08/12/2011

Diya our Bati Hum, నా డైలీ సోప్



'డెడ్ మేన్ వాకింగ్' లోనూ, 'రెయిన్ కోట్' లోనూ నేపధ్య సంగీతానికి గళాన్నందించిన శుభా ముద్గల్ స్వరం వెంటాడుతుండగా, కైలాష్ ఖేర్ ఆలాపన జ్ఞాపకాలతో రొమాన్స్ చేయిస్తుండగా ఈ పాట బావుందనిపించి...:D

పెళ్ళి లానే సీరియళ్ళు కూడా కొత్తలో బావుంటాయి, తరవాత సాగదీత మొదలవుతుంది. ఎంత హిట్టయితే అంత సాగదీత. ఈ సీరియల్ ఇంకా కొత్తదే కాబట్టి, హనీమూన్ ఇంకా ముగియలేదు (సాగతీత మొదలవలేదు)కాబట్టి ఇప్పటికయితే, ఎంజాయ్ చేస్తున్నా.

11 వ్యాఖ్యలు:

తృష్ణ said...

నాక్కూడా 'శుభా ముద్గల్'వాయిస్ ఇష్టం...చాలా చాలా బావుంది పాట.. Thank you for sharing.

Sujata said...

Hi

Trishna garu, Thanks.

ఆత్రేయ said...

ఇటుక మీద ఇటుక పెట్టి,
మధ్యలో తాపీ తో జార్తగా సిమెంట్ పరిచి,
పక్కల వంకర లేకుండా సరిది,
లంబంతో సరి సూసి,
అలా రోజంతా సేస్కుంటూ... పోయి సీకటడ్డాక
సామాను సరిడేసి ఇంటికేల్తే..
బాగా పొగరెక్కిన ఆంబోతు కోపంతే రుస రుస లాడుతూ
ఆ పచ్చి గోడని కుమ్మేస్తే ... ఎలా కూలిపోతుందో
అలా...
కూలి పోయింది
మీమీద నాకున్న గౌరవం, అభిమానం,
మీరు సీరియళ్ళు చూస్తారన్న విషయం తెలిసి.
ఇప్పుడున్నదంతా
బోలెడంత జాలీ,
సానుభూతీ,
త్వరగా కోలుకోవాలన్న
అభిలాష.. అంతే .. అంతే..!!

కొత్తావకాయ said...

భాస్కర రామి రెడ్డి said...

ఆత్రేయ గారూ, మీ కవిత సూపర్.

Sujata said...

Atreya garu,

I hurt. I collapse.

కొత్తావకాయ said...

మీరేం హర్ట్ అవకండి సుజాత గారూ.. బతికున్న రోజుల్లో ఒకటీ అరా తెలుగు ( తమిళ్) సోపులే చూసిన నాలాంటి పాపుల దృష్టిలో మీరు హిమాలయం... ఖళ్ ఖళ్...
"పెళ్లిలానే సీరియళ్ళు...." ఇది మాత్రం పేటెంట్ తీసుకోవలసిన కోట్.. ఆలోచించుకోండి. 

ఆత్రేయ said...

భారారే గారూ
అది మీకు కవిత లా అనిపించిందా ..
"రజ్జు సర్ప భ్రాంతి ..!!"

పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు) said...

సీరియళ్లు చూస్తారని చిన్నచూపు చూడకండి ఆత్రేయగారూ. మీరొకసారి మీ ఇంట్లోవాళ్లని ఏదైనా సీరియల్ అలవాటు తప్పించాలని ట్రై చెయ్యండి మీరుకూడా మొదలుపెడతారు. అందుకు ఇంగ్లీష్ సుజాత గార్కి నా మద్దతు ప్రకటిస్తున్నా.

జయ said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పాపకు కూడా.

ఆత్రేయ said...

డియర్ పక్కింటబ్బాయి (మా పక్కిల్లు కాదు) మా లేడీస్ కూడా చూస్తుంది సీరియల్స్
అందుకే నేను రాత్రి పన్నెండు దాకా క్లబ్బులనీ, బార్లనీ తిరుగుతుంటాను.
మగాళ్ళు చెడ తిరగటానికి ఆడాళ్ళే కారణమనటానికి ఇది చాలదూ ?


ఈ విషయం మీద ఇలా వేరే వాళ్ల (సుజాత అక్క బ్లాగ్) ఇల్లు ఒద్దుగానీ మనం వేరే కలిసి మాట్లాడుకుందాం.