స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవులు కలిసి రావడం తో, చాలా రోజుల తరవాత మా వూరు వెళ్తున్నాను. మనసంతా చాలా మంచి ఫీలింగ్స్.. వొద్దు వొద్దులే అనుకుంటున్నా.. ఏవేవో ఎక్స్పెక్టేషన్స్! వుంటూనే వున్నాయి. చాలా హాపీ గా వుంది.
ఎన్నో నెలల తరవాత అప్పచెల్లెళ్ళం కలుసుకోబోతున్నాం. మా అక్క కొడుకు ను కూడా దాదాపు ఏడాదిన్నరతరవాత చూడబోతున్నాను. వైజాగ్ ఎంతగా మారిపోయిందో - కొత్త షాపులూ బోల్డు వచ్చుంటాయి. ఎం.వీ.పీ కాలనీ లో వేంకటేశ్వాలయానికీ, సింహాచలం, బీచ్ వెళ్ళాలని అనుకుంటున్నాను. చూడాలి, పరిస్థితులు ఎంతవరకూ అనుకూలిస్తాయో !
ఈలోపు ముఖాముఖి గా కలుసుకోబోతున్న ప్రమదావనం స్నేహితులందరికీ (ఉడుక్కుంటూ !) అభినందనలు.
అన్నట్టు దేశభక్తులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
అమ్మవారి భక్తులకు శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు !!
అన్నయ్యలూ చెల్లెళ్ళందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు !!!
నేను వూర్నుంచొచాకా, సుజాత గారి ద్వారానో, జ్యోతి గారి ద్వారానో - విశేషాలు తెలుసుకుంటాను.
అంత వరకూ.......సెలవిప్పించండి !
సెలవులు సరదాగ గడిపి రండి.మీ విశేషాలతో మళ్ళీ బ్లాగులో కలుద్దాం!
ReplyDeleteఅన్నట్టూ మీ టెంప్లేట్ బాగుంది!
నేనూ వైజాగ్ ప్రయాణం కట్టానండోయ్. hav a gud trip
ReplyDeleteబోలెడన్ని వైజాగ్ కబుర్లు మోసుకొచ్చే షరతు మీద సెలవు మంజూరు చేయబడును. శుక్రవారం మధ్యాహ్నం (పూజ అయ్యాక) నేనూ జంప్! Have nice trip and enjoy your stay.
ReplyDelete