Pages

10/04/2009

జై హో సోనియా !!

ప్రజాస్వామ్యం - మరో వారంలో ఎన్నికల పండుగ. ప్రపంచంలో ఒక శక్తివంతమయిన ప్రజాస్వామ్య పోరాటం జరుగుతూన్నప్పుడు - మన దేశంలో పెద్ద అమ్మగారు (స్త్రీ - శక్తివంతమయిన స్త్రీ - సోనియా) మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి - (జర్నయిల్ సింగ్ షూ విసరడం - సిక్కుల ఆందోళన - వీటికి గౌరవం ఇచ్చి), ప్రజలు ఎన్నికల్లో ఎండగడతారేమో అని, ప్రతిపక్షాలకు ఒక అవకాశం దొరుకుతుందేమో అని - కారణం ఏమయినా గానీ, టైట్లెర్, సజ్జన్ కుమార్ లను ఉపసంహరించడం ఒక మంచి నిర్ణయం - త్వరగా స్పందించి తీసుకున్న నిర్ణయం.

ఇలాంటిదే - ముంబాయి దాడి తరవాత హోం మినిస్టర్ గారి నిర్మూలన, నేషనల్ ఎంప్లాయ్ మెంట్ గారంటీ ఆక్ట్ దేశవ్యాప్తం గా విస్తరించాల్సింది గా ఆదేశించడం - ఇలా !

కాంగ్రెస్ ను కమ్యూనిస్టులు కార్నర్ చేసినపుడు ప్రధాన మంత్రి ని గట్టిగా సమర్ధించడం - వంటి ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు ఇన్నాళ్ళూ ఒక మహిళ నిర్వహిస్తూ ఉండటం దేశం ఎంతో గర్వించదగ్గ విషయం.

10 ఏళ్ళ క్రిందట ఒక మహిళ ప్రధాని గా ఉన్న పాకిస్తాన్ ఇపుడు పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి, పురాతనత్వం లోకీ ప్రయాణిస్తూ స్తీలను మంత్రి అయినందుకు చంపడం, భర్త కాని ఇంకొకనితో బయట కనిపించినందుకు బహిరంగ శిక్షలూ విధిస్తూ - ముస్లిం సమాజంలో స్త్రీ గా పుట్టడం దురదృష్టకరమయిన విషయంగా చేస్తూన్న పరిస్థితుల్లో - ఆమె ఇటాలియన్ అయినా కానీ, మన దేశాన్ని మురిగిపోకుండా కాపాడుతూ వస్తున్నందుకూ, కీలక నిర్ణయాధికారాన్ని మంచి పనులకు వినియోగిస్తున్నందుకూ - గర్విస్తున్నాను.

ప్రధానంగా పురుషులు ఏలుతూ వస్తున్న రాజకీయాల్లో స్త్రీ శక్తి కి ప్రతీక గా నిలిచిన సోనియా మెచ్చుకోవాల్సిన మనిషే ! ఏమంటారు ?

17 comments:

Vinay Chakravarthi.Gogineni said...

emantam......antaledu antam antam.....partiki manchi chesukovadam kadu kaavalsindi....society ki emchesindo cheppandi..........

సుజాత said...

అబ్బ, దీని మీదే రాద్దామనుకుంటూ ఉండగా మీ పోస్టు చూశాను. హేవిటో, సోనియా కూడా ఇలాంటి మంచి పనులు చేసేస్తోంది. దేశం ఏమైపోతుందో ఏమిటో!

Anonymous said...

It is the people, culture, religion, social value system that determine the destiny of a nation. Pakistan is where it is beacuse of its inferior people (majority Muslims), culture (Islamic), religion (Islam) and social values.

Don't credit Sonia or for that matter Missionary Reddy for the situation in India. We must credit people (majority Hindus), culture (Hindu), religion (Hindu) and social value system in this country.

Hindus in India have the same opportunity as that of Muslims in Pakistan to declare India as a Hindu nation, but Hindus never did that, and above all allowed a Italian Christian to rule India.

So it is the greatness of Hindus for the present state of India. And nothing else. If you give opportunity to Muslims, they declare India a Muslim country. And if you allow Communists, they they will impose Comunist rule in India. And if you allow Missionaries then they will convert all Hindus.

Give the credit where it belongs.

Sujata said...

Gogineni garu..

She helped the Indian govt strike N.deal with the US.

Sujata said...

Darling,

U r not politically right to say that Islam is inferior. However, India is a multi-cultural, dynamic and progressive nation which faces a constant threat from fundamentalism, more than any other issue, in these times. Let us hope that religion never plays vital role in our policy and decision making structure. thanks for patient comment.

Sujata said...

Sujata garu

konni ala jarigipotuntayi. Pappu cant dance sala anukuni enjoy cheseyaali.:D

Anonymous said...

@Sujata: (English name)

"Let us hope that religion never plays vital role in our policy and decision making structure".

