దేశంలో ధరల్లానే అవినీతి పెరిగిపోయి, ఆ అవినీతి కాస్తా బద్ధలై - బోల్డన్ని కుంభకోణాలూ, కుంభకోణానికి కనీసం ఆరుగురు చొప్పున కొత్త ఖరీదైన ఖైదీలూ తయారయ్యారు. అసలు కసబ్ ని జైల్లో పెట్టి మేపుతున్నారు - అదీ ఇదీ అంటున్నారు. ఇండియన్ జైల్లో ఉంచడమే వాడికి తగిన శిక్ష. చావు కన్న ఘోరం ఇండియన్ జైలు లో జీవితం ! ఇండియాలో జైళ్ళు మహా ఘోరం - దరిద్రం - చండాలం - వగైరా అని చెప్పి చాలా మంది మనీషులు బాధ పడుతున్నారు. లేటు గా - అంటే తెలుగులో లేటెస్టు గా మన దేశంలో నేరాలు చేసి, ఫారిన్ పారిపోతే సుఖం. ఎంచక్కా, ఒక వేళ దొరికి పోయినా, ఫారిn లో సౌకర్యంగా వుండే జైళ్ళలో వుండొచ్చు. ఇండియాలో అలాంటి ఫెసిలిటీలు లేవు కాబట్టి - మేము రాం అంటున్నారు నేరస్థులు. సీ.బీ.ఐ. ని ముప్పతిప్పలు పెడుతున్నారు. వార్ రూం లీక్ కేసులో రవి శంకరన్ గారూ, పురూలియా లో ఆకాశంలోంచీ ఆయుధాలు వెదచల్లిన కిం డేవీ గారూ - ఇండియా లో జైళ్ళు బావుండవనీ, దైచేసి మమ్మల్ని అక్కడికి మాత్రం పంపించకండని - ఇంగ్లండు లో పిటిషన్లేసేరంట.
మొన్నామధ్య జైళ్ళలో మన ప్రముఖులంతా ఏం చేస్తున్నారూ అని ఒక వ్యాసం రాసేరు వీక్ వాళ్ళు. ఏం చేస్తారు ? మనూ షర్మ గారు తీహార్ జైల్లో బేకరీ నడుపుతున్నారు. కనిమోళి అమ్మ గారు కవితల్రాస్తున్నారు. పుస్తకాలు చదువుతున్నారు. రాజా గారూ, భృత్యులూ, కల్మాడీ గారూ బాట్మింటన్ ఆడుకుంటున్నారు. ఇవన్నీ కబుర్లు బావున్నాయి. కొందరు పెద్దలు జైలు చూసి డిప్రెస్ అయ్యారంట. వాళ్ళని అర్జంటు గా counsel (console) చెయ్యల్సి వచ్చిందంట. నేరం (White Collar?!) చేసినపుడు కలగని భయం జైల్లో గడపడానికి కలుగుతుంది. కానీ ఆ డిప్రెషను మరీ పరిధి దాటితే శారీరక మానసిక రుగ్మతలకి గురవుతారు కాబట్టి ఇదీ ఆలోచించదగ్గ విషయమే !
రిలయన్స్ అడాగ్ (ADAG) ఎం.డీ. గార్ని అనిల్ అంబానీ గారు కలవడానికి వస్తారు. కనిమోళి నీ, రాజా నీ కలవడానికి కరుణానిధి గారు వెళ్తూ ఉంటారు. అక్కడ సౌకర్యాలూ అవీ ఎలా వున్నాయో మరి. అపుడెపుడో సల్మాన్ ఖాన్ గారు మనుషుల్నో, దుప్పుల్నో చంపినపుడు ఒక రాత్తిరంతా జైలో వేసేరు. రాత్రి మొత్తం దోమలు కుట్టి కుట్టి చంపాయంట. ఒక్క రాత్రి కే ఆయనకీ, వాళ్ళమ్మ గారికీ కళ్ళలో నెత్తురొచ్చింది. జైల్ లో సెల్ ఎంత దరిద్రం గా వుంతుందో 'The Week' వారు వెల్లడించారు. అయితే లక్కీ గా, సెల్ శుభ్ర పరచడానికి పెద్ద వాళ్ళు (హైక్లాస్) చిన్న వాళ్ళని కొంత భత్యాన్నిచ్చి పెట్టు కోవచ్చంట. అంటే వారానికి మీకు జైల్లో ఉంచుకోనిచ్చే 850 రూపాయల్లో ఈ (లో క్లాస్) చిన్న ఖైదీలకి డబ్బులిచ్చి రూం శుభ్రం చేయించుకోవచ్చు, సిగరెట్లు తెప్పించుకోవచ్చు వగైరా.
