ఒక ఆదివారం B4U Moovies లో 'మాతృభూమి: అ నేషన్ వితౌట్ విమేన్' (హిందీ) అనే సినెమా చూసాను. మధ్యలోంచి చూడటం మొదలుపెట్టడం వల్ల అసలు కధ ఎమిటో మొదట అర్ధం కాకపోయినా ఇంతకూ ముందు ఈ సినెమా గురించి విని ఉండటం వలన చూచాయ గా అర్ధం కావటం ఆరంభించింది. ఈ సినిమా లో దిగ్గజాలే నటించారు. నేను ఇష్టపడే త్యులిప్ జోషి హీరోయిన్. ఐతే.. ఈ సినీమాలో సున్నితంగా పువ్వులా ఉండే ఈ అమ్మాయి ఎలా నటించిందా అని ఆశ్చర్యం కలిగింది. ఈ పువ్వు లాంటి అమ్మాయి మీద జరిగే అత్యాచారాల్ని చూసి రాక్షసుడికైనా బాధ కలుగుతుంది.
ఈ సినెమా కధ ఒక ఊహ నించి పుట్టింది. మనీష్ ఝా ఈ కధను రచించి, సినీమా దర్శకత్వం వహించారు. వర కట్న దురాచారం దేశం లో మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్ చేయించడం, ఆడ పిల్ల పుడితే రక రకాల హేయమైన పద్ధతుల లో ఆ పసిగుడ్డును చంపటం.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆడ సంతానాన్ని చంపటం.. ఇదే రేట్ లో కొనసాగితే.. కొన్నాళ్ళకి దేశం లో ఆడవాళ్ళే కరువుతారు. అటువంటప్పుడు సామాజికంగా ఎటువంటి పరిస్తితులు ఎదురుతాయో ఊహించి తీసిన చిత్రం ఇది. ఈ సినెమా ౨౦౦౩ లో విడుదలైంది. చాలా అంతర్జాతీయ వేదికలలో విడుదల అయి చాల పేరు పొందింది. ప్రపంచం అంతా.. ఇండియా లో ఇలా ఆడ పిల్లల్ని చంపుతారా?! .. అని ఆశ్చర్య పడితే మనకు అవమానం కదూ!
గ్రామంలో అగ్రకులానికి చెందిన ఒక పెద్దాయనకు ( ఠాకూర్) (సుధీర్ పాండే) అయిదుగురు కొడుకులు. ఎన్నాళ్ళుగానో ఆడపిల్లలను మట్టుపెట్టడం వల్ల గ్రామంలో ఆడదంటూ మిగలక.. గత పదిహేనేళ్ళుగా అందరూ మగ వాళ్లతో నిండిన గ్రామం అది. పెద్దాయనకు కొడుకుల పెళ్లి చెయ్యటం గగనం అవుతుంది. పిల్ల దొరకందే..! ఇతగాడికీ అయిదుగురు మగ పిల్లల్ని కన్న భార్య ఏనాడో పరమపదిస్తుంది. కాబట్టి ఆడపిల్ల ఒకటి దొరికితే.. ఆ ఆరుగురూ.. దాన్ని (ఒక వస్తువు లాగా..) అనుభవించుదామని చూస్తుంటారు. ఇక్కడ ఆడది లేక పొతే మగవాళ్ళ జీవితాల్లో కలిగే Sexual Frustration ముఖ్యమ్గా చూపించారు. మనిషి పశువు అవుతాడు. రాక్షసుడు కూడా అవుతాడు.
ఈ కుటుంబానికి (నిజానికి పెద్దబ్బాయికి) ఒక సారి ఒక సంబంధం వస్తుంది. కానీ తాళి కట్టే వేళకు ఆ పెళ్లి కూతురు అసలు ఆడది కాదని.. మోసం అని తెలిసి.. ఖంగు తింటారు. అప్పటికి వరకట్నం పోయి కన్యాశుల్కం పద్దతి వస్తుంది. ఊర్లో అమ్మాయి కనపడితే ఎత్తుకుపోవటమో, కొనుక్కోవటమో సాధారణం అయి వుంటుంది. ఆడ పిల్లలు పెళ్లి పేరుతో అమ్మకానికి సిద్ధంగా ఉంటారు.
