Pages

05/11/2008

నీ ప్రేమ !

పొద్దున్న కోయిలలూ, పావురాలూ, కాకులూ
పిచ్చుకలూ, కొంగలూ, ఇంకేవో పేరు తెలియని
చిన్నా పెద్దా పిట్టలు గోల మొదలు పెట్టకముందే
నిద్ర లేచెయడం,

నేను లేచానా లేనా కనుక్కోవడం,
అపుడు నేను నిద్దట్లో
ఇపుడు టైం ఎంతయ్యిందని అడిగితే
పెద్ద నవ్వొకటి నవ్వి టైం చెప్పడం,

పరుగుకో, పరుగులాంటి నడకకో వెళ్ళినప్పుడు
రొప్పుతో నాతో మాట్లాడటం,
లేదు లేదు నేను రొప్పడమే లేదమ్మీ..
అని గొప్పలు చెప్పుకోవడం,

నీ మనసు ని తాకాలని నేనూ
నా మనసు గెలుచుకోవాలని నువ్వూ
పగలంతా శ్రమించడం,

నన్ను క్రమశిక్షణ లో పెట్టడానికి
నీ మెదడంతా - నీ హృదయమంతా ధారవోసి
చిన్ని చిన్ని ప్రయత్నాలు మొదలు పెట్టడం,

నన్ను నవ్వించడం,
నా మీద ఆశలు పెట్టుకోవడం,


నాకోసం ఏమైనా చేస్తావా అనడం ?
నన్ను దూరంగా పెట్టడానికి ప్రయత్నించడం,
నా ప్రపంచాన్నే ముట్టడి చెయ్యడం,
నా కళ్ళకే కన్నీరు తెప్పించడం,

నన్ను కలవడానికి వచ్చినపుడు
నీ బట్టలు బావున్నయ్యా లేదా అని బెంగపడడం,

నేనిచ్చిన జ్ఞాపికలను భద్రంగా దాచుకోవడం,
నేను దగ్గర నిలబడినపుడు
ఇంకొంత సేపు ప్రశ్నలడగడం,

పాటలూ, సంగీతం, రాగాలూ
అవధులూ పరిధులూ దూరాలూ
ఇవన్నీ మన సంగతులను మనకే చెప్పడం ,
నన్ను చూసినపుడు మెరిసే కళ్ళను
అనుమానపడుతూ నేను పరీక్షించడం,

నీ జీవిత సాయంత్రాన్ని నాతో
గడపాలని వెలిబుచ్చిన కోరికా,
నీ ధ్యాసలోనే ఉండిపోయి
నా మనసు చేసిన సాధనా,

మంచి భోజనం చెయ్యమనీ..
బాగా చదువుకోమనీ..
హాయిగా ఉండమనీ..
వ్యాయామం చెయ్యమనీ..
సుఖంగా బ్రతకమనీ..
నువ్వు చేసే ప్రబోధాలూ,

నన్ను నాకే నమ్మశక్యం
కానంతగా ప్రేమించిన నీ ప్రేమా,
నాకు నువ్వు చేసిన అంతు లేని సాయం,
నా మీద నువ్వు కురిపించే కరుణా..
నీ నిండైన - గాడ్ బ్లెస్స్ యూ లూ
నీ మీద నాకున్న గౌరవం తో కూడిన వ్యామోహం,

నీ వేడికోళ్ళూ
నీ బెదిరింపులూ
నీ పట్టుదలా
నీ పంతం
నీ బెట్టూ
నీ చేతి రాత,
నీ నవ్వూ,

నేను కోప్పడితే
నొచ్చుకునే నీ గొంతూ,
నేను ఏడిస్తే
పసిగట్టే నీ మనసూ,
నీ తో కలిసి నేను గడిపిన కొద్దిపాటి జీవితం,

ఇవన్నీ మరిచిపోలేను !
నువ్వు ఎక్కడ ఉన్నా, నేనెక్కడ ఉన్నా -
నువు తాకిన నా మనసు,
నీ జ్ఞాపకాల్ని వొదిలి ఉండనే లేదు.