జైలు సంస్కరణలూ, ఓపెన్ జైళ్ళూ అంటూంటారు కదా - పని లో పని గా కొంచెం ఖరీదైన వీ.అయి.పీ లను ఉంచదగిన - ఇలాంటి స్టైలిష్, పోష్ నేరగాళ్ళని ఉంచడానికి సకల సదుపాయాలతో కొన్ని పోష్ - కార్పొరేట్ స్టైలు జైళ్ళు కట్టొచ్చు కదా. అపుడు అందరికీ బావుంటుంది. రవిశంకరన్ గారి లాంటి పోష్ నేరస్థులని జాగర్త గా మన దేశం తెప్పించుకుని దర్యాప్తు జరపవచ్చు.
ఇలాంటి 'స్టార్' నేరస్థులకి 'స్టార్' సదుపాయాలు ఇవ్వాలి. ముళ్ళపూడి వారన్నట్టు - చట్టం ముందు అందరూ సమానమే. కొందరు ఇంకొంచెం ఎక్కువ సమానం. ఇన్నాళ్ళూ ఏ ప్రధానమంత్రో, హోం మంత్రో 'చట్టం తన పని తాను చేస్తూంటుంది - ' అని స్టాండర్డు డైలాగు కొడితే వింటున్నాం కదా. అలా చట్టం ఎంత సేపయినా పని చెయ్యనీ - అంత సేపూ ఈ చట్టానికి చుట్టాల్ని కొంచెం ఆదరం గా చూడాలి కదా. కనీసం అప్పుడు ప్రపంచ దేశాల ముందు మన పరువు దక్కుతుంది. ఇలాంటి సాకులు కూడా తగ్గుతాయి.
22 వ్యాఖ్యలు:
Dear Anonymous,
అవును. నేనూ చిరాగ్గా రాసాను. కష్టపడి తిట్టినందుకు థాంక్స్. వచ్చిదే వ్యాఖ్య అని పబ్లిష్ చేస్తున్నాను. I mean it.
సుజాత గారు మీరు రాయండి ఆందరూ అజ్జ్ఞాతలంత మేధావులు కారు . చాలామందికి తెలియని విషయాలు ప్రస్తావించారు ఇండియన్ జైల్స్ లో పెట్టవద్దని కోరిన వారి గురించి నేనైతే మొదటిసారి చదివాను
బారాసారు!
కానీ కొందరు పోష్ నేరస్థులకి జైల్లో బిర్యానీ దొరుకుతుందని, టీవీలుంటాయని, ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయని విన్నాను! అదంతా నిజం కాదా?
and your comment to above anon - liked it very much..that's the spirit, bravo! :)
హ్మ్..!
చట్టం ముందు అందరూ సమానమే. కొందరు ఇంకొంచెం ఎక్కువ సమానం..
కరెక్టేనండీ..
బాగా రాశారు.
మురళి గారూ..
బ్లాగర్ తెరవాలంటే భయపడుతూ చూస్తే మీ వ్యాఖ్య 'హమ్మయ్య' అనిపించేలా చేసింది. దీనికి మీకు పెద్ద థాంక్స్. పై అజ్ఞాత గారి మూడ్ బాలేదని, క్లియర్ గా అర్ధం అయింది.
తెలుసా లేదా అన్నది కాదు. నేనూ చికాకుగానే రాసాను. సెటైరు పాలు ఎక్కువైనట్టుంది. Many Thanks.
సౌమ్య,
gee... నేను కూడా సినిమాల్లో చూసాను. అవి 'బీ','సీ', సెంటర్లలో సెన్సారోళ్ళు కత్తిరించిన రీళ్ళు కలిపి సినిమాలేసినట్టు - చెర్లపల్లి లాంటి జైళ్ళలో జరుగుతాయేమో. తీహార్ ఆష్రం మరీ డిల్లీ లో కదా - అది మల్టీప్లెక్స్ అన్నమాట. అక్కడ ఇలాంటివి అంత ఫీసిబుల్ కాకపోవచు. (my guesstimate)
Rajkumar garu
Thanks. Hee hee. This excuse is helping a criminal in extradition. Shame.
నిజం చెప్పండి
ఆ అజ్ఞాత కామెంటు మీమీద మీరే వేసుకున్నట్టు ఉంది.
ఇక పోతే ,నాతో కలిపి ...
कुछ थो लोग कहेंगे , लोगों का काम है केहना...
