ఈ రోజు నా కోపం నషాళానికంటింది. కానీ ఏం చెయ్యలేని నిస్సహాయత !
వారం రోజులుగా నా ఆఫీస్ సిస్టం లో నార్టన్ Anti Virus ఎక్స్పైర్ అయిపోయింది. అప్డేట్ చెయ్యడానికి గవర్న్మెంట్ ఫండ్స్ లేవు. పూట పూటకీ దీని నాణ్యత నశించి రెండు రోజులుగా పూర్తిగా మూలపడింది నా కంప్యూటర్. మళయాళీ టెక్నీషియన్ వచ్చి 'ఆంటీ వైరస్ ' తెస్తానని చెప్పి పారిపోతాడు. మరి రాడు. ఆంటీ రాదూ, అంకులూ రాడు. 30 రోజుల్నుంచీ యూపీఎస్ బాటరీ అయిపోయింది. ఇది మార్చడానికి కూడా 'పిల్లర్ టూ పోస్ట్' పరుగులు సాగుతున్నాయి.
ఇన్ని కంప్లయింట్స్ లో సెంట్రల్ యూనివర్సిటీ లో దూరవిద్య లో చేరాను - ఏదో పొడిచేద్దామని. వాళ్ళు డబ్బులు స్వీకరించారు. నెల రోజులు దాటాకా, డీ.డీ. అందినట్టు మెయిల్ వచ్చింది. ఇంకో నెల కి, సీ.డీ లో స్టడీ మెటీరియల్ వచ్చింది. ఇంతలో ఇంట్లో గగ్గోలు మొదలయ్యి, ఆ సీ.డీ ని చదివి తరించలేకపోయాను.
ఇప్పుడు ఎసైన్మెంటు వచ్చింది. అయ్యా ! సీడీ లో మెటీరియల్ తెర మీద చూస్తూ రాస్కోవడం నా వల్ల కాట్లేదు. మెటీరియల్ పంపించరా ? తెలీదు. ఆఫీసు లో పనికి చాలా ఇబ్బంది. పని చాలా వుంది. పెద్దాఫీసరు కి కంప్లైంట్ చేద్దామంటే - ఆయన కి నేనెప్పుడూ 'కంప్లైంట్లు చేసే దానిలా !' కనిపిస్తాను. దెబ్బకి చిర్రెత్తుకొచ్చింది. పని చెయ్యడం లో అస్సలు మజా రావట్లేదు. నా వర్క్ లో నేను చాలా మోటివేషన్ కోల్పోయి వున్నాను. అందరి మీదా అరిచేసాను.
ఈవెధవ గోల లో నేను నా పని చేసుకోలేక, పేరుకు పోతున్న బర్డెన్ ని చూసి భయపడుతూంటే, నా మొబైల్ లో ఫోన్లు ! నిన్నేమో - ఏదో ఫోన్ తీసుకుంటే , జగపతి బాబు నా చెవి లో 'ఐ లవ్ యూ చెప్పూ !' అని డిమాండు చేసాడు. అదేంటి అని ఆస్చర్యపోతే, అది గాయం సినిమా ప్రకటన అనీ, ఆ మాటాడేది జగపతి బాబు అని తెలిసింది. 3 జీ లో మొబైల్ సినిమా చూడొచ్చట !! అంటే 3 జీ మొబైల్ లో 30 పై / సెకను కి గాయం చూడాలంట !
ఈ రోజైతే మరీ అసహ్యంగా ఒక ఆడ గొంతు హస్కీ గా పకపకలు వికవికల్తో ఫోన్ చేసింది. ఆవిడతో నేను మాట్లాడాలట. చార్జెస్ చెప్పి, నా ఫొన్ కై రాత్రీ పగలూ ఎదురు చూస్తూనే వుంటానని చెప్పింది. ఈ కాల్ ఖచ్చితంగా - అలా మాట్లాడాలి అనే బలహీనత వున్న మగవాళ్ళకోసం. ఇలాంటి కాల్ నా మొబైల్ కి వస్తే ఎంత విసుక్కోవాలో అంత కన్నా ఎక్కువ గానే విసుగనిపించింది.
8 వ్యాఖ్యలు:
మీ ఆఫీస్ కష్టాలు వింటుంటే న్యాయానికి నవ్వు రాకూడదు కానీ.. జగపతి బాబు గాయం ఆడ్ వినగానే పైకే నవ్వేసాను...
ఒక్కోరోజు అంతే, నాకు కూడా.. విసుగు మీద విసుగ్గా..
"..... कॆ लियॆ खॆद है"
(remember the DD clip art?)
...:)))
:) :) :)
మీ ప్రొఫైల్ స్టేటస్ I'm me నుంచి confused,irritating,impulsive గా మారడాన్ని తీవ్రంగా ఖండించేస్తున్నాను! అందరమూ ఇలాంటి స్థితిలో ఏదో ఒక రోజు ఉంటాం. లేకపోతే రోజూ కాసేపుంటాం, ! అంతమాత్రాన్న అది ప్రొఫైల్ గా ఉంచేసుకుంటానంటే కుదర్దు!
:-) :-) :-)సారి సుజాత, "ఎద్దుపుండు కాకి కి నొప్పా" అని ఒక సామెత. అలానే మీ కష్టాలు మాకు నవ్వొస్తున్నాయి మరి. కొన్నాళ్ళయ్యాక మీకు కూడా వస్తుంది లే నవ్వు తలచుకుంటే
చాలా బాగుందండి. నా కష్టాలు నీకు బాగున్నాయా అనకండేం. ఇది వేరే నిజ్జంగా అసలైన బాగు అన్నమాట.
ఇండియా ఫోన్ చేస్తే ఒక్కో ఫోన్ ఒక్కో పాట పాడుతుంది. దానికే విసుక్కుంటూ ఉంటాను. ఏదో ముఖ్యమైన కబురు చెప్దామనుకుంటే "మౌనం గానే ఎదగమనీ అనో నీవని నేనని వేరుగా లేమనీ అనో" సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఇంక ఓ పక్క చెయి ఖాళీ లేని సమయంలో ఎంత జగపతిబాబైనా ఐ లవ్ యూ చెప్పడం కష్టమేలెండి. మీ విసుగు ముదావహం. :)
నాకో డౌటు...మీ పోస్టులు నాకు మాలికలోనో, కూడలిలోనో, హారంలోనూ ఎప్పుడూ కనిపించవు ఎందుకని???? అబ్బ అలా విసుక్కోకండీ...మీ విసుగు నాకు అర్థమయిందిగానీ ఇది నిజంగానే డౌటు :(
ఎప్పుడూ పోస్ట్ రాసిన ఓ పది రోజుల తరువాతే కనిపిస్తుంది...అరె ఇదెప్పుడు రాసారు అని ఆశ్చర్యపోతుంటాను...హేవిటో బ్లాగు మాయ.
పోనీలెండి ఇలా లేటుగా కనిపించడం అనేది ఈరోజుకి ఉపయోగపడింది. ఆరోజే కనిపించి ఉంటే ఈ టపాలో నేనీ డౌటు అడిగి ఉంటే మీకున్న విసుగు కి(ఆరోజు)...నన్నేం చేసుండేవారో...వామ్మో నేను ఊహించలేను :D
Post a Comment