34 comments:

bujji said...

chala bagundi

నిషిగంధ said...

"నీ జీవిత సాయంత్రాన్ని నాతో
గడపాలని వెలిబుచ్చిన కోరికా,
నీ ధ్యాసలోనే ఉండిపోయి
నా మనసు చేసిన సాధనా"

ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు సుజాతా! ఆసాంతం హత్తుకుంది!!

అర్జెంటుగా దీన్ని 'పిచ్చిరాతలు' Label నించి మార్చేయండి, ప్లీజ్...

కొత్త పాళీ said...

కొన్ని ఊహలూ ఎక్స్‌ప్రెషన్లూ చాలా బాగున్నై.

కత్తి మహేష్ కుమార్ said...

కవిత చాలా బాగుంది. నిషిగంధగారు చెప్పిన వాక్యాలు నాకూ తెగనచ్చేసాయి.

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది సుజాత గారు... అర్జంట్ గా పిచ్చి రాతలు లేబిల్ తీసేయాల్సిందే...

ప్రతాప్ said...

"నీ మనసు ని తాకాలని నేనూ
నా మనసు గెలుచుకోవాలని నువ్వూ.."
ఈ రెండు లైన్లు అద్భుతంగా వున్నాయి.
ఇంత బాగా రాసి పిచ్చిరాతలు అనడం బాలేదు.

laxmi said...

Good One

ఏకాంతపు దిలీప్ said...

తేలికైన మనసుతో నిజాయితీగా తనకు తాను చెప్పుకున్న ఊసుల్లా ఉన్నాయి.... ఈ కవితలోని ప్రతీ వరస నాకు మంచి అనుభూతిని మిగిల్చింది..

మేధ said...

>>నీ మనసు ని తాకాలని నేనూ
నా మనసు గెలుచుకోవాలని నువ్వూ

చాలా బావున్నాయి ఈ లైన్లు... నిషిగంధగారన్నట్లు, ముందు ఆ లేబుల్ మార్చెయ్యండి..

sujata said...

bujji garu

thanks.

sujata said...

నిషిగంధ

చాలా థాంక్స్. పిచ్చి రాతలు ఎందుకంటే, ఇవి రాశేశాక, పోస్ట్ చేసేక, నాకే విసుగేస్తుంది. కానీ రాయాలనిపిస్తుంది. ఏదో మీరు మంచాళ్ళు కాబట్టి మీకు నచ్చుతున్నాయి. లేబుల్ 'కపిత్వం ' గా కూడా మార్చకూడదు. కపిత్వం కన్నా వెనకటి స్థాయి వీటివి.

sujata said...

కొత్త పాళీ గారు

థాంక్స్. నాకూ కొంతే నచ్చింది.

sujata said...

మహేష్ గారు

చాలా చాలా థాంక్స్.

sujata said...

వేణూ శ్రీకాంత్ గారు,

బావున్నయ్యా ? ఒరిగినల్ ఫీలింగ్స్ మరి !!!

పిచ్చి రాతలు మీద నా రైట్స్ ఉన్నయి. నేను లేబుల్ మార్చేస్తే ఎట్టా ?

sujata said...

ప్రతాప్ గారూ

థాంక్స్. కొన్ని ఫీలింగ్స్ పిచ్చివే. :D

sujata said...

లక్ష్మి గారు

థాంక్స్.

sujata said...

దిలీప్ గారు

థాంక్స్. తేలిక భాషోద్యమం చేస్తున్నానేమో. నా వల్ల ఇంత కన్నా కాదు. మీకు నచ్చినందుకు థాంక్స్. మామూలు మనుషులు ప్రేమించినపుడు వేరే మనిషి గురించి ఇలానే తేలిక పదాల్లో ఆలోచిస్తారేమో అని నా భావన. అందుకే ఇలా రాస్తాను.

sujata said...