Looks like you are living in a fools paradise. The politics in India are based on Islam appeasement. You can not deny this fact. The Congress Party is captured by Christians headed by Sonia and Samuel Reddy appease Muslims at the expense of Hindus.

With wishful thinking problems don't go away. You have to identify the evil that is and defeat it with your might. Else all women in India will wear a Burkha (only produce children) in next 50 years as it is happening in Pakistan, Bangladesh and other Islamic countries.

కత్తి మహేష్ కుమార్ said...

మంచి టపా. సోనియా గాంధీ "ప్రధానమంత్రిని అవను" అన్నప్పట్నుంచీ రాజకీయ పరిణితి మెండుగా కనిపిస్తోంది.తన నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు మాత్రమే.

కొందరు ముస్లిం-క్రిస్టియన్ ఫోబియాతో సఫర్ అవుతున్నవారికి అన్నీ మతం రంగుల్లో జరుగుతున్న కుట్రల్లాగే అనిపిస్తాయి. వారిని ఏమీ చెయ్యలేము. కనీసం పేరుచెప్పి తమ వ్యాఖ్య రాయలేరుగానీ దేశ భవిష్యత్తును భుజస్కంధాలమీద మోస్తున్నట్లు మాట్లాడుతుంటారు.

Sujata said...

Dear Anonymous

What you strongly feel is called Islamophobia. What do u think the solution is ?

neeharika said...

సుజాత గారు,
నేను ఇలాంటి పోస్టు వ్రాసాను. ఒక్కసారి చూడండి.my url:http://ramyamgakutirana.blogspot.com
neeharika

Amar said...

సోనియా గాంధి ఎలెక్షన్ సమయంలో లేని పోని గొడవ అని ఈ పని చెసినట్లు వుంది.

నావరకూ ఇది గతి లేకె తీసుకున్న నిర్నయం అని అనుకుంటున్నా.
ఆవిడ ఇంతకంటే మంచి పనులు చెయగల్గివుండి కూడా ఏమి చేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లొ.

Anonymous said...

People think that it is Islamophobia when they (terrorists) reach up to their neighbor's house, and when they (terrorists) reach their house, they surrender like sheep. One need no more examples other than Pakistan, Afghanistan, Iran and Bangladesh.

People quite often live in fools paradise. It looks like only White man can save Indians.

Hindufobia forced sections of Indians towards Islam in India.

అబ్రకదబ్ర said...
This comment has been removed by the author.
అబ్రకదబ్ర said...

టైట్లర్, సజ్జన్‌కుమార్‌లని తప్పించటం గతి లేని పరిస్థితిలో వాళ్ల పార్టీ కోసం తీసుకున్న నిర్ణయం. ఆవిడ నిజంగా జనాలకుపయోగ పడే మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటే వాళ్లని ఇన్నేళ్ల తర్వాత, ఇంత రాద్ధాంతమయ్యాకనా తీసేసేది?

ఇక - హోం మినిస్టర్‌ని పీకెయ్యటం, దేశవ్యాప్త ఉపాధి పధం అమలు (??) వగీరాలు ఏ హోదాలో ఆడేశించిందావిడ?

ఈ విమర్శలు ఆవిడ ఇటాలియన్ అయినందుకో, స్త్రీ అయినందుకో చెయ్యటం లేదు. బాధ్యత లేని అధికారాన్ని అనుభవిస్తూ త్యాగమయిలా పోజులు కొడుతున్నందుకు వళ్లు మండి అడుగుతున్నాను. ఆవిడే ప్రధానిగా ఉండి ఈ పనులు చేస్తే వాటిలో కొన్నిట్నైనా అభినందించి ఉండేవాడిని.

neeharika said...

ఒకరేమో ప్రధాని అయితే గుండు కొట్టిచ్హుకుంటానంటారు,
ఒకరేమో ప్రధాని అయి చేయొచ్హుగా అంటారు.కుటుంబంలో ఒకరిద్దరు పనికిమాలిన వాళ్ళు ఉండొచ్హు.వాళ్ళను శిక్షించడానికి ఎంతో ఆలోచించవలసివస్తుంది.భారతీయుల మనోభావాలని గౌరవించడం ఆమె చేసిన తఫ్ఫు కాబోలు?

krishna rao jallipalli said...

కీలక నిర్ణయాధికారాన్ని మంచి పనులకు వినియోగిస్తున్నందుకూ - గర్విస్తున్నాను... కీలక నిర్ణయాలు తీసుకొనడానికి ఆమె ఎవరు?? మరి PM కుర్చీలో మన్మోహన్ దేనికి ??

Anonymous said...

Here is an interesting deal for those Hindu men/women who supports Muslims and Pakistan.

Let them send to Afghanistan or Swat Valley of Pakistan for a month. Let them see the first hand, how brutal those thugs are.

Read the story at CNN.com
http://www.cnn.com/2009/WORLD/asiapcf/04/13/pakistan.swat/index.html