నేను నాకోసం నాకై తీసుకున్న నిర్ణయం ఒకటుంది. ఇంక నుండీ నన్ను నేను ప్రేమించేసుకోవాలి గాట్టిగా !
చాలా రోజులయింది నేను నిజంగా బ్లాగింగ్ చేసి. నిరుడు ఎంతో ఉత్సాహం తో మొదలు పెట్టేసి, ఏవేవో రాసేసి, నా వెన్ను నేనే తట్టేసుకుని చతికిలబడ్డాను. బ్లాగు రాయడం సరదాగా ఉండేది. చదవడం కూడా ఇష్టమే. కానీ అప్పుడు ఇన్ని బ్లాగులు లేవు. కావల్సినంత సమయం ఉండేది. బ్లాగు వల్ల లోకం పెద్దదయ్యి, నాలుగు ముక్కలు మంచీ చెడూ తెలిసి నా పరిధి విస్తృతం అయింది సుమీ అని ఆనందించే లోపే రక రకాల కారణాల వల్లా, స్వయంగా అంతర్ముఖ ను అయి ఉండడం వల్లా, ఇంకో సగం వీలు చిక్కకా కాస్త ఇక్కడి వాతావరణానికీ, ఆవరణానికీ దూరం అయ్యాను.
మధ్య మధ్య లో కూడలికి వచ్చినా, తెలిసిన వారిని మాత్రమే పలకరించి పోతూ ఉండటం వల్ల, కొత్త వాళ్ళూ, కొత్త గాలీ అలవడలేదు. ఇపుడు కొంచెం టైం దొరికి రోజూ కూడలికి వస్తున్నాను. వివాదాలూ - హేళన లూ ఉంటాయని భయపడి ఇప్పటి దాకా జోలికి పోని కొత్త (నాకు - రిలెటివ్ గా) బ్లాగుల్ని చదివాను. నా బ్లాగులో వ్యాఖ్యలు విదిల్చిన అపరిచితులను వెంటాడి, వాళ్ళ బ్లాగులూ చదివాను.
ఈ అనుభవం బావుంది. ఎన్నో కొత్త సంగతులూ, శైలులూ తెలిసాయి. 'అర్రె ! ఈ బ్లాగు బావుందే' - అనుకుంటూనే ఇప్పటి దాకా కనీసం ఒక డజను బ్లాగుల్ని ఆపాదమస్తకం (అన్ని టపాలూ) చదివేసేను.
ఇన్నాళ్ళూ కుంచుంచుకుపోయిన పరిధి ఇప్పుడు కాస్త వదులయింది. ఆ రచనల్నీ, ఆ ఉత్సాహానీ, కసినీ - హాయినీ - కొత్త కొత్త బ్లాగులు నాలో పూరించిన కొత్త ఉత్సాహాన్ని అందిపుచ్చుకుని, నేనూ కొంచెం హాయిగా బ్లాగుదామని నిర్ణయించుకున్నానుల్. మునుపు 'బ్లాగులు రాయండి మహాశయులారా - అని పెద్దలు ప్రచారం చేస్తుంటే - ఏమో అనుకునేదాన్ని.
బానే ఉంది - బ్లాగులు ఎక్కువయ్యాయి. సమాచారమూ ఎక్కువే ఉంది. మంచో చెడో నిర్ణయించాల్సింది చదువరులే ! ఏదో ఉత్సాహం ఉండనే ఉంది. పాత వాళ్ళూ, కొత్త వాళ్ళూ అదే ఉత్సాహం తో ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారు.
నేనూ ఇంక ఏదో ఒకటి మంచిగా రాయాలి. ఎందుకంటే - పిపీలికంలాగా మిగిలిపోకుండా ఉండాలంటే ఏవైనా మంచి విషయాలు తెలుసుకోవాలి. గడ్డిపూలా - అవేవీ - గొబ్బి పూలా - జిల్లేడు పూలా అని - ఎవరయినా ఎగతాళి చేస్తే నవ్వుకునేందుకు సరిపడా ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి.
ఇంతకీ - ఈ మధ్య నేను సాధించిన విజయాలు - పాత స్నేహితులకూ, ఎన్నాళ్ళుగానో మాట్లాడకుండా దూరం అయిన బంధువులకూ ఫోను చేసి పాత స్నేహాల్నీ, ప్రేమల్నీ నెమరు వేసుకోవడం..
ఊర్లో ఉన్న బందు మిత్ర పరివారాల్ని ఒక్కర్నీ వొదలకుండా ఇంటికెళ్ళి వాళ్ళకి నాకు అతిధిసత్కారాలు చేసుకుని తరించే భాగ్యాన్నివ్వడం,
ఆఫీసులో నూ, బయటా - ఎవరికి ఎంత మాటంటే అంత మాట సమాధానం ఇవ్వడం (అతి కోపం, వీర నారీ టైపు) (ఇది విజయం కాదు కానీ, నా మంచితనాన్ని (మెతక స్వభావాన్ని) అపార్ధం చేసుకునే వాళ్ళను షాక్ చేసాను) సగం మంది జనం నాకు పిచ్చెక్కిందని తీర్మానించేరు. అయినా ఒప్పుకోలేదు మరి !
