Pages

03/09/2008

లక్కీ మిట్టల్ విజయాలు

ఇండియా కు మూడు ఒలింపిక్ పతకాలు. వాటిల్లో ఒకటి, స్వర్ణం.. అందరూ ఖుష్ ! వీటి వెనుక ఒక ఉక్కు స్నేహ హస్తం ఉంది. తెలుసా ? ఆ హస్తమే లక్ష్మీ మిట్టల్.


క్రికెట్ - ఆర్ధికంగా, భారత దేశాన్ని శాసించే క్రీడ ! క్రికెట్ మీద కాసులు కురిపిస్తే నష్టపొయ్యేదేమీ లేదు. క్రికెట్ లో గ్లామరుంది. క్రికెట్ (భారత దేశపు టీం అంటూ ఏమీ లేదు) దేశాన్ని ముందుకు నడిపిస్తుంది అని వెఱ్రిగా నమ్మే భారతీయ కోర్పరేట్ ప్రపంచాన్ని లక్కీ మిట్టల్ చిన్న కుదుపు కుదిపాడు.


స్పాన్సర్ షిప్ - ప్రోత్సాహం, మెఱికల్లాంటి క్రీడాకారుల ఎంపిక, కోచింగ్, అత్యుత్తమ ఫిశియో థెరపీ - ఎమోషనల్ సపోర్ట్ - మనకి ఈ సారి బీజింగ్ ఒలింపిక్స్ లో ఈ విజయాల్ని సాధింప జేసాయి. క్వార్టర్ ఫైనల్ వరకూ అయినా మన క్రీడా కారులు చేరగలిగారంటే వారి విజయం వెనుక ఉన్న అదృశ్య హస్తం మిట్టల్ !


విజెందర్ మినహా అభినవ్, సైనా సహా అందరు క్రీడా కారులకూ మిట్టల్ సహకారాన్ని అందించారు. However, విజెందర్ కూడా మిట్టల్ స్పాన్సర్షిప్ లో పని చేసిన వారే - కాకపోతే, ఒలింపిక్స్ కు కాస్త ముందుగా బయటకు వచ్చారు. కాబట్టి విజెందర్ కూడా మిట్టల్ ప్రోత్సాహం వల్ల లాభ పడినట్లే చెప్పుకోవచ్చు.


2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో భారత్ అపజయాల్ని చూసి నొచ్చుకున్న మిట్టల్ కుటుంబం 2005 లో లండన్ లో వింబుల్డన్ లో మహేష్ భూపతి ని కలిసారు. మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ ను స్థాపించడానికి నాంది పలికారు. 10 మిలియన్ డాలర్లు, 40 మంది క్రీడాకారులు, 2012 ఒలింపిక్స్ లో మంచి ఫలితాలను సాధించాలన్న లక్ష్యం తో మొదలయిన ఈ ఎం.సీ.టీ (మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్) ఈ బీజింగ్ ఒలింపిక్స్ లో తన టీం లోని 14 గురు క్రీడాకారులతో సాధించిన అత్బుతాలు చెప్పుకోదగ్గవే!


భారత దేశంలో త్వరలో బాక్సింగ్ లీగ్ లను మొదలు పెట్టబోతున్నారు ! బాక్సింగ్ మీద యువత లో క్రేజ్ మొదలయింది. కరణం మల్లీశ్వరి గుర్తున్నారా? మల్లీశ్వరి కు మన రాష్ట్రం లో లభించిన ఘన స్వాగతం గుర్తుందా ? ఆ తరవాత చాలా మంది అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నారుట. క్రికెట్ తో విబేధించే ఉద్దేశ్యం నాకు లేదు. భారత దేశంలో నిజంగా మైదానానికి వెళ్ళి పరుగులు పెట్టి, క్రికెట్ ఆడినా, ఆడకపోయినా, టీవీ లో క్రికెట్ కు అతుక్కుపోయే జనాభా అత్యధికం. క్రికెట్ తనకు తానే సాయపడగలదు. మరి మిగతా క్రీడల మాటేమిటి ? ఒలింపిక్స్ రాగానే వాటి మీద ఆందోళన చెందడం, ఆ రెండు వారాలు కాగానే, యధావిధి గా ఈ.ఎస్.పీ.ఎన్. చూడటం, మన అలవాటు.


అమిత్ భాటియా - [ మిట్టల్ అల్లుడు ] కూడా క్రికెట్ లో డబ్బు పెట్టడానికి పూర్తిగా వ్యతిరేకం. మిట్టల్, భాటియాలు కలిసి చేసిన ఈ అత్భుతం మాత్రం ఖచ్చితంగా స్వర్ణ పతకాన్ని గురించి కాదుట (కనీసం బీజింగ్ లో). కానీ సాధించిన విజయాలువారినే ఆశ్చర్య పరచినా, frankly ఖచ్చితంగా స్పూర్తిదాయకాలు ! విజేతలు ( జరా హట్ కే..) విభిన్నంగా ఆలోచిస్తారేమో ! మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ 2005 నుండీ ఇదే పని లో ఉంది ! మూడేళ్ళ పాటూ అకుంఠిత దీక్ష, లక్ష్యాల పట్ల చిత్త శుద్ధి తో లక్ష్మీ మిట్టల్ సాధించిన ఈ విజయం లక్ష్మీ ని భారతీయ క్రీడల లక్కీ ఐకన్ గా మార్చింది. మిట్టల్ కేవలం స్పాన్సర్ మాత్రమే కాదు. ఆయన దేశానికోసం ఏదో చెయ్యాలనుకుని ఉబలాటపడ్డారు. సో... భారత దేశం 2012 ఒలింపిక్స్ కోసం ఎదురుచూడొచ్చు !

9 comments:

  1. Quite Informative!

    Yes, the future seems bright. Hope we don't get carried out.

    ReplyDelete
  2. Thanks.. (thanks to OUTLOOK - I merely copied the matter here, coz I was damn impressed!)

    ReplyDelete
  3. Informative and insightful. Thanks to you as well as outlook for the post

    ReplyDelete
  4. మిట్టల్ నిజంగా అభినందనీయుడు. మిట్టల్ స్పూర్తితో ఇంకొంతమంది సంపన్న భారతీయులు ముందుకు వస్తే వచ్చే ఒలంపిక్సులో ఇంకా మెరుగైన ప్రదర్శన మన క్రీడాకారుల నుండి ఆశించవచ్చు.

    ReplyDelete
  5. Good Info.. :) Thanks for sharing it.

    ReplyDelete
  6. Dear Precious,

    Srividya

    Varoodhini garu

    Thanks a lot. ..mmm... interesting anukunTaarani poasT cheasa.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.