ఇలాంటి పరిస్తితులలో ఒక స్నేహితుని ద్వారా..వీళ్ళకు ఒక పిల్ల సంగతీ తెలుస్తుంది. పిల్ల పేరు కల్కి. (త్యులిప్ జోషి) తండ్రి ఆ పిల్లను భద్రంగా లోకుల కంట పడకుండా దాచి ఉంచుతాడు. మొదట పెద్ద కొడుకు కి సంబంధం అంటూ మాట్లాడటానికి వెళ్తారు. లక్ష ఇస్తామన్న పిల్ల తండ్రి ఒప్పుకోడు. కానీ ఆఖరికి బేరం కుదిరి... అయిదు లక్షలకు, అయిదుగురు కొడుకుల తో పెళ్లి జరపటానికి ఒప్పుకుంటాడు. పెళ్లి దృశ్యం పాండవులతో ద్రౌపది లా.. అయిదుగురు భర్తలతో.. ఈ టీనేజ్ పిల్ల పెళ్లి. తండ్రి చేతులారా.. డబ్బు కోసం ఆ పిల్లను పసువులా అమ్ముతాడు. ఆ తరవాత మొదటి రాత్రి గది లోకి మామగారు దూరతారు. వారం లో రోజులు ఆ భర్తలందరూ వంతులు వేసుకుంటారు. ఆ వంతుల లో వారానికి రెండు రోజులు మమగారివి కూడా.. టీనేజ్ పిల్ల ఈ విపరీతాలకు తట్టుకోలేకపోతుంది. ఆ అయిదుగురు కొడుకుల లో చిన్న వాడు (సుశాంత్) కాస్త మనిషి లాంటి వాడు. కల్కి తో దయ గా ఉంటాడు. అతని సాన్నిహిత్యం ఆమె కు ఊరట.
అతని తో ఆమె స్నేహం గా ఉండటం చూసి ఓర్వలేక అన్నలు అతనిని చంపేస్తారు. అప్పుడు కల్కి .. సొంత కొడుకు చనిపోయిన రాత్రే మామగారు తనమీద అత్యాచారం చేయటం భరించలేక తండ్రి కి ఆ విషయం చెప్తూ రక్షించమని ఉత్తరం రాస్తుంది. ఆ మహానుభావుడు.. మామగారి దగ్గరకొచ్చి.మాట్లాడి ఇంకో లక్ష తీసుకుని.. కల్కిని ఊరుకోమని బోధపరిచి వెళిపోతాడు. అపుడు కల్కి కి తండ్రి ఎంత దుర్మార్గుడో అర్ధం అవుతుంది. ఇంక ఎవరు రక్షించేది లేక ఆ పిల్ల పారిపోయే దారులు వెతుకుతుంది. ఆ ఇంట్లో పని చేసే ఒక నిమ్న జాతి పిల్ల వాడి సాయంతో పారిపోతుండగా భర్తలు వెంటపడి.. ఆ పిల్లాన్ని చంపి, కల్కి ని తీస్కొచ్చి పశువుల కొట్టం లో గొలుసులతో కట్టి పడేస్తారు.
గ్రామంలో కుల వైషమ్యాలు ప్రజ్వరిల్లి.. నిమ్న జాతి పని పిల్ల వాడి బంధువులు అసహాయమ్గా పశువుల కొట్టం లో పడి ఉన్న కల్కిని (ఉన్నత జాతివారి( ఠాకూర్ మహిళను కిన్చపరచటం కోసం) బలత్కరిస్తారు. నెలల తరబడి ఈ అత్యాచారాలు, భార్తలూ, మామగారూ.. పిల్లవాడి బంధువులూ .. అంతా ఈ పిల్ల మీద అత్యాచారం చేస్తూ ఉండగా ఇంట్లో కి ఇంకొక పిల్ల వాడు పని లో చేరతాడు. గొలుసులతో కట్టేసి.. పడి వున్న ఈ కల్కి కి రోజు పాలో, రొట్టేలో ఇచ్చి ప్రాణాలు నిలిపేది ఆ పిల్లాడే. కొన్నాళ్ళకు కల్కి గర్భవతి అవుతుంది. ఆ పుట్టబోయే శిశువు కు తానూ తండ్రి అంటే తానూ అని గ్రామస్తులూ (పాత పని పిల్లాడి బంధువులు.. ఎవరైతే కల్కి ని చరచారో వారు), ఇంట్లో వారూ వాడులాడుకుంటారు.
