Pages

05/05/2008

Brand Ambassador

మీకు Ambassador కార్ల మీద మోజు ఉందా ? అసలు మన దేశం లో చిన్న కార్ల శకం మొదలైన దగ్గర నుంచి Ambassador ల పట్ల ఆకర్షణ బాగా తగ్గింది. అయినా ఈ కార్లు అధికారికంగా మంచి కార్లు గా పేరు పడ్డాయి. మరి మన మంత్రులూ, బ్యూరోక్రాట్లూ.. (ఆఖరికి సోనియా గాంధీ కూడా పోయిన ఎన్నికల లో డిక్లేర్ చేసిన సంపద ఈ కారే...) కార్ల లోనే ఎక్కువ గా తిరుగుతారు. పెద్ద వాళ్ళందరి ఆమోదం పొందిన మంచి క్వాలిటీ కారు ఇది. ఒక పది సంవత్సరాల క్రితం Taxi అంటే Ambassador లే. ఇప్పుడు కాబ్ ల తరగతి లో చాల మటుకు వేరే బ్రాండ్ కార్లు దర్శనం ఇస్తున్నాయి. అయినా ఈ రకం కార్ల ఆకర్షణ వేరు.

ఇండియన్ కార్లు .. అనగా Ambassador లు ఇప్పుడు London లో ద్రవ్యాకర్షణ చేస్తున్నాయి. London Cabs అనగా ప్రసిద్ధి పొందిన నల్ల రంగు కాబ్ ల లో తిరిగే పర్యాటకులు ఈ భారతీయ కారు మీద చాల మోజు చూపిస్తున్నారు. ఈ క్రింది వార్త (Karma Cars - Advertisement) చదవండి. రక రకాల రంగుల్లో, అలంకరణ ల లో మెరిసి పోతున్న మన కారు మీద లండనర్లకు, పర్యాటకులకూ మోజు కలుగుతూ ఉందంటే ఆశ్చర్యం ఏమి లేదు.




Getting a black cab in London is so passé. Karma Kars are sweeping the capital: a fleet of uniquely decorated Indian cars allow you to travel in Asian style.

1 comment:

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.