Pages

28/09/2010

నో కా బ్లా స Season 2

'నో కా బ్లా స' సూపరు హిట్టు పోస్టు అయింది. ఎడారిలో ఒయాసిస్సులా - బీటలు వారిన భూమి మీద లేలేత వాన చినుకుల్లా, ఆకలితో అలమటిస్తున్న పేదవాడికి పంచభక్ష్య పరమాన్నం లా (అ..క్ష..రా..లా..) 40 కామెంట్లు ఇప్పటివరకూ ! గడ్డిపూలు కళకళ్ళాడాయి. అయితే, నేనింత దాకా రిప్లయి సమాధానం ఇవ్వనందుకు సభ్యులు క్షమించాలి. బుల్లెమ్మ కి కుంచెం అనీజీగా వుంటేనూ, రెండ్రోజులు ఇటు తొంగి చూళ్ళేదు. కానీ, ఆఫీసులో ఎపుడైనా కామెంట్లు వచ్చేయో లేదో చూడటం, ప్రచురించుకుని మూడొందల ముప్పయి నాలుగోసారి మురిసిపోవడం వగైరా బాగా జరిగాయి.

మొదటగా - వ్యాఖ్యానించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేనస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. మొదటి వ్యాఖ్య భాస్కర రామిరెడ్డి గారికి చాలా వినమ్ర నమస్కారాలు. సత్యం వచించారు.

సభ్యత్వం కోసం చాలా మంది బ్లాగర్లు పోటీ పడ్డారని చెప్పడానికి పట్టలేనంత ఆనందిస్తున్నాను.

కానీ, నా నో.కా.బ్లా.స పోస్టు కే చాలా వ్యాఖ్యలు వచ్చినందుకు దీని 'వెరీ స్పిరిట్' కి అన్యాయం జరిగిందని కూడా పలువురు అభిప్రాయపడ్డారు.

నేనే, ఎవరి బ్లాగు లోనూ కామెంటనని కూడా చీవాట్లేసేరు.

నా బ్లాగు లోనే కామెంట్లకి సమాధానం ఇవ్వానని కూడా మిత్రులు తలంటారు.

శరత్ గారు పదవి ఇమ్మన్నారు.

పద్మ గారు 'కామెంట్లొస్తేనే బాధ ! రిప్లయి ఇవ్వాలి !' అని Absolute Truth వచించారు.

కొన్ని అర్ధం కాని అభిప్రాయాలు (ఆడవాళ్ళకి ఎక్కువ కామెంట్లు వస్తాయి-ఆకాశ రామన్న) వగైరాలు కూడా ఉన్నట్టు తెలుసుకున్నాను.

టెంప్లేట్ గురించిన సూచనలు స్వీకరించాను. పూర్తిగా అమలు చెయ్యడానికి కుస్తీ పట్టాలి వీలును బట్టీ.

మొత్తానికి అసలు మొదలంటూ పెట్టాను కాబట్టి, దీన్లో సభ్యత్వం కోరుకున్న వాళ్ళందిరికీ, విత్ డ్యూ వెరిఫికేషన్, ఫ్రీ సభ్యత్వం ఇచ్చేస్తున్నా. ఇచ్చేస్తున్నా. సభ్యత్వ రుసుము ఏమీ లేదు.

సుజాత గారి లాంటి సానపెట్టిన వజ్రాలకు (పాప్యులర్ బ్లాగర్లకు) గౌరవ సభ్యత్వం ఇద్దామనుకుంటున్నా. వీళ్ళ దగ్గర మనం ట్యూషన్ లో చేరొచ్చు. ఆస్పత్రిలో చేరి, బాగుపడి ఇంటికొచ్చేసే రోగుల్లాగా, మనం ఈ సంఘంలో చేరి, అధ్వాన్నత నుంచి, ధన్యత కి ప్రయాణం చేసి, ఇంకా, బ్లాగ్ లోకంలో పైకి, పైపైకి చేరి, బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు గడించేద్దాం. కామెంట్లే ప్రమాణం కాదని కూడా ఒట్టేసుకుందాం. (ఓథ్ / OATH అన్నమాట) శరత్ గారి పదవి సంగతి కేబినెట్ తో చర్చించి నిర్ణయిస్తా. మితృలు బులుసు సుబ్రమణ్యం గారు మాంచి పేరు (కాలే బ్లాస) సూచించారు. దీన్నీ కేబినెట్ కమిటీ కి పంపించా. చూద్దాం. (ఇంతకీ కాబినెట్టులో ఏమీ లేదు. ఖాళీ!) సరే ! ఇంక ఆపుతా !

నిజాయితీగా, నాకేం కార్యాచరణ గురించి ఐడియాలు లేవు. ఏదో సరదాకి టపాయించేను. అందరూ సరదాగా వ్యాఖ్యానించడం కూడా చాలా బాగా అనిపించింది. బుల్లెమ్మ ఫిట్ అయ్యాక, తప్పకుండా దీని గురించి కొంచెం సమయం, ఎనర్జీ, (శాయశక్తులా) ప్రయత్నిస్తాను.
నో.కా.బ్లా.స. కు సంఘీభావం తెలియచేసిన అందరు మితృలకూ, హృదయపూర్వక ధన్యవాదాలు.

14 comments:

  1. నాకు శాఖలేని పదవి ఇచ్చినా 'చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే చాలు' అని సర్దుకుంటా కానీ అస్సల్ పదవి ఇవ్వకపోతే నిరసనలూ, ధర్నాలూ గట్రా చేస్తా! సర్లెండి, ముందు బుజ్జమ్మ సంగతే చూడండి, నా పదవి సంగతి తరువాత ఆలోచిద్దురు గానీ.