छोड़ो बेकार की बातो में कही बीत ना जाए रैना ...
ఎందుకని వ్రాయటం బాగా తగ్గించారు ?
బాగుంది.
ఈ టపాకి అప్రస్తుత వ్యాఖ్యే కానీ, గడ్డిపూల లే ఔట్ మారేసరికి కొత్తగా అనిపించింది. "గడ్డిపూలు" పేరు సరిగ్గా కనిపించడంలేదు చూసారా? సర్లెండి. ముంజేతి కంకణానికి అద్దమేల. మీరేనని తెలిసినవారికి పెనుమార్పేం కాదు కానీ, ఇంకో లే అఔట్ ఏదైనా ప్రయత్నించకూడదూ!
పరాయి దేశం నుంచి వచ్చిన కసబ్ బాబుకి ఏ.సి జైళ్ళు, సెక్యూరిటీ, బిర్యానీ లాంటి రాజభోగాలు ఇస్తే లేదు గానీ ఏదో కాస్త కక్కుర్తి పడి లక్షల కోట్ల చిల్లర నొక్కేసిన భారతీయులకి మాత్రం ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంత కుళ్ళుకుంటారా? సుజాత గారూ యే సరాసర్ నా ఇన్సాఫీ హై. అసలు దేశంలో అన్ని జైళ్ళు ఏసీ చేయించాలని, రాజ్యసభకి, లోక్ సభకి రాష్ట్రపతి జైళ్ళ నుంచి కనీసం పది పదిహేను మందినైనా నామినేట్ చేసేలా చట్టం తీసుకురావాలని, ఖైదీలకి ప్రభుత్వ ఉద్యోగాలలో పాతిక శాతం వాటా కావాలని ఎప్పుడో ఏ రాజానో జైల్లో నిరాహార దీక్ష మొదలెట్టేస్తాడు. చూస్తూ ఉండండి.
మన దేశంలో చెరసాలలూ, ఉరికొయ్యలూ ఉన్నవి పేదవాళ్ళని శిక్షించడానికే కానీ పెద్దవాళ్ళని శిక్షించడానికి కాదు.
http://audios.teluguwebmedia.in/63556817
http://audios.teluguwebmedia.in/63638212
మీరు అనానిమస్ కామెంట్ సాహసంతో పబ్లిష్ చేసినందుకు అభినందిస్తున్నాను. కొంతమంది పుట్టుకతో మూర్ఖులు.
మీరు రాసే విషయాలు తెలియని నాలాంటి అజ్ఞానులు కూడా ఉంటారండి..
I really admire your spirit..
నాక్కూడా కాస్త అప్పివ్వండి...:)
పోస్టు నచ్చేసిందండీ.. ఈమధ్య చాలా తరచుగా లే అవుట్ మారుస్తున్నట్టున్నారు? ఇది బాగుంది, పూలు లేనప్పటికీ..
ఒకప్పుడు ది వీక్ రెగ్యులర్గా చదివేవాడిని.. ఇప్పుడు కుదరడం లేదు :( వాళ్ళిచ్చే కథనాలు బాగుంటాయి..
ఆత్రేయ గారూ..
మీ కా లే బ్లా స ఎలా వుంది ? నేనూ అందుకే తగ్గించేసా. బేరాల్లేక. (హె హీ హీ)
కొత్తావకాయ జీ.
మార్చేసా. బ్లాగు కి మేక్ ఓవర్.. ! :)
శంకర్ గారూ..
నా ఇన్సాఫీ హై ! ఒప్పుకుంటా. అవసరమైతే నేనూ ఓ చెయ్యేసి, ........ .. @@@!@!
ప్రవీణ్ శర్మ గారూ..
అయ్యో - ఇక్కడ కూడా ఎర్ర జెండానా ?
మురళి గారు
థాంక్స్. వీక్, Outlook రెండూ బావుంటాయి.
బాగుందండీ టపా. కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాను.
చెరసాలలూ, ఉరికొయ్యల గురించి శివసాగర్ వ్రాసిన కవితలు ఇంకొన్ని నా దగ్గర ఉన్నాయి. శివసాగర్ విప్లవ కవే కదా. అందుకే అతని కవితలు ఎర్రగానే ఉంటాయి. ఆ కవితలు ఎర్రగా ఉన్నాయన్నా, పచ్చగా ఉన్నాయన్నా మన దేశంలో ఉరికొయ్యలు ఎన్నడూ హవాలా లాంటి పెద్ద కుంభకోణాలు చేసినవాళ్ళ మెడలని వేలాడదియ్యవు.
Post a Comment