మిన్నాగు ' కధా సంకలనం ఒకటి. ఇది (Going Solo) రాల్డ్ సొంత కధ. రాల్డ్ డహల్ ఒక గొప్ప రచయిత. తన జీవితంలో తూకం వేసినట్టు సుఖాన్నీ, దుఃఖాన్నీ రెంటినీ అనుపమానంగా అనుభవిస్తూ, తన రచనలతో ఎందరినో ఉత్తేజితులను చేసిన ఉత్తేజితుడీయన. చిన్న వయసులోనే యుద్ధ భూమి లో విమానాలు నడిపి, సొంత వాళ్ళను వొదిలి ఖండాంతరాలు తిరిగి, ముక్కు సూటిగా పోయి ముక్కు పగలగొట్టుకొని, విమాన ప్రమాదంలో తీవ్ర గాయాలయి కూడా బ్రతికి బట్టకట్టి, అన్నాళ్ళూ తనకి సేవ చేసిన నర్సు భామ ను ప్రేమించి - ఆ తర్వాత నాలిక్కరుచుకుని ముందుకు పోయి, అలా అలా.. మాంచి రచయిత అయి, పిల్లల కోసం ఎన్నో అపురూపమయిన పాత్రలను సృస్ఠించి, అమెరికన్ ప్రెసిడెంటునే మెప్పించి,, తరవాత వాయుసేన దౌత్యాధికారిగా కూడా పని చేసి, జీవితంలో ఎన్నో పార్స్వాలను స్పృశించిన వాడు. ఈయన జీవితం - రోలర్ కోస్టర్ రైడ్ లా వుండగాబట్టి - యుద్ధంలో విమాన ప్రమాదానికి గురయి, మృత్యువు ని ముఖాముఖి దర్శించి -వెనక్కి వచ్చి ఆ అనుభవాల్ని పత్రికకు రాస్తూ.. తనలో రచనా పటిమను తనే గుర్తించేసి, అదే వృత్తి గా స్వీకరించి, ఇలా ప్రపంచ ప్ర సిద్ధి గాంచిన రచయిత కావడం..[ సాధ్యమా ?] ఈయన ప్రత్యేకత ! రాల్డ్ డహల్ సరళమైన రచయిత. ఈ సరళత వెనుక దాగి ఉన్న బోల్డన్ని అనుభవాలు - అన్నీ వొళ్ళు గగుర్పొడిచేలాంటివే.
రాల్డ్ రచనల్ని అభిమానించే వాళ్ళకి 'గోయింగ్ సోలో' ఒక ట్రోఫీ లాంటిది. రాల్డ్ ఆఫ్రికన్ జీవిత పయనం, షెల్ పెట్రోలియం కమెపెనీ లో ఉద్యోగపర్వం నుంచీ కధ మొదలవుతుంది. క్లుప్తంగా రాల్డ్ గురించి చెప్పాలంటే - రాల్డ్ తల్లికి ఒక్కగానొక్క కొడుకు ! ఇరవయ్యేళ్ళకి షెల్ కంపెనీ లో ఉద్యోగ రీత్యా మొంబాసా (ఈస్ట్ ఆఫ్రికా) బైల్దేరుతాడు. అప్పట్నించీ తన అనుభవాల్ని పంచుకోవడం - ఎలా తను రాయల్ ఎయిర్ ఫోర్స్ లో చేరడం, తిరస్కరించబడడం, మళ్ళీ చేరడం, యుద్ధ సమయం లో స్వచ్చందంగా యుద్ధం లో ఫ్లయింగ్ చెయ్యడం - ఇలా చక చకా సాగిపోయే వర్ణనలతో కధనాన్ని పరుగులు పెట్టిస్తాడు. ఇవన్నీ బోర్ అనుకునేవాళ్ళకి కొన్ని నమ్మశక్యం కాని పిట్టకధలు కూడా చెప్తాడు. అవి ఆఫ్రికన్ సింహాల గురించీ, మాంబా సర్పాల గురించీ.. ఫ్రెంచి వాడినొకణ్ణి తెగనరికిన తన స్వాహిలీ నౌకరు గురించీ.. దిగంబరంగా నౌక లో తిరిగే ఇంగ్లీష్ దంపతుల గురించీ.. ఒకటని కాదు. ఎన్నని చెప్పం ? ఇవన్నీ ఒక 21 ఏళ్ళ యువకుడికి గుర్తుంచుకోదగిన అనుభవాలే మరి. ఆరోజుల్లో ఫేస్ బుక్, బ్లాక్ బెర్రీ లు లేవు. కుర్ర కారు సాహసాలే చేసే వారు. ఇవన్నీ వివరంగా తల్లికో తండ్రికో ఉత్తరం లో కూడా రాసేవాళ్ళు. పుస్తకం లో అడుగడుగునా, రాల్డ్ తన తల్లికి పరిస్థితుల్ని వివరిస్తూ - తన అతీ గతీ చెప్తూ రాసిన ఉత్తరాలు, తీసిన ఫుటోలూ, ప్రత్యేకాకర్షణ గా నిలుస్తాయి. 'స్వాహిలీ- ఇంగ్లీష్' డిక్షనరీ - ఇంగ్లీష్ వాళ్ళ పర భాషా పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది.
ఏదో హాలీవుడ్ ఏక్షన్ సినిమా చూసినట్టు (హీరోయిన్ లేదు మరి.. ఎలా?) అనిపిస్తూంటుంది ఈ కధ. రాల్డ్ మిగిల్న రచనల్లో వివిధ సంఘటనల ప్రస్తావన వుంటుంది కాబట్టి, పాఠకులు ఆయన ఇక్కడ చెప్పే చాలా విషయాల్తో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఒడిస్సీ తదితర పుస్తకాల దుకాణాల్లో రాల్డ్ పాప్యులర్ రచనలు 'ఫామిలీ పాక్' :D లో లభిస్తున్నాయి. ఆ పాక్ లో ఇది కూడా వుంది. విడి గా కూడా దొరుకుతుంది. రాల్డ్ గురించి ఇతర వివరాలకు వెబ్ సైట్ ని దర్శించవచ్చు.
అయితే రాల్డ్ జీవితం లో ఒక భాగాన్ని మాత్రమే ఈ 'గోయింగ్ సోలో' కవర్ చేస్తుంది. అతని జీవితపు ప్రధమార్ధాని గురించి (బాల్యం) 'బోయ్' లోనూ, చరమార్ధం గురించి (చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు) 'మై ఇయర్' లోనూ రాసుకున్నాడు. వాటిని నేనింకా చదవలేదు. అవి కూడా రిమార్కబుల్ పుస్తకాలు అని విన్నాను. చూడాలి ఎప్పటికి కుదురుతుందో !