    ReplyDelete
  2. Where iZZ my comment on పాతపోస్ట్....? కొత్త పొస్ట్ అచ్చేసాక కూడా పాత కామెంట్ why not కనిపించింగ్ ? నొ.కా.బ్లా.స అంటే సమాధానాలు దాటవేసేందుకు నాయకులు చెప్పే ’నో కామెంట్స్’ లాంటి బ్లగర్ల సంఘమా.... నేను దీన్నొప్పుకోనద్దెచ్చా...

    సమాధానాలు బుల్లెమ్మ ఫిట్ అయ్యాకే ఇవ్వుడి...

    ReplyDelete
  3. సుజాత గారూ,

    నేను మాత్రం సంఘం ఆశయాలను గౌరవించి చదివి కూడా కామెంట్ పెట్టకుండా వెళ్ళిపోయి నా బ్లాగ్ నుండి మిమ్మ్లని సభ్యత్వం అడిగానండీ..

    సంఘం లో చేరక ముందే ఇలా సంఘాన్ని విపరీతం గా గౌరవించే వారికి ఏదైనా పెద్ద పోస్ట్ వుందాండీ? ఈ శరత్ కాలం గారు ఒకరు...E సంఘం పెట్టినా, నాకోక పోస్ట్ అంటూ వచ్చేస్తారు. మనమేమో ఆయన సంఘం లోకి అంత సులువు గా వెళ్లగలీగ్ సంఘాలు కావవి. కాబట్టి నాకు ఆయన కన్నా పెద్ద పోస్ట్ కావాలి ...ప్లీజ్.

    ReplyDelete
  4. నో కా బ్లా స క్యాబినెట్ నుంచి మిమ్మల్ని తీసేసాం గదా. అయ్యో మీకింక తెలీద. మీ సబ్యత్వం రద్దు అయ్యిందొచ్, అయినా భలే పట్టేసారండి ఎలా రాస్తే కామెంట్లు వస్తాయన్నది. మొత్తానికి కామెంట్ల వర్షం లో తడిసిపోయారు. ఇక తుఫాన్లు , సునామీ లు రావాలని? సరదాగా బాగుంది.

    ReplyDelete
  5. సుజాతగారూ.. మీ కొత్త సంఘం బాగుంది.
    మీరెందుకో వెనుకాడుతున్నారు గానీ, కామెంట్లు రాలడం చాలా వీజీ... అదీ ఆడవారికి.. :)


    సరదాగా చేసిన వ్యాఖ్య అది. అమ్మాయిలు కొంచెం దైర్యంగా రాస్తే కామెంట్లు టప టపా అవే రాలతాయన్నది నా అభిప్రాయం. కావాలంటే మీరు మహిళా బ్లాగర్లను చూడండి .. మీకే అర్థం అవుతుంది. :)

    ReplyDelete
  6. నాకే సభ్యత్వాలూ వద్దండీ! పాపులర్ బ్లాగర్ , వజ్రం అదీ ఇదీ లాంటి బిరుదులసలే వద్దు! ఏదో చదవడం తప్ప రెగ్యులర్ గా రాయడం కూడా లేదు! ఏదో ఇలా లైట్ గా పోనీండి నన్ను! మీరు ట్యూషన్ చేరాలంటే వందల కొద్దీ కామెంట్స్ వచ్చే బ్లాగర్లు బోల్డు మంది ఉన్నారు, మన ఒంగోలు శ్రీను తో సహా!

    మీ పాత పోస్టుకు అని కామెంట్స్ వచ్చాక ఇంకా నో కా బ్లా స కి అస్థిత్వం ఎక్కడుంది? అది రద్దయి పోయింది మరి! :-))

    ReplyDelete
  7. కల్పనా గారు

    మీలాంటి వాళ్లకు ఈ సంఘం లో ప్రవేశం లేదోచ్. అయినా ఈ రోజుల్లో స్త్రీ లు దైర్యంగా ఎక్కడికైనా వెళ్తున్నారు కదా ! మీరెంటండి అల్లా అంటున్నారు. అయినా మీలాంటి వాళ్ళు ఇక్కడ కూడా చేరితే మేం ఎక్కడి కి వేల్లలండి. ఎవరితో మొర పెట్టుకోవాలి. బాబ్బాబు సారీ అమ్మ అమ్మ అమ్మ మమ్మల్ని వదిలేయండి సంఘ సబ్యులార దీన్ని అందరు ఖండించండి.

    ReplyDelete
  8. మరి మీకు తలంటి, చీవాట్లు పెట్టిన వారికి సభ్యత్వం ఉందా??

    ReplyDelete
  9. @soumya garu,

    Yeah. Sure. Why Not ?! Definitely. they hv kept the mirror across my face.

    ReplyDelete
  10. @ Sarat

    ok. Miru kooda e sangham loa e post lo unnaro track pettukondi.

    ReplyDelete
  11. @ Nagarujuna

    కొత్త పొస్ట్ అచ్చేసాక కూడా పాత కామెంట్ why not కనిపించింగ్ ? ??? Missing. Nakoo rale.

    ReplyDelete
  12. హహ్హహ్హా.. భలే టపా రాశారు.. ఇంకా భలే సంఘం పెట్టారు.. కామెంట్ల సంగతేమో కానీ నాకు మాత్రం నవ్వుల పంట అందించారు..:) చాలా చాలా బాగున్నాయండీ మీ టపాలు..:)

    ReplyDelete
  13. బుల్లెమ్మ జాగ్రత్తండీ.. బ్లాగెక్కడికీ పోదు..

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.