వంశం అన్న మాట వచ్చేసరికీ జనం ఆ స్త్రీ మీద హక్కుల గురించి పోరాడుకుంటారు. సంతానం తమదంటే తమదని వాదించుకుంటారు. ఆ సన్నివేశం చూడాలంటే.. గుండె బలం కావాలి. ప్రజల desperation చూసి 'నిజమే! ఇలా కూడా జరగొచ్చు' అనిపిస్తుంది.
పెద్దాయన కల్కిని డబ్బిచ్చి కొన్నాడు కద! తమ కొడుకులకో తనకో తప్ప కల్కి వేరే వారి సంతానాన్ని కంటే తనకు నష్టం కదా.. అందుకే ఆ సంతానం తనదే అని ప్రకటించి.. కల్కి ని కనికరించి పురిటి సమయానికి ఇంట్లోకి తీసుకొస్తారు. అయితె అప్పుడు మామగారి క్రూరత్వం బయటపడి.. అగ్రజాతి వారి నిమ్నత్వం మీద గ్రామంలో గొడవలు మొదలుతాయి. తుపాకీ పట్టుకుని బయల్దేరిన నలుగురు కొడుకుల్నీ గ్రామస్తులు చంపేస్తారు. కల్కి ని బలత్కరించిన నిమ్న జాతి వాళ్ళూ ఆ గొడవల్లో చనిపోతారు. ఈ చావుల కు కారణం నువ్వే అంటూ కల్కి ని మామ గారు చంపబోతుండగా.. కొత్త పని పిల్లాడు ఆయన్నే చంపేస్తాడు. కల్కి కి ఆడపిల్ల పుడుతుంది. కొన్ని తరాల తరవాత ఆ గ్రామంలో ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్లను చూసి కల్కి మధురంగా నవ్వటం తో సినెమా ముగుస్తుంది.
ఈ సినెమా చూసినంత సేపు ఆ ఘోర కలి ని చూసి .. వళ్ళు గగుర్పొడిచింది. సినెమా లో మంచి పట్టు ఉంది. నాకు టెక్నికల్ గా చెప్పడం తెలియలేదు. కానీ ఇలాంటి పరిస్తితి వస్తె.. మగవాళ్ళూ.. ఆడవాళ్ళూ కూడా అలాంటి నరకాన్ని తట్టుకోలేరు. సెక్స్ మాత్రమే కాకుండా స్త్రీ మగవాడికి చాలా అవసరాలకు పనికొస్తుంది. ఇంటి పని, వంట పని చెయ్యడానికీ, పిల్లలను కని పెంచడానికీ.. ఇలా ఈ లెక్కలు కట్టి ఠాకూర్ కల్కి ని కొన్నా ఇవి నిజంగానే నిజాలు కదా! స్త్రీ లేక పొతే.. మిగతా పనులు జరిగి పోయినా వంశం మాత్రం పెరగదు కదా! అందుకే స్త్రీ కి అంత డిమాండ్. (కధ కాలానికి ఆమె కేవలం ఒక వస్తువు కదా) ఈ నిజం మన కళ్ళ కు కట్టే పని లో మనీష్ ఝా సఫలీకృతం అయ్యారు.