మేధ

చాలా థాంక్స్. నా లేబుల్ వెనుక మీరూ పడ్డారన్న మాట ! అమ్మో నా లేబుల్ !

మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడ వ్యాఖ్యానించినందుకు థాంక్స్.

ఇంకొంచం మంచిదేదయినా రాస్తే పిచ్చిరాతలు అనే లేబుల్ ని మారుస్తాను. తప్పకుండా.

చాలా థాంక్స్.

రాధిక said...

కవిత మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళింది.నేను మాత్రం చేతిరాత దగ్గర ఆగిపోయా :)
మనసు తాకాలని నేనూ,నీ జీవిత సాయంత్రాన్ని నాతో ....ఇవి హైలెట్

ఏకాంతపు దిలీప్ said...

సుజాత గారు,

కొంచెం బాధపడ్డాను... నేను తేలికైన మనసుతో అన్నానే కానీ, మీరు భాషని తేలిక చేస్తున్నారు అనలేదు... నేను అనుభూతి చెంది అంత శ్రద్ధగా వ్యాఖ్య రాస్తే, మీరు అలా ఎందుకు ఆలోచించారు? ఎక్కడైనా నేను మీ కవితా శైలిని గురించి కానీ, భాష గురించి కానీ ఆక్షేపించానా? మీ వ్యాఖ్య చూసి, నేనేమైనా విమర్శించానా అని మరలా ఇంకోసారి నా వ్యాఖ్య చదువుకోవాల్సి వచ్చింది...

నావరకు నాకు నా అనుభూతి మాత్రమే ముఖ్యం... నాకు శైలి, భాషని విమర్శించెంత రచనా అనుభవం లేదు... మంచి అనుభూతి మిగిల్చినప్పుడు, నేను అసలు విమర్శించలేను...

ఇక మీరు చెప్పినట్టు తేలిక పదాలతోనే ఆలోచిస్తాము.... మీరు కవితలో వ్యక్తపరచిన చాలా సంధర్భాల్లో అవి అనుభవించేప్పుడు మాటలు ఉండవు, మనసు మౌనంగానే ఉంటుంది.. కొంచెం కాలం సాగాక, మనసు తేలిక పడి అప్పటి అనుభవానికి మాటలు అల్లుకుని మెదడులో నిక్షిప్తం చేసుకుంటుంది మరచిపోలేని జ్ఞాపకంగా...

బొల్లోజు బాబా said...

చాలా సరళంగా, లలితంగా హృదయాన్ని ఎలా ఆవిష్కరించవచ్చో ఈ కవిత ద్వారా చెప్పారు.
భాషాడంబరం లేదు, పదాల పటాటోపం లేదు, ప్రాసలకై పాకులాట లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె లోతుల్లోంచి పెల్లుబికే ఫీల్.

అవును ఆ ఫీల్ ఒకటే ఈ కవితకు ప్రాణం పోసింది. అదేనేరుగా పాఠకుని మనసులోకి ఏ మరుగులూ లేకుండా అందింది.

బాగుంది.
అభినందనలు

బొల్లోజు బాబా

సుజాత said...

సుజాతా,
లలితమైన పదాలతో ఆడుకున్నారు. నాకే కాదు "హీరో" క్కూడా నచ్చేస్తుంది విపరీతంగా!

sujata said...

దిలీప్ గారు

మీ వ్యాఖ్య చదివి కంగారు పడుతున్నాను. నా ఉద్దేశ్యం మిమ్మల్ని హర్ట్ చేద్దామని ఎంత మాత్రం కానే కాదు. మీరు బాధ పడటం చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా సోరీ అండీ. చాలా చాలా సోరీ. ఇది కేవలం అపార్ధం మాత్రమే. నన్ను, నా పిచ్చి రాతల్నీ క్షమించండి. మీ మంచి అభినందనలు నాకు చాలా ఇంపోర్టెంట్ ! మీ వ్యాఖ్య నిజానికి నా మనసును హత్తుకుంది. మీ లాంటి మితృలను నొప్పించాలని అనుకోకుండానే నొప్పించినందుకు నన్ను క్షమించండి.