- ఇలా - ఇవన్నీ నాకు నేను చేసుకున్న మేళ్ళే ! ఒక్కటీ ఇంకొకరి కోసం చేసినది కాదు. కానీ ఇలా నన్ను నేను ఉద్ధరించుకోవడం సంవత్సరానికొకసారి కాబట్టి ఈ సీజన్ ముగిసే లోగా నా బ్లాగును కూడా కొంచెం ఉద్ధరిద్దామనీ (లేకపోతే ఈ పోటీ ప్రపంచం లో - ఏమో అయిపోయి - ఇంకేమో అయిపోతాయని బెంగపడి... ) నిర్ణయించీసుకున్నాను.
రేపట్నించీ చూడండి - సరికొత్త రకం గడ్డిపూలని (!) (ఏమో రేపు ఇటు తొంగి చూసే వీలుంటుందో లేదో !!! రేపంటే - దీని తరువాత రాయబోయే టపా నుంచీ. ఎందుకంటే - ఈ టపా ఎలాగూ సొంత సోది కాబట్టి) ఇది నా గడ్డిపూలమీద ఈ వేసవిలో కొంచెం నీళ్ళ చిలకరింపు - నన్ను ప్రేమించేసేసుకుంటే సరిపోదు కదా... నా బ్లాగు తో కూడా మళ్ళా ప్రేమలో పడాలి. లేకపోతే ఇంతమంది అందమయిన బ్లాగుల్లో నా బ్లాగు పేలవమయిపోతుంది.
ఇంకెందుకాలస్యం? కానీయండి.
ReplyDeleteహ హ భలే రాసారు..హూం.. నేను మీ బ్లాగు తక్కువే చదవడం కాని, మీరు ఇతరుల బ్లాగులలో వెసిన కామెంట్లను మాత్రం విరివిగా చదివాను.. గడ్డిపూల సుజాతగా మీరు చాలామందికి సుపరిచయం .. మీ కొత్త పోస్టులకోసం ఎదురు చూస్తూ ఉంటాం అందరం
ReplyDeleteఅయితే మీ అజ్ఞాతవాసం వెనకాల ఇంత సంఘర్షణ ఉందన్నమాట :))
ReplyDeletemissed reading your posts for sure..
>>ఊర్లో ఉన్న బందు మిత్ర పరివారాల్ని ఒక్కర్నీ వొదలకుండా ఇంటికెళ్ళి వాళ్ళకి నాకు అతిధిసత్కారాలు చేసుకుని తరించే భాగ్యాన్నివ్వడం
ReplyDeleteptch.. పాపం... :)
అయితే రేపటినుండి, గడ్డిపూలు గుత్తులు, గుత్తులు వస్తాయనమాట!!!
"వేసవిలో గడ్డిపూలు.....వెదజల్లు పరిమళాలు"
ReplyDeletehhmmmm
ReplyDeleteఅజ్ఞాతవాసం వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి వస్తున్నారా. స్వాగతం. కానివ్వండి మరి..
ReplyDeleteబ్లాగులే ప్రపంచం కాదు. అప్పుడప్పుడూ బ్లాగు సెలవు తీసుకుని బంధు మిత్రులను పలకరించటం ఆరోగ్యకరం. కొత్త ఉత్సాహంతో ఎప్పటివలే రాస్తారని ఆశిస్తాను.
ReplyDeletemee gaddipoolu parimalaalu vedajalle ..kshnam .ki
ReplyDeleteగడ్డిపూలు మళ్ళీ పూస్తున్నాయన్నమాట. :).
ReplyDeleteవాడిన గడ్డిపూలే వికసించెనే ..
ReplyDeleteగుడ్ గుడ్
బాగుంది మీ స్వగతం. వేసవి వేడిని మీ టపాలతో చల్లర్చండి మరి.
ReplyDeleteబావుందండీ సుజాతగారూ , నేను వచ్చిన కొత్తలో సుజాత లిద్దరి మధ్య తికమక పడుతుంటే ఇంగ్లీష్ సుజాత " గడ్డిపూలు సుజాత ,తెలుగు సుజాత " మనసులోమాట సుజాత అని చెప్పి నా కష్టం తీర్చారు గుర్తుందా .( పై వాక్యం లో ఎందరు సుజాతలు వున్నారో ఠక్కున చెప్పాలి ) ఈ సారి నాకు అలవాటై పోయిందిలెండి.
ReplyDeleteమీరుకోప్పడనంటే ఓ మాటండి. తెలుగులో మేళ్ళు అనే పదం లేదటండి.( మీరు కావాలనే రాసారా ఐతే O.K.) మనముఖ్యమత్రి గారు ( ఇవ్వాల్టికేలెండి) తరచూ ఈ పదాన్ని వుపయోగిస్తారు . మా ప్రభుత్వం చేసినన్ని మేళ్ళు ......అని , ఎవరైనా ఆ పదం తప్పండీ అంటే ఆ.... మనం చేసింది తక్కువ మేలా అందుకే ఇలా అంటమే కరెక్ట్ అని వాదిస్తారట. సర్లెండి కొంగొత్త ఉత్సాహంతో, కొంగొత్తపోష్టులు వస్తాయని ఆసిస్తున్నాం.
లలిత గారు
ReplyDeleteథాంక్స్. నేను సరదాగా రాసాను మేళ్ళు అని. ఈ సారికి క్షమించండి. ఒంటరితనాన్ని తుంటరితనంతోనే ఎదుర్కోవాలని బుద్ధొచ్చి మళ్ళీ నా బ్లాగు పంచనే చేరాను. మీ వాక్యంలో నాలుగు సుజాతలున్నారు. (!!!!) కనిపెట్టేసా !