ఈ సినెమా చూసినంత సేపు ఆ ఘోర కలి ని చూసి .. వళ్ళు గగుర్పొడిచింది. సినెమా లో మంచి పట్టు ఉంది. నాకు టెక్నికల్ గా చెప్పడం తెలియలేదు. కానీ ఇలాంటి పరిస్తితి వస్తె.. మగవాళ్ళూ.. ఆడవాళ్ళూ కూడా అలాంటి నరకాన్ని తట్టుకోలేరు. సెక్స్ మాత్రమే కాకుండా స్త్రీ మగవాడికి చాలా అవసరాలకు పనికొస్తుంది. ఇంటి పని, వంట పని చెయ్యడానికీ, పిల్లలను కని పెంచడానికీ.. ఇలా ఈ లెక్కలు కట్టి ఠాకూర్ కల్కి ని కొన్నా ఇవి నిజంగానే నిజాలు కదా! స్త్రీ లేక పొతే.. మిగతా పనులు జరిగి పోయినా వంశం మాత్రం పెరగదు కదా! అందుకే స్త్రీ కి అంత డిమాండ్. (కధ కాలానికి ఆమె కేవలం ఒక వస్తువు కదా) ఈ నిజం మన కళ్ళ కు కట్టే పని లో మనీష్ ఝా సఫలీకృతం అయ్యారు.
ఈ సినీమాలో కల్కి కి పెళ్లి జరిగే సన్నివేశం నుంచీ దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ ఆమె 'ఇదేమిటి' అని ప్రస్నించదు. తన మీద రక రకాలుగా, వికృతంగా జరుగుతున్న అత్యాచారాల సన్నివేశాల లోనూ తిరగబడదు. మౌనంగా, దీనంగా, 'ఇదే నా ప్రాప్తం!' అనుకునేలా కనిపిస్తుంది. ఆఖరికి అయిదవ భర్తా, తన స్నేహితుడు అయిన అబ్బాయి హత్య కు గురయ్యాక... విపరీతమైన షాక్ లో ఉన్నా, మామగారు గది లో కి రావటం చూసి బెదిరిపోయినా.. వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితి లో ఉంటుంది. అపుడు నాకు అమె పాత్ర ప్రవర్తన.. పూర్తి లోంగుపాటు.. ఆశ్చర్యం కలిగించినా.. అప్పటి పరిస్థితులకు స్త్రీ ల ముందు కూడా ఎటువంటి ఆప్షన్స్ మిగలక.. ఒక కొత్త సామాజిక న్యాయం మొదలుతుందేమో అని అనిపించింది. అపుడు స్త్రీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చూసాక ఎ స్త్రీ లెదా పురుషుడు ఆడ పిల్లల భ్రూణ హత్య చేయ్యరేమో అని దర్శకుడు ఆశ పడ్డట్టు ఉంటుంది సినిమా.
ఈ సినిమా చూసాక ఒక వారం వరకూ నా మనసు నుంచీ ఆ భావాల తీక్ష్ణత తొలగిపోలేక పోయింది. ఈ సినెమా ఫక్తు sexist సినిమా అయి ఉండొచ్చు. కానీ ఆ సినెమా చెప్పదలచుకున్నది మాత్రం చెప్పగలిగింది. పరిస్థితి తీవ్రత ని ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలూ గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల లో ఆ చైతన్యం తీసుకు రాకపోతే.. ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రజలను మన మాతృభూమి లో.. మాత (స్త్రీ) లేక పొతే ఇంక జననాలేవి, వంశం ఏది, వంసోద్ధారణ ఏది ? మాత లేక పొతే మతం ఏది, సమాజం ఎక్కడ ? స్త్రీ ని చంపుతున్నారంటే ఒక 'మాత' ని చంపుతున్నట్టే. స్త్రీ జీవితం కేవలం పిల్లలు కనటానికే కాడు. కానీ స్త్రీ లేక పొతే... పిల్లలూ లేరు, మన జాతికి భవిష్యత్తూ లేదు. ఆడ పిల్లలను ఎ కారణం వల్ల చంపుతున్నామో ఆ కారణాలను మట్టుపెట్టాలి. లేకపొతే.. మనమే నాశనం అయిపోతాం అని చాల చక్కగా చెప్పారు 'ఝా'.
