Pages

02/09/2010

అప్రస్తుతం !





జీవితంలో తెరలు తెరలుగా ప్రత్యక్షమవుతున్న భయాలను ఒక్కొటిగా ఛేదిద్దామని – నిర్వికారమైన మనస్తత్వాన్ని సాధిద్దామని, బుల్లెమ్మ తో కలిసి ఇంట్లోనే ఉండిపోదామనీ ఏవేవో కోరికలు !

ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవడం అనే ఆటలో బాధ పడుతున్న మనసును జోకొట్టి, ధైర్యం సమీకరించుకుందామని లాలస ! ఈ ఆట బాగా ఆడాలనే కోరిక లో నన్ను నేనే ఓడించేసుకుంటానేమో అనే సందేహం !

ప్రస్తుతం ఇదీ నేను.

9 comments:

  1. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్థితిని అనుభవిస్తారేమోనండి.

    ReplyDelete
  2. మీ పరిస్థితి ఏంటో నాకు సరిగ్గా అర్ధం కాలేదు. మీ భయాలేంటో వివరంగా చెబితే పరిష్కారం తెలిసిన వారు సూచించడానికి ఆస్కారం వుంటుంది.

    ReplyDelete
  3. నేను ఇంచు మించు ఇలాంటి స్థితి లోనే ఉన్నాను కాని ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవడం అనే ఆటలో కాకుండా అన్ని కోల్పిపొతున్నాననే లా ఉంది

    ReplyDelete
  4. సుజాత గారూ ..నమస్కారం. తక్కువ వాక్యాల్లో గొప్ప తత్త్వం చెప్పారు. మనసు మర్మం పట్టండి ఓటమి ఉండదు గాక ఉండదు. కాదంటారా....!

    ReplyDelete
  5. true.

    మా వివి అధ్యక్షులుంగారు విద్యార్ధులనుద్దేశించి చేసిన ఒకానొక ఉపన్యాసంలో ఇలా సెలవిచ్చారు:
    "If you were ever given the choice of two paths in life, you should be able to say - I will take both of them, thank you very much."

    ReplyDelete
  6. అర్ధమయినట్టే అనిపించిందండీ.. అర్ధం చేసుకున్నదాన్ని బట్టి చెప్పేది ఏమిటంటే.. పరుగుపందెం మొదలు పెట్టాక పరుగు ఆపడం కుదరదు.. ఇతర ఆలోచనలతో నిమిత్తం లేకుండా పరుగెడుతూనే ఉండాలి.. యుద్ధం చేయనన్న అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడో గుర్తు చేసుకోండి..

    ReplyDelete
  7. తప్పదు సుజాత. జీవితం లో ప్రతి మలుపులు లో చాయిస్ లు వుంటాయి చాయస్ లకు కాన్సిక్వెన్సెస్ వుంటాయి.. మీరు తీసుకునే మంచి చాయస్ లకు మంచి ఫలితం వచ్చి వదులుకున్న దానిని మరిపించేట్లు చెయ్యాలని ఆకాంక్షిస్తున్నా.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.