ఏకాంతపు దిలీప్ said...

@ సుజాత
సారీ ఎందుకండి.. నేను కేవలం మీరు అర్ధం చేసుకున్న ఉద్దేశం నా వ్యాఖ్యలో లేదు అని మాత్రమే చెప్పదలచుకున్నాను... నేను అభిమానంగా రాస్తె, అది విమర్శగా ఎలా అర్ధం చేసుకున్నారు అని కంగారు పడి ఆ వ్యాఖ్య రాసాను... మరిన్ని రచనలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాను... :-)

sujata said...

రాధిక గారు

చాలా థాంక్స్. అమ్మో నాకు గర్వం అనిపించేసింది.

sujata said...

సుజాత గారు

థాంక్స్ చాలా. ప్చ్ .. హీరో కి చదువు రాదే !

:(


ఒక వేళ చెప్పినా నన్ను ఏడిపించేస్తాడు. నీకంత సీన్ లేదని తేల్చేస్తాడు. అదీ బాధ.

sujata said...

బాబా గారు

చాలా థాంక్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే. ఇది కవిత ఆని చెప్పలేము. కొన్ని అక్షరాల అమరికే. దీనికి ఏ క్వాలిటీలూ లేవు. జస్ట్ పిచ్చి ఆలోచనలు. మీ వ్యాఖ్య కు చాలా థాంక్స్.

sujata said...

దిలీప్ గారు

చిన్న చిన్న విషయాలు బావుంటాయి. ఇంకా ఏదో చెప్పేద్దామని ఉన్నా.. పొడిగించినట్టవుతుందని ఊరుకుంటున్నా.

మీ అభిమానానికి - చాలా థాంక్స్. మీ ఇంటిపేరు ఏకాంతపు నా ? లేదా మీరే పెట్టుకున్నారా ? ఎన్నాళ్ళో అడుగుదామనుకుని దాటవేస్తున్న ప్రశ్న ఇది.

సుజాత said...

లాభం లేదు, నేను హీరో తరఫున వకాల్తా పుచ్చుకోవాల్సిందే! నేన్నమ్మను, మీరే ఉడుక్కుంటూ హీరో మీద నెట్టేస్తున్నారు, ఏడిపిస్తారంటూ! "నీకంత సీన్లే"దన్నా లోలోపల ఆనందమేనమ్మా!(మా ఆవిడ కవయిత్రి అయిపోయిందోచ్ అనుకుంటూ)

ఏకాంతపు దిలీప్ said...

నేనే పెట్టుకున్నాను... :-)

sujata said...

సుజాత గారూ..

హీరో తరఫున వకాల్తా నా ? అమ్మో ! మీరు అసలు నా తరఫునుండాలి. మనం మనం ఒక పేరు వాళ్ళం. ఒక గ్రూపు వాళ్ళం. మీరే ఇలా చేస్తే ఎలా అండీ ?

sujata said...

ఏకాంతపు దిలీప్

మీ పేరు బావుంది! భలే పెట్టుకున్నారు. చాలా భలే గా ఉంది. good.

సుజాత said...

దిలీప్ ,
నిజంగానా? మీరే పెట్టుకున్నారా ఆ పేరు? సుజాత గారు అడక్కపోతే నాకు తెలిసేదే కాదు. ఇలాంటి ఇంటి పేరుంటుందా అని అనుకున్నాను గానీ, ఉంటుందేమోలే అనేసుకున్నాను. భలే పెట్టుకున్నారు సుమా!

Anonymous said...

sujata garu chalabagundi