ఈ సినెమా ఇంకో సారి చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. కానీ మంచి ప్రయత్నం అనిపించింది. నటులంతా.. పేరున్న వారే. హిందీ, భోజపురీ సినీ నాటక రంగాల లో తారలే. వీళ్ళంతా ఈ సినెమా లో ఎందుకు / ఎలా నటించారా ?! అని అనిపిస్తూంటుంది. కానీ వాళ్లు నటించకపోయుంటే, వెంటనే ఛానెల్ తిప్పేసే దాన్ని. త్యులిప్ కు ఎక్కువ సంభాషణలు లేవు. ఆమె నటన లో ఎంతొ పరిపక్వత. ఈ నటులూ, ఈ దర్శకుడు.. హీరో లేని, డిషూం డిషూం లు లేని.. పాటలు లేని.. సంగీతం లేని ఈ సినెమా.. కధ కూడా భయంకరమైనది.. కానీ ముగింపు దాక కదలకుండా చూసేలా చేసిన సినిమా గురించి ఇక్కడ ఎవరైనా చదివి.. 'నవతరంగం' లాంటి పెద్ద వేదికల మీద రాస్తారేమో అని ఆశిస్తున్నా.
సుజాత గారూ, మీ సమీక్ష చదువుతుంటేనే నా మనసు చెదిరిపోయింది.. ఇక సినిమా చూసే ధైర్యం నాకస్సలు లేదు.. ఒక సన్నివేశం కాదు మొత్తం సినిమా చూడటానికే చాలా గుండె బలం కావాల్సి వచ్చేట్టుంది!!
ReplyDeleteనిశిగంధ గారు,
ReplyDeleteచాలా థాంక్స్. ఈ సినీమా లో ఎక్కడా మరీ కమర్షియల్ సినిమా లా భయంకరమైన (రేప్) సీన్లు లేవు. అన్నీ suggestions మాత్రమే. కల్కి submissiveness బహుసా ఆ కాల సామజిక పరిస్థితుల బట్టి సహజమేమో. దర్శకత్వం బావుంది - గంభీరంగా! ఒక సారి చూడొచ్చు. మరీ భయపెట్టేసానేమో. కానీ ఇది తప్పకుండా మంచి సినిమా. ఎప్పుడన్నా కుదిరితే చూడండి.
సుజాతగారూ..
ReplyDeleteఇలాంటి సినిమాకు అలాంటి శీర్షికగా ప్రచురించేటప్పటికి, చదవడం మొదలు పెట్టా. అబ్బా.. ఎందుకండీ ఇలాంటి సినిమాలు తీస్తారూ అనిపించింది. ఒక వేళ వారు తీసారనుకోండి, మీలాంటి వారు ఎందుకు చూసారా ఆని అనుకున్నా.
ఒక్క అభిమాన నటి గురించి చూసారనుకోండి. కానీ దీని గురించి అంత వివరంగా వ్రాసిన తీరు చూస్తుంటే.. నాకు జీవితం మీద విరక్తి కలిగిందనుకోండి. నిజ జీవితంలో ఇంత భయంకర మయిన విషయాలు జరుగుతాయా అనిపిస్తుంది. ఎదే మైనా, నాది ఒక చిన్న మనవి.
నాయందు దయ యుంచి, ఈ పుటని డిలీట్ చెయ్యండి. నా మనసంతా కకలావికలం అయి పోయింది. ఈ భాధని ఎంత కాలం భరించాలో తెలియటం లేదు.
దేవుడు మనకు మతి మరుపు అనేటటువంటి గొప్ప వరాన్నిచ్చాడు. అది ఇప్పుడెందుకు పని చేయ్యటం లేదో .. వింత వింతగా .. చేదు చేదుగా .. రక రకాలుగా ఉంది.
చక్రవర్తి గారూ..
ReplyDeleteనేను ఎందుకు రాసానూ అంటే.. ఈ సినిమా చూసి.. ''అయ్యో! ఇలాంటివి జరుగుతాయా..? అసలు ఈ సినిమా ఎందుకు తీసారూ ? వీళ్ళంతా ఎందుకు నటించారూ.. ? మనం పాత రాతియుగం కన్నా వెనక్కి వెళ్లి పోతున్నామా..?'' అనే సందేహాలూ.. జుగుప్సా.. జాలి లాంటివి అన్నీ కలిగి, చలించి రాసాను. ఈ రాయడం.. ఒక synopsis గా మాత్రమే రాసాను. అయితె.. ఇవన్నీ.. ఆడపిల్లలను చంపుకుంటూ పొతే.. జరగబోయే.. పరిణామాలుగా మాత్రమే తీసుకుని, ఇప్పటికి ఊపిరి పీల్చుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ మీద 'The Inconvenient Truth' సినెమాలా.. ఇది మరీ.. అతి గా అనిపించి ఉండొచ్చు. కానీ ఇవి సినిమా మన మీద విసిరిన హెచ్చరికలు. వీటిని పాసిటివ్ గా స్వీకరించాల్సింది మనమే.
