Pages
▼
04/07/2008
అంతర్జాతీయం - కొలంబియా లో అద్భుతం
రాంబో సినిమా మా టైం లో సూపర్ డూపర్ హిట్। అలాంటి సినిమా ఇంకోటి రాలేదు। ఈ రోజు న్యూస్ లో అలాంటి వొళ్ళు గగుర్పొడిచే వార్త ఉంది। కొలంబియా లో గత ఏడు సంవత్సరాలుగా గెరిల్లా ల (ఫార్క్ - రివల్యూషనరీ అర్మెడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా ) బందీ గా ఉన్న నలభయ్యారెళ్ళ ఇంగ్రిడ్ బెంటాకోర్ట్ అనే ఆవిణ్ణి మరో పధ్నాలుగురు ముఖ్యమైన బందీల తో సహా ఆర్మీ విడిపించింది। ఈ ఆపరేషన్ లొ ఒక్క తుపాకీ గుండు పేలలేదు. ఒక్క రక్తపు బొట్టు చిందలేదు. ఇంగ్రిడ్ కొలంబియా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఆవిడని ఫిబ్రవరి 2002 లో ఫార్క్ కిడ్నాప్ చేసేసింది। అప్పణ్ణించీ బందీ గానే ఉన్న ఆమెను ఇతర బందీలు (అమెరికన్ కాంట్రాక్టర్లూ, కొలంబియా సైనికులూ, పోలీసులూ॥ )తొ సహా ఒక హెలికాప్టెర్ లో సినిమా లొ లాగా తీసుకుని వచ్చేసారుట। కొలంబియా అడవుల్లో ఈ బందీలందర్నీ ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉండేవారు। ఇలా ఈ రోజు కూడా షిఫ్ట్ చేసే నెపంతో ఒక హెలికాప్టెర్ లో వచ్చిన కొందరు గొరిల్లాలు॥ (గొరిల్లాల వేషం లో ఉన్న యూ. ఎస్. సైనికులు) బందీలందర్నీ జనారణ్యం లోకి తీసుకు వచ్చేసారు. కొన్ని సంవత్సరాల పాటూ॥ తీవ్రవాదులలొ కలిసిపొయి, వారి కదలికలను కనిపెడుతూ।, సరైన ప్రణాళిక తో, సరైన సమయం లో సరైన నిర్ణయాలు తీసుకుంటూ॥ ప్రాణాలకు తెగించి చేసిన ఈ ఆపరేషన్ లో కొన్ని వందల మంది సైనికులూ, పోలీసులూ పాల్గొన్నారు। తీవ్రవాదులను మోసం చేసి, తీవ్రవాదుల వేషాల్లో ఉన్న సైనికులు తెలివి తేటల తో ఈ ఆపరేషన్ ను నిర్వహించారు.
ఇంగ్రిడ్ కిడ్నాప్ చాలా సంచలనం సృష్టించింది। వెనిజుయెలన్ ప్రెసిడెంట్ ఆమె విడుదల కై చాలా ప్రయత్నాలు చెస్తూండే వాడు। ఆయన చొరవ కారణంగా గత ఆరు నేలలలో ఫార్క్ ముఖ్యమైన కొందరు బందీలను విడుదల చేసింది। ఇంగ్రిడ్ మాత్రం విడుదల కాలేదు. ఇంగ్రిడ్ ను బలమైన పావుగా ఇన్నాళ్ళూ వాడుకున్న ఫార్క్ కు నడుము విరిగినట్టయింది. నిర్దాక్షిణ్యమైన కిడ్నాపులూ, హత్యలూ చేసే ఫార్క్ కు అచ్చం సినిమాల్లొ లాగా దెబ్బ తగిలింది.
హెలికాప్టెర్ లోకి బందీలు ఎక్కగా నేల మీద మిగిలిపొయిన నలభయి మంది తీవ్రవాదులను మాత్రం వొదిలేసారు. హెలికాప్టెర్ లో బందీలతో పాటూ ప్రయాణించిన ఇద్దరు గొరిల్లాలను కోర్టు ముందు ప్రవేశ పెడతారు. ప్రభుత్వం, అధ్యక్షుడు యురైబ్, సమర్ధవంతమైన అధికారులూ కలిసి అత్భుతంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ చరిత్ర లో మిగిలిపోతుంది. తీవ్రవాదం తో నలిగిపోతున్న దేశం ఇలాంటి అహింసాత్మకమైన దాడి నిర్వహించడం, ఇప్పటి చరిత్రకు చెందని కరుణ చూపించడం ; గొరిల్లలను గొరిల్లా వ్యూహలతోనే ఎదుర్కోగలగడం, ఈ విజయానికున్న గొప్ప విషయాలు। క్షేమంగా బందీలను విడిపించడం తో పాటు, ఈ అత్భుతాన్ని సాధించాకా, నలభై ఏళ్ళ చరిత్ర గల ఫార్క్ కు అంత గట్టి దెబ్బ (బ్లో) ఇచ్చి, బలహీన పరిచి, ప్రభుత్వం వారిని చర్చలకు రమ్మంటుంది। మోత్తానికి ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించిందా ? కొలంబియా లో శాంతి అంత అకస్మాత్తుగా రాకపోవచ్చు! కానీ హింసకు హింసే సమాధానం అనుకునే ప్రపంచం దీన్నుంచీ కొంచెం ఏదైనా నేర్చుకుంటే బావుంటుంది.
Photo : Ingrid in captivity : 2002
ReplyDeleteశుక్రవారం న్యూస్ లో చూసాను,ఒక్క తుపాకీ గుండు పేలక, ఒక్క నెత్తురు చుక్క రాలకుండా బందీలను తప్పించారు.తప్పించడంలో వీరు మారు వేషంలో ఉన్న పోలీసులని తెలిస్తే క్షణంలో వాళ్ళ ప్రాణాలు గాలి లో కలిసిపొయేవి.
ReplyDeleteకథనం ఆసక్తికరంగా రాసారు. ఇది అద్భుతమే మరి. ఈ వ్యాస మకుటంలోని అత్భుతం ను అద్భుతం గా సరిదిద్దగలరు.
ReplyDeleteThank you.
ReplyDeleteCB rao gaaru.. thank you. I hv corrected atbhutam.. ! :D
COlumbia - not Combodia.
ReplyDeleteColumbia is in SOuth America
Camobodia is in Asia
దీన్ని మించిన సినిమా ఫక్కీ రెస్క్యూ ఆపరేషన్ 1976 జూన్ లో ఇజ్రాయెలీ సైనికులు విజయవంతంగా చేశారు. Operation Entebbe గా ఇది ప్రాచుర్యం పొందింది. అప్పటి ఉగాండా నియంత ఈదీ అమీన్ సైన్యం హైజాక్ చేసిన ఫ్రాన్స్ కి చెందిన 139 మంది ప్రయాణీకుల విమానాన్ని కాపాడిన ఆపరేషన్ ఇది. ఈదీ అమీన్ ని పోలిన మనుషులని, అతని కాన్వాయ్ ని పోలిన కార్లని సైనిక విమానాల్లో ఉగాండా లోని Entebbe విమానాశ్రయంలో అక్కడి ఎయిర్ కంట్రోల్ కి తెలియకుండా రాత్రి వేళలో రహస్యంగా దించి, తరువాతి ఉదయం ఈదీ అమీన్ స్వయంగా వెళ్లి నిర్బంధితులని విడుదల చేయించినట్లు అత్యంత నాటకీయంగా బందీలను విడుదల చేయించుకుపోయిన ఘనత ఇజ్రాయెలీలది.
ReplyDeleteనిజంగా ఒక అద్బుతమైన పుస్తకం రాయొచ్చేమొ ఈ ఆపరేషన్ మీద.
ReplyDeleteఅబ్రకదబ్ర గారు చెప్పిన విషయం పై అద్భుతమైన పుస్తకం: 90 Minutes at Entebbe by William Stevenson. అవకాశం/ ఆసక్తి ఉంటే తప్పక చదవండి!
ReplyDeleteకొత్త పాళీ గారు.. థాంక్స్. What a Blunder it Was!!! ''కొలంబియా'' గా సరి చేశాను.
ReplyDeleteనెటిజెన్ గారు, థాంక్స్. అవునా.. అబ్రక దబ్ర గారు సూచించిన పుస్తకం చదవటానికి ప్రయత్నిస్తాను.
ReplyDeleteSujata,
ReplyDeleteWhenever I hear about Operation Entebbe, I get goosebumps.
If you don't want to read the book, you can watch it here .
Please see this. It's a must watch.
http://www.youtube.com/watch?v=s3dEX4yYXts
Thank you independent garu. I watched the video. It was lengthy but good.
ReplyDeleteసుజాత గారు,
ReplyDeleteచాలా బాగుంది ఈ వ్యాసం. గొరిల్లలను గొరిల్లా వ్యూహలతోనే ఎదుర్కోవటం చాలా బాగుంది. " హింసకు హింసే సమాధానం అనుకునే ప్రపంచం దీన్నుంచీ కొంచెం ఏదైనా నేర్చుకుంటే బావుంటుంది" అని చివరలో మీరు అన్న మాటలు నాకు చాలా నచ్చాయి.
Thank you sunita
ReplyDelete