మీకు ఈ రచన (లేదా పోస్ట్) నచ్చకపొతే మన్నించండి. మిమ్మల్ని (అందర్నీ..) disturb చేసిన ఈ సినిమా నాకు నచ్చింది. నన్నూ చాలా disturb చేసింది. అసలు మనల్ని బాగా కదిలించాలనే ఆ సినిమా తీయటం జరిగింది. ఆ అగ్ర నటులు సినిమా లో నటించి, వాళ్ల presence తో చాలా వన్నె తెచ్చారు. వాళ్ళూ ఈ కాన్సెప్ట్ కు (స్త్రీ వాదమా..?!) మోరల్ సప్పోర్ట్ ఇచ్చినట్టు అనిపించింది. కాబట్టి ఒక సారి.. ఇలాంటి భయానక పరిణామాలని దృష్టి లో పెట్టుకునన్నా..సమాజం మారాలి అని దర్సాక నిర్మాతల అభిప్రాయం. దాన్ని గ్రహించి, మిగిలిన విషయాలను మర్చిపోండి! :D
మీ సమీక్ష చదివినతరువాత సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోగలుగుతున్నాను.
ReplyDeleteఆలోచించే కొద్దీ బవిష్యత్తులో ఆవిధంగా ఎందుకు జరగకూడదు అని కూడా అనిపిస్తుంది.
మీ సమీక్షలో ఎక్కడో అన్నట్లు గానే ఈ సినిమాని సెక్సిష్టు భావాలతో తిసారనుకున్నా అభినందించ తగ్గ విషయమే. ఎందుకంటే దీనిలో సమాజాన్ని చిద్రం చేయబోయే బ్రూణహత్యల పర్యవసానాలను చర్చించారు కనుక.
మీరు అభిప్రాయపడినట్లు గా సినిమాకు అంతర్లీనంగా లైంగిక వాంచ మాత్రమే భూమిక కాదేమో. ఆడపిల్లలు లేకపోవటం తద్వారా వచ్చే దైన్యం, నిస్సహాయత, వంశం కోసం ఆరాటం, దాన్ని ఇవ్వగలిగేది స్త్రీ మాత్రమే కనుక తనని ఒక ఆస్థిగానో, వస్తువుగానో, బీరువాలో దాచుకోవాలనుకో్టం వంటివన్నీ ఆ చిత్రానికి నేపద్యంగా నాకనిపిస్తుంది.
ప్రొక్రియేషను అనెది ప్రతిజీవికి తప్పని సరి తద్దినం. (తమాషాగా). దానికోసం ఎంతకైనా ఒక జీవి తెగింస్తుంది అనేది ఈ సినిమాలా చక్కగా ఆవిష్కరించగలిగారనిపిస్తుంది.
ఆడజీవులు తక్కువగా ఉండే పరిస్థితులలో మగజీవులు చేసే ఆగడాలు ఒక జంతుశాస్త్ర అద్యాపకుడిగా అనేక ఉదాహరణలు చెప్పగలను.
మానవుడుకూడా ఇలాంటి సందర్భాలలో ఒక జంతువుగానె ప్రవర్తిస్తాడన్న సత్యం ఈ సినిమా చూపిందన్నమాట.
మీ పోష్టు థాట్ ప్రొవోకింగ్.
థాంక్యూ
బొల్లోజు బాబా
బోల్లోజు బాబా గారు..
ReplyDeleteచాలా మంచి, స్పష్టమైన కామెంట్లు రాస్తారు మీరు. అందుకు మీకు అభినందనలు.
ఈ వ్యాఖ్క కు థాంక్స్